కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 6/1 పేజీలు 3-4
  • మతం యెడల ఎందుకు ఆసక్తి కలిగివుండాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మతం యెడల ఎందుకు ఆసక్తి కలిగివుండాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు మతమును గంభీరముగా తీసికొనవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మీరు సరియైన మతాన్ని కనుగొన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • మీ ఆధ్యాత్మిక అవసరాలు తీర్చుకునే విధానం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • సంభాషణను ఆటంకపర్చే వారికి మీరెలా ప్రత్యుత్తరమివ్వవచ్చును
    బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 6/1 పేజీలు 3-4

మతం యెడల ఎందుకు ఆసక్తి కలిగివుండాలి?

భూమిపైనున్న ప్రతి దేశంలోను, మతం యెడల ఆసక్తి ఉంది. మరో ప్రక్క, మతం యెడల తమకు ఆసక్తి లేదని ఎంతో నిర్మొహమాటంగా చెప్పేవారు కూడా అనేకులున్నారు. కాని వారు ఎప్పుడూ అలాగే భావించారా?

మానవ నైజం ఎలా ఉందంటే, కేవలం వస్తుసంపదతోనే ఒక వ్యక్తి నిజంగా సంతృప్తిపడలేని విధంగా ఉంది. మానవులకు ఆత్మీయత అవసరం. అప్పుడప్పుడు వినోదం అనుభవిస్తూ, భౌతికావసరతలను తీర్చుకోవడంతోనే ముడిపడివుండే దైనందిన జీవితం ఒక వ్యక్తి అంతర్గత అవసరతలను సంపూర్ణంగా తీర్చలేదు. జంతువులవలె కాకుండా, మానవులు ‘జీవిత సంకల్పం ఏమిటి?’ ‘ఎంతో అందమైనది, మరెంతో అసహ్యమైనది కూడా అయిన ఈ స్వల్ప జీవితమే సమస్తమా?’ అనే విషయాలను గురించి తెలుసుకోవాలని కోరతారు. ఇలాంటి ప్రశ్నలు మీరడగలేదా?

అయినా, నేడు జీవించియున్న లక్షలాదిమంది ప్రజలు, మతం యెడల కొద్దిపాటి అర్థవంతమైన ఆసక్తిని కూడ నిరుత్సాహపర్చిన పరిసరాల్లో పెరిగారు. అటువంటి ప్రభావం వారి తలిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, లేక ప్రభుత్వం నుండి కూడ కలిగివుండవచ్చు.

కమ్యూనిస్టు పరిపాలనలో ప్రజలకు దేవుడు లేడని బోధించబడిందని అల్బేనియా నివాసియైన స్కాలాబ్రినో అనే యౌవనుడు వివరించాడు. అంతేగాక, మతం గురించి మాట్లాడటం వారికి ప్రమాదకరంగా ఉండేది; అలా చేయడం చెరసాలపాలగుటకు నడిపించవచ్చు. అయినా, 1991లో స్విట్జర్‌లాండ్‌లో శరణార్థిగా ఉన్నప్పుడు బైబిలు పఠనంచేసే అవకాశం అతనికి ఇవ్వబడింది. అతడు అంగీకరించాడు. ఎందుకు?

అతడు అల్బేనియాలో ఉన్నప్పుడు బైబిలువంటి పుస్తకం ఒకటి ఉందని విన్నాడు, కాని దాని గురించి నిజంగా అతనికేమి తెలియదు. అలా, అతన్ని ప్రేరేపించింది ప్రాథమికంగా బైబిలును అర్థం చేసుకోవాలనే కోరిక కాదు. మానవజాతి యెడల, భూమి యెడల దేవుడు కలిగివున్న సంకల్పాన్ని గురించి పఠిస్తామని అతనికి చెప్పబడినప్పటికీ, తాను స్థానిక భాషను అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది మంచి అవకాశమని తలంచాడు. అయినా, త్వరలోనే తాను నేర్చుకుంటున్నది తన అంతర్గత ఆత్మీయ ఆకాంక్షను తృప్తిపర్చిందని అతడు తెలుసుకున్నాడు. జీవానికి అవసరమైన సమస్తాన్ని ప్రజలు పుష్కలంగా అనుభవిస్తూ నిత్యం జీవించగల, శాంతి నెలకొని ఉండే నూతన లోకాన్ని గూర్చిన దేవుని వాగ్దానాన్ని గురించి తెలుసుకున్నప్పుడు అతడెంతో ఆనందించాడు. ఈ నూతన లోకంలో తాను, తన కుటుంబం భాగమై ఉండవచ్చునని తెలుసుకున్నప్పుడు అతని ఆసక్తి అధికమైంది. సువార్తను తన వరకే ఉంచుకోలేక, అల్బేనియాలో ఉన్న తన కుటుంబంతో పంచుకోడానికి అతడు వారికి ఫోన్‌ చేశాడు.

రష్యా నివాసియైన అలిక్స్యా, బైబిలు యొక్క కచ్చితమైన జ్ఞానం ఒక వ్యక్తి జీవితంపై చూపించగల ప్రభావాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు. సమస్యల్లో మునిగిపోయి, జీవిత సంకల్పానికి సంతృప్తికరమైన వివరణను తెలుసుకోలేక అతడు ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధమయ్యాడు. అయినా, మొదట అతడు ఫిన్‌లాండ్‌లోవున్న తన స్నేహితున్ని చూడడానికి వెళ్లాడు. రైలులో ప్రయాణిస్తుండగా, అతడు తన సమస్యల గురించి తన తోటి ప్రయాణికులలో కొంతమందితో మాట్లాడాడు. వారిలోవున్న ఒక యెహోవాసాక్షి, అలాంటి సమస్యలకు బైబిలు పరిష్కారాల్ని చూపిస్తుంది కాబట్టి దాన్ని పఠించమని అతనికి చెప్పింది. అతడు సంశయించాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా అతనికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈసారి మరో సాక్షి అతనితో మాట్లాడింది, ఆమె తనకు కూడా అలాంటి సమస్యలే ఉండేవని, వాటిని పరిష్కరించుకోడానికి బైబిలు సహాయం చేసిందని చెప్పింది. ఆమె కూడా అతన్ని బైబిలు పఠించమని ప్రోత్సహించింది. అతడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఫోన్‌ మ్రోగింది. సాక్షులతో పఠిస్తూ ఎంతో సంతోషంగా ఉన్న మరో స్నేహితురాలు ఫోన్‌ చేసింది. తనకు అవసరమైనది బహుశా బైబిలు నిజంగా అందజేయగలదేమోనని అతడు భావించడం ప్రారంభించాడు, కాని ఎవరి సహాయం లేకుండా తాను దాన్ని అర్థం చేసుకోలేనని అతనికి తెలుసు. యెహోవాసాక్షులతో క్రమమైన గృహబైబిలు పఠనం చేయడానికి అతడు అంగీకరించాడు, అతడు వారి కూటాలకు హాజరు కావడం ప్రారంభించాడు. బైబిలు బోధపై తమ జీవితాలను నిర్మించుకున్న వారు మానవజాతికి సర్వసామాన్యమైయున్న సమస్యలను అనుభవిస్తున్నప్పటికీ, వారెందుకు సంతోషంగా ఉన్నారో అర్థం చేసుకోవడానికి అతనికి ఎక్కువ సమయం పట్టలేదు.

మానవుడు నిర్మింపబడిన రీతిని బాగా ఎరిగిన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించలేడు.” (మత్తయి 4:4, ది న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) ఆయనింకా ఇలా చెప్పాడు: “తమ ఆత్మీయ అవసరతలందు శ్రద్ధగలవారు ధన్యులు.” (మత్తయి 5:3, NW) వారు తమ అవసరత గురించి అత్యంత శ్రద్ధ కలిగివుండి, దాన్ని తీర్చుకోడానికి తగిన చర్యలు తీసుకుని, దేవుని ఆశీర్వాదం పొందుతారు కాబట్టి, వారికి సంతోషం కల్గుతుంది. అయినా, కేవలం ఏదైనా చర్చీలో సభ్యులైతే, లేదా ఏదైనా మతసంబంధ సేవలకు హాజరవ్వడం వల్ల మన ఆత్మీయ అవసరత తీర్చబడదు. అధిక ఆచారాలు గల మతం మానసికంగా మనకు ఆహ్లాదకరంగా ఉండవచ్చు, కాని అది జీవిత సమస్యలకు వాస్తవ పరిష్కారాలను ఇవ్వగలదా? ఒక మతం కొన్ని కారణసహితమైన ప్రాథమిక సూత్రాలను కలిగివున్నప్పటికీ, జీవిత వాస్తవ సంకల్పాల గురించి సరియైన అర్థాన్ని చెప్పలేకపోతే, అది మీ ఆత్మీయ అవసరతను తృప్తిపర్చగలదా? దానికన్నా ప్రాముఖ్యమైనది, అలాంటి మతాన్ని అవలంభించడం దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండటానికి దోహదపడగలదా? అది లేకుండా నిజమైన సంతృప్తి ఉండదు.

ఈ విషయంలో అనేకమంది వారు ఇంతవరకు కనుగొనని దానికొరకు వెదుకుతున్నారు.

[3వ పేజీలోని చిత్రం]

ఒక చర్చీలో చేరడంవల్ల మీ ఆత్మీయ అవసరతలు నిజంగా తృప్తిపర్చబడతాయా?

[4వ పేజీలోని చిత్రం]

తాము బైబిలును అర్థం చేసుకున్నప్పుడు జీవితానికి క్రొత్త అర్థం వస్తుందని అనేకులు కనుగొన్నారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి