కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 3/15 పేజీలు 24-25
  • ఆయన తన హృదయ కోరికను గ్రహించాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆయన తన హృదయ కోరికను గ్రహించాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మెస్సీయ ప్రవచనాలు నిరీక్షణనిస్తాయి
  • ఇంకా మెస్సీయ రాలేదా!
  • ఓ భక్తిపరుడైన వ్యక్తి
  • సుమెయోను ప్రవచనార్థక మాటలు
  • మరియతో సుమెయోను వ్యాఖ్యానం
  • సుమెయోను మెస్సీయ ప్రవచనాల్ని అన్వయించుట
  • వాగ్దాన శిశువు
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • దేవుడు వాగ్దానం చేసిన శిశువు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • వృద్ధులారా—మీరు సంఘానికి ఒక ఆస్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మీరు దేవునికి దగ్గరగా ఎలా కాగలరు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 3/15 పేజీలు 24-25

ఆయన తన హృదయ కోరికను గ్రహించాడు

మెస్సీయ రాజ్యం భూమ్యంతటా పరిపాలించడాన్ని చూడాలనే హృదయకోరిక మీకుందా? ఉంటే, మీరు దాన్ని అపేక్షించి, ఆ పరలోక రాజ్యం క్రిందవుండే వాగ్దాన భూ ఆశీర్వాదాలకై మీరు ప్రార్థిస్తారు. అట్లయితే మీరు సహనాన్ని కనపర్చండి, కారణం “సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.”—సామెతలు 13:12; యాకోబు 5:7, 8.

సుమారు 2,000 సంవత్సరాల క్రితం, “నీతిమంతుడును భక్తిపరుడునైయున్న” సుమెయోను అనే ఓ మనుష్యుడు యెరూషలేములో నివసిస్తూ ఉండేవాడు. ఆయనకు మెస్సీయ ప్రవచనాలపై విశ్వాసం ఉండేది, అందుకుగాను అతను ఓపికతో “ఇశ్రాయేలు యొక్క ఆదరణకొరకు కనిపె”ట్టాడు.—లూకా 2:25.

మెస్సీయ ప్రవచనాలు నిరీక్షణనిస్తాయి

పాపభూయిష్ట, మృతతుల్య మానవజాతికి నిరీక్షణనిచ్చే మెస్సీయను గూర్చిన మొదటి ప్రవచనానికి యెహోవాయే కారకుడు. దేవుని “స్త్రీ” లేక విశ్వ సంస్థ నుండి వచ్చే సంతానాన్ని గూర్చి ఆయన ముందుగానే చెప్పాడు.—ఆదికాండము 3:15.

ఆయన అబ్రాహాము సంతానమని గుర్తించబడ్డాడు, అంతేకాక యాకోబు ఆయన రాకను గూర్చి ప్రవచించాడు. (ఆదికాండము 22:17, 18; 49:10) మెస్సియా రాజ్యం యొక్క మహిమలు కీర్తనల్లో ప్రస్తుతించబడ్డాయి. (కీర్తన 72:1-20) ఈ సంతానము ఓ కన్యక ద్వారా జన్మిస్తుందని యెషయా ప్రవచించాడు, ఆ జననం బెత్లెహేములో జరుగుతుందని మీకా ప్రవచించాడు. (యెషయా 7:14; మీకా 5:2) అయితే యివి మెస్సీయకు సంబంధించిన అనేక ప్రవచనాల్లో కొన్ని మాత్రమే.

ఇంకా మెస్సీయ రాలేదా!

గతాన్ని గూర్చి ఆలోచించి, సా.శ. మొదటి శతాబ్దం దగ్గరపడుతోందని ఊహించండి. దేవుని మొదటి మెస్సీయకు సంబంధించిన ప్రవచనానికి యిప్పుడు 4,000 సంవత్సరాలు. యూదులు యెహోవా ఆలయ నాశనాన్ని, తమ స్వదేశం నిర్మానూషం కావడాన్ని, 70 సంవత్సరాల బబులోను చెరను చవిచూచారు, అంతేకాదు అన్యరాజుల క్రింద మరో 500 సంవత్సరాలు గడిపారు. అయినా మెస్సియా రాలేదు!

దేవునికి భయపడే యూదులు మెస్సీయ రాకడను ఎంతగా కాంక్షించారో కదా! వారికి, మిగతా జనాంగాలన్నింటికి ఆయన్నుండి ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయి.

ఓ భక్తిపరుడైన వ్యక్తి

మెస్సీయ రాకడకు ఎంతగానో అపేక్షిస్తూ ప్రార్థిస్తూ ఉన్న యూదుల్లో సుమెయోను ఒకడు. ఆయన యూదయ రాజధానిలో జీవించే నమ్మకమైన వృద్ధ యెహోవా సేవకుడు. సుమెయోనుకు ప్రత్యేకమైందేదో జరిగింది.

దేవుడు సుమెయోను మీద తన పరిశుద్ధాత్మను ఉంచి, ఓ ప్రకటనతో ఆయన్ను బహుకరించాడు. మెస్సీయ ఎవరవుతారన్నది చూడకుండా సుమెయోను చనిపోడు. అయితే రోజులు నెలలు అలా గడుస్తూ ఉన్నాయి. సుమెయోనుకు వయస్సు మీరుతోంది, యిక ఎక్కువ కాలం బ్రతుకుతాడన్న ఆశలేదు. దేవుడు అతనికి చేసిన వాగ్దానం నెరవేరుతుందా?

ఒక రోజు (సా.శ.పూ 2లో) ఓ యువ దంపతులు ఒక పసివానితో బెత్లెహేము ఆలయానికి వచ్చారు. ఎప్పటినుండో నిరీక్షిస్తున్న రోజు యిదేనని పరిశుద్ధాత్మ సుమెయోనుకు బయల్పరుస్తుంది. ఆయన ఆలయానికి వెళ్తాడు అక్కడ, ప్రవక్తలు ఎవని గూర్చైతే రాశారో వానిని ఆయన చూస్తాడు. ఆయన వృద్ధ శరీరము అనుమతించినంత వేగంగా వచ్చి ఆయన యోసేపును, మరియను, బాబును చూస్తాడు.

యేసును సుమెయోను ఎంతో సంతోషంతో తన చేతుల్లోకి తీసుకుంటాడు! ఇతను వాగ్దాన మెస్సీయ అవుతాడు—“యెహోవా యొక్క క్రీస్తు.” అంత వృద్ధాప్యంలో ఉన్న సుమెయోను, యేసు తన భూ పరిచర్యను నెరవేర్చడాన్ని చూడ్డానికి నిరీక్షించలేడు. అయితే, ఆయన్ను పసివానిగా చూడడం ఓ అద్భుతమే. మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు నెరవేరనారంభించాయి. సుమెయోను ఎంత సంతోషంగా ఉన్నాడో! ఇప్పుడు ఆయన సంతృప్తిగా పునరుత్థానం చేయబడేంతవరకు మరణ మందు నిద్రిస్తాడు.—లూకా 2:25-28.

సుమెయోను ప్రవచనార్థక మాటలు

సుమెయోను యెహోవాను స్తుతించడానికి తన స్వరాన్ని ఎత్తినప్పుడు ఆయన యిలా అనడం మనం వింటాము: “నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.” యేసును పెంచిన తండ్రి యోసేపు, ఆయన తల్లి మరియ, ఈ మాటలు విని ఆశ్చర్యపోతారు.—లూకా 2:29-33.

పిల్లవాని యెడల తమ బాధ్యతను నిర్వర్తించడానికి యెహోవా ఆశీర్వాదం వారిపై ఉండాలని కోరుతూ యోసేపు మరియలను ఆశీర్వదించేటప్పుడు సుమెయోను ముఖము వెలుగొంది ఉంటుంది. తర్వాత ఆ పెద్ద మనిషి ముఖము గంభీరమైంది. కేవలం మరియను సూచిస్తూ ఆయన యిలా అన్నాడు: “ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు; మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవును.”—లూకా 2:34, 35.

మరియతో సుమెయోను వ్యాఖ్యానం

మరియ ఎలా భావించివుండవచ్చో ఊహించండి. సుమెయోను ఉద్దేశమేమిటి? కొందరు క్రీస్తును అంగీకరించి, తమ దిగజారిన స్థితి నుండి మరలా లేవనెత్తబడతారు. అయితే, ఆయన్ను తిరస్కరించేవారు, ఆయన విషయమై అభ్యంతరపడి, పడిపోతారు. ప్రవచించబడిన ప్రకారంగా, యేసు అనేకమంది యూదులకు అభ్యంతరము కలిగించే బండగా రుజువు చేసుకున్నాడు. (యెషయా 8:14; 28:16) మొదట ఇశ్రాయేలీయులు అవిశ్వాసంలో పడిపోయి, తర్వాత యేసును అంగీకరించడం ద్వారా విశ్వాస మందు లేవనెత్తబడతారన్నది సుమెయోను భావం కాదు. బదులుగా, ఆయన యెడల వేరువేరు వ్యక్తుల ప్రతిస్పందన వివిధరకాలుగా ఉంటుంది. అది వారి హృదయ తలంపులను బహిర్గతంచేసి, వారికి మంచిదేగాని చెడ్డదేగాని దేవుని తీర్పుకు లభించేటట్లు చేస్తుంది. విశ్వాసంలేనివారికి, ఆయన తిరస్కారానికి గుర్తుగా ఉంటాడు లేక తిరస్కరించబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, తప్పుల్లో పాపాల్లో చనిపోయిన స్థితి యందున్న యితరులు దేవుని యెడల నీతియుక్త స్థానాన్ని సంపాదించడానికి లేవనెత్తబడతారు. మెస్సీయ యెడల వారి ప్రవర్తన వారి హృదయాల్లో ఏముందో కనపరుస్తుంది.

“నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొనిపోవును” అని సుమెయోను అన్న మాటల విషయమేమిటి? మరియకు అక్షరార్థంగా తనలో నుండి కత్తి దూసుకుపోయిందన్న సూచనలేవీ లేఖనాల్లో లేవు. అయితే, అనేకులు యేసును తిరస్కరించడం ఆమెను కలవరపెడుతుంది. మరి యేసు మ్రానుకు కొట్టబడేటప్పుడు మరియకు ఎంత బాధ కల్గివుంటుంది! అది తనలోనుండి ఓ కత్తి దూసుకుపోయినట్లుండెను.

సుమెయోను మెస్సీయ ప్రవచనాల్ని అన్వయించుట

మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలను యేసుకు అన్వయించడానికి సుమెయోనును దేవుని ఆత్మ ప్రేరేపించింది. ‘అన్యజనులకు దేవుని బయలుపరచుటకు వెలుగుగాను ఆయన ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను ఆయన సకల ప్రజలయెదుట సిద్ధపరచిన ఆయన రక్షణను అతను కన్నులార చూచాడు’ గనుక సుమెయోను సమాధానంగా, సంతోషంగా చనిపోగలడు. (లూకా 2:30-32) ఇది యెషయా ప్రవచనార్థక మాటలకు ఎంత చక్కగా అన్వయించబడగలదు!

ఆ ప్రవక్త యిలా ప్రవచించాడు: “యెహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండ సర్వశరీరులు దాని చూచెదరు.” “భూదిగంతములవరకు నీవు నేను [యెహోవా] కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను [మెస్సీయను] నియమించియున్నాను.” (యెషయా 40:5; 42:6; 49:6; 52:10) క్రైస్తవ గ్రీకు లేఖనాలూ భౌతిక విషయాలూ మెస్సీయయైన యేసుక్రీస్తు జనాంగాలకు నిజమైన వెలుగని, ఆయన ఆత్మీయ అంధకారాన్ని తీసివేసి, ప్రజలకు రక్షణను తెస్తాడని రుజువు చేస్తున్నాయి.

వృద్ధుడైన సుమెయోను గూర్చి దేవుని వాక్యం యింకేమీ చెప్పడం లేదు. స్పష్టంగా క్రీస్తు పరలోక జీవనానికి మార్గం తెరవక ముందే ఆయన మరణించాడు. అయితే త్వరలోనే సుమెయోను భూమిపై పునరుత్థానుడౌతాడు. దేవుని మెస్సీయ రాజ్యం క్రింద నూతన లోకంలో ఆయన మీరూ ఎంత సంతోషాన్ని అనుభవించగలరు!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి