ఒక శ్రేష్ఠమైన లోకం—కేవలం ఒక స్వప్నమా?
ఒకవేళ నీవు ఇరాన్ ప్రవక్తయైన జొరాస్టర్ ప్రకటించిన జొరాస్ట్రియన్ మతావలంభికుడవైతే, భూమి దాని తొలి అందానికి తిరిగివచ్చే దినం కొరకు నీవు వేచియుండేవాడివి. ఒకవేళ నీవు ప్రాచీన గ్రీసులో నివసించి ఉంటే, నీవు ఊహాజనిత అదృష్ట ద్వీపాలను చేరాలని లేక సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దపు కవియైన హేసియోద్ వర్ణించిన స్వర్ణయుగం తిరిగి రావటాన్ని చూడాలని కలలు కని ఉండేవాడివి. దక్షిణమెరికాలోని గౌరాని ఇండియన్ ఇప్పటికి కూడా దుష్టత్వం లేని దేశం కొరకు వెదుకుతుండవచ్చు. మన కాలంలో జీవిస్తూ, రాజకీయ సిద్ధాంతాల ద్వారా లేక ఆధునిక దిన పర్యావరణ జాగరూకత ద్వారా లోకం మెరుగౌతుందని బహుశ నీవు నిరీక్షిస్తుండవచ్చు.
స్వర్ణయుగం, అదృష్ట ద్వీపాలు, దుష్టత్వంలేని దేశం—శ్రేష్ఠమైన లోక నిరీక్షణ అనే అదే కోరికను వర్ణించడానికి ఉపయోగింపబడే అనేక పేర్లలో ఇవి కూడా చేరివున్నాయి.
మనం జీవిస్తున్న ఈ లోకం, నిజంగా ఒక మంచి స్థలంగా లేదు. పెరిగిపోతున్న క్రూరమైన నేరము, అత్యధిక దౌర్జన్యం యొక్క సహోదర హత్యాసంబంధ యుద్ధాలు, జాతి నిర్మూలనము, ఇతరుల బాధల యెడల అలక్ష్యము, పేదరికం మరియు ఆకలి, నిరుద్యోగం మరియు ఐక్యత లేకపోవుట, పర్యావరణ సమస్యలు, లక్షలాది మందిని బాధిస్తున్న చికిత్సలేని జబ్బులు—ప్రస్తుత శ్రమల పట్టిక అంతం లేనిదిగా కనిపిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను గురించి ఆలోచిస్తూ, ఒక ఇటలీ దేశ విలేఖరి ఇలా అన్నాడు: “మన కాలంలో శత్రుత్వమే అత్యంత బలమైన మానసిక భావనగా లేదా అన్నది సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న.” ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ఏదో వేరైన దాని కొరకు, ఏదో శ్రేష్ఠమైనదాని కొరకు అపేక్షించడం వాస్తవమేనని నీవనుకుంటున్నావా? లేక అలాంటి అభిలాష కేవలం ఒక భ్రమ లేదా ఎన్నటికీ నిజంకాని ఒక కలయా? సాధ్యమగు అన్ని ప్రపంచ పరిస్థితులలోకెల్లా శ్రేష్ఠమైనదానిలో మనం జీవిస్తున్నామా?
ఇవి క్రొత్త చింతలేమీ కాదు. శతాబ్దాలుగా మనుష్యులు ఐక్యత, న్యాయము, క్షేమము, ప్రేమ వెల్లివిరిసే లోకం కొరకు కలలు కంటూనే ఉన్నారు. కాలగమనంలో, అనేకమంది తత్వవేత్తలు ఆదర్శ దేశాలు, శ్రేష్ఠమైన లోకాలను గూర్చిన తమ భావాలను వివరించారు. కాని దుఃఖకరంగా, వాటిని ఎలా విజయవంతం చేయాలో వారు ఎన్నడూ వివరించలేక పోయారు.
కలలు, భ్రమలు, శ్రేష్ఠమైన సమాజం కొరకైన మానవ ఆకాంక్షల యొక్క శతాబ్దాల పురాతన ఈ పట్టిక మనకేమైనా బోధించగలదా?
[3వ పేజీలోని చిత్రం]
సాధ్యమైన అన్ని ప్రపంచ పరిస్థితులలోకెల్లా ఇది శ్రేష్ఠమైనదా?