కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 6/1 పేజీలు 5-7
  • సరియైన మతం కొరకు వారి అన్వేషణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరియైన మతం కొరకు వారి అన్వేషణ
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు కొంతమందికి గంభీరమైన సందేహాలుంటాయి
  • ఆమె మృతులను గూర్చిన సత్యాన్ని నేర్చుకుంది
  • వారు అర్థవంతమైన జీవితాన్ని కనుగొన్నారు
  • “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • కొందరు జవాబులు పొందిన విధానము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 6/1 పేజీలు 5-7

సరియైన మతం కొరకు వారి అన్వేషణ

జీవితాన్ని గూర్చిన తమ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబుల కొరకు కొందరు బాల్యం నుండే అన్వేషించారు. చిన్నవారిగా ఉన్నప్పుడు వారు మతసంబంధమైన ఆరాధనలకు హాజరై యుండవచ్చు. ఇవ్వబడిన జవాబులు గాని చర్చీ ఆచారం గాని జీవిత సమస్యలను ఎదుర్కోడానికి వారికి నిజంగా సహాయం చేయలేదని అనేకులు తెలుసుకున్నారు.

చాలా అరుదుగా మతసంబంధ ఆచారాలకు హాజరౌతున్నప్పటికీ, తాము తమ తలిదండ్రుల మతానికి చెందిన వాళ్లమనే వారు చెప్పుకుంటారు. చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు చెందిన ఒక బిషప్పు చెప్పినదాని ప్రకారం వారిది శేషించిన విశ్వాసం. వారు మతాన్ని ఓ ప్రక్కన పడేశారు. ఇతరులు, మతసంబంధ వర్గాల్లో తాము చూస్తున్న వేషధారణను బట్టి విసిగిపోయి, మొత్తంగా మతాన్నే నిరాకరించారు. అయినా, జీవితాన్ని గూర్చిన వారి ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

ఎందుకు కొంతమందికి గంభీరమైన సందేహాలుంటాయి

ఇళ్లులేని వారికి సహాయం చేయడానికి, పేదలకు ఆహారాన్ని పంచిపెట్టడానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతునివ్వడానికి అనేక చర్చీలకు సంస్థలున్నాయని చాలామందికి తెలుసు. క్రైస్తవేతరుల మధ్యనే కాకుండా, క్రైస్తవులమని చెప్పుకునేవారి మధ్య కూడా మతంలో వేళ్లూనిన దౌర్జన్యం, రక్తపాతాన్ని గూర్చిన వార్తలు దాదాపు ప్రతిరోజు వారు కూడా వింటుంటారు. అలాంటి హింసాయుత చర్యల్లో పాల్గొనే గుంపులు అవలంభించేది సరియైన మతమా అని వారు శంకించడం మనల్ని ఆశ్చర్యపర్చాలా?

చర్చీల మద్దతుగల అనాధ శరణాలయాలు ఎంతో మంచివని మతసంబంధ పూర్వాపరాలుగల అనేకులు భావించేవారు. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో, శ్రద్ధ తీసుకొమ్మని వారికప్పగించిన పిల్లలనే వారు లైంగికంగా పాడు చేశారన్న నేరంపై పలు ప్రాంతాల్లో మతగురువులు నిందించబడడంతో వారు కలతచెందారు. మొదట్లో, కేవలం కొద్దిమంది మతగురువులే అలాంటి వారని ప్రజలనుకున్నారు. ఇప్పుడు, అసలు చర్చీనందే ప్రాథమికంగా ఏదైనా తప్పు ఉందా అని కొందరు అనుకుంటున్నారు.

ఎగన్యా వంటి కొంతమంది, ఒకప్పుడు తమ మతమందు ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండేవారు. అర్జెంటీనాలోని యౌవనస్థురాలుగా, ఇటాటి కన్యను ఆరాధించడానికి యాత్రలు చేసినవారిలో ఆమె కూడా వుంది. ఆమె 14 సంవత్సరాల పాటు ఒక కాన్వెంట్‌లో నన్‌గా పనిచేసింది. తర్వాత ఆమె అది విడిచిపెట్టి, తిరుగుబాటు ద్వారా సమాజంలో సామాజిక, ఆర్థిక రంగాల్లో సత్వర, సమూల మార్పులు తీసుకురావచ్చునని ప్రబోధించిన అంతర్జాతీయ మతరాజకీయ గుంపులో చేరింది. తాను చూసి, అనుభవించిన దాన్నిబట్టి ఆమె దేవుని యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోయింది. ఆమె తాను విశ్వసించగల మతం కొరకు నిజంగా వెదకలేదు. ఆమెకు కావలసింది బీదలైన వారికి న్యాయం చేకూర్చడానికి ఒక మార్గం, తాను విశ్వసించగల ఒక స్నేహితురాలు.

ఇతరులైతే చర్చీల్లో జరుగుతున్న దాన్ని గమనించి వాటికి దూరంగా ఉండిపోయారు. ఒక నాస్తికుని ఉద్దేశాలు 1991లో స్పుట్నిక్‌ అనే పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఆయన యథార్థంగా ఇలా చెప్పాడు: “అన్యుల, క్రైస్తవుల పురాణ ధర్మాలకు మధ్య నేను ఏ తేడాను కనుగొనలేకపోతున్నాను” దానికి ఉదాహరణగా, ఆయన ఒక ఊరేగింపు గురించి వివరించాడు, ఆ ఊరేగింపులో బంగారు బూటాపని చేయబడిన వస్త్రాలు ధరించిన మతనాయకులు మమ్మీ ఉన్న శవపేటికను నెమ్మదిగా మోసుకుంటూ మాస్కో వీధుల వెంట తిరిగారు. “ఒక నిష్టాపరుడైన క్రైస్తవ పరిశుద్ధుని” శరీరాన్ని మ్యూజియం నుండి చర్చీకి తీసుకువెళ్తున్నారు, అది రచయితకు ప్రాచీన ఐగుప్తులోని మతగురువులు, మమ్మీలు జ్ఞాపకం వచ్చేలా చేసింది. మాస్కోలో జరిగిన ఆ ఊరేగింపులో భాగం వహిస్తున్న వారందరూ “క్రైస్తవ త్రిత్వాన్ని” నమ్ముతారని, అంతేగాక ఐగుప్తీయులు కూడా ఓసిరిస్‌, ఐసిస్‌, హోరస్‌ అనే త్రిత్వ దేవున్ని ఆరాధించేవారని కూడా ఆయన చెప్పాడు.

క్రైస్తవత్వ ప్రేమ సిద్ధాంతాలైన “దేవుడు ప్రేమాస్వరూపి,” “నీ పొరుగువానిని ప్రేమించుము” అనే వాటికి సమానమైనవేవి అన్యుల దేశమైన ఐగుప్తులో కనుగొనలేమని కూడా ఆ రచయిత అన్నాడు. ఆయనిలా చెప్పాడు: “ప్రపంచంలో సహోదర ప్రేమ విజయం సాధించలేక పోయింది, చివరికి తనను తాను క్రైస్తవ లోకమని చెప్పుకొనే దానిలో కూడా అది లోపించింది.” చర్చీ రాజకీయాల్లో తలదూర్చడం వల్ల కల్గిన చెడు ఫలితాల గురించి కూడా తర్వాత ఆయన వ్యాఖ్యానించాడు. తాను వెదికేదాన్ని క్రైస్తవమత సామ్రాజ్యం యొక్క చర్చీలు అందజేశాయని భావించేలా ఆయన చూసింది ఆయన్ని కదిలించలేదు.

దానికి బదులుగా, ఇతరులు సంతృప్తికరమైన సమాధానాలను కనుగొన్నారు కాని, క్రైస్తవమత సామ్రాజ్య చర్చీలలో కాదు.

ఆమె మృతులను గూర్చిన సత్యాన్ని నేర్చుకుంది

ఇప్పుడు 37 సంవత్సరాల వయసున్న మగ్దలేనా, బల్గేరియాలో నివసిస్తుంది. తన మామగారు 1991లో మరణించిన తర్వాత ఆమె ఎంతో నిరాశ చెందింది. ఆమె పదే పదే తనను తానిలా ప్రశ్నించుకునేది, ‘మృతులు ఎక్కడికి వెళతారు? మా మామగారు ఎక్కడ ఉన్నారు?’ ఆమె చర్చీకి వెళ్లింది, ఇంటి వద్ద ఒక విగ్రహం ముందు ప్రార్థించింది, అయినా ఆమెకు జవాబులు దొరకలేదు.

తర్వాత ఒక పొరుగు వ్యక్తి ఫోన్‌ చేసి ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడు. యెహోవాసాక్షులతో పఠనం చేస్తున్న ఒక యౌవనస్థుడు ఆ పొరుగువారి దగ్గరకు వచ్చాడు. ఆయన దేవుని రాజ్యం గురించి, ప్రజలు నిత్యం సంతోషంగా జీవించగల పరదైసుగా భూమిని మార్చే దేవుని సంకల్పాన్ని గురించి మాట్లాడుతుండగా ఆమె విన్నది. బల్లమీద మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం ఉంది. దాన్ని ఉపయోగిస్తూ ఆ యౌవనస్థుడు ఆమె అవధానాన్ని ప్రసంగి 9:5 నందలి బైబిలు లేఖనంవైపు మళ్లించాడు, అదిలా ఉంది: “చచ్చినవారు ఏమియు ఎరుగరు.” ఆ రోజు సాయంకాలం ఆమె ఇంకా ఎక్కువ చదివింది. మృతులు పరలోకంలోగాని, నరకంలోగాని వేరే జీవితం కొరకు వెళ్లలేదని ఆమె తెలుసుకుంది; మత్తు నిద్రలో ఉన్నట్లుగా, వారికి ఏమి తెలియదు. యెహోవాసాక్షుల స్థానిక సంఘ కూటానికి రమ్మన్న ఆహ్వానాన్ని ఆమె సంతోషంగా అంగీకరించింది. కూటం ముగిసిన తర్వాత ఆమె క్రమ బైబిలు పఠనానికి అంగీకరించింది. వారు కూటంలో యెహోవాకు ప్రార్థనలు చేసిన విధానాన్ని గమనించి, ఆమె కూడా తనలో లోతుగా పాతుకుపోయిన బలహీనతను అధిగమించడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆమె ప్రార్థనకు సమాధానం దొరికినప్పుడు, ఆమె తాను సరైన మతాన్ని కనుగొన్నానని తెలుసుకుంది.

వారు అర్థవంతమైన జీవితాన్ని కనుగొన్నారు

ఆండ్రే బెల్జియంలోని ఒక బలమైన కాథలిక్‌ విశ్వాసంగల గృహంలో పెరిగి, స్థానిక మతగురువుకు సహాయకునిగా పనిచేశాడు. అయితే, ఆ సమయంలో చర్చీ యెడల ఆయనకున్న గౌరవాన్ని తగ్గించేలాంటి విషయాలను ఆయన చూశాడు. ఫలితంగా, ఆయన నామకార్థ కాథలిక్‌గా మిగిలాడు.

ఆయన 15 సంవత్సరాల పాటు ఫుట్‌బాల్‌ ఆడాడు. ఇటలీలో వారి జట్టు ఒక టోర్నమెంట్‌ ఆడినప్పుడు, వారు పోప్‌తో సమావేశం కావడానికి ఆహ్వానించబడ్డారు. ఆ సందర్శనంలో ఆత్మీయంగా పెంపొందించేది ఏది లేదు, పోప్‌ చుట్టూవున్న లోకసంబంధ ఐశ్వర్యం ఆండ్రేను కలవరపర్చింది. చర్చీని గూర్చిన అతని అనుమానాలు ఎక్కువయ్యాయి. విచ్ఛిన్నమైన రెండు వివాహాల కారణంగా అతని వ్యక్తిగత జీవితం అసంతోషకరంగా ఉంది. ప్రపంచ పరిస్థితి అతనికి నిరాశ కలుగజేసింది. ఆయన 1989లో తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు: ‘మన చుట్టూ జరుగుతున్న తెలివితక్కువ సంఘటనలన్నిటి భావమేమిటి?’ ఆయన తన మతం నుండి సమాధానాలు కనుగొనలేకపోయాడు.

ఆండ్రే 1990లో ఐస్‌లాండ్‌ నందు ఫుట్‌బాల్‌ కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు, యెహోవాసాక్షుల మిషనరీయైన ఐరీస్‌ అతన్ని కలిసింది. ఆయన సాహిత్యం తీసుకుని మిషనరీని మళ్లీ రమ్మని ఆహ్వానించాడు. ఆమె తన భర్త కెల్‌ను తీసుకుని వచ్చింది. చివరికి వారు కూర్చుని ఆండ్రేతో మాట్లాడే సమయానికి అతడు బైబిలును అర్థం చేసుకోవాలనే గాఢమైన కోరికను కలిగివున్నాడన్నది స్పష్టమైంది. అతని భార్య ఆస్తా కూడా ఆసక్తి కలిగివుంది. శిక్షణనిచ్చే తరగతుల మధ్య మధ్యాహ్న సమయంలో ఆయనకు మూడు గంటల ఖాళీ సమయం ఉండేది, ఆ సమయాన్ని బైబిలు పఠనం కొరకు ఉపయోగించడానికి వారు నిర్ణయించుకున్నారు. ఆయన “కేవలం విశ్రాంతి తీసుకోవడం కంటే బైబిలు చదవడం ద్వారా నేను ఎక్కువ విశ్రాంతి పొందుతున్నట్లు భావిస్తున్నాను” అన్నాడు. క్రమంగా బైబిలు వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. యెహోవా యందు, ఆయన రాజ్య మందు వారి ఆసక్తి మెల్లిగా పెరిగింది. శాంతియుత నూతన లోకాన్ని గూర్చిన బైబిలు నందలి మహిమాన్విత వాగ్దానాలు, “జరుగుతున్న తెలివితక్కువ సంఘటనలన్నీ” లేకుండాపోయే లోకం వారికి వాస్తవంగా కన్పించింది. ఇప్పుడు ఆండ్రే, ఆస్తా ఇద్దరూ తాము క్రొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు.

మగ్దాలేనా, ఆండ్రే, ఆస్తా చివరకు తాము సరైన మతాన్ని కనుగొన్నామన్న నమ్మకాన్ని కలిగివున్నారు. ఎగన్యా కూడా, రాజకీయ పద్ధతుల ద్వారా ప్రపంచ సమస్యలను పరిష్కరిద్దామని ప్రయత్నించిన తర్వాత, చివరికి తాను సరైనదని భావించే మతాన్ని యెహోవాసాక్షుల మధ్య కనుగొన్నది. కాని ఒక మతం సరైనదని నిజంగా ఏది నిర్థారిస్తుంది? దయచేసి క్రిందవున్న సమాచారాన్ని చూడండి.

[7వ పేజీలోని చిత్రం]

సంతృప్తికరమైన సమాధానాల కొరకైన అన్వేషణలో యాభై లక్షలకంటే ఎక్కువమంది ప్రజలకు యెహోవాసాక్షులచే చేయబడుతున్న క్రమ బైబిలు పఠనం సహాయం చేస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి