కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 6/1 పేజీలు 13-18
  • సరియైన మతాన్ని కనుగొనడంతో బాధ్యత పెరుగుతుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరియైన మతాన్ని కనుగొనడంతో బాధ్యత పెరుగుతుంది
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని వాక్యానికి మీరెలా ప్రతిస్పందిస్తారు?
  • యెహోవా యెడల మీ భక్తి సంపూర్ణంగా ఉందా?
  • క్రీస్తు ప్రేమ మిమ్మల్ని ఎంత గాఢంగా ప్రభావితం చేస్తుంది?
  • లోకం నుండి వేరైయుండుట—ఎంత మేరకు?
  • మీ ప్రేమ ఎంతవరకు చేరుతుంది?
  • రాజ్య సాక్ష్యపు పని—మీకు ఎంత ప్రాముఖ్యమైనది?
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మనం ప్రకటించాల్సిన సందేశం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • దేవున్ని ఆరాధించే సరైన పద్ధతి ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 6/1 పేజీలు 13-18

సరియైన మతాన్ని కనుగొనడంతో బాధ్యత పెరుగుతుంది

“దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు.”—లూకా 11:28.

1. ఒకసారి వారు సరైన మతాన్ని గుర్తించిన తర్వాత, ఎటువంటి ప్రజలు దాని చుట్టూ తమ జీవితాలను నిర్మించుకుంటారు?

సరియైన మతాన్ని గుర్తిస్తేనే సరిపోదు. మనం సరియైన, నిజమైన దాన్ని ప్రేమించేవారమైతే, ఒకసారి మనం నిజమైన మతాన్ని కనుగొంటే, మనం మన జీవితాల్ని దాని చుట్టూ నిర్మించుకుంటాము. నిజమైన మతం కేవలం మానసిక తత్వం కాదు; అది జీవన విధానం.—కీర్తన 119:105; యెషయా 2:3; అపొస్తలుల కార్యములు 9:2ను పోల్చండి.

2, 3. (ఎ) దేవుని చిత్తాన్ని చేయడంలోని ప్రాముఖ్యతను యేసు ఎలా నొక్కి చెప్పాడు? (బి) సరైన మతాన్ని తెలుసుకునే ప్రతివారిపై ఏ బాధ్యత ఉన్నది?

2 తన చిత్తమని దేవుడు దేన్ని బయల్పర్చాడో దాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యతను యేసుక్రీస్తు నొక్కిచెప్పాడు. కొండ మీది ప్రసంగంగా ప్రఖ్యాతి చెందిన ఆ ప్రసంగ ముగింపులో, తనను ప్రభువు అని పిలిచేవారందరూ (క్రైస్తవులమని చెప్పుకునేవారు) ఆ రాజ్యంలో ప్రవేశించరు; కేవలం తన తండ్రి చిత్తం చేసేవారే ప్రవేశిస్తారని యేసు తెలియజేశాడు. ఇతరులు, “అక్రమము చేసేవారిగా” నిరాకరింపబడతారని ఆయన చెప్పాడు. అక్రమం చేసేవారని ఎందుకు? ఎందుకంటే, దేవుని చిత్తాన్ని చేయకపోవడం పాపమని, పాపమంతా అక్రమమని బైబిలు తెలియజేస్తుంది. (మత్తయి 7:21-23; 1 యోహాను 3:4; రోమీయులు 10:2, 3 పోల్చండి.) ఒక వ్యక్తికి సరైన మతం తెలిసియుండవచ్చు, దాన్ని బోధించేవారిని అతడు మెచ్చుకోవచ్చు, దాన్ని అవలంభించేవారిని అతడు పొగడవచ్చు, కాని దాన్ని తన స్వంత జీవితంలో అన్వయించుకోవాల్సిన బాధ్యత కూడా అతనికుంది. (యాకోబు 4:17) అతడు ఆ బాధ్యతను అంగీకరిస్తేనే, అతని జీవితం సఫలమౌతుందని తెలుసుకుంటాడు, మరే విధంగానూ పొందలేని ఆనందాన్ని అతడు పొందుతాడు.

3 ముందు శీర్షికలో, మనం నిజమైన మతం యొక్క ఆరు గుర్తింపు చిహ్నాలను గురించి పరిశీలించాము. వాటిలో ప్రతిఒక్కటి సరైన మతాన్ని గుర్తించడానికి మనకు సహాయం చేయడమే కాకుండా, మనకు వ్యక్తిగతంగా సవాళ్లను, అవకాశాలను అందజేస్తుంది. ఏవిధంగా?

దేవుని వాక్యానికి మీరెలా ప్రతిస్పందిస్తారు?

4. (ఎ) క్రొత్తవారు యెహోవాసాక్షులతో సహవసించడం ప్రారంభించినప్పుడు, సాక్షులు బైబిలును ఉపయోగించడాన్ని గురించి వారు వెంటనే ఏమి గమనిస్తారు? (బి) ఆత్మీయంగా బాగా పోషించబడటం యెహోవా సేవకులను ఎలా ప్రభావితం చేస్తుంది?

4 క్రొత్తగా ఆసక్తి పెంపొందించుకుంటున్నవారితో యెహోవాసాక్షులు బైబిలు పఠనం చేస్తున్నప్పుడు, బోధించబడుతున్నది బైబిలు నుండేనని ఈ క్రొత్తవారిలో అనేకులు వెంటనే గ్రహిస్తారు. వారి ప్రశ్నలకు సమాధానంగా, వారు చర్చీ వర్గాలను, మానవ ఆచారాలను, లేక ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరు. దేవుని స్వంత వాక్యమే అధికారము. వారు రాజ్యమందిరానికి వెళ్లినప్పుడు, అక్కడ కూడా బైబిలే ప్రధాన పాఠ్య పుస్తకమని వారు గమనిస్తారు. యథార్థంగా సత్యాన్ని వెదికేవారికి, యెహోవాసాక్షులలో కనిపించే ఆనందానికి ముఖ్య కారణం వారు దేవుని వాక్యం నుండి ఆత్మీయంగా పోషించబడుతున్నారనే వాస్తవాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టదు.—యెషయా 65:13, 14.

5. (ఎ) యెహోవాసాక్షులను గమనించేవారికి ఏ సవాలు ఎదురౌతుంది? (బి) సాక్షుల ఆనందంలో వారెలా భాగం వహించగలరు?

5 ఒకవేళ మీరు దీన్ని గుర్తిస్తే, దానికి మీరెలా ప్రతిస్పందిస్తారు? మీరు దాని భావాన్ని గ్రహిస్తే, మీరు కేవలం చూసేవారిగానే ఉండలేరు, ఉండాలని కూడా మీరు కోరరు. “వాక్యప్రకారము ప్రవర్తించువారై” యుండకుండా, “వినువారు మాత్రమై” యుండేవారు ‘తమ్మును తాము మోసపుచ్చుకొనువారని’ బైబిలు చూపిస్తున్నది. (యాకోబు 1:22) వారేమి చెప్పినప్పటికీ, వారు నిజంగా దేవున్ని ప్రేమించడం లేదన్న విషయాన్ని, వారు దేవునికి విధేయులు కాకపోవడం చూపిస్తుందని వారు గుర్తించరు కాబట్టి వారు తమ్మును తాము మోసం చేసుకుంటారు. క్రియలు లేని విశ్వాసం మృతమైనది. (యాకోబు 2:18-26; 1 యోహాను 5:3) దానికి బదులుగా, “క్రియను చేయు”వానిగా యెహోవా యెడలగల ప్రేమచేత కదలింపబడిన వ్యక్తి “తన క్రియలో ధన్యుడగును.” అవును, యేసుక్రీస్తు వివరించినట్లుగా, “దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు.”—యాకోబు 1:25; లూకా 11:28; యోహాను 13:17.

6. మనం నిజంగా దేవుని వాక్యాన్ని మెచ్చుకుంటే, వ్యక్తిగతంగా మనమే అవకాశాలను అందుకోడానికి ప్రయత్నిస్తాము?

6 మీరు దేవుని చిత్తం యొక్క జ్ఞానమందు అభివృద్ధి చెందుతున్నప్పుడు, మీరు నేర్చుకుంటున్న ఇతర విషయాలను అన్వయించుకుంటున్నప్పుడు ఆ ఆనందం అధికమౌతుంది. దేవుని వాక్యాన్ని పఠించటానికి మీరు ఎంతగా కృషిచేస్తారు? నిరక్షరాస్యులైన వేలాదిమంది వ్యక్తులు ముఖ్యంగా తాము లేఖనాలను చదివి, ఇతరులకు బోధించే నిమిత్తం చదవడం నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఇతరులు, ప్రతిరోజు బైబిలును, బైబిలు పఠన సహాయకాలైన కావలికోట వంటివాటిని చదవడానికి కొంత సమయం గడపవచ్చునని ప్రతి ఉదయం పెందలకడనే లేస్తారు. బైబిలును మీరు క్రమంగా చదివితే లేక ఇతర పఠనాంశాలలో ఇవ్వబడిన లేఖనాలను తెరిచి చూస్తే, యెహోవా కట్టడలు, ఆజ్ఞలను జాగ్రత్తగా పరిశీలించండి, మన నడిపింపు కొరకు అక్కడ ఇవ్వబడిన అనేక సూత్రాలను పరిశీలించడానికి ప్రయత్నించండి. దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి, మానవజాతితో ఆయన వ్యవహారాల గురించి ప్రతి భాగం తెలియజేస్తున్న దానిని ధ్యానించండి. ఇది మీ హృదయాన్ని మలచడానికి సమయమివ్వండి. మీ స్వంత జీవితంలో బైబిలు ఉపదేశాన్ని మరింత ఎక్కువగా అన్వయించుకోడానికి ఏమైనా మార్గాలున్నాయేమో పరిశీలించండి.—కీర్తన 1:1, 2; 19:7-11; 1 థెస్సలొనీకయులు 4:1.

యెహోవా యెడల మీ భక్తి సంపూర్ణంగా ఉందా?

7. (ఎ) దేవున్ని ఆరాధించాలనే ప్రజల ప్రయత్నాలపై త్రిత్వ సిద్ధాంతం ఎలా ప్రభావం చూపింది? (బి) ఒక వ్యక్తి యెహోవాను గూర్చిన సత్యాన్ని నేర్చుకుంటే ఏమి జరుగవచ్చు?

7 లక్షలాదిమంది ప్రజలకు, నిజమైన దేవుడు ఒక త్రిత్వము కాదని తెలుసుకోవడం గొప్ప ఉపశమనాన్ని కలుగజేసింది. “అది ఒక మర్మం” అనే వివరణ వారిని ఎన్నడు సంతృప్తిపర్చలేదు. అగోచరమైన దేవునికి వారెలా సన్నిహితం కాగలరు? ఆ బోధ ఫలితంగా, వారు తండ్రిని (చర్చీలో వారెప్పుడు ఆయన నామాన్ని వినలేదు) అలక్ష్యం చేయడం, యేసును దేవుడని ఆరాధించడం లేక వారి ఆరాధనను మేరీకి (ఆమె “దేవుని తల్లి” అని వారికి బోధించబడింది) చెల్లించడం వంటివి చేయడానికి అలవాటు చేసుకున్నారు. కాని యెహోవాసాక్షుల్లో ఒకరు బైబిలు తెరిచి, దేవుని వ్యక్తిగత నామం యెహోవా అని వారికి చూపించినప్పుడు వారి హృదయాలు ఆనందంతో ప్రతిస్పందిస్తాయి. (కీర్తన 83:18) ఒక వెనుజ్యులా స్త్రీకి దైవ నామం చూపబడినప్పుడు ఆమె ఎంతగా ఉప్పొంగి పోయిందంటే, తనతో ఆ అమూల్యమైన సత్యాన్ని పంచుకున్న యౌవన సాక్షిని అక్షరాలా కౌగలించుకుంది, గృహ బైబిలు పఠనానికి అంగీకరించింది. యేసు తన తండ్రి గురించి “నా దేవుడు మీ దేవుడు” అని చెప్పాడని, తన తండ్రిని “అద్వితీయ సత్య దేవుడు” అని సంబోధించాడని తెలుసుకున్నప్పుడు, దేవుని గురించి బైబిలు బోధించేది అగోచరం కాదని అలాంటి ప్రజలు గ్రహిస్తారు. (యోహాను 17:3; 20:17) వారు యెహోవా లక్షణాలను తెలుసుకున్నప్పుడు, వారాయనకు సన్నిహితమైనట్లు భావిస్తారు, ఆయనకు ప్రార్థించడం ప్రారంభిస్తారు, ఆయనను ప్రీతిపర్చడానికి ఇష్టపడతారు. తత్ఫలితమేమిటి?

8. (ఎ) యెహోవా యెడల తమకున్న ప్రేమనుబట్టి, ఆయనను ప్రీతిపర్చాలనే వారి కోరికనుబట్టి, లక్షలాదిమంది ప్రజలు ఏమి చేశారు? (బి) క్రైస్తవ బాప్తిస్మము ఎందుకు అత్యంత ప్రాముఖ్యము?

8 గత పది సంవత్సరాల్లో, ఆరు ఖండాలలోను, అనేక ద్వీపాలలోను 25,28,524 మంది నీటి బాప్తిస్మం ద్వారా తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నారు. వారిలో మీరొకరై యున్నారా, లేక బాప్తిస్మం తీసుకోడానికి ఇప్పుడు మీరు సిద్ధపడుతున్నారా? నిజమైన ప్రతి క్రైస్తవుని జీవితంలో బాప్తిస్మం ఒక ప్రాముఖ్యమైన మైలు రాయి. సమస్త జనులను శిష్యులను చేసి వారికి బాప్తిస్మమివ్వమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19, 20) యేసు బాప్తిస్మం తీసుకున్న వెంటనే “నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నాను” అని చెబుతూ, యెహోవా తానే పరలోకం నుండి మాట్లాడడం గమనించదగిన విషయము.—లూకా 3:21, 22.

9. యెహోవాతో అంగీకరించబడిన సంబంధాన్ని కల్గివుండడానికి, మనం ఏమి చేయవలసి ఉంది?

9 యెహోవాతో అంగీకృతమైన సంబంధం ఆనందించదగినది. సమర్పణ, బాప్తిస్మం ద్వారా మీరు అలాంటి సంబంధంలోకి ప్రవేశించివుంటే, దాన్ని చెడగొట్టుకొనే పనేది చేయకండి. జీవిత వ్యాకులతలు, వస్తు సంపదల యెడల ఆసక్తి దాన్ని రెండవ స్థానంలోకి నెట్టివేయడానికి అనుమతించకండి. (1 తిమోతి 6:8-12) “నీ ప్రవర్తన అంతటి యందు [యెహోవా] అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును” అన్న సామెతలు 3:6 నందలి ఉపదేశానికి అనుగుణంగా జీవించండి.

క్రీస్తు ప్రేమ మిమ్మల్ని ఎంత గాఢంగా ప్రభావితం చేస్తుంది?

10. మనం యెహోవాను ఆరాధించడం యేసును అలక్ష్యం చేయకుండా ఎందుకు ఉంచుతుంది?

10 యెహోవా ఏకైక సత్య దేవుడనే సరైన మెప్పు, ఒక వ్యక్తి యేసుక్రీస్తును అలక్ష్యపరచునట్లు చేయదు. బదులుగా ప్రకటన 19:10 ఇలా చెబుతుంది: “యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము.” ఆదికాండము నుండి ప్రకటన వరకు, ప్రేరేపిత ప్రవచనాలు యెహోవా సంకల్పములో యేసుక్రీస్తు పాత్రను గూర్చిన వివరాలను తెలియజేస్తున్నాయి. ఒక వ్యక్తి ఆ వివరాలతో పరిచయం ఏర్పరచుకుంటే, క్రైస్తవమత సామ్రాజ్య అబద్ధ బోధల ఫలితంగా ఏర్పడిన అపోహలు, భావాల నుండి వేరుగా ఉండే ఓ అద్భుతమైన చిత్రం ఆయనను గూర్చి ఏర్పడుతుంది.

11. దేవుని కుమారుని గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకోవడం పోలాండ్‌లోని ఒక స్త్రీపై ఎలా ప్రభావం చూపింది?

11 దేవుని కుమారున్ని గూర్చిన సత్యాన్ని గ్రహించుకోవడం ఒక వ్యక్తిపై గంభీరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. పోలండ్‌లోని డెనూటె అనే స్త్రీ విషయంలో అదే జరిగింది. ఆమె ఎనిమిది సంవత్సరాలుగా యెహోవాసాక్షులతో సహవసిస్తుంది. వారు చెప్పేదాన్ని బట్టి ఆనందించేది, కాని ఆమె సత్యారాధనను తన జీవన విధానంగా మాత్రం చేసుకోలేదు. తర్వాత ఆమె క్రీస్తు జీవితాన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా రూపొందించబడిన జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి అనే పుస్తకాన్ని పొందింది.a తర్వాత సాయంకాలం, కేవలం ఒక్క అధ్యాయం మాత్రం చదవాలని ఆమె పుస్తకం తెరిచింది. అయితే, ఉదయమయ్యే వరకు, ఆమె పుస్తకాన్ని పూర్తిగా చదివే వరకు దాన్ని ప్రక్కన పెట్టలేకపోయింది. ఆమె బాగా ఏడ్చింది. “యెహోవా, నన్ను క్షమించు” అని ప్రార్థించింది. తాను చదివిన దాని ఫలితంగా, యెహోవా మరియు ఆయన కుమారుడు చూపిన ప్రేమను మునుపెన్నటికన్నా యిప్పుడామె స్పష్టంగా గ్రహించగల్గింది. దేవుడు తనకు సహనంతో అందజేస్తున్న సహాయం నుండి ఎనిమిది సంవత్సరాలుగా తాను కృతజ్ఞత లేకుండా ప్రక్కకు తిరిగిపోయానని ఆమె గ్రహించింది. యేసుక్రీస్తు నందలి విశ్వాసం ఆధారంగా ఆమె 1993లో తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుంది.

12. యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞానం మన జీవితాలపై ఎలా ప్రభావం చూపుతుంది?

12 చురుకైన, ఫలవంతమైన క్రైస్తవునిగా ఉండటమనేది “మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన”ముతో సంబంధము కలిగివుంది. (2 పేతురు 1:8) ఇతరులతో రాజ్యసందేశాన్ని పంచుకోవడం వంటి కార్యక్రమంలో మీరు ఎంత వరకు భాగం వహిస్తారు? ఒక్కొక్కరు చేసే సేవ వారివారి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. (మత్తయి 13:18-23) కొన్ని పరిస్థితులను మనం మార్చలేము; కొన్నిటిని మార్చవచ్చు. చేయగలిగే మార్పులను గుర్తించడానికి, చేయడానికి ఏది మనల్ని పురికొల్పుతుంది? అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది”; వేరే మాటల్లో చెప్పాలంటే, మన కొరకు ఆయన తన జీవితాన్ని అర్పించడంలో చూపించిన ప్రేమ ఎంత విశేషమైనదంటే, దాని యెడల మన మెప్పు పెరిగే కొలది మన హృదయాలు తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. ఫలితంగా, స్వంత గమ్యాల కొరకు పాటుపడటం, మన స్వంత కోరికలను తీర్చుకోవడానికి జీవించడం తగినది కాదని గ్రహిస్తాము. బదులుగా, క్రీస్తు చేయమని తన శిష్యులకు అప్పగించిన పనికి మొదటి స్థానాన్ని ఇవ్వగల్గేలా మన కార్యాలను మార్చుకుంటాము.—2 కొరింథీయులు 5:14, 15.

లోకం నుండి వేరైయుండుట—ఎంత మేరకు?

13. తనను తాను ఈ లోకంలో భాగంగా చేసుకున్న మతంలో మనమెందుకు భాగమై ఉండకూడదు?

13 క్రైస్తవమత సామ్రాజ్యం, ఇతర మతాలు చేసిన రికార్డును చూడటం కష్టమేమికాదు ఎందుకంటే, వారు లోకంలో భాగమై ఉండడానికి ఇష్టపడతారు. విప్లవాత్మక కార్యాల ఖర్చుల కొరకు చర్చీ డబ్బులు వాడబడతాయి. మతనాయకులు గెరిల్లా పోరాటకులుగా తయారయ్యారు. ప్రతిదినం భూమి నలుమూలల నుండి, ఒకరితో ఒకరు పోరాడుతున్న మతసంబంధ కొట్లాటలను గూర్చిన వార్తలు వార్తాపత్రికల్లో వస్తున్నాయి. వారి చేతులు రక్తంతో తడిసిపోతున్నాయి. (యెషయా 1:15) ప్రపంచవ్యాప్తంగా మతనాయకులు రాజకీయ రంగాన్ని నేర్పుతో నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సత్యారాధికులు దీనిలో ఎంతమాత్రం భాగం వహించరు.—యాకోబు 4:1-4.

14. (ఎ) మనం లోకం నుండి వేరైయుండ గోరితే, మనం వ్యక్తిగతంగా దేన్ని విసర్జించాలి? (బి) లోక సంబంధ దృక్పథాలు, ఆచారాలలో చిక్కుకొనకుండా ఉండడానికి మనకు ఏది సహాయం చేయగలదు?

14 కాని లోకం నుండి వేరైయుండటంలో అంతకంటే ఎక్కువే ఇమిడివుంది. ధనాపేక్ష, ధనం కొనగల వాటి యెడల ప్రీతి, వ్యక్తిగత ప్రఖ్యాతి కొరకైన కోరిక, సుఖభోగాల కొరకు ఎడతెగని ప్రయత్నం, వీటితోపాటు ఇతరుల యెడల నిజమైన శ్రద్ధ లేకపోవడం, అబద్ధాలు చెప్పడం, దుర్భాషలాడటం, అధికారానికి ఎదురుతిరగడం, ఆశానిగ్రహాన్ని చూపించలేకపోవడం వంటి గుణాలతో ప్రపంచం నిండివుంది. (2 తిమోతి 3:2-5; 1 యోహాను 2:15, 16) మన స్వంత అపరిపూర్ణత వల్ల, మనం కొన్నిసార్లు అలాంటి కొన్ని గుణాలను చూపిస్తుంటాము. అలాంటి ఉరులను తప్పించుకోడానికి మనం చేసే పోరాటంలో మనకు ఏది సహాయం చేయగలదు? వీటన్నిటి వెనుక ఉన్నదెవరో మనకు మనం గుర్తుచేసుకుంటుండాలి. “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:19) ఏదైనా ఒక చర్య ఎంత మరులు గొల్పేదిగా కనబడినప్పటికీ, ఎంతమంది ఇతర ప్రజలు అలాంటి జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, దానంతటి వెనుక యెహోవా యొక్క ప్రధాన శత్రువైన అపవాదియగు సాతాను ఉన్నాడని మనం గమనించినప్పుడు, అది నిజంగా ఎంత అసహ్యంగా ఉందో మనం గుర్తిస్తాము.—కీర్తన 97:10.

మీ ప్రేమ ఎంతవరకు చేరుతుంది?

15. మీరు గమనించిన నిస్వార్థమైన ప్రేమ సరైన మతాన్ని గుర్తించడానికి మీకు ఎలా సహాయం చేసింది?

15 మొదట్లో మీరు యెహోవాసాక్షులతో సహవసించడం ప్రారంభించినప్పుడు, వారి మధ్యనున్న ప్రేమ లోకాత్మకు విరుద్ధంగా ఉంది గనుక నిస్సందేహంగా అది మిమ్మల్ని ఆకట్టుకొని ఉండవచ్చు. నిస్వార్థ ప్రేమను నొక్కి చెప్పడం, యెహోవా స్వచ్ఛారాధనను ఇతర విధాలైన ఆరాధన నుండి వేరుగా ఉంచుతుంది. బహుశా ఇదే మిమ్మల్ని యెహోవాసాక్షులు సరైన మతాన్ని అవలంభిస్తున్నారని ఒప్పించి ఉండవచ్చు. యేసుక్రీస్తు తానే ఇలా చెప్పాడు: “మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”—యోహాను 13:35.

16. మన ప్రేమను విశాలపర్చుకోడానికి మనకు వ్యక్తిగతంగా ఏ అవకాశాలు ఉండగలవు?

16 అదే లక్షణం మిమ్మల్ని కూడా క్రీస్తు శిష్యుల్లో ఒకరిగా గుర్తిస్తున్నదా? మీ ప్రేమను వ్యక్తపర్చుటను విశాలపర్చుకొనే మార్గాలు ఏవైనా ఉన్నాయా? నిస్సందేహంగా మనందరం అలా చేయగలము. రాజ్యమందిరం వద్ద ఇతరుల యెడల స్నేహభావం కనపర్చడం కంటే దానిలో మరెంతో ఇమిడి ఉంది. మనల్ని ప్రేమిస్తున్నవారినే మనం ప్రేమిస్తే, మనం లోకం నుండి ఏమైనా వేరుగా ఉండగలమా? “అన్నిటికంటే ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కుటమైన ప్రేమగలవారై యుండుడి” అని బైబిలు ప్రేరేపిస్తున్నది. (1 పేతురు 4:8) ఎవరి యెడల మనం ఎక్కువ ప్రేమను కనపర్చాలి? మనకు భిన్నమైన పూర్వరంగం గలవారిని, వారు చేసే కొన్ని పనులు మనకు చిరాకు కలుగజేసే క్రైస్తవ సహోదరుడు లేక సహోదరీ యెడల కనపర్చాలా? అనారోగ్యం లేక వృద్ధాప్యం వల్ల కూటాలకు క్రమంగా హాజరు కాలేకపోతున్న వారి యెడలనా? మన వివాహజత యెడలనా? లేక, బహుశ వృద్ధులౌతున్న మన తలిదండ్రుల యెడలనా? ఆత్మఫలాలను, ప్రేమను కూడా చక్కగా వ్యక్తపరుస్తున్న కొందరు, తీవ్రంగా అసమర్థులైపోయిన కుటుంబ సభ్యుల యెడల పూర్తి శ్రద్ధను చూపెట్టవలసిన కష్టతరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, వారు ఇవన్నీ మళ్లీ నేర్చుకుంటున్నట్లుగా భావించారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కూడా, మన ప్రేమ మన ఇంటి వారికి మాత్రమే పరిమితమై ఉండకూడదు.

రాజ్య సాక్ష్యపు పని—మీకు ఎంత ప్రాముఖ్యమైనది?

17. యెహోవాసాక్షుల సందర్శనాల వల్ల మనం వ్యక్తిగతంగా మేలు పొందినట్లైతే, ఇప్పుడు మనమేమి చేయడానికి కదిలింపబడాలి?

17 మనం మన తోటివారి యెడల ప్రేమను కనపర్చడానికి ఒక ప్రాముఖ్యమైన మార్గం, దేవుని రాజ్యం గురించి వారికి సాక్ష్యమివ్వడమే. యేసు ప్రవచించిన ఈ పనిని కేవలం ఒక గుంపు వారు మాత్రమే చేస్తున్నారు. (మార్కు 13:10) వారే యెహోవాసాక్షులు. మనం ఆ సాక్ష్యం ద్వారా వ్యక్తిగతంగా మేలు పొందాము. ఇతరులకు సహాయం చేయడం ఇప్పుడు మన ఆధిక్యత. ఈ విషయంలో మనం దేవుని ఉద్దేశాన్ని కలిగివుంటే, ఈ పని మన జీవితాల్లో ప్రధానమైనదై ఉంటుంది.

18. జెహోవాస్‌ విట్నెసెస్‌—ప్రొక్లైమర్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ కింగ్‌డ్‌ అనే పుస్తకాన్ని మనం చదవడం, రాజ్య సాక్ష్యపుపనిలో మన వంతును మనం చేయడానికి ఎలా ప్రాబల్యం చూపగలదు?

18 ఈ అంత్య దినాల్లో రాజ్యసందేశం భూమి యొక్క మారుమూల ప్రాంతాలకు కూడా ఎలా తీసుకువెళ్ల బడిందనే ఉత్తేజకరమైన విషయం జెహోవాస్‌ విట్నెసెస్‌—ప్రొక్లైమర్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ కింగ్‌డ్‌ అనే పుస్తకంలో చెప్పబడింది. మీకు ఇంగ్లీషు భాష వస్తే, దాన్ని తప్పకుండా చదవండి, చదివేటప్పుడు, రాజ్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడంలో ప్రతిఒక్కరు ఎలా భాగంవహించారో వాటన్నిటిని ప్రత్యేకంగా గమనించండి. మీరు అనుకరించదగిన ఎవరి మాదిరులైనా ఉన్నాయా? మనందరికీ అనేక అవకాశాలు తెరువబడివున్నాయి. యెహోవా యెడల మనకున్న ప్రేమ వాటిని సరిగా ఉపయోగించుకోడానికి మనల్ని పురికొల్పుగాక.

19. సరైన మతాన్ని తెలుసుకోవడంతో వచ్చే బాధ్యతను మనం అంగీకరిస్తే, మనం ఎలా ప్రయోజనాన్ని పొందగలము?

19 అలా మనం యెహోవా చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం సమర్పించుకుంటే, జీవితం యొక్క అర్థమేమిటి? అనే ప్రశ్నకు సమాధానాన్ని కనుగొంటాము. (ప్రకటన 4:11) అప్పుడు మనం ఏదో వెలితి భావంతో తడువులాడుతూ ఉండము. యెహోవా దేవుని సేవచేయడానికి మిమ్మల్ని మీరు హృదయపూర్వకంగా అన్వయించుకోవడంలో లభించేదాని కంటే అధికమైన సంతృప్తి, మీరు మరే ఇతర పని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నా లభించదు. అది ఎంతటి శ్రేష్ఠమైన భవిష్యత్తును అందజేస్తుంది! ఆయన నూతన లోకంలో మనం సంతృప్తికరమైన నిత్యజీవాన్ని పొందగలము, అందులో దేవుడు మానవులను సృష్టించిన ప్రేమగల సంకల్పానికి పూర్తి అనుగుణంగా మనం మన సామర్థ్యాలను ఉపయోగించ గల్గుతాము.

[అధస్సూచీలు]

a వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటి ఆఫ్‌ న్యూయార్క్‌, ఇన్‌కార్పొరేటెడ్‌ వారు ప్రచురించారు.

మీరెలా జవాబిస్తారు?

◻ ఒక మతం బైబిలును దేవుని వాక్యమని, యెహోవాను సత్య దేవుడని అంగీకరించి ఘనపర్చడం ఎందుకు ప్రాముఖ్యము?

◻ విమోచకునిగా యేసు పాత్రను గురించి నిజమైన మతం ఏమి బోధిస్తుంది?

◻ క్రైస్తవులు ఎందుకు లోకం నుండి వేరై, నిస్వార్థమైన ప్రేమను కలిగివుండాలి?

◻ సరైన మతంలో రాజ్య సాక్ష్యపు పనికి ఏ పాత్ర ఉంది?

[16వ పేజీలోని చిత్రాలు]

సత్యారాధన యొక్క బాధ్యతలను అంగీకరించడంలో బాప్తిస్మం ఒక ప్రాముఖ్యమైన చర్య. ప్రతి నెల, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25,000 మంది అలా చేస్తున్నారు

రష్యా

సెనెగల్‌

పపువా న్యూ గినియా

అమెరికా

[17వ పేజీలోని చిత్రాలు]

బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోడం సత్యారాధనలో భాగము

అమెరికా

బ్రెజిల్‌

అమెరికా

హాంకాంగ్‌

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి