కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 1/15 పేజీలు 24-30
  • ఉత్సాహపూరిత సమావేశాలు దైవిక బోధను అందించుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఉత్సాహపూరిత సమావేశాలు దైవిక బోధను అందించుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మొదటి రోజు మధ్యాహ్నం
  • రెండవరోజు ఉదయం
  • రెండవరోజు మధ్యాహ్నం
  • మూడవ రోజు ఉదయం
  • మూడవ రోజు మధ్యాహ్నం
  • నాలుగవ రోజు ఉదయం
  • చివరి మధ్యాహ్నం
  • దేవుని వాక్యాన్ని బోధించేవారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • “ఆసక్తిగల రాజ్య ప్రచారకులు” సంతోషంగా సమకూడారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • మనిషిని కాదు దేవుణ్ణి మహిమపరచండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు ఆనందాన్ని కనుగొంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 1/15 పేజీలు 24-30

ఉత్సాహపూరిత సమావేశాలు దైవిక బోధను అందించుట

నేడు, లోకం సమాచారాలను ఎక్కువగా పొందుతోంది. టీవి, రేడియో, పుస్తకాల ద్వారా లేక కంప్యూటర్ల ద్వారా, ఊహించగల ఏ విషయంపైనైనా దాదాపు అంతులేని జ్ఞానం అందించబడుతోంది. అయినా ప్రజలు అనారోగ్యులై, చనిపోతున్నారు. నేరం, ఆకలి, పేదరికం భూమ్యంతటా ఉంది, మరి ఎన్నటికంటే ఎక్కువగా భావోద్రేక అస్థిరత మరింత ప్రభావాన్ని చూపుతోంది. అందుబాటులో ఉన్న జ్ఞానమంతా ఈ విషయాలను చక్కబెట్టలేక పోయింది. ఎందుకు? కారణం దేవుని జ్ఞానాన్ని మానవజాతి అలక్ష్యం చేయడమే.

మరి, యిటీవల కాలంలో జరిగిన యెహోవాసాక్షుల సమావేశాల అంశం “దైవిక బోధ” అని ఎన్నుకోబడ్డం ఎంత సరిగ్గా సరిపోయింది! ఈ కార్యక్రమమంతా, దేవుని వాక్యమైన బైబిలులోని బోధ మాత్రమే జీవాన్ని రక్షించగల నిజమైన విలువ గలదని, అక్కడ హాజరైన వారికి జ్ఞాపకం చేసింది.

మొదటి సమావేశం గురువారం జూన్‌ 3న యూన్‌యన్‌డాల్‌, న్యూయార్క్‌, అమెరికాలో ప్రారంభమైంది. అప్పటినుండి, ఈ కార్యక్రమం విభిన్న నగరాలలో, ఒక దేశం తర్వాత మరో దేశంలో జరుగుతూ చివరకు ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో ముగిసింది.

మొదటి రోజు మధ్యాహ్నం

ప్రతి దినం, దైవిక బోధ అనే విషయాన్ని నొక్కితెలిపే అంశం ఒకటి ఉండేది. ఉదాహరణకు, మొదటి దిన కార్యక్రమం “దేవుని వలన కలిగిన బోధను తెలిసికొనుట” అనే అంశంపై ఆధారపడింది. (యోహాను 7:17) ఆ దినం గడిచేకొలది ఈ విషయం చక్కగా వివరించబడింది.

పాట, ప్రార్థన తర్వాత, సమావేశ అధ్యక్షుడు, “దైవిక ఉపదేశము మనందరినీ సమకూర్చును” అనే ప్రసంగాంశంపై ప్రసంగిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. యెహోవా ప్రజలు ఆయన మార్గాలను తెలుసుకొని ఆయన త్రోవలో నడవడం వల్ల ఐక్యమయ్యారని ప్రసంగీకుడు చూపించాడు. (మీకా 4:1-5) దైవిక బోధ వారి ఐక్యతను బలపరుస్తుంది. సమావేశానికి హాజరైనవారు తమ ఐక్య సహవాసమందు సంతోషించవలసిందిగా ప్రోత్సహించబడ్డారు.—కీర్తన 133:1-3.

మధ్యాహ్నం కొంత సమయం తర్వాత, “యెహోవా మార్గాలను గూర్చి ఉపదేశించే కూటాలు” అనే అంశంపైని గోష్ఠిలో, క్రమంగా జరిగే సంఘ కూటాలను గూర్చి చర్చించబడింది. మనం కలిసినప్పుడు యెహోవాను గౌరవిస్తాం, అలా ఆయన ఆశీర్వాదాలను మనం పొందుతాం అని మొదటి ప్రసంగీకుడు సమావేశానికి హాజరైన వారికి జ్ఞాపకం చేశాడు. రెండవ ప్రసంగీకుడు కూటాల్లో భాగం వహించే అవసరతను నొక్కితెల్పాడు. అలా చేయడం ద్వారా, మనం యెహోవాను బహిరంగంగా స్తుతిస్తాం, మన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాం, అంతేకాకుండా యితరుల విశ్వాసాన్ని బలపరుస్తాం. గోష్ఠిలోని మూడవ ప్రసంగీకుడు, మనం కూటాల్లో నేర్చుకున్నవాటిని ఆచరణలో పెట్టవలసిన అవసరతను చూపించాడు. మనం “వినువారు మాత్రమైయుం”డక . . . “వాక్యప్రకారము ప్రవర్తించువార”మై ఉండాలి.—యాకోబు 1:22.

తర్వాత, యెహోవాకు స్తుతిగీతాలు పాడడంపై చక్కటి చర్చ జరిగింది. హృదయపూర్వక గీతం మన ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని కల్గివుంటుంది. ఈ ప్రసంగం తర్వాత “దైవిక బోధ జయించును” అనే ముఖ్యాంశ ప్రసంగం యివ్వబడింది. ఎంత చక్కటి అంశం! “ఎవరైనా పొందగల శ్రేష్ఠమైన బోధకు మూలం యెహోవాయే” అని ప్రసంగీకుడు చెప్పాడు. పిదప, మానవ మెదడు యొక్క అద్భుతాన్ని కొద్దిసేపు చర్చించిన తర్వాత ఆయన యిలా అన్నాడు: “మనం మన ఆలోచనా సామర్థ్యాలను ప్రాముఖ్యంగా దైవిక బోధను పొందడానికి ఉపయోగించుకోవాలి. అది మాత్రమే యథార్థమైన వివేకాన్ని అందించగలదు.” ఎంత నిజం!

రెండవరోజు ఉదయం

‘మన రక్షకుడగు దేవుని బోధను అలంకరించుకొంటూ ఉండండి’ అన్నది సమావేశపు రెండవ రోజు అంశం. (తీతు 2:10) “దైవిక బోధకు దయ్యాల బోధలకు మధ్యపోరాటం” అనే ప్రసంగంలో ఈ సూత్రం విశదీకరించబడింది. అవును, దయ్యాలకు వాటి బోధలున్నాయి. (1 తిమోతి 4:1) ప్రసంగీకుడు వివరించినట్లుగా, అబద్ధ బోధలను, అపవాది కుతంత్రాలను బహిర్గతం చేయడం ద్వారా సాతాను “జ్ఞానం” మీద దైవికబోధ విజయం సాధిస్తుంది. దీని మూలంగా, 45,00,000 మంది యథార్థ హృదయులైన క్రైస్తవులు సాతాను అంధకారానికి ఏమాత్రం దాసులుకారు.—యోహాను 8:32.

ఇంకా, మనం సాతానును ఎడతెగక ఎదిరించాలి. ఈ విషయం, “మీరు లౌకికాత్మను ఎదిరిస్తున్నారా” అనే ప్రసంగంలో నొక్కితెల్పబడింది. లోకాత్మ మరణకరం. అది నీచమైన నైతికతను, అధికార ధిక్కార ధోరణిని, వస్తుసంబంధ విషయాలపై ఈర్ష్యతో కూడిన కోరికలను ప్రోత్సహిస్తుంది. ఒక క్రైస్తవుడు తన్ను తాను ఎల్లప్పుడూ పరీక్షించుకోవాలి. తాను ఏమి చూస్తున్నాడో, ఏమి వింటున్నాడో లేక ఏమి చదువుతున్నాడో అన్న విషయాలు వచ్చినప్పుడు అతను యింకా ఉన్నత విలువలను కల్గివున్నాడా? ప్రోత్సాహకరంగా ప్రసంగీకుడు యిలా అన్నాడు: “సహోదర, సహోదరీలారా, యౌవనులారా, ఈ విషయంలో ఇప్పటికే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మేము మెచ్చుకుంటున్నాము.”—1 యోహాను 2:15-17.

లోకాత్మను వ్యతిరేకించడాన్ని కష్టతరం చేసే ఒక విషయం ఉంది. అదేంటి? మనమందరమూ అపరిపూర్ణులం. నిజమే, యేసు మన పాపాల కొరకు మరణించాడు, అయితే పాపం చేయాలనే కోరికతో మనం పోరాడాలి. ఈ విషయం “పాపపు ఊబిలోనున్న అపరిపూర్ణ శరీరంతో పోరాడుట” అనే ప్రసంగంలో పరిశీలించబడింది. ఇతర విషయాలతోసహా, మనం నవీన స్వభావాన్ని ధరించుకుని, మన పాపభరిత ప్రవృత్తిలో పాల్గొనేట్లు చేసే దేన్నైనా మనం విడనాడినట్లైతే, పాపంతో మనకున్న పోరాటాన్ని మనం జయించగలం అని ప్రసంగీకుడు చెప్పాడు.

“హిత బోధను మీ జీవన మార్గముగా చేసుకోండి” అనే అంశంపై తర్వాతి ప్రసంగం యివ్వబడింది. కొందరు తమ శారీరక ఆరోగ్య విషయమై విపరీతమైన శ్రద్ధ కల్గివుంటారు. అయితే నిజానికి, ఆత్మీయ ఆరోగ్యం అంతకంటే ఎంతో ప్రాముఖ్యం. ఈ విషయంలో మన బాధ్యతను మనం గంభీరంగా తీసుకోవల్సిన అవసరతను ప్రసంగీకుడు నొక్కితెల్పుతూ, క్రైస్తవ స్త్రీలకు ఆయన ప్రత్యేక ప్రోత్సాహకరమైన వాక్కులను పలికాడు. ఆయన యిలా అన్నాడు: “వృద్ధులు, యౌవనులైన సహోదరీలు, పరిచర్యలో తమ ఆసక్తినీ, వ్యక్తిగత బాధ్యతలపై తమ శ్రద్ధ విషయాల్లో వారు కనపర్చే సమతూకాన్ని మేము ఎంతగానో మెచ్చుకుంటున్నాం.” అవును, అంతేకాకుండా లోకం నుండి మనలను వేరుపర్చే ఆరోగ్యదాయకమైన బోధకొరకై మనమందరమూ యెహోవాకు కృతజ్ఞతలను తెల్పుతున్నాము.

“దైవిక బోధ జీవిత లక్ష్యాన్ని బయలుపరుచును,” అన్నది ఉదయకాల కార్యక్రమంలోని ముగింపు ప్రసంగం. ఆ ప్రసంగీకుడు యిలా అన్నాడు: “రేపోమాపో, దాదాపు అందరూ ‘జీవిత సంకల్పమేమిటి’ అని ఆలోచిస్తారు.” బలమైన తర్కాన్ని ఉపయోగించి, కేవలం బైబిలే ఈ ప్రశ్నకు నిజమైన జవాబునివ్వగలదని ప్రసంగీకుడు నిరూపించాడు. తర్వాత, దేవుని అద్భుతమైన వాగ్దానాలు ఫలవంతంగా జీవితానికి ఒక సంకల్పాన్ని అందిస్తాయని ప్రసంగీకుడు చూపాడు. బహుశ, ప్రేక్షకుల్లోని అనేకులు ‘నా ప్రాంతంలోని ప్రజలు వినాలని కోరే విషయం కచ్చితంగా యిదే’ అని అనుకుంటూ ఉన్నారు. పరిపాలక సభ కూడా అదే ఆలోచనను కల్గివుంది. జీవిత సంకల్పమేమిటి? అనే అంశంతో ఒక క్రొత్త బ్రోషూరు, ప్రసంగం ముగింపున విడుదల చేయబడింది. అందరూ ఎంత సంతోషించారో! మధ్యాహ్న విరామ సమయం, క్రొత్త ప్రచురణను ఒకసారి చూసే అవకాశాన్నిచ్చింది.

రెండవరోజు మధ్యాహ్నం

మధ్యాహ్నం మొదటి ప్రసంగం, “మీ చింతయావత్తు యెహోవా మీద మోపండి” అనే ఓదార్పుకరమైన అంశంపై యివ్వబడింది. అనేక విషయాలు చింతను కలిగిస్తాయి; అయితే, దేవుని వాక్యం మన చింతయావత్తునూ ఆయనపైన మోపమని చెబుతోంది. (1 పేతురు 5:6, 7) నిజమే, కొన్ని సమస్యలు విడువక కొనసాగుతాయి. దీని విషయంలో ప్రసంగీకుడు యిలా ఉద్బోధించాడు: ‘ఓర్పును కల్గివుండండి. యెహోవా కొరకు కనిపెట్టి ఉండండి. బైబిలును అనుసరించడం ఎల్లప్పుడూ శ్రేష్ఠమని దృఢంగా నమ్మండి. మనం యెహోవాపై మన హృదయాలను నిలిపివుంచినట్లైతే, సమస్త జ్ఞానమును మించిన “దేవుని సమాధానమును” మనం అనుభవించగలము.’—ఫిలిప్పీయులు 4:6, 7.

తదుపరి నాలుగు ప్రసంగాలు, కుటుంబ జీవితంలో దైవిక బోధ అన్వయిస్తుందని చూపాయి. మొదట, “వివాహమును చిరకాల బంధముగా చేయుట,” అనే ప్రసంగం, లోకస్థులనేకమంది దీనిని అవసరం తీరిపోయిన తర్వాత విడిచిపెట్టుకునే బంధమని భావిస్తారు, అయితే యెహోవా దృష్టిలో యిది అటువంటిది కాదని సమావేశానికి సహాజరైన వారికి ప్రసంగీకుడు జ్ఞాపకం చేశాడు. అయినా, వివాహాన్ని విజయవంతం చేయాలంటే, మనం యెహోవా నడిపింపును అనుసరించాలి. ఆయన మనలను సృజించాడు. కాబట్టి, ఆయన ప్రేరేపిత వాక్యంలో వివాహానికి సంబంధించిన చక్కటి సలహావుంది.

“మీ కుటుంబ రక్షణ కొరకు కష్టించి పనిచేయుము” అనే ప్రసంగం, ఈ అపాయకరమైన కాలాల్లో ఒక కుటుంబానికి చూపవల్సిన శ్రద్ధలో ఎదురయ్యే సవాళ్లను చర్చించింది. (2 తిమోతి 3:1) తలిదండ్రులు తమ పిల్లలకు భౌతిక శుభ్రత, మంచి మర్యాద, పని చేయడం, ఉదారంగా ఉంటూ యితరుల యెడల శ్రద్ధను చూపడం వంటి వాటిని నేర్పిస్తారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, సమర్పించుకున్న యెహోవా సేవకులుగా ఎలా ఉండాలో వారు తమ పిల్లలకు నేర్పించాలి.—సామెతలు 22:6.

“తలిదండ్రులారా—మీ పిల్లలకు నైపుణ్యంతోకూడిన శ్రద్ధ అవసరం” అనే చర్చలో, తమ పిల్లల బలహీనతలను గమనిస్తూనే వారిని మెచ్చుకోవాలని ప్రసంగీకుడు సమావేశానికి హాజరైన వారికి జ్ఞాపకం చేశాడు. కపటం, వస్తువ్యామోహం, స్వార్థం వంటి ధోరణి యెడల తలిదండ్రులు ప్రత్యేకంగా మెలకువగా ఉండాలి.

ప్రత్యేకంగా సమావేశానికి హాజరైన యౌవనులు, “యౌవనులారా—మీరు ఎవరి బోధను వింటారు?” అనే ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. యౌవన క్రైస్తవుల పరిస్థితులు యిప్పుడు వేరుగా ఉన్నాయి. లోకం పోకడతోపాటు పోవడం సులభమే, అయితే అది మరణానికి దారితీస్తుంది. దైవిక బోధను హత్తుకొని ఉండడానికి యౌవనులకు ధైర్యమవసరమైనప్పటికి, యిప్పుడు అది గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది, భవిష్యత్తులో నిత్యజీవాన్నిస్తుంది.—1 తిమోతి 4:8.

ప్రస్తుతం వారి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనే యౌవనులు, అనే హృదయాన్ని కదిలించే నాటకంతో రెండవ రోజు ముగిసింది. ఉపోద్ఘాతంలో, దేవుని సంస్థలోని యౌవనులు “యెహోవాకు, పరలోకమందు రాజుగా నియమింపబడిన యేసుక్రీస్తుకు సమర్పించుకుని నమ్మకంగా సేవచేస్తున్న దైవపరిపాలనా సైన్యం” అని డైరెక్టరు వర్ణించాడు. ఆయన యింకా యిలా జోడించాడు: “మన యువతరం నిజంగానే మంచిని సాధిస్తున్నారు!” తలిదండ్రులు పిల్లవానికి చక్కటి శిక్షణనిస్తే, వాడు పెరిగి యెహోవాను తనకు తానుగా సేవించేటప్పుడు వానికది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అని ఆ నాటకం స్పష్టం చేసింది.

మూడవ రోజు ఉదయం

“సమస్త జనులకు బోధిస్తూ ఉండండి,” అన్నది మూడవ రోజు అంశం. (మత్తయి 28:19, 20) సమావేశానికి హాజరైన వారు ప్రకటనా పనిపైన సమయోచితమైన సలహాకై ఎదురు చూశారు, మరి వారు నిరుత్సాహపర్చబడ లేదు. “ప్రకటించే, బోధించే మన పనిని ఆనందంగా నెరవేర్చుట” అనే అంశంపైని గోష్ఠి, ప్రకటించే పనిలో భాగంవహించాలనే వారి తీర్మానాన్ని దృఢపర్చింది. ప్రారంభ ప్రసంగం మొదటి సందర్శనాలను, రెండవది పునర్దర్శనాలను, మూడవది బైబిలు పఠనాలను చర్చించాయి. ప్రపంచమంతటావున్న మిషనరీలు తమ స్వస్థలాలకు ఆహ్వానింపబడి, తమ కుటుంబాలతో స్నేహితులతో సమావేశాలకు హాజరుకావడానికి ఆహ్వానించబడ్డారు. ఆ మిషనరీల్లో కొందరు కార్యక్రమంలోని ఈ భాగంలో పాలుపంచుకున్నారు. వారు సేవాపనిలో సాధించిన విజయాల్లో కొంత తెలుసుకోవడం ఆనందదాయకంగా ఉండెను. తర్వాత, “అందరికీ సువార్తను అందజేయుట,” తటస్థసాక్ష్యం తెచ్చే ప్రభావాన్ని పరిశీలించింది.

ఉదయకాల కార్యక్రమం, బాప్తిస్మము ప్రసంగంతో ముగిసింది, అది ఎల్లప్పుడు యెహోవాసాక్షుల పెద్ద కూటమిలో ప్రధానాంశం. సమావేశం తర్వాత సమావేశాల్లో, క్రొత్తగా సమర్పించుకున్నవారి పెద్ద గుంపులు, అక్కడ సమకూడిన వారి ముందు నిలుచుని, వారి కొరకు వేయబడిన రెండు ప్రశ్నలకు అవునని నిశ్చయంతో జవాబు చెప్పారు. ఆ తర్వాత వారు బహిరంగ బాప్తిస్మమును పొందారు. దైవిక బోధ తెచ్చే గొప్ప ప్రభావానికి ఎంత బలమైన సాక్ష్యము!

మూడవ రోజు మధ్యాహ్నం

మధ్యాహ్న కార్యక్రమం లోతైన లేఖనాధార చర్చతో ప్రారంభమైంది. యెహోవాసాక్షులకు, మత్తయి 24వ అధ్యాయం లూకా 21వ అధ్యాయంలోని మాటలు బాగా తెలుసు. ఈ బైబిలు అధ్యాయాలను గూర్చి క్రొత్తగా చెప్పబోయేదేమీ లేదని కొందరు అనుకున్నారా? వారు ఎంత పొరబడ్డారు! “నీ ప్రత్యక్షతకు సూచనలేవి?” “ఇవి ఎప్పుడు జరుగును? . . . మాతో చెప్పుము” అన్న ప్రసంగాలు సమావేశానికి హాజరైనవారిని, ఆ రెండు అధ్యాయాల్లోని భాగాలు అద్భుతమైన చర్చకు నడిపించాయి అంతేకాకుండా, అవి కొన్ని లేఖనాలకు సరిక్రొత్త వివరణను అందించాయి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సమావేశానికి హాజరైనవారు తాము ఆ అంశాలను అర్థం చేసుకున్నారా లేదా అని తమ నోట్సులను చూసుకునేటప్పుడు సజీవమైన చర్చలు జరిగాయి. నిస్సందేహంగా, ఈ సమాచారం కావలికోటలో ముద్రింపబడినప్పుడు అనేక ప్రశ్నలకు సమాధానం యివ్వబడుతుంది.

“మీ బైబిలు ప్రశ్నలకు సరియైన సమాధానాలు” అన్న ప్రసంగం యివ్వబడినప్పుడు బైబిలు పఠనాంశం కొనసాగింది. తర్వాత కార్యక్రమం మరో విషయంవైపుకు మరలింది. వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ యొక్క 50వ వార్షికోత్సవంగా 1993 గుర్తించబడింది. “యాభై సంవత్సరాల గిలియడ్‌ శిక్షణ, దాని కార్యవిధానము” అనే ప్రసంగం సమావేశానికి హాజరైన వారికి ఆ కాలంలో ఏమి సాధించబడిందో చూపింది. “భూమియంతట సువార్తసేవ సాధించిన ఫలితాలు” అనే ప్రసంగం యివ్వబడినప్పుడు అక్కడ మిషనరీలు ఉంటే, తమ అనుభవాల్లో కొన్నింటిని ప్రేక్షకులతో పంచుకోడానికి ఆహ్వానించబడ్డారు. మిషనరీల వృత్తాంతాలు వినడం ఎంతో పులకరింపజేసేదిగా ఉంది!

తదుపరి ప్రసంగం, “యెహోవాసాక్షులు ఎందుకు మెలకువగా ఉంటారు” అన్నది మరో చరిత్రా పాఠం. మొదటి శతాబ్దంనుండి ఈనాటి వరకు క్రైస్తవులు మెలకువగా ఉన్నారని అది చూపింది. అది మరో ఆశ్చర్యానికి నడిపింది. “రాజ్య ప్రచారకులు భూవ్యాప్తంగా చురుకుగా ఉన్నారు” అనే ప్రసంగ ప్రారంభంలో, ప్రసంగీకుడు ఒక పెద్ద వాల్యూమ్‌ (అప్పటికే ప్రాంతీయ భాషలో లభ్యమై ఉంటే) చూపిస్తూ యిలా అన్నాడు: “జెహోవాస్‌ విట్నెసెస్‌—ప్రొక్లైమర్స్‌ ఆఫ్‌ గాడ్స్‌ కింగ్‌డమ్‌ అనే పుస్తకం విడుదలను ప్రకటించడానికి సంతోషిస్తున్నాము.” ఈ పుస్తకంలో యెహోవాసాక్షుల ఆధునికదినాల చరిత్ర వృత్తాంతం సవివరంగా ఉంది. యెహోవా ఆత్మ తన సేవకులపై చురుకుగా పనిచేస్తోందనడానికి శక్తివంతమైన ఆధారాన్నిస్తూ అది సహనం, నిశ్చయం, విజయాల పులకరింపజేసే కథను చెబుతోంది.

నాలుగవ రోజు ఉదయం

అప్పటికే సమావేశం చివరి రోజు వచ్చేసింది. ఆ దిన అంశం, “దైవిక బోధ ద్వారా మనకై మనం ప్రయోజనం పొందుట” ఒక చక్కటి కార్యక్రమ ముగింపుకు అది అభయమిచ్చింది. (యెషయా 48:17) ఉదయం సమావేశానికి హాజరైనవారి అవధానం మూడు శక్తివంతమైన ప్రసంగాలతోకూడిన గోష్ఠిపై కేంద్రీకృతమై ఉంది. “గత కాలానికి, ప్రస్తుతకాలానికి—యిర్మీయా ప్రేరేపిత హెచ్చరిక సందేశం” అనే గోష్ఠిలో యిర్మీయా 23, 24, 25 అధ్యాయాల్లోని ఒక్కో వచనం చర్చించబడ్డం జరిగింది. ఈ అధ్యాయాలు ఎంతటి శక్తివంతమైన సమాచారాన్ని కల్గివున్నాయి! విశ్వాసఘాతకులైన ఇశ్రాయేలీయులు, యిర్మీయా కాలంలో ఆయన దాపరికంలేని, దైవిక హెచ్చరికలకు వణికిపోయి ఉంటారు. ఈ హెచ్చరికలు నెరవేరినప్పుడు ప్రపంచమంతా అంతకంటె ఎక్కువగా వణికిపోయింది. ఈనాడు విషయాలు వేరుగా ఉన్నాయా? కానేకాదు. యెహోవా ప్రజలు దేవుని తీర్పు సమాచారాన్ని ధైర్యంతో ప్రకటిస్తారు. తుదకు, ఈ విధానమంతా యెహోవా తీర్పు కార్యాలను ఎదుర్కోవాలి. అంటే, సాతాను లోకానికి సమూల నాశనం అని దాని భావము.

ఆదివారం ఉదయకాల కార్యక్రమం, మోసపోవద్దు లేదా దేవుని వెక్కిరింపవద్దు అనే రెండవ నాటకంతో ముగిసింది. దైవిక బోధ హేయమైన వీడియో, సంగీతం, తోటి క్రైస్తవుల్లో అనైక్యతను విత్తే ప్రవృత్తినుండి మనలను ఎలా కాపాడుతుందో సవివరంగా చూపించింది. నాటకం ముగింపులో, ఆలోచనను రేకెత్తించే పాత్రధారుల్లో ఒకరి మాటలను అధ్యక్షుడు ఎత్తి చెప్పాడు: “లోక ప్రభావాన్ని మనం తప్పించుకోలేము. మనం దాన్ని ఎదిరించకపోతే, లోకం మన ఆలోచనను పూర్తిగా పాడుచేయగలదు. మరి మనం నమ్మకంగా ఉండడమో, లేకపోవడం అన్నది, మనం ఏమి విత్తుతున్నాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.” ఎంత వాస్తవం!

చివరి మధ్యాహ్నం

“అపాయకరమైన మనకాలం కొరకు సహాయకరమైన బోధ” అనే బహిరంగ ప్రసంగాన్ని యివ్వడానికి ప్రసంగీకుడు వేదికపైకి నడిచేటప్పటికి సమావేశం వేగంగా ముగింపుకు రాసాగింది. నేడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన స్పష్టంగాను, సహేతుకంగాను గుర్తించి, శ్రేష్ఠమైన జీవితాన్ని మనం అనుభవించడంలో దైవిక బోధ సహాయపడే కొన్ని మార్గాలను ఆయన సూచించాడు. ఇప్పుడు మనం లేఖనాధార బోధను అనుసరించినట్లైతే, యెహోవా నూతన లోకంలో వాటిని ఎల్లకాలం అనుసరించగలమని ఆయన చెప్పాడు.

వారపు కావలికోట పఠన సారాంశం తర్వాత, ముగింపు ప్రసంగ సమయం వచ్చింది. నాలుగు రోజుల కార్యక్రమంలోని ముఖ్యాంశాలను ప్రసంగీకుడు వేగంగా చెప్పి, సమావేశానికి హాజరైన వారికి క్రొత్త ప్రచురణలను జ్ఞాపకం చేశాడు. ది బైబిల్‌—ఎ బుక్‌ ఆఫ్‌ ఫాక్ట్‌ ఆండ్‌ ఫ్రాఫసీ అనే విడీయో కేసెట్ల పరంపరలో రెండవది త్వరలో విడుదల కాబోతున్నట్లు కూడ ఆయన ప్రకటించాడు. వాస్తవానికి, ది బైబిల్‌—మాన్‌కైండ్స్‌ ఓల్డెస్ట్‌ బుక్‌ అనే విడియోకేసెట్టు ఇంగ్లీషు నందు ప్రస్తుతం అందుబాటులో ఉంది. తీవ్ర సంక్షోభాలుగల బోస్నియా, హెర్జిగోవినా వంటి ప్రాంతాలనుండి హృదయాన్ని తాకే నివేదికలు చదువబడ్డాయి. కార్యక్రమాంతంలో, ప్రసంగీకుడు ప్రసంగి 12:13లోని మాటలను చదివాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”

ఎంత చక్కటి జ్ఞాపిక! గొప్ప బోధకుడైన యెహోవాను మానవజాతి అంతా స్తుతిస్తూ, ఆయన దైవిక బోధను గైకొనే రోజుకొరకు మనం జీవిద్దాము.

[24, 25వ పేజీలోని చిత్రాలు]

మాస్కో, కై నందలి “దైవిక బోధ” సమావేశం గొప్ప ఆనందాన్ని తెచ్చింది

[26, 27వ పేజీలోని చిత్రాలు]

1. బాప్తిస్మము పొందుట ద్వారా, అనేకులు దేవునికి తాము చేసుకున్న సమర్పణను సూచించారు

2. సమావేశానికి హాజరైన 100 సంవత్సరాల వ్యక్తి క్రొత్త ప్రచురణను పొంది పులకరించిపోయాడు

3, 4. ఆలోచనను రేకెత్తించే నాటకాలు ఎంతో మెప్పును పొందాయి

5. సమావేశాల్లో పరిచయం చేయబడిన మిషనరీలు ముఖ్యంగా దైవిక బోధ వల్ల కలిగే ప్రయోజనాలను తెల్పారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి