కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 11/15 పేజీ 11
  • బ్రిటన్‌లో ఆసక్తిగల క్రైస్తవులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బ్రిటన్‌లో ఆసక్తిగల క్రైస్తవులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిజ క్రైస్తవులందరు మంచి సందేశాన్ని అందిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • యెహోవా సంస్థ మీ పరిచర్యకు మద్దతునిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 11/15 పేజీ 11

బ్రిటన్‌లో ఆసక్తిగల క్రైస్తవులు

ది ఎకానమిస్ట్‌ ప్రకారం బ్రిటన్‌ నందలి 5 కోట్ల 60 లక్షల మంది ప్రజలలో ప్రస్తుతం 10 శాతం కంటే తక్కువమంది ఆసక్తిగల క్రైస్తవులుగా ఉన్నారు. ఆదివారం నాడు 40 లక్షలకంటే తక్కువమంది ప్రజలు చర్చి కూటాలకు హాజరవుతారు. వీరిలో, కేవలం 11 లక్షలమంది మాత్రమే ఆంగ్లికన్లు. ఆజ్ఞేయతావాదం విస్తృతంగా వ్యాప్తి చెందినప్పటికీ, చర్చ్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఆ దేశ అధికారిక మతంగా తన స్థానంలో కొనసాగుతూనే ఉంది. “అనేక సంవత్సరాలుగా బ్రిటన్‌ క్రైస్తవ సమాజంగా లేదు కాని ఇంటిబెంగ వల్ల ఆజ్ఞేయతావాదాన్ని గైకొనుటకు నిరాకరిస్తుంది” అని అదే వార్తాపత్రిక అంటున్నది. ఆధునిక రాజకీయవేత్తలు, వార్తాపత్రికలు చర్చీల ప్రాబల్యం తగ్గాలని, చర్చీకి రాష్ట్రానికిగల సంబంధం తెగిపోవాలని కోరుకోవడంలో ఆశ్చర్యంలేదు.

“ప్రపంచమందు క్రైస్తవులమని చెప్పుకుంటున్న లౌకిక రాజ్యం అత్యంత నీచంగావుంది,” అని ది ఎకానమిస్ట్‌నకు 19వ శతాబ్దములో సంపాదకుడుగా పనిచేసిన వాల్టర్‌ బాగెహాట్‌ విచారాన్ని వ్యక్తం చేశాడు. కాని సా.శ. మొదటి శతాబ్దంలో, యేసుక్రీస్తు తన శిష్యులును ‘నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు’ అని చెప్పాడు. (యోహాను 17:16) అయిననూ, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి ఆయన వారిని లోకం లోనికి పంపించాడు. అలాగే ఈనాడు, యెహోవాసాక్షులు “బహిరంగముగాను, ఇంటింటను” ఆసక్తిగా ప్రకటించువారని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.—అపొస్తలుల కార్యములు 20:20.

ఆంగ్లికన్లతో పోలిస్తే బ్రిటనులో వున్న 1,26,173 మంది సాక్షులు సంఖ్యలో చాలాతక్కువ మందే. అయినా వారు క్రైస్తవ కూటాలకు హాజరవ్వటానికి నెలకు 20 గంటలు వెచ్చిస్తారు. ఇంకా, నీతియుక్తమైన నూతన లోకాన్ని త్వరలోనే స్థాపించే ప్రభుత్వమైన దేవుని రాజ్య సువార్తను ఇతరులకు ప్రకటించటానికి 1992లో, ఒక నెలకు ప్రతి సాక్షి సగటున 16 అదనపు గంటలు గడిపాడు. (మత్తయి 24:14; 2 పేతురు 3:13) మరోసారి యెహోవాసాక్షులు మీ ఇంటికి వస్తే, వారి ప్రత్యేకమైన సమాచారాన్ని విని, వారి ఆసక్తిని పురికొల్పేదేమిటో మీరు తెలుసుకుంటారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి