రక్తమార్పిళ్లు బహు ఉన్నతంగా పరిగణించ బడుతున్నాయా?
ఆధునిక వైద్యంలో రక్తమార్పిడులు సర్వసాధారణం, కాని వాటి పేరుకు తగినట్లు అవి వున్నాయా? మీరేమనుకుంటారు?
డా. క్రాగ్ ఎస్. కిచెన్స్ ది అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ (ఫిబ్రవరి 1993) నందు “రక్తమార్పిళ్లు ఉన్నతంగా పరిగణించబడుతున్నవా?” అని ప్రశ్నించాడు. తరచు వైద్యులు చికిత్సవల్ల సంకటం కంటే ఎక్కువ లాభం వుందా అని జాగ్రత్తగా పరిశీలిస్తారు. రక్తమార్పిడుల విషయమేమిటి?
హెపటైటిస్, వ్యాధినిరోధక శక్తి క్షీణించుట అంగవ్యవస్థ వైఫల్యం, దాత-గ్రహీత-చికిత్సా విధానాలలో జరిగే ప్రతిచర్య వంటి అనేక ప్రమాదాలు రక్తమార్పిడులతో సంబంధం కలిగివున్నాయన్న రుజువును కిచెన్స్ ఇటీవలనే పునఃపరిశీలన చేశాడు. రక్తమార్పిడుల నుండి వచ్చే “వేలాది సమస్యలను” క్లుప్తీకరిస్తూ, ఒక అధ్యయనం “ప్రతి రక్తమార్పిడిలో 20 శాతం వరకు అది వికటించే అవకాశముంది, వాటిలో కొన్ని చిన్నవి, కాని మిగతావి హానికరమైనవి, మరణకరమైనవి కూడా” అని తేల్చిచెప్పింది.
అయితే, చెప్పబడిన ప్రయోజనములు అట్టి ప్రమాదాల్ని ఎదుర్కోవడాన్ని సమర్ధిస్తాయా?
‘రక్తాన్ని విసర్జింపవలెనని’ చెప్పబడిన బైబిలు ఆజ్ఞకు లోబడి రక్తమార్పిడులను నిరాకరించే యెహోవాసాక్షులపై చేసిన 1,404 శస్త్రచికిత్సలకు సంబంధించిన 16 అధ్యయనాలను డా. కిచెన్స్ పునఃపరిశీలించాడు.—అపొస్తలుల కార్యములు 15:28, 29.
ఫలితం? “పెద్ద శస్త్రచికిత్సల కొరకు రక్తమార్పిడి వద్దని చెప్పే రోగులైన యెహోవాసాక్షుల నిర్ణయం మొత్తం శస్త్రచికిత్స సంకటానికి 0.5 నుండి 1.5 శాతం మాత్రమే ప్రాణభయాన్ని కలుగజేస్తున్నది. ఈ ఆచరణ ద్వారా ఎంత అనారోగ్యం వుందో, ఎంత శాతం మరణంవుందో అంత స్పష్టంగా లేకున్ననూ, రక్తమార్పిడి చేసుకునే వారిలోకంటే అలా చేసుకోని వారిలో ప్రమాదపు శాతం చాలా తక్కువ. (ఐటలిక్కులు మావి.) ఆయన ఉద్దేశం? రక్తమార్పిడులను అంగీకరించడం కంటే వాటిని నిరాకరించడంలో తక్కువ వైద్యసంకటం ఉంది.
కాబట్టి, కిచెన్స్ వేసిన కారణసహితమైన ప్రశ్న ఏమంటే: “రక్తమార్పిడి చేసుకోని యెహోవాసాక్షులకు అనారోగ్యం, మరణం, దీర్ఘకాలిక సమస్యల ఖర్చులు తక్కువగా వుంటే, రోగులు రక్తమార్పిడులను తగ్గించాలా?”
అలాంటి రుజువు ఆధారంగా రక్తమార్పిడిని నిరాకరించేవారు కూడా సృష్టికర్త నడిపింపులకు అనుగుణ్యంగా ప్రవర్తిస్తున్న వారౌతారు.