పాఠకుల ప్రశ్నలు
మానవ రక్తంనుండి తీసిన ఆల్బుమిన్ (శ్వేతధాతులు) కలిసిన వైద్యపరమైన ఇంజక్షన్‌ను లేదా టీకాలు వేయించుకోవడం సరియైనదేనా?
నిస్సందేహంగా, ఈ విషయంలో ప్రతి క్రైస్తవుడు వ్యక్తిగతంగా తీర్మానించుకోవలసిందే.
దేవుని సేవకులు అపొస్తలుల కార్యములు 15:28, 29లో యివ్వబడ్డ నిర్దేశకానికి లోబడాలని సరిగ్గా కోరుకుంటారు. అదేవిధంగా, క్రైస్తవులు రక్తంతో కూడిన మాంసాన్ని లేదా బ్లడ్ సాసేజ్ వంటి రక్తంతో కూడిన మాంసమున్న పదార్థాలను తినరు. అయితే దేవుని చట్టం వైద్య విషయాల్లో కూడా అన్వయిస్తుంది. ‘రక్తం ఎక్కించడాన్ని, మొత్తం రక్తాన్ని, ఎర్ర రక్తకణాలను, తెల్ల రక్తకణాలను, రక్తఫలకాలు లేదా రక్తమందలి ప్లాస్మాను’ వారు నిరాకరిస్తున్నారని తెలియజేసే పత్రాన్ని యెహోవాసాక్షులు తమతోపాటు ఉంచుకుంటారు. అయితే, కొంచెం మాత్రమే రక్త ప్రోటీన్ వున్నటువంటి సీరమ్ ఇంజక్షన్‌ల విషయమేమిటి?
ఇది ప్రతి ఒక్కరి యొక్క బైబిలు శిక్షిత మనస్సాక్షిని బట్టి నిర్ణయించుకోవాల్సిన విషయమని చాలా కాలం క్రితమే సాక్షులు గుర్తించారు. ఇది జూన్ 1, 1990 ది వాచ్‌టవర్ సంచికలో “పాఠకుల ప్రశ్నలు” అనే శీర్షికలో సూచించారు, ఒకరు ప్రత్యేకమైన వ్యాధులకు గురైనప్పుడు ఒక వైద్యుడు సిఫారసు చేసే సీరమ్ ఇంజక్షన్‌లను గూర్చి అది చర్చించింది. అలాంటి ఇంజక్షన్‌లలో వున్న చురుకైన పదార్ధాలు వాటంతటవి రక్తమందలి ప్లాస్మా కావు కాని వ్యాధినిరోధకతను వృద్ధిచేసుకున్నవారి రక్తమందలి ప్లాస్మానుండి వచ్చిన యాంటీబాడీలైయున్నవి. అలాంటి ఇంజక్షన్‌లను మంచి మనస్సాక్షితో అంగీకరించగలమని భావించే కొంతమంది క్రైస్తవులు, గర్భిణీ స్త్రీయొక్క రక్తంలోని యాంటీబాడీస్ ఆమె గర్భంలోని బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తాయని గుర్తించారు. ఈ విషయాన్ని “పాఠకుల ప్రశ్నలు”లో వివరించారు, అలాగే కొంత ఆల్బుమిన్ గర్భిణీ స్త్రీనుండి ఆమె బిడ్డకు వెళ్తుందనే వాస్తవాన్ని కూడా ప్రస్తావించింది.
అనేకమంది దీనిని ప్రాముఖ్యమైన విషయంగా గుర్తించారు, కొన్ని వాక్సీన్‌లు రక్తంలేకుండా తయారు చేయబడతాయి గనుక తయారీలో అవసరమైన పదార్ధాలను నిశ్చలీకరణ చేయడానికి ఉపయోగించే లేదా వాటితో కలిపే ప్లాస్మా ఆల్బుమిన్ చాలా కొద్ది పరిమాణంలోనే ఉంటుంది. ఇటీవలనే సింథెటిక్ హార్మోన్ ఇపిఒ (ఎరిత్రోపొయిటిన్) అనే ఇంజక్షన్‌ల తయారీలో కూడ కొంత పరిమాణంలో ఆల్బుమిన్ ఉపయోగించబడుతున్నది. కొంతమంది సాక్షులు ఇపిఒ ఇంజక్షన్‌లను అంగీకరించారు, ఎందుకంటే అది ఎర్ర రక్తకణాల ఉత్పత్తి వేగాన్ని పెంచగలదు, తద్వారా రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుందేమోననే భావాలనుండి వైద్యుని దూరంచేయగలదు.
భవిష్యత్తులో చాలా కొద్ది పరిమాణంలో ఆల్బుమిన్ వున్న యితర మందులు కూడా ఉపయోగంలోకి రావచ్చు, ఎందుకంటే మందులు తయారు చేసే కంపెనీలు కొత్త ఉత్పత్తులను వృద్ధిచేస్తుంటారు లేదా ప్రస్తుతం వున్నవాటి ఫార్ములాలను మారుస్తుంటారు. అందుకే క్రైస్తవులు ఆల్బుమిన్ అనేది వైద్యుడు సిఫారసు చేసే టీకాలమందు లేక వేరే ఇంజక్షన్‌లోని భాగమా అని పరిశీలించడానికి కోరుకుంటారు. ఆల్బుమిన్ వాటిలో భాగమనే విషయంలో అనుమానమున్నట్లైతే, వారు తమ వైద్యున్ని సంప్రదించగలరు.
వివరించినట్లుగా, చాలామంది సాక్షులు కొద్ది పరిమాణంలో ఆల్బుమిన్ వున్న ఇంజక్షన్‌ను అంగీకరించడానికి వ్యతిరేకించలేదు. ఇంకా, ఎవరైనా వ్యక్తిగత నిర్ణయం తీసుకొనే ముందు ఈ విషయాన్ని ఎక్కువ క్షుణ్ణంగా పఠించాలని కోరుకుంటే, జూన్ 1, 1990 ది వాచ్‌టవర్ నందలి “పాఠకుల ప్రశ్నలు” అనే అంశంలోని సమాచారాన్ని పునర్విమర్శించాలి.