కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 9/15 పేజీ 32
  • “వేరు కదలదు”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “వేరు కదలదు”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 9/15 పేజీ 32

“వేరు కదలదు”

ప్రపంచంలోని అతి పెద్ద మరియు పురాతన సజీవుల్లో, కాలిఫోర్నియాకు చెందిన సికోయా చెట్లు చెప్పుకోదగ్గవి. ఆకాశాన్నంటేలా పెరిగే ఈ అద్భుతమైన చెట్లు పూర్తిగా పెరిగినప్పుడు 90 మీటర్ల ఎత్తు ఉంటాయి, మరి అవి 3,000 సంవత్సరాల వరకు జీవించగలవు.

సికోయాను చూడటం సంభ్రమాశ్చర్యాన్ని కలిగిస్తుంది, అయితే మనం చూడలేని దాని వేర్లు కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సికోయా మూడు లేక నాలుగు ఎకరాలంత పెద్ద స్థలాన్ని ఆక్రమించగలిగేంత విస్తారమైన సమాంతర వేర్లను కలిగి ఉంది. వరదలు రావడం లేక పెనుగాలులు వీచినప్పుడు దాని విశాలమైన వేర్ల వ్యవస్థ గట్టి పట్టును యిస్తుంది. సికోయా ఒక శక్తివంతమైన భూకంపాన్ని కూడా తట్టుకోగలదు.

రాజైన సొలొమోను తన సామెతలలో ఒకదాంట్లో అలంకారార్థంగా ఒక చెట్టు యొక్క పటిష్ఠమైన వేర్ల వ్యవస్థను ఎన్నుకున్నాడు. “భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు,” అని ఆయన చెప్పాడు. (సామెతలు 12:3 ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) అవును, భక్తిహీనులు కదిలే నేలపై ఉన్నారు. వాళ్లు పొందుతున్నారని అనిపించే ఎటువంటి విజయం కూడా కేవలం తాత్కాలికమైనదే, ఎందుకంటే యెహోవా యిలా వాగ్దానం చేస్తున్నాడు, “భక్తిహీనుల ఆశ భంగమై పోవును.”—సామెతలు 10:28.

క్రైస్తవులమని చెప్పుకునే వారికి ఇదొక హెచ్చరిక, ఎందుకంటే కొందరిలో “వేరు” ఉండదని మరి వారు అభ్యంతర పడతారని యేసు చెప్పాడు. (మత్తయి 13:21) అంతేకాకుండా, “గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి [అబద్ధ] ఉపదేశమునకు,” కొట్టుకొనిపోయే వ్యక్తులను గురించి అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (ఎఫెసీయులు 4:14) దీనినెలా నివారించవచ్చు?

సికోయా వేర్లు భూమి యొక్క పోషణకరమైన నేలలో ఎలా విస్తరిస్తాయో, అలాగే మనం మన మనస్సులను, హృదయాలను దేవుని వాక్యంలోనకు లోతుగా చొప్పించి, దాని జీవమిచ్చే నీళ్లను తీసుకోవాలి. పటిష్ఠంగా వేరుపారిన విశ్వాసాన్ని పెంపొందించుకోడానికి యిది మనకు సహాయం చేస్తుంది. నిజమే, మనం ఉప్పెనలవంటి శ్రమల ప్రభావాన్ని భరించాలి. కష్టకాలంలో మనం ఒక చెట్టువలె వణకవచ్చు కూడా. కానీ మన విశ్వాసం మంచి పటిష్ఠమైనదిగా ఉంటే, మన “వేరు కదలదు.”—హెబ్రీయులు 6:19 పోల్చండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి