కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 10/1 పేజీ 32
  • దయగల మాటయొక్క శక్తి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దయగల మాటయొక్క శక్తి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 10/1 పేజీ 32

దయగల మాటయొక్క శక్తి

“విచారంతో కృంగిన హృదయాన్ని, దయగల మాట ఎంత సంతోషపెట్టగలదో!”—సామెతలు 12:25, నాక్స్‌.

క్రైస్తవులు దుర్దశనుండి పూర్తిగా దూరంకాలేదు. ఈ “అపాయకరమైన కాలము”లలో జీవిస్తున్నందువల్ల వారు కొన్నిసార్లు చింతను అనుభవిస్తారు.—2 తిమోతి 3:1.

అలాంటి దుర్దశను అనుభవిస్తున్నప్పుడు, యథార్థమైన స్నేహితుని నుండి దయగల మాటలు వినడం ఎంత ఆశీర్వాదమో! “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరునిగా నుండును,” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 17:17) నమ్మకమైన వాడైన యోబు ఈ విధమైన స్నేహితుడనే పేరుపొందాడు. ఎలీఫజు కూడా ఆయన గూర్చి యిలా చెప్పాడు: “నీ మాటలు, తొట్రిల్లి, బలహీనమై అలసిన వానిని బలపరచి ప్రోత్సహించాయి.”—యోబు 4:4, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

అయినప్పటికి, యోబుకే ప్రోత్సాహం అవసరమైనప్పుడు, ఎలీఫజు, అతని సహవాసులు దయగల మాటలు పలుకలేదు. అతడు కొన్ని రహస్యమైన పొరపాట్లు గలవాడని సూచిస్తూ, యోబును తన దుర్దశనుబట్టి నిందించారు. (యోబు 4:8) ది ఇంటర్‌ప్రిటర్స్‌ బైబిల్‌ యిలా వ్యాఖ్యానిస్తుంది: “యోబుకు కావల్సిందేమంటే మానవుల హృదయంనుండి వచ్చిన కనికరము, కాని తాను పొందినదేమంటే పూర్తిగా ‘వాస్తవమైన,’ సుందరంగా వ్యక్తపర్చిన మత సంబంధమైన మాటలు, నైతికంగా చప్పనైన మాటల పరంపరలే.” ఎలీఫజు, అతని సహవాసుల మాటలను వినడంతో యోబు మానసికంగా ఎంత కలత చెందాడంటే, ఆయన యిలా రోదించాల్సి వచ్చింది: “ఎన్నాళ్లు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్లు మాటచేత నన్ను నలుగగొట్టుదురు?”—యోబు 19:2.

మన తోటి దేవుని సేవకులను ఎన్నడూ కూడా మనం మన అనాలోచిత, నిర్దయతో కూడిన మాటలద్వారా దుఃఖంతో రోదించేలా చేయకూడదు. (ద్వితీయోపదేశకాండము 24:15 పోల్చండి.) ఒక బైబిలు సామెత యిలా హెచ్చరిస్తున్నది: “నీ మాటలు జీవాన్ని రక్షించగలవు లేదా నాశనం చేయగలవు; కాబట్టి దాని ఫలితాన్ని నీవు అంగీకరించాల్సిందే.”—సామెతలు 18:21, టుడేస్‌ ఇంగ్లీష్‌ వర్షన్‌.

సంభాషణయొక్క శక్తిని గుర్తిస్తూ, మనం అపొస్తలుడైన పౌలు మాదిరిని అనుకరిద్దాం. మాసిదోనియలో ఉండగా, ఆయన ‘పెక్కు మాటలతో వారిని హెచ్చరించెను.’—అపొస్తలుల కార్యములు 20:2.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి