కోతకాలము!
“క్రైస్తవత్వం” యొక్క చరిత్ర క్రైస్తవత్వానికి ఎందుకు చాలా భిన్నంగా ఉండింది? ఆలోచనాపరులైన వ్యక్తులనేకమంది ఈ ప్రశ్నను అడుగుతారు, కానీ యేసు ఇంచుమించు 2,000 సంవత్సరాల పూర్వమే ఒక ఉపమానంలో దానికి జవాబిచ్చాడు. ఆయన “తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని” గురించి చెప్పాడు. తరువాత, “శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.” విత్తనాలు మొలక వచ్చినప్పుడు, పనివారు గురుగులను గమనించి వాటిని పెరికివేయ తలంచారు. కాని ఆ మనుష్యుడు ఇలా చెప్పాడు: “కోతకాలము వరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి.” కోతకాలమున, గోధుమలు గురుగులనుండి వేరుచేయ బడతాయి.—మత్తయి 13:24-30.
ఆ ఉపమానాన్ని వివరిస్తూ నిజమైన క్రైస్తవులను—“మంచి విత్తనమును” విత్తిన వాడు తానే అని యేసు చెప్పాడు. శత్రువు సాతాను, ఆ “గురుగులను”—నకిలీ క్రైస్తవులను సంఘంలోనికి ప్రవేశపెట్టాడు. అబద్ధ మరియు నిజమైన క్రైస్తవులు కలిసి పెరగడాన్ని యేసు తానే అనుమతించాడు—కానీ కేవలం కోతకాలం వరకే. తర్వాత వారు వేరు పరచబడతారు.—మత్తయి 24:36-44.
కావున, “క్రైస్తవ” సంస్థలు అన్య సిద్ధాంతాలను అనుమతించడం, లైంగికతను అంగీకరించడం, యుద్ధాలకు మద్దతు ఇవ్వడం, మరియు క్రూరమైన న్యాయవిచారణలను అమలుపరచడం ద్వారా శతాబ్దాల నుండి దేవున్ని అగౌరవపర్చారని మనం తెలుసుకొన్నప్పుడు ఆశ్చర్యపడనక్కర లేదు. సాతానుచే విత్తబడిన చెడ్డ విత్తనాన్ని మనం ఇందులో గుర్తించగలం. అయిననూ, చెరసాలలో బంధింపబడిన లేక చనిపోయిన కొందరు వ్యక్తులు బైబిలు సూత్రాల విషయంలో రాజీపడడానికి బదులు వారే చనిపోయారని మనం చదివినప్పుడు, మంచి విత్తనం రూపుమాపబడ లేదని మనం గమనిస్తాము.
కోతకాలము “యుగసమాప్తి” అని యేసు చెప్పాడు. ఈ ప్రస్తుత ప్రపంచ వ్యవస్థ యొక్క సమాప్తిలో మనం జీవిస్తున్నాము గనుక, ఇదే కోతకాలము! కావున నిజమైన మరియు అబద్ధ క్రైస్తవుల మధ్య వేరుపరచడం జరిగి ఉంటుంది. ఈనాడు, ఎవరైతే నిజమైన క్రైస్తవులను గూర్చిన యేసు వివరణకు సరిపోతారో—ఎవరైతే దేవుని రాజ్యానికి లోబడి, సువార్తను ప్రకటిస్తున్నారో, ఎవరైతే బైబిలు ఆధారిత నైతికతను పెంపొందించి, బైబిలు సత్యాల పక్షాన అన్య సిద్ధాంతాలను తృణీకరిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని ప్రత్యక్షపరచి, లోకంలో భాగం కాకుండా ఉంటారో అటువంటి ప్రజలు ఉండాలి కాని, కేవలం చెదురుమదురుగా ఉన్న వ్యక్తులు కాదు.—మత్తయి 6:33; 24:14; యోహాను 3:20; 8:32; 17:6, 16.
అటువంటి ప్రజలు ఉన్నారని మేము మీకు హామి యిస్తున్నాము! దేవున్ని అంగీకారయుక్తంగా సేవించటానికి మీరు ఇష్టపడుతున్నారా? అయితే ఈ ప్రజలను వెదకి, వారితోపాటు దేవున్ని సేవించండి.