కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 11/1 పేజీలు 30-31
  • తొలి క్రైస్తవులు దేవుని నామాన్ని ఉపయోగించారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • తొలి క్రైస్తవులు దేవుని నామాన్ని ఉపయోగించారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 11/1 పేజీలు 30-31

తొలి క్రైస్తవులు దేవుని నామాన్ని ఉపయోగించారా?

దేవుని నామము హెబ్రీ లేఖనాల్లో వేలసార్లు కనిపిస్తుంది, అక్కడ అది יהוהఅను నాలుగు హల్లుల (YHWH, చతురక్షర పదం) ద్వారా చూపబడుతుంది. యూదులు బబులోనుకు కొనిపోబడక మునుపు ఇశ్రాయేలులో, 607 సా.శ.పూ.,నకు ముందు ఆ నామం సామాన్యంగా ఉపయోగింపబడేది, మరియు నిర్గమం తరువాతి బైబిలు పుస్తకాలైన ఎజ్రా, నెహెమ్యా, దానియేలు, మరియు మలాకీలో అది తరుచుగా కనిపిస్తుందని పురావస్తుశాస్త్ర అన్వేషణలు చెబుతున్నాయి. క్రమేపి, మెస్సీయ రావడానికి సమయం ఆసన్నమయ్యేసరికి, యూదులు మూఢనమ్మకంతో ఆ నామాన్ని ఉపయోగించడానికి విముఖులయ్యారు.

మరి యేసు శిష్యులు (ఇంగ్లీషులో మాములుగా “జెహోవా,” లేక “యాహ్వే” అనబడు) దేవుని నామాన్ని ఉపయోగించారా? అవును అని రుజువులు చెబుతున్నాయి. దేవునికి ఇలా ప్రార్థించండని యేసు తన అనుచరులకు నేర్పాడు: “నీ నామము పరిశుద్ధ పరచబడుగాక.” (మత్తయి 6:9) భూమిపై తన పరిచర్య ముగింపులో, తన పరలోక తండ్రికి తానే స్వయంగా ఇలా ప్రార్థన చేశాడు: “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని.” (యోహాను 17:6) సెప్టాజింట్‌ యొక్క తొలి ప్రతులే కాక, యేసు శిష్యులు ఉపయోగించిన హెబ్రీ లేఖనాల గ్రీకు తర్జుమాలు సహితం, హెబ్రీ చతురక్షర పదం రూపంలో దేవుని నామాన్ని కలిగి ఉండినవి.

సువార్తలు మరితర క్రైస్తవ గ్రీకు లేఖనాల (“క్రొత్త నిబంధన”) విషయమేమిటి? సెప్టాజింట్‌లో దేవుని నామం ఉంది గనుక, క్రైస్తవ గ్రీకు లేఖనాల తొలి ప్రతుల్లో—కనీసం సెప్టాజింట్‌ ఎత్తివ్రాయబడిన చోట—అది ఉండవచ్చు అని తర్కించబడింది. అలా, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది క్రిస్టియన్‌ గ్రీక్‌ స్క్రిప్చర్స్‌లో యెహోవా అను నామము 200కంటే ఎక్కువసార్లు కనిపిస్తుంది. ఇది అన్యాయమని కొందరు విమర్శించారు. అయితే, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌కు ఒక భిన్న మూలమైన బాబిలోనియన్‌ టాల్ముడ్‌ నుండి మద్దతు లభిస్తునట్లు కనిపిస్తుంది.

యూదుల ఈ మతపర గ్రంథం యొక్క మొదటి భాగం పేరు షాబత్‌ (సబ్బాతు) మరియు ఇందులో సబ్బాతు నందు కలిగి ఉండవలసిన ప్రవర్తనను గూర్చిన అనేక కట్టడలు ఉన్నాయి. సబ్బాతునందు బైబిలు వ్రాతప్రతిని అగ్నినుండి కాపాడుట మంచిదా అను విషయాన్ని గూర్చిన చర్చ ఒక ఖండంలో ఉంది, మరియు దాని తరువాతి వాక్యాల్లో ఇలా ఉంది: “గ్రంథంలో ఇలా చెప్పబడింది: ఖాళీ స్థలాలు [గిల్‌యోహానిమ్‌] మరియు మినిమ్‌ యొక్క పుస్తకాలను, మనం అగ్ని నుండి కాపాడవలసిన అవసరం లేదు. ఆర్‌. జోష్‌ ఇలా అన్నాడు: సబ్బాతు మినహా మిగతా వారపు దినాల్లో ఒక వ్యక్తి ఆ వ్రాతప్రతులు కలిగి ఉన్న దైవిక నామములను కత్తిరించి, కత్తిరించిన వాటిని దాచి, మిగతా భాగాన్ని తగులబెట్టవలెను. ఆర్‌. టార్‌ఫన్‌ ఇలా అన్నాడు: అవి నా చేతికి గనక దొరికితే అవి కలిగి ఉన్న దైవిక నామముతో సహా ఆ వ్రాతప్రతుల్ని నేను తగులబెట్టకపోతే నేను నా కుమారున్ని పాతిపెట్టే గతి నాకు వచ్చునుగాక.”—డా. ఎచ్‌. ఫ్రెడ్‌మాన్‌చే అనువదింపబడింది.

మినిమ్‌ ఎవరైయుండిరి? ఆ పదానికి “శాఖాభిమానులు” అని అర్థము మరి అది సద్ధూకయ్యులను లేదా సమరయ్యులను కూడా సూచించవచ్చు. కానీ డా. ఫ్రెడ్‌మాన్‌ ప్రకారం, ఈ వాక్యభాగమందు అది చాలావరకు యూదా క్రైస్తవులనే సూచిస్తున్నటుంది. మరి డా. ఫ్రెడ్‌మాన్‌ ప్రకారం “ఖాళీ స్థలములు” అని తర్జుమా చేయబడిన గిల్‌యోహానిమ్‌లు ఏమిటి? దానికి రెండు అర్థాలు ఉండవచ్చని అంచనా. అవి కాగితపుచుట్ట యొక్క ఖాళీ మార్జినులు లేక ఖాళీ కాగితపు చుట్టలు. లేక—గూఢార్థంగా చెప్పాలంటే—ఆ వ్రాతలు ఖాళీ గ్రంథపు చుట్టలంత వ్యర్ధమైనవని చెప్పవచ్చు, అవి మినిమ్‌ల వ్రాతలు అయ్యుండవచ్చు. శబ్ధకోశంలో ఈ రెండవ అర్థము “సువార్తలు” అని ఇవ్వబడింది. దీనికి సామరస్యంగా, టాల్ముడ్‌లో పైన ఉదహరించబడిన ఖండంలో పైన ఉల్లేఖించబడిన వాక్యభాగమందు ఇలా ఉంది: “మినిమ్‌ల పుస్తకములు ఖాళీ స్థలముల [గిల్‌యోహానిమ్‌] వంటివి.”

తదనుగుణ్యంగా, లారెన్స్‌ ఎచ్‌. చిఫ్‌మాన్‌చే, వ్రాయబడిన హూ వాజ్‌ ఎ జ్యూ? అనే పుస్తకంలో, పైన ఉదహరించబడిన టాల్ముడ్‌లోని వాక్యభాగం ఈ విధంగా అనువదింప బడింది: “మేము (సబ్బాతు నందు) అగ్నినుండి సువార్తలను మరియు మినిమ్‌ల (‘మత వ్యతిరేకుల’) పుస్తకములను రక్షించము. బదులుగా, (విశ్రాంతి దినమందు) అవి వాటి చతురక్షర పదాలతో, వాటి స్థలంలోనే తగులబడిపోతాయి. యోసే హ-గెలిలీ అనబడే రబ్బీ ఇలా అంటున్నాడు: వారంలో ఒకడు చతురక్షర పదాలను కత్తిరించి, వాటిని దాచి మిగతా భాగాన్ని కాల్చివేయాలి. రబీ టార్‌ఫన్‌ ఇలా చెబుతున్నాడు: నేను నా కుమారులను పాతిపెడ్తాను గాక! ఒకవేళ (ఈ పుస్తకాలు) నా చేతిలోకి గనుక వస్తే, నేను వాటిని వాటి చతురక్షర పదాలతో కాల్చిపారేస్తా.” డా. చిఫ్‌మాన్‌ ఇక్కడ చెప్పబడిన మినిమ్‌ యూదా క్రైస్తవులని ఇంకా వాదిస్తున్నాడు.

టాల్ముడ్‌ యొక్క ఈ ఖండం నిజంగా యూదా క్రైస్తవులను గురించి మాట్లాడుతుందా? ఒకవేళ అవునైతే, క్రైస్తవులు దేవుని నామాన్ని, చతురక్షర పదాన్ని, తమ సువార్తల్లో మరియు వ్రాతల్లో కలిగి ఉన్నారనడానికి ఇది బలమైన రుజువు. టాల్ముడ్‌ ఇక్కడ యూదా క్రైస్తవులను గురించి చర్చిస్తుందన్నది చాలావరకు కచ్చితం. ఆ విధమైన అభిప్రాయానికి పాండిత్యసంబంధమైన మద్దతు ఉంది, మరియు టాల్ముడ్‌లోని పూర్వాపర సందర్భం అదనపు మద్దతును అందిస్తున్నట్లు కనిపిస్తోంది. పైన ఉదహరించబడిన షాబత్‌యొక్క వాక్యాల తరువాతి భాగం గమాలియేలు మరియు ఒక క్రైస్తవ న్యాయవాధి ఇమిడి ఉన్న ఒక కథను చెబుతోంది. అందులో కొండ మీది ప్రసంగం యొక్క భాగాలు ఉల్లేఖించబడ్డాయి.

భ్రష్ట క్రైస్తవత్వం యేసు చేసిన సాధారణ బోధలనుండి తప్పుకొన్న తరువాతే, దేవుని నామము క్రైస్తవులమని చెప్పుకొను వారిచే ఉపయోగింప బడటం మానివేయబడింది మరియు సెప్టాజింట్‌ ప్రతులనుండి, సువార్తలు, ఇతర బైబిలు పుస్తకాలనుండి కూడ అది తీసివేయబడింది.

[31వ పేజీలోని చిత్రం]

యేసు దినాల్లో, దేవుని నామము “సెప్టాజింట్‌”లో కనిపించింది

[క్రెడిట్‌ లైను]

Israel Antiquities Authority

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి