కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/15 పేజీలు 30-31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆర్థిక ఇబ్బందులు, అప్పుల విషయంలో బైబిల్లోని సలహాలు సహాయం చేస్తాయా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీరు అప్పులు చేయడం యోగ్యమేనా?
    తేజరిల్లు!—1995
  • స్నేహితుల మధ్య అప్పు ఇచ్చిపుచ్చుకోవడం
    తేజరిల్లు!—1999
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/15 పేజీలు 30-31

పాఠకుల ప్రశ్నలు

కష్టతరమైన ఈ ఆర్థిక సమయాల్లో అనేకమంది వ్యక్తులు, కంపెనీలూ దివాలాను ఆశ్రయిస్తున్నారు. ఒక క్రైస్తవుడు దివాలా విషయమై అర్జీ దాఖలు చేసుకోవడం లేఖనాధారంగా సరైన విషయమేనా?

ఈ ప్రశ్నలకు జవాబు, ప్రత్యేకంగా ఆధునికమైన సమస్యలకు దేవుని వాక్యం ఆచరణాత్మకమైన నడిపింపును ఎలా అందిస్తుంది అన్న విషయమై సరైన ఉదాహరణను యిస్తుంది. అనేక దేశాల్లో దివాలాను గూర్చి చట్టబద్ధమైన శాసనాలున్నాయి. ఈ సూత్రాలు ఒక దేశం నుండి మరో దేశానికి వేరువేరుగా ఉంటాయి, ఈ విషయంపై న్యాయబద్ధమైన సలహాలివ్వడం క్రైస్తవ సంఘం పనికాదు. అయితే దివాలా విషయంలో న్యాయబద్ధమైన ఏర్పాటునంతటినీ మనం ఒకసారి పరిశీలిద్దాము.

వ్యక్తులూ వ్యాపారాలూ దివాలా తీశాయని ప్రకటించేలా ప్రభుత్వాలు అనుమతించడానికి కారణం, డబ్బు యిచ్చినవారికీ లేక అప్పిచ్చినవారికి, డబ్బు తీసుకుని లేక అప్పు తీసుకుని, తీసుకున్న అప్పును తిరిగి చెల్లించని వ్యక్తులకు వ్యాపారాల నుండి ఒక మోస్తరు రక్షణను అందించడమే. అప్పు పుచ్చుకున్నవారు తాము దివాలా తీశామని ప్రకటించమని కోర్టుకు అప్పీలు చేసుకోవడమే, అప్పిచ్చినవారు వసూలు చేసుకోగల ఏకైక పద్ధతి అని వారికి అనిపించవచ్చు. దాని వల్ల అప్పు పుచ్చుకున్నవారు ఆ అప్పును కొంత చెల్లించినట్లుగా అతని ఆస్తిని పంచుకుంటారు.

తమకు అప్పు యిచ్చిన వారిని నిజంగా తృప్తిపర్చలేని అప్పు తీసుకున్నవారికి రక్షణగా కూడా ఈ దివాలా పనిచేస్తుంది. అప్పు తీసుకున్నవారు దివాలా తీశామని అర్జీ దాఖలు చేసుకునేందుకు అనుమతించబడవచ్చు, అప్పుడు తనకు అప్పిచ్చినవారు తన ఆస్తిలో కొంత భాగాన్ని తీసుకోవచ్చు. అయినప్పటికీ, తన ఇల్లు లేక ఆస్తిలో భాగాన్ని ఉంచుకోమని చట్టం అనుమతించవచ్చు, ఆ తర్వాత మునుపు తనకు అప్పిచ్చినవారు జప్తుచేస్తారనో లేక వారివలన నష్టపోవల్సివస్తుందనే భయం లేకుండా అతడు జీవితాంతం కొనసాగవచ్చు.

ఈ చట్టాలు, ఆర్థిక లేక వ్యాపార లావాదేవీల్లో యిరు పక్షాలవారికి కొంతమేరకు రక్షణనివ్వడానికే రూపొందించబడ్డాయన్నది స్పష్టం. అయితే, బైబిలు మనకు ఏ సహాయకరమైన సలహాను అందిస్తుందో గమనిద్దాము.

అప్పు చేయడాన్ని బైబిలు ప్రోత్సహించడం లేదని ఒకరు తెలుసుకోకుండా దాన్ని మొదటినుండి చివరిదాకా చదవడం కష్టంగా ఉంటుంది. “ఐశ్వర్యవంతుడు బీదలమీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చినవానికి దాసుడు” అని సామెతలు 22:7లో ఉన్నటువంటి హెచ్చరికలను మనం కనుగొంటాము.

మత్తయి 18:23-34 నందు గల చాలా పెద్దమొత్తంలో అచ్చివున్న ఓ దాసుని గూర్చిన యేసు ఉపమానాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి: “వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగిన యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను,” కానీ ఆ తర్వాత ఆ యజమానుడైన రాజు దయతో కనికరాన్ని కనపర్చాడు. ఆ తర్వాత ఆ దాసుడు కనికరం లేని వాడని నిరూపించబడినప్పుడు ఆ రాజు “తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని నప్పగించ”మని ఆజ్ఞాపించాడు. స్పష్టంగా, సరైన పద్ధతి, సిఫార్సుచేయబడిన పద్ధతేమిటంటే, డబ్బు అప్పుగా తీసుకోవడాన్ని నివారించడమే.

పురాతన ఇశ్రాయేలులో ఉన్న దేవుని సేవకులకు వ్యాపార లావాదేవీలు ఉండేవి, కొన్నిసార్లు అప్పివ్వడం పుచ్చుకోవడం జరిగేవి. యెహోవా ఏమి చేయమని వారికి ఉపదేశించాడు? ఓ వ్యక్తి వ్యాపారంలోకి ప్రవేశించడానికిగానీ లేక దాన్ని విస్తృతపర్చుకోడానికి గానీ డబ్బును అప్పుగా తీసుకుంటే వడ్డీ విధించడం హెబ్రీయులకు న్యాయమే, అది సహజమే. అయితే, దేవుడు అవసరతలో ఉన్న ఇశ్రాయేలీయుడికి అప్పిచ్చేటప్పుడు స్వార్థపూర్వకంగా ఉండవద్దని తన ప్రజలకు ఉద్బోధించాడు; ప్రతికూల పరిస్థితిలో ఉన్న వారిపై వడ్డీ విధించి వారు లాభం పొందరాదు. (నిర్గమకాండము 22:25) ద్వితీయోపదేశకాండము 15:7, 8 యిలా అంటోంది: “నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల . . . నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కర చొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను.”

అప్పిచ్చినవారు అప్పు పుచ్చుకున్న వాని జీవితావసరతలు, అంటే కుటుంబ తిరుగటిరాయి లేక రాత్రుళ్లు వెచ్చగా ఉంచే బట్టలను జప్తు చేయరాదనే నియమాలను నిర్ణయించడంలో అలాంటి కనికరం శ్రద్ధ ప్రతిబింబించాయి.—ద్వితీయోపదేశకాండము 24:6, 10-13; యెహెజ్కేలు 18:5-9.

యూదులందరూ తమ గొప్ప న్యాయాధిపతి, శాసనకర్త యిచ్చిన ఈ ప్రేమపూర్వక సూత్రాల నిజమైన భావాన్ని అంగీకరించి, అన్వయించలేదు. (యెషయా 33:22) కొందరు స్వార్థపరులైన యూదులు తమ సహోదరులతో కఠినంగా వ్యవహరించారు. నేడు కూడా, అనుకోని సంఘటనలు ఎదురవ్వడం వల్ల ఆ సమయానికి చెల్లించలేకపోయిన ఒక యథార్థ క్రైస్తవుని యెడల సహితం కొందరు అప్పిచ్చేవారు, తాము కోరే వాటి విషయంలో కఠినంగా సహేతుకం కాని విధంగా ఉండవచ్చు. (ప్రసంగి 9:11) తమ కఠినమైన ఒత్తిడి ద్వారా అప్పిచ్చే లోకస్థులు, అప్పు పుచ్చుకున్న అలాంటి వ్యక్తి తనను తాను రక్షించుకోవాలని భావించే స్థితికి తీసుకురావచ్చు. అదెలా? కొన్ని కేసుల్లో చట్టబద్ధంగా దివాలా తీయడమే ఏకైక మార్గంగా కొందరు అప్పు పుచ్చుకున్నవారు గుర్తిస్తారు. కనుక తాను తీసుకున్న అప్పు విషయంలో దురాశాపరుడు కాని, అశ్రద్ధ లేని ఓ క్రైస్తవుడు దివాలా తీసాననే విషయమై అర్జీ దాఖలు చేసుకోవడంపై ఆధారపడతాడు.

అయితే, ఈ విషయంలో మరోప్రక్క ఉన్న దాన్ని మనం తెలుసుకుని ఉండాలి. ఒక క్రైస్తవుడు కేవలం ఎంత లేక ఎలా ఖర్చు చేయాలన్న విషయంలో ఆశానిగ్రహాన్ని కనపర్చకపోవడం లేక తన వ్యాపార నిర్ణయాల్లో సహేతుకమైన ముందుచూపును కనపర్చకపోవడం వల్లే అప్పులపాలు కావచ్చు. తాను తీసుకున్న అప్పు విషయంలో ఏమీ పట్టనట్టు ఉండి, దివాలా ద్వారా త్వరగా ఉపశమనాన్ని పొంది, అలా తను సరైన తీర్మానం చేసుకోలేకపోవడంవల్ల యితరులకు హాని కలిగిస్తాడా? అలాంటి ఆర్థిక బాధ్యతా రాహిత్యాన్ని బైబిలు అంగీకరించడంలేదు. దేవుని సేవకుడు అవునంటే అవును అన్నట్లు ఉండాలని అది ఉద్బోధిస్తుంది. (మత్తయి 5:37) ఓ గోపురం కట్టించడానికి ప్రారంభించకముందు లెక్క చూసుకోవడం విషయంలో యేసు చేసిన వ్యాఖ్యానాల్ని జ్ఞాపకముంచుకోండి. (లూకా 14:28-30) దానికి అనుగుణంగా, ఆర్థికంగా అప్పు తీసుకునే ముందు ఓ క్రైస్తవుడు రాగల కోరదగని పరిణామాలను ముందుగానే ఆలోచనాపూర్వకంగా పరిశీలించాలి. ఇంత అప్పు తీసుకోవాలని ఊహించిన వెంటనే, తాను డబ్బు అచ్చివుండే ఆ వ్యక్తులకు లేక కంపెనీలకు దాన్ని తిరిగి చెల్లించాలనే బాధ్యతను అతను భావించాలి. ఓ క్రైస్తవుడు బాధ్యతా రహితుడు లేక అపనమ్మకస్థుడని యితరులనేకులు గ్రహించినట్లైతే, అతను యింతకాలం పొందాలని ప్రయత్నించిన మంచి పేరుకు కళంకం తెచ్చుకుని ఆ విధంగా బయటివారి నుండి ఎలాంటి మంచి సాక్ష్యాన్ని ఎన్నటికీ పొందలేడు.—1 తిమోతి 3:2, 7.

కీర్తన 15:4 యెహోవా ఆహ్వానించే వ్యక్తి ఎలా ఉంటాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకంచేసుకోండి. అక్కడ మనమిలా చదువుతాము: “అతడు [దేవుడు అంగీకరించినవాడు] ప్రమాణముచేయగా నష్టము కలిగినను మాటతప్పడు.” అవును, క్రైస్తవులు తమతో ఎలా వ్యహరించాలని కోరుకుంటారో అదే విధంగా తమకు అప్పిచ్చినవారితో వ్యవహరించాలని దేవుడు అపేక్షిస్తాడు.—మత్తయి 7:12.

మరి సారాంశంగా, తీవ్రమైన పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే దివాలా న్యాయ రక్షణ నుండి ఓ క్రైస్తవుడు లాభం పొందకూడదని బైబిలు నిర్ణయించి చెప్పడంలేదు. అయితే, నిజాయితీ నమ్మకత్వం విషయాల్లో క్రైస్తవులు ప్రత్యేకమైనవారిగా ఉండాలి. ఆ విధంగా, తమ ఆర్థిక బాధ్యతలను నిర్వహించాలనే తమ యథార్థమైన కోరికను కల్గివుండడంలో వారు మాదిరికరంగా ఉండాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి