ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—బహమాస్
ప్రజా ప్రభుత్వం గల బహమాస్—3,000 ద్వీపాలు, చిన్న చిన్న దీవులతో కూడిన ద్వీప సమూహము. అది ఫ్లోరిడా, క్యూబాల మధ్యనున్న నీలం, పచ్చ కలగలిసి 900 కిలోమీటర్ల పొడవున్న సముద్రం చూట్టూ పగడాల హారంలా ఉంటుంది. దాని 2,67,000మంది నివాసుల్లో వృద్ధి చెందుతున్న రాజ్య ప్రచారకులున్నారు. వారు పాడే స్తుతిగీతం యెషయా 42:10-12ను మనస్సుకు తెస్తుంది: “సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్తగీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక, ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక.”
కొత్త విశ్వాసం సవాలు చేయబడెను
ఓ క్రమ పయినీరు 1992, జూలై నెలలో (ఓ పూర్తికాల రాజ్య ప్రచారకుడు), తనకు పరిచయస్తుడైన ఓ వ్యాపారస్తునికి బైబిలు పఠనానికి సహాయపడే మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించాడు. ఆ పుస్తకాన్ని ఆ వ్యక్తి చదివిన తర్వాత, ‘ఈ మతాన్ని నేను పరిశీలించాల్సిందే’ అని అనుకున్నాడు. ఆ తర్వాత రెండు ఆదివారాలు రెండు వేర్వేరు యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో అతను కూటాలకు హాజరయ్యాడు. పిదప, ఆ వ్యక్తితో బైబిలు పఠనం ప్రారంభించబడింది. అయితే, అతను బైబిలు నేర్చుకోవడం ఆరంభించి ఆరువారాలు అయ్యిందో లేదో, పుట్టినరోజు పండుగ జరుపుకునే విషయంలో అతని కొత్త విశ్వాసానికి సవాలు ఎదురైంది.
ఆ వ్యాపారస్తుని కుటుంబం అటువంటి ఆచారాల్లో ఎంతగానో నిమగ్నమై ఉండేది, అయితే దేవుని వాక్యం యెడల ఆయనకున్న ప్రేమ బైబిలు పఠనాన్ని కొనసాగించడానికి పురికొల్పింది. ఆత్మీయ సత్యం యెడల ఆయన జ్ఞానం అభివృద్ధి చెందేకొలది, పుట్టినరోజు పండుగలను లౌకిక పర్వ దినాలను, యెహోవా ఎలా దృష్టిస్తాడన్న విషయాలను గూర్చిన అవగాహన పెరిగింది.
ఇతని భార్య, ఫాదర్స్‌డే రోజున ఓ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు, దానికి హాజరుకానని అతను మర్యాదగా చెప్పాడు. అయితే, తనకంటే తన కుటుంబం కంటే ఆ మతాన్నే ఆయన ముందుంచుతున్నాడని, ఆయన తననెంతమాత్రం ప్రేమించడం లేదని ఆవిడ భావించింది. బైబిలు నుండి అతను నేర్చుకునేవాటిని అవలంభించడంవల్ల, అది అతను మరింత మంచి భర్తగా, తండ్రిగా మారడానికి సహాయపడుతుందని అతను దయాపూర్వకంగా వివరించాడు. చివరికి, లేఖన సంబంధ సత్యం యెడల అతనికున్న ప్రేమపై ఆమె మెప్పు పెరిగి, బైబిలు పఠనానికి అంగీకరించింది. ఇప్పుడాయన తన కుటుంబంతో బైబిలు పఠనం నిర్వహిస్తున్నాడు. గడచిన సంవత్సరం “దైవిక బోధ” జిల్లా సమావేశంలో అతను ఎంత ఆనందాన్ని అనుభవించాడు! అతని భార్యా పిల్లలూ హాజరై అతను బాప్తిస్మము తీసుకుంటుండగా చూశారు.
వలసవచ్చినవారు క్రొత్త పాటను వింటున్నారు
హయిటీ నుండి వలసవచ్చిన వేలాది మంది ప్రజలు బహమియా సమాజంలో మిళితమౌతున్నారు. వారు కూడా రాజ్య సువార్త యొక్క నూతన గీతాన్ని వినాల్సిన అవసరం ఉంది. హయిటియన్ అమెరికన్ వారైన రెండు జంటలు వచ్చినందుకు బహమాస్‌లోని సాక్షులు ఎంతో కృతజ్ఞులై ఉన్నారు. వీరు, గ్రాండ్ బహమాస్, అబాకొ నందు క్రొత్తగా ఏర్పడిన హయిటీ గుంపులను బలపర్చడానికి సహాయంచేశారు.
రాజ్య వర్తమానంలో ఆసక్తిగల హయిటియన్ల కొరకు మరో సహాయకంగా బహమాస్‌లో యింతవరకూ జరగని మొట్టమొదటి క్రియోలి భాషలో జిల్లా సమావేశం 1993, జూలై 31 నుండి ఆగస్టు 1 వరకు జరిగింది. ముగ్గురు క్రొత్తగా బాప్తిస్మము పొందినవారితో సహా, అక్కడ హాజరైన వారి సంఖ్య 214కు చేరుకుంది. బహమాస్‌లో సత్యం నేర్చుకున్న అనేకమంది హయిటియన్లు, తమ స్వస్థలాలకు చేరుకుని లేక తిరిగి మరో ప్రాంతానికి తరలి వెళ్లి, ప్రాంతీయ సాక్షులతో చేరి యెహోవాకు స్తుతి గీతం పాడ్డంలో తమ స్వరాలను కలిపారు.
[8వ పేజీలోని బాక్సు]
దేశ గణాంకం వివరాలు
1993 సేవా సంవత్సరంa
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 1,294
నిష్పత్తి: 1 సాక్షికి 197
జ్ఞాపకార్థ దినానికి హాజరైనవారి సంఖ్య: 3,794
సగటు పయినీరు ప్రచారకులు: 186
సగటు బైబిలు పఠనాలు: 1,715
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 79
సంఘాల సంఖ్య: 22
బ్రాంచి కార్యాలయం: నాసావు
[అధస్సూచీలు]
a అధిక సమాచారం కొరకు 1994 క్యాలెండర్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ చూడండి.
[9వ పేజీలోని చిత్రం]
బ్రాంచి కార్యాలయం, మిషనరీ గృహంతో, మొట్టమొదటి రాజ్యమందిరం
[9వ పేజీలోని చిత్రం]
సాక్షులు ఆసక్తితో సువార్తను ప్రకటిస్తున్నారు
[9వ పేజీలోని చిత్రం]
దాదాపు 45 సంవత్సరాల క్రితం నాసావులో, మిషనరీలతో మిల్టన్ జి. హెన్సిల్, నేథన్ హెచ్. నార్
[9వ పేజీలోని చిత్రం]
ఫిబ్రవరి 8, 1992లో ప్రతిష్ఠించబడిన క్రొత్త బ్రాంచి కార్యాలయం