ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—కొలంబియా
కొలంబియా విశిష్టమైన దక్షిణ అమెరికా దేశము. అగ్నిపర్వతాలతో అలంకృతమైయున్న ఈ దేశ తీరప్రాంతాన్ని పసిఫిక్ అట్లాంటిక్ మహా సముద్రాలు ఆలింగనం చేసుకుని ఉంటాయి. వాతావరణం ఉష్ణమండల సముద్ర తీరంలో, పల్ల ప్రదేశాల్లో వేడిగా ఉండి, మంచుతో కప్పబడివున్న అండేస్ పర్వత శిఖరాల దగ్గరికి వచ్చేసరికి చల్లగా మారుతుంది.a
కొలంబియా బంగారానికీ, మణులకు పేరుగాంచినదైనప్పటికీ, దాని ప్రజలే దాని అమూల్య సంపద. నేడు, యెహోవా తన ఆత్మీయ ఆలయాన్ని మహిమతో నింపుతున్నాడు. కొలంబియాతో సహా అద్భుతమైన, యిష్టవస్తువులైన ఆరాధికులు భూమి యందలి అన్ని ప్రాంతాల నుండి దానిలోకి ప్రవాహంలా వస్తున్నారు.—హగ్గయి 2:7.
వ్యాపార అధికారులు ముగ్ధులయ్యారు
ఆదివారం, నవంబరు 1, 1992, బొగొటాకు వాయవ్య దిశగా 20 మైళ్ళ దూరాన ఉన్న ఫాకాటాటీవాలో వాచ్‌టవర్ సొసైటి యొక్క క్రొత్త బ్రాంచి ఆఫీసు, ముద్రణాలయాలు సమర్పించబడ్డాయి. ఈ బ్రాంచీని సందర్శించడం సందర్శకులపై చెరగని ముద్ర వేసింది. ఒక సందర్శకుడు తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీకి తిరిగివచ్చి, ‘అద్భుతమైన సామర్థ్యము, క్రమము, ఉద్యోగస్థుల సరైన మనోదృక్పథంగల’ సంస్థను వెళ్ళి పరికించండని ఉత్సాహంతో తన పైఅధికారులను కోరాడు. అధికారులు తమ తర్వాతి పర్యటనలో గొప్ప ఆసక్తిని కనబరచి, అనేక ప్రశ్నలు అడిగారు.
అధికారులు, తమ సూపరింటెండెంట్లను, సూపర్వైజర్లను, ఫోర్మ్యాన్లను, తమ పనివాళ్లందరిని అక్కడికి సందర్శించడానికి పంపాలని అనుకున్నారు. తమ ఫ్యాక్టరీలోని 1,300 మంది ఉద్యోగస్థులందరూ, యిలాంటి సంస్థయొక్క సామర్థ్యాన్ని పరికించేలా, ప్రతి వారం 15 నుండి 25 మంది వెళ్లేలా పట్టిక వేశారు.
తమ పనివారిలో వందలాది మంది బ్రాంచి సదుపాయాలను పర్యటించారు, జెహోవాస్ విట్నెసెస్—ది ఆర్గనైజేషన్ బిహైండ్ ది నేమ్ అనే వీడియో చూశారు. సంస్థ పరిమాణాన్ని, ప్రపంచ వ్యాప్త రాజ్య ప్రకటన పనిని చూసి వారు ముగ్ధులయ్యారు. సంస్థ కార్యాలకు ఉపయోగిస్తున్న ఉన్నత సాంకేతిక విద్యను చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. దానిలో నుండి బయటకు వచ్చేటప్పుడు, వారు ‘పరదైసును వదిలి క్రమరహితమైన లోకానికి తిరిగి వెళ్తున్నట్లు’ భావిస్తున్నామని అనేకులు చెప్పినట్లు వినిపించింది.
సత్యం సకలజనులను చేరుతుంది
సకల జనులకు సువార్త అందజేయబడుతున్నది. (1 తిమోతి 2:3, 4) ఉదాహరణకు, మునుపు హెవీ మెటల్ రాక్ సంగీతానికి స్వరాన్ని కూర్చేవాడును, నాయకుడునైన వ్యక్తి బైబిలు సత్యాన్ని స్వీకరించి, తన జీవితంలో మార్పులు చేసుకొని, తొందరలోనే పూర్తికాల సేవకుడయ్యాడు. తర్వాత అతడు పరిచారకునిగా నియమితుడయ్యాడు. ఉగ్రవాదుల గుంపుల్లో సభ్యులుగా ఉన్న అనేకులు యెహోవా రాజ్య మందు నమ్మకాన్ని, నిరీక్షణను ఉంచడం నేర్చుకున్నారు. ఇప్పుడు వారు శాంతియుత నూతన లోకాన్ని గూర్చిన సందేశాన్ని ప్రకటించడంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
మాదక ద్రవ్యాలకు దాసులైనవారు, చాటుమాటుగా వాటిని అమ్మేవారు కూడా సత్యంవైపు తిరిగారు. ఇప్పుడు సాక్షియైన ఒక యువకుడు, తన పాత జీవితాన్ని విడువక ముందు ఐదు సంవత్సరాలు మాదక ద్రవ్యాల తోటను పెంచాడు, అడవిలో కొకైన్ పరిశోధనాశాలను నడిపాడు. అతడు బైబిలు సూత్రాలను పఠించడంలోను, వాటిని అన్వయించడంలోను సంతోషాన్ని కనుగొన్నాడు. జైల్లో శిక్షించబడిన హంతకులు యథార్థంగా బైబిలును పఠించడం ద్వారా పురికొల్పబడినవారై, యెహోవా తమ తప్పులను క్షమించాలని, ఆయన దాసులుగా తమను అంగీకరించాలని పట్టుదలతో ప్రార్థిస్తున్నారు.
అలా అన్ని రకాల ప్రజలు రాజ్య వర్తమానానికి ప్రతిస్పందిస్తున్నారు. అన్నిచోట్లలాగే, కొలంబియాలో కూడా యెహోవా తన ఆలయాన్ని అలా మహిమతో నింపుతున్నాడు.
[అధస్సూచీలు]
a అధిక సమాచారం కొరకు 1994 క్యాలెండర్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ చూడండి.
[8వ పేజీలోని బాక్సు]
దేశ గణాంక వివరాలు
1993 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 60,854
నిష్పత్తి: 1 సాక్షికి 558
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 2,49,271
సగటు పయినీరు ప్రచారకులు: 8,487
సగటు బైబిలు పఠనాలు: 1,00,927
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 5,183
సంఘాల సంఖ్య: 751
బ్రాంచి కార్యాలయం: ఫాకాటాటీవా
[9వ పేజీలోని చిత్రం]
పందొమ్మిది వందల యాభై ఆరులోని బ్రాంచి కార్యాలయ సిబ్బంది, మిషనరీలు
[9వ పేజీలోని చిత్రం]
బ్రాంచి కార్యాలయ విహంగ దృశ్యం