ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు—పిలిప్పైన్ రిపబ్లిక్
ఫిలిప్పైన్స్ రిపబ్లిక్, 7,083 ఎత్తుపల్లాలుగల ఉష్ణమండల ద్వీపాలతో, నీట సగం మునిగిన పర్వత శ్రేణి పైభాగాన ఉంటుంది.a మరి 6,20,00,000 మంది ఫిలిప్సైన్స్ నివాసులు, దాదాపు ఏ విషయంపైనైనా చర్చించడానికి యిష్టపడతారు. సులభంగా మాట్లాడడానికి అనుమతించే ఈ స్వభావం రాజ్య సాక్ష్యాన్నివ్వగల ఫలవంతమైన ప్రాంతాన్ని అందిస్తుంది.
పాఠశాలలో సాక్ష్యమివ్వడం
మాస్బటె ద్వీపంపై, ఒక ఉన్నత పాఠశాల విద్యార్థిని తప్పు ఒప్పుల క్విజ్ సమయంలో తన ఉపాధ్యాయురాలికి, తరగతికి సాక్ష్యమివ్వగలిగింది. ఆమె యిలా నివేదించింది:
“‘దేవుడు నన్ను ప్రేమిస్తే,’ ఆయన నాకు సమస్యలను సృష్టించడు లేక నన్ను బాధపడనివ్వడు అన్నదే ఆ వాక్యం. మా ఉపాధ్యాయురాలు మా పేపర్లను పరిశీలించేటప్పుడు, నేను తప్ప నా తోటి విద్యార్థులందరూ ఒప్పు అని జవాబిచ్చినట్లు ఆమె గమనించింది. నేను తప్పు అని ఎందుకు సమాధానమిచ్చానో తరగతిలోని వారికి వివరించడానికి ఆమె నన్ను అనుమతించింది. దేవుడు బాధలను అనుమతించి, మనం పరీక్షించబడడానికి అనుమతించినప్పటికి, మనకు సమస్యలను కలుగజేసేది ఆయన కాదు అని నేను చెప్పాను. నేను ఎప్పుడూ స్కూలుకు తీసుకెళ్లే నా బైబిలును ఉపయోగించి, 1 యోహాను 4:8లో ‘దేవుడు ప్రేమాస్వరూపి’ అన్న మాటపై నేను నా తరగతివారితో సహేతుకంగా తర్కించాను. నేను వివరించిన తర్వాత, నా ఉపాధ్యాయురాలు ఒప్పుకొని, తన బల్లను కొడుతూ ‘మరిలు జవాబే సరైంది’ అని చెప్పింది. ఈ ప్రశ్నకు సరైన జవాబు నాకొక్కదానికే దొరికింది, ఎక్కువ మార్కులు కూడా నాకే దొరికాయి.”
రాజ్య వర్తమానం అంతటా ఉంది
ఫిలిప్పైన్స్ నందలి మరో ప్రాంతంలో ఇంటింటి పరిచర్యలో ఉన్నప్పుడు ఒక క్రమ పయినీరు (రాజ్య వర్తమానాన్ని పూర్తికాలం ప్రకటించే వ్యక్తి) ముగ్గురు చిన్న పిల్లలున్న తల్లిని కలిసింది. ఆ స్త్రీ రాజ్య వర్తమానమందు ఎంతో ఆసక్తిని కనపర్చింది, మరి అది ఆమెతో బైబిలు పఠనాన్ని సులభంగా ప్రారంభించడానికి వీలు కల్పించింది. బైబిలు పాఠాలు నేర్చుకోవడం, ప్రత్యేకంగా యెహోవాసాక్షుల నుండి వాటిని నేర్చుకోవడం ఆమె భర్తకు యిష్టం లేకపోయినా, పఠనం కొనసాగింది.
సాక్షులతో తన భార్య సహవాసం అంతటితో ముగిస్తుందన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి తన కుటుంబాన్ని మరో పట్టణానికి తరలించాడు. అయితే, కొద్దికాలంలోనే వారు ఆ స్త్రీని కనుక్కుని, ఆమెతో మరలా బైబిలు పఠనాన్ని ప్రారంభించారు. నిస్సందేహంగా, ఆమె భర్త మరలా ఎంతో బాధపడ్డాడు. తాను పనిచేసే స్థలానికి కూడా అదే కోపంతో వెళ్లి, అక్కడ తన వాహనాన్ని బాగుచేయించుకోడానికి వచ్చిన ఒక వినియోగదారుని దగ్గర అతని మనస్సులోని భావాలను వ్యక్తపర్చాడు. ఈ వినియోగదారుడూ ఒక యెహోవాసాక్షియేనని అతనికి తెలియదు.
ఆమె బైబిలు పాఠాలను నేర్చుకోవడం తన కుటుంబమంతటికి చాలా ప్రయోజనకరమని ఆ సాక్షి అతనికి వివరించాడు. ఆమె బైబిలు సూత్రాలను యింటి వద్దనే అన్వయించడం ప్రారంభించగలదనీ దేవుని రాజ్యం గూర్చి నేర్చుకోవడం తనకే ప్రయోజనమని ఆయన అతనికి సలహా యిచ్చాడు.
ఈ చర్చవల్ల ఏ ఫలితం దక్కింది? అతని భార్యకు బైబిలు పఠించడానికి అధిక స్వేచ్ఛ దొరికింది, అంతేకాకుండా ఆ వ్యక్తి తన కుటుంబాన్ని మరలా తన మొదటి యింటికి తరలించాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ ఆ స్త్రీ బాప్తిస్మము తీసుకోని ప్రచారకురాలిగా అయ్యేంత ఆత్మీయ అభివృద్ధిని చేసుకుంది. ఆమె భర్త కూడా బైబిలు పఠించడానికి అంగీకరించాడు, అంతేకాదు, కుటుంబమంతా క్రైస్తవ కూటాలకు హాజరౌతోంది.
[అధస్సూచీలు]
a అధిక సమాచారం కొరకు 1994 క్యాలండర్ ఆఫ్ జెహోవాస్ విట్నెసెస్ చూడండి.
[8వ పేజీలోని బాక్సు]
దేశ గణాంకం
1993 సేవా సంవత్సరం
సాక్ష్యమిస్తున్నవారి శిఖరాగ్ర సంఖ్య: 1,16,576
నిష్పత్తి, 1 సాక్షికి: 549
జ్ఞాపకార్థదినానికి హాజరైనవారి సంఖ్య: 3,57,388
సగటు పయినీరు ప్రచారకులు: 22,705
సగటు బైబిలు పఠనాలు: 94,370
బాప్తిస్మము తీసుకున్నవారి సంఖ్య: 7,559
సంఘాల సంఖ్య: 3,332
బ్రాంచి కార్యాలయం: మనీలా
[9వ పేజీలోని చిత్రం]
మార్కెట్టు స్థలాల్లో సాక్ష్యమివ్వడం చక్కని ఫలితాలను తెస్తుంది
[9వ పేజీలోని చిత్రం]
మనీలాలోని వాచ్‌టవర్ సొసైటి బ్రాంచి కార్యాలయం