కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 7/15 పేజీ 31
  • ‘వారు అతని స్వరమెరుగుదురు’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘వారు అతని స్వరమెరుగుదురు’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 7/15 పేజీ 31

‘వారు అతని స్వరమెరుగుదురు’

“యెహోవా నా కాపరి.” కీర్తన 23వ అధ్యాయంలోని ప్రారంభ మాటలవి. యెషయా ప్రవచనంలో యెహోవాను ఓ కాపరితో పోల్చుతూ మరలా లేఖనాలు యిలా చెబుతున్నాయి: “గొఱ్ఱెల కాపరివలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.”—యెషయా 40:11.

అదే విధంగా యేసుక్రీస్తును ఓ కాపరితో పోల్చడం జరిగింది. “నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణముపెట్టును” అని ఆయన అన్నాడు. (యోహాను 10:11) “గొఱ్ఱెలు అతని [కాపరి] స్వరము వినును, అతడు తన స్వంత గొఱ్ఱెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును” అని యేసు అన్నాడు. ఆయన యింకా యిలా అన్నాడు, “గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”—యోహాను 10:2-5.

యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యిద్దరూ, తర్వాత లేఖనాల్లో వర్ణించబడిన రూపానికి తగినట్లుగా జీవించారు. వారు తమ సూచనార్థక గొఱ్ఱెలను ఆప్యాయత ప్రేమలతో కూడిన శ్రద్ధతో చూసుకుంటారు. తత్ఫలితంగా, గొఱ్ఱెవంటి వారు తాము ప్రేమ, భద్రత, సంరక్షణలను పొందుతున్నామని భావిస్తున్నారు.

ఈ సంబంధాన్ని, అక్షరార్థమైన గొఱ్ఱెకు తమ కాపరితో ఉన్న సంబంధానికి పోల్చడం సమంజసంగానే ఉంది. ఈ విషయంపై 1831లో జాన్‌ హార్‌ట్లె తాను గమనించిన విషయాలను రాశాడు. గ్రీస్‌ దేశంలో గొఱ్ఱెల కాపరులు తమ గొఱ్ఱెలకు పేర్లుపెట్టే ఆచారాన్ని రాశాడు. ఆయన పేరుపెట్టి పిలిచినప్పుడు గొఱ్ఱెలు కాపరి స్వరానికి స్పందిస్తాయి. సుమారు 51 సంవత్సరాల తర్వాత, 1882లో జె.ఎల్‌.పోర్‌టర్‌ కూడా అలాంటి విషయాలనే గమనించాడు. గొఱ్ఱెలు వినమ్రపూర్వకంగా కాపరులను అనుసరించడం ద్వారా ప్రతిస్పందించే “ఓ వింతైన ఉత్సాహపూరిత ధ్వనిని” కాపరులు “. . . ఉచ్చరించడాన్ని” ఆయన స్వయంగా చూశాడు. అదే సంవత్సరంలో విలియమ్‌ యమ్‌. థామ్‌సన్‌, గొఱ్ఱెలు తమ కాపరిని అనుసరించడానికి, అతని స్వరాన్ని గుర్తించడానికి నేర్పబడగలవని పదే పదే నిరూపించే ప్రయోగాలను గూర్చి రాశాడు.

గొఱ్ఱెలు వాటి కాపరుల మధ్య గల ఈ విశిష్టమైన సంబంధం యిటీవలి సంవత్సరాల్లో కనిపించిందా? కనిపించింది. సెప్టెంబరు, 1993లో వెలువడిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో ఆస్ట్రేలియా సాహసియైన రాబిన్‌ డేవిడ్స్‌న్‌, అను ఆస్ట్రేలియా దేశస్థురాలు, ఇండియాలోని వాయవ్య భాగానున్న రబారె పశుపాలకులను గూర్చి యిలా రాశాడు: “ప్రతి కాపరికీ ఒక్కో విషయానికి ఒక్కోరంగా పిలిచే పిలుపులు ఉంటాయి ఉదయం బయటకు తీసుకెళ్లడానికో పిలుపు, గొఱ్ఱెలు నీళ్లు తాగడానికో పిలుపు, అలా యింకా యింకా ఎన్నో పిలుపులుంటాయి. ప్రతి కాపరి తన గొఱ్ఱెలను, ప్రతి గొఱ్ఱె తన కాపరిని ఎరుగును, అతని మంద పెద్ద మందనుండి వేరై ఉదయాన్నే అతనిని వెంబడిస్తాయి.”

నిస్సందేహంగా, యిప్పుడు పేర్కొన్న నాలుగు ప్రయాణికులు వివరించిన వాటిని యేసు గమనించాడు. గొఱ్ఱెలు తన స్వరాన్ని గుర్తుపడతాయనే యేసు వృత్తాంతానికి, ఆయన స్వయంగా గమనించిన విషయాలే నిజత్వాన్ని చేర్చాయి. మీరు యేసు గొఱ్ఱెలలో ఒకరా? మీకు ఆయన స్వరం తెలుసా, దాని అనుగుణంగా నడుస్తున్నారా? మీరు ఆయన బోధలను సత్యమని గ్రహించి, అంగీకరించి, ఆయన ఆజ్ఞలకు లోబడి, యెహోవాను ఆరాధించే విషయంలో ఆయన నడిపింపును అనుసరిస్తే, అప్పుడు మీరు, యెహోవా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యిచ్చే ప్రేమ ఆప్యాయతలతో కూడిన కాపుదలను అనుభవించగలరు.—యోహాను 15:10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి