కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 10/15 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు, నేటి క్రైస్తవులకు పరిశుద్ధాత్మ నడిపింపు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • అద్భుత స్వస్థతలన్నీ దేవుని శక్తితోనే జరుగుతున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 10/15 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

మొదటి కొరింథీయులు 14:37 నందలి “ఆత్మసంబంధి” అనే పదానికి అభిషేకించబడినట్లుగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందడం అని భావమా, లేక ఆత్మ అతనికి అద్భుతమైన వరమిచ్చిందని దాని భావమా?

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చ్‌ర్స్‌లో ఆ వచనం ఇలా చదువబడుతుంది: “ఎవరైనా తాను ప్రవక్తననియైనను లేక ఆత్మవరాన్ని పొందాననియైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను.”—1 కొరింథీయులు 14:37.

“ఆత్మవరాన్ని పొందానని” అనే వచనాన్ని మొదటి శతాబ్ద క్రైస్తవులు ఆత్మచేత అభిషేకించబడి దేవుని ఆత్మీయ కుమారులయ్యారన్న వాస్తవానికి నిదర్శనంగా తీసుకోవచ్చును. లేక ఎవరైనా ఆత్మ యొక్క ప్రత్యేక వరాన్ని పొందిన వారికి ఆ పదం వర్తిస్తుందని అర్థంచేసుకోవచ్చు. దాని పూర్వాపరాలు చూపిస్తున్నట్లు, ఈ రెండవ భావమే సరియైనదై వుండవచ్చు.

“ఆత్మసంబంధమైన, ఆత్మీయమైన” అనే మూలభావం గల న్యూమాటికోస్‌ అనే గ్రీకు పదాన్ని అపొస్తలుడైన పౌలు ఇక్కడ ఉపయోగించాడు. “ఆత్మ సంబంధమైన శరీరము,” “ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము,” “ఆత్మ సంబంధమైన వివేకము,” “ఆత్మ సంబంధమైన మందిరము” వంటి వివరణలలో దాని రూపాలే ఉపయోగింపబడ్డాయి.—1 కొరింథీయులు 15:44; ఎఫెసీయులు 1:3; కొలొస్సయులు 1:9; 1 పేతురు 2:5.

ఆ సందర్భాలలో, “ఆత్మసంబంధమైన” అనేది వివరించే దాన్ని (శరీరము, ఆశీర్వాదము, వివేకము, మందిరము) అనే విషయాన్ని బైబిలు నిశ్చయంగా చెప్తున్నది. కాని ఇతర సందర్భాలలో, “ఆత్మసంబంధమైన” అనేదాని భావం మరియు సరైన వివరణ సందర్భాన్నిబట్టి నిర్ణయించాల్సి వుంటుంది. ఉదాహరణకు, 1 కొరింథీయులు 2:14, 15 “ఆత్మసంబంధమైన మనిషి” అనే తర్కబద్దమైన భావంగల హో న్యూమాటికోస్‌కి శరీరసంబంధమైన మనిషి దృక్పథానికి వున్న వ్యత్యాసాన్ని చూపుతుంది.

మొదటి కొరింథీయులు 12 నుండి 14 అధ్యాయాలు పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన వరాలపై దృష్టిసారిస్తుంది. తాను ఇక సహజ ఇశ్రాయేలును ఉపయోగించుకోవడం లేదు కాని ఇప్పుడు క్రైస్తవులైన “దేవుని ఇశ్రాయేలును” ఆశీర్వదిస్తున్నానని చూపించటానికి దేవుడు వీటిని కొంతమంది తొలి క్రైస్తవులకు ఇచ్చాడు. (గలతీయులు 6:16) ఈ వరాలను గూర్చి పౌలు ఇలా వ్రాశాడు: “కృపావరములు నానావిధములుగా ఉన్నవిగాని ఆత్మ యొక్కడే.” (1 కొరింథీయులు 12:4) ప్రత్యేకమైన వివేకం, జ్ఞానం, విశ్వాసం అనేవి ప్రవచించడం, భాషలలో మాట్లాడడం, భాషల అర్థం చెప్పడం వంటివాటిలాగే ఆత్మ వరాలలో చేరివుండెను.—1 కొరింథీయులు 12:8-11.

పౌలు ఎవరికి వ్రాశాడో ఆ కొరింథులోని క్రైస్తవులు పరిశుద్ధాత్మచే అభిషేకింపబడ్డారు. పౌలు ఇలా అన్నాడు: “ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.” (1 కొరింథీయులు 6:11; 12:13) అవును, అందరు “ఆత్మ అనే సంచకరవును” పొందారు. (2 కొరింథీయులు 5:5) అయితే, వారిలో అందరూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకమైన వరాన్ని పొందలేదు. భాషలలో మాట్లాడటాన్ని గూర్చి అందరూ ఆకర్షించబడి, దానికి అనవసరమైన ప్రాముఖ్యతను కలిగించినట్లు కనిపిస్తున్నది. వారి ఆలోచనావిధానాన్ని సరిచేయటానికి వ్రాస్తూ పౌలు, ప్రవచనవరం ప్రయోజనకరమైనంత మందికి భాషలలో మాట్లాడటం ప్రయోజనకరం కాదని చూపించాడు. పన్నెండవ అధ్యాయ ముగింపులో పౌలు కొరింథీయులకు ఇలా ఉపదేశించాడు: “కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి.”—1 కొరింథీయులు 12:28-31.

తరువాత, 14వ అధ్యాయ ప్రారంభంలో ఆయనిలా కోరాడు: “ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి. ఆసక్తితో [టా న్యూమాటికా] అపేక్షించుడి; విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి.” ఏమి అపేక్షించాలి? ఆ క్రైస్తవులు ఆత్మాభిషేకాన్ని అపేక్షించ వలసిన అవసరంలేదు, ఎందుకంటే వారికి అది అప్పటికే వుంది. ఆయన వారిని 12వ అధ్యాయం ముగింపులో అపేక్షించమని చెప్పింది ఆత్మసంబంధమైన “వరాలు” అని న్యాయసమ్మతంగా పౌలు భావమైయుండెను. కాబట్టి, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలి స్క్రిప్చ్‌ర్స్‌ 1 కొరింథీయులు 14:1ని ఇలా అనువదిస్తున్నది: “ఆత్మసంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి.” ఇతర బైబిలు తర్జుమాలు ఇక్కడ టా న్యూమాటికాను “ఆత్మసంబంధమైన వరాలు” లేక “ఆత్మ వరాలు” అని అనువదిస్తున్నాయి.

ఆ పూర్వాపరాలతో, 14వ అధ్యాయ ముగింపులో, పౌలు ప్రవచించటాన్ని న్యూమాటికాతో జతచేస్తున్నాడు. మొదటి వచనంలో, ఆత్మ వరాలను పొందడం అని ఆయన భావమని సందర్భం సూచిస్తున్నది. ఆర్‌. ఎఫ్‌. వేమౌత్‌ అనువదించిన ది న్యూ టెస్ట్‌మెంట్‌ ఇన్‌ మోడ్రన్‌ స్పీచ్‌ అనువాదమిలా వుంది: “ఎవరైనా తనను తాను ప్రవక్తగా, లేక తనకు ఆత్మ సంబంధమైన వరాలున్నట్లు పరిగణించుకుంటే, నేనిప్పుడు వ్రాసేదాన్ని ప్రభువు ఆజ్ఞగా అతడు గుర్తించాలి.”

అవును, క్రైస్తవులందరు, వారికి ప్రవచనవరం వున్నా, లేక ఆత్మ సంబంధమైన ఇతర వరాలున్నా, సంఘంలో కార్యాలు ఎలా జరగాలని పౌలు వ్రాశాడో ఆ ఉపదేశాన్ని అంగీకరించి, అనుసరించవలసిన అవసరతవుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి