కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 10/1 పేజీలు 3-4
  • జయవంతమగు కుటుంబ జీవితానికి కీలకము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జయవంతమగు కుటుంబ జీవితానికి కీలకము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక గంభీరమైన బాధ్యత
  • వారిని సంరక్షించడం ఎలా
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • పిల్లలు “యెహోవా ఇచ్చే ఆస్తి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • మన పిల్లలు—ఒక అమూల్యమైన స్వాస్థ్యము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 10/1 పేజీలు 3-4

జయవంతమగు కుటుంబ జీవితానికి కీలకము

“మన కుటుంబ వ్యవస్థ క్షీణించి పోతుంది,” అని అమెరికా అధ్యక్ష పదవికి గత సంవత్సరం పోటీచేసిన అభ్యర్థి ఒకరు అన్నారు. నిజంగా కుటుంబ క్షీణదశ మనలను దిగ్భ్రమలో ముంచివేసే స్థితిలో ఉంది. “అదే సమయంలో ఆర్థిక లేదా పారిశ్రామిక రంగాలలో అంతే విస్తృతంగా కలుగుతున్న మార్పులుకూడా” మనలను “ఆశ్చర్యంలో ముంచుతున్నవని” ఫార్‌చ్యూన్‌ మ్యాగజైన్‌ నివేదిస్తుంది.

చివరకు బైబిలు సూత్రాలను అనుసరించ ప్రయత్నిస్తున్న కుటుంబాలు కూడా తరచు విషాదకరంగా ఈ ప్రభావానికి గురౌతున్నవి. కొన్నిసంవత్సరాల క్రితం ఇంకా యుక్తవయస్సుకు ఎదగని ఆరుగురు పిల్లలుగల తండ్రితో సదుద్దేశముగల తోటిక్రైస్తవుడు ఇలా అన్నాడు: “మీ పిల్లల్లో నలుగురు లోకంలో పడిపోతారని నువ్వు కనిపెట్టవచ్చు.” అయితే ఆ తండ్రి తన పిల్లల్లో ఒక్కరికి కూడా అలా జరుగుతుందని నమ్మలేదు. అది ఎందుకో ఆయన ఇలా వివరించాడు.

“మా పిల్లలు నిజంగా మా పిల్లలు కాదు.” వారు “నాకు, నా భార్యకు యెహోవా దేవునిచేత అప్పగింపబడిన ‘స్వాస్థ్యము’ లేక ఆయన ఇచ్చిన బహుమానము. వారికి మేము సరైన మార్గంలో శిక్షణ ఇచ్చినట్లయితే, వారు ‘ఆ మార్గం నుండి తొలగిపోరు.’ అందుచేత మేమెల్లప్పుడు వారు యెహోవాకు చెందినవారని వారి విషయంలో జాగ్రత్తవహించడానికి ప్రయత్నించాము.”—కీర్తన 127:3; సామెతలు 22:6.

ఇక్కడ ఆ తండ్రి విజయవంతమైన కుటుంబ జీవితానికి కీలకమేంటో గుర్తించాడు—తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో వారు దేవుని సొత్తన్నట్లుగా శ్రద్ధవహించవలసి ఉన్నారు. అంటే దీనర్థం, ప్రతి సందర్భంలో మీ పిల్లలు మీరిచ్చే మంచి నడిపింపును గైకొంటారని కాకపోయినా, దేవుడు మీకప్పగించిన పిల్లలను సంరక్షించవలసిన బాధ్యతను మీరు కలిగి ఉన్నారు.

ఒక గంభీరమైన బాధ్యత

ఈ సంరక్షణను మీరు మిక్కిలి శ్రద్ధతోనూ, గౌరవముతోనూ అందించ వలసివున్నారేగాని, అజాగ్రత్తతో లేక విముఖతతో కాదు. దేవుడు మీకనుగ్రహించిన స్వాస్థ్యము లేక బహుమానం విషయమై మీరు దేవునికి జవాబుదారులైయున్నారనే విషయాన్ని గుర్తించి, దాని విషయంలో కృషిచేయండి. పిల్లలను పెంచడానికి వివిధ పద్ధతులను ప్రయోగించి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు తన వాక్యమైన బైబిలులో అనుగ్రహించిన ఉపదేశాలే తల్లిదండ్రులకు చాలు. వాటిని జాగ్రత్తగా అనుసరించాలి.

యెహోవా దేవుడు ఇలా ఉపదేశిస్తున్నాడు: “నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను. నీ యింటి ద్వార బంధములమీదను నీ గవునులమీదను వాటిని వ్రాయవలెను.” బైబిలు ఇంకా ఇలా ప్రోత్సహిస్తుంది: ‘తండ్రులారా, . . . ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని (మీ పిల్లలను) పెంచుడి.’—ద్వితీయోపదేశకాండము 6:7-9; ఎఫెసీయులు 6:4.

కనుక, పిల్లలను సంరక్షించడానికి అనుదిన శ్రద్ధ అవసరం; అంటే వారికొరకు మీ సమయాన్ని నిరాటంకంగా వెచ్చించడం, ప్రత్యేకంగా వారికి మీ ప్రేమను అందిస్తూ, వారియెడల ప్రగాఢమైన శ్రద్ధవహించడమని దాని భావము. పిల్లలయొక్క ఈ ప్రాథమిక అవసరతలను తీర్చే తల్లిదండ్రులు, విజయవంతమైన కుటుంబజీవితాన్ని ఆనందించడానికి ఏమి అవసరమని దేవుడు చెబుతున్నాడో దానిని చేస్తున్నారు.

ఇది అమితంగా కోరడమని మీరనుకుంటున్నారా? అనేకమంది తల్లిదండ్రులు వారి చర్యల ద్వారా అలా భావిస్తున్నట్లు చూపుతారు. అయినా, దేవుని బహుమానాలైన—మీ పిల్లలు—నిజంగా విశేష అవధానానికి పాత్రులైయున్నారు.

వారిని సంరక్షించడం ఎలా

పిల్లలను పెంచడంలో విజయాన్ని పొందిన వారి మాదిరిని వివేకంతో పరిశీలించండి. ఒక పత్రిక “అద్భుతమైన కుటుంబాలు” అనే దాని కవరు స్టోరీలో పిల్లలను విజయవంతంగా పెంచడంలో ప్రాముఖ్యమైన నాలుగు విషయాలను గుర్తించింది: “[1] వివేకంతో సంగతులను విచారించి తెలిసికోవాలనే ప్రేరణను కలిగించే భోజనపు బల్లయొద్ద సంభాషణ, [2] మంచి పుస్తకాలను చదువుట, [3] సృజనాత్మకమైన, అనుకరించదగు మేధా సంపన్నులనుండి కలిగే ప్రేరణ, [4] గౌరవంగా కాపాడవలసిన కుటుంబ సాంప్రదాయం ఉన్నదనే భావన.”—యు. యస్‌. న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్టు, డిశంబరు 12, 1988.

“భోజనపు బల్లయొద్ద సంభాషణ,” విషయానికొస్తే, దేవుడు తల్లిదండ్రులకు యింట కూర్చుండునప్పుడును బోధించాలని చెప్పిన విషయాన్ని గుర్తుతెచ్చు కొనండి. భోజన సమయంలో మీ కుటుంబములోని వారంతా కలిసి కూర్చొని భోంచేస్తూ, సహవాసానికి, ప్రోత్సాహకరమైన సంభాషణకు అనుదినము అవకాశాన్నిస్తున్నారా? పిల్లలకు స్థిరత్వాన్ని, భద్రతా భావాన్ని ఇచ్చే అటువంటి సమయాలు ప్రాముఖ్యము. అవి పిల్లల జ్ఞాపకాల్లో మిగిలిపోతాయి. “ఒకరినిగూర్చి మరొకరం బెంగ పడనవసరం” లేకుండాచేస్తూ, అందరిని ఒకసారి కలుపుతాయి గనుక, భోజన సమయాలను తానెంతో ఇష్టపడుతున్నట్లు ఆరేండ్ల వయస్సుగల ఒక అబ్బాయి చెప్పాడు.

అయితే భోజన సమయంలో మీరు చేసే సంభాషణ ఎలా ఉంది? తరచు అది బైబిలు, బైబిలు ఆధారిత సాహిత్యాలతో కలిపి, “గొప్ప పుస్తకాలను” గూర్చి, మన దేవుని సేవ, లేక దేవుని సృష్టికి సంబంధించిన విషయాలపై కేంద్రీకృతమై ఉందా? ఇలాంటి భోజన సమయంలో జరిగే సంభాషణతోపాటు, క్రమమైన పఠన కార్యక్రమంద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలలో యెహోవాపట్ల, ఆయన నీతియుక్తమైన కట్టడలపట్ల ప్రేమను పెంపొందించవలసియున్నారు.

ముందు ప్రస్తావించబడిన ఆ ఆరుగురు పిల్లల తండ్రి “క్రమంగా అందరం కలిసి భోంచేయడం సమస్యేమి కాదు,” అని వివరించాడు. “ఇది సహజంగా జరుగుతుంది, మమ్ములను ఐక్యపరచడానికి అది సహాయపడుతుంది. అయితే బైబిలు పఠనాన్ని క్రమంగా చేయడమే కష్టమౌతుంది.” రోజంతా బాగా కష్టపడి పనిచేసి అలసి వచ్చిన తర్వాత, కొన్నిసార్లు పఠనం జరుగుతున్న సమయంలోనే ఆయన నిద్రలోకి వెళ్లిపోయాడు. అయినా తన పిల్లలతో క్రమంగా బైబిలు పఠనాన్ని నిర్వహించడాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన క్రమంగా పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ, ఎక్కువసేపు వారు చేప్పేది వింటూ ఉండేవాడు.

భోజన సమయంలో జరిగే అర్థవంతమైన సంభాషణలో నాయకత్వం తీసుకొనడం, గొప్ప పుస్తకాలతో పరిచయం కలిగించడంతోపాటు, “అనుసరించదగు గొప్ప మాదిరికర్తల” నుండి మీ పిల్లలు ప్రేరేణపొందునట్లు మీరు చేస్తున్నారా? సత్యమేమంటే, వారు విజయవంతమైన పెద్దలు కావడానికి జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషియైన, యేసుక్రీస్తును అనుకరించేవారితో క్రమంగా సహవసించేలా చేయడం ప్రాముఖ్యము.

చివరగా, “వారు గౌరవవించాల్సిన కుటుంబ సాంప్రదాయం ఉందనే భావన” విషయమేంటి? మీ పిల్లలు వారు ఉన్నతపరచవలసిన కుటుంబ ప్రమాణాలు కొన్ని ఉన్నవని—ఒక విధమైన ప్రవర్తన, మాట, దుస్తులు, మర్యాదలు మొదలైనవి ఆమోదయోగ్యం కావని, అవి కుటుంబ సాంప్రదాయాన్ని భంగపరుస్తాయని గ్రహించవలసి ఉన్నారు. కుటుంబ సాంప్రదాయాన్ని అతిక్రమించడం గంభీరమైన విషయమని, తన పిల్లల అవమానకర ప్రవర్తన ‘ఆ దేశ నివాసులలో . . . తనను అసహ్యునిగా’ చేసినప్పుడు ప్రాచీనకాల పితరుడైన యాకోబువలె మీరు కూడా తీవ్ర వ్యధకు గురౌతారని వారు గుర్తించాలి.—ఆదికాండము 34:30.

పిల్లలు దేవుని సొత్తు అని గుర్తించిన ఆ ఆరుగురు పిల్లల తండ్రి, “కుటుంబ సంప్రదాయాన్ని” ప్రత్యేకంగా నొక్కివక్కాణించాడు. దుస్తులు, కేశాలంకరణ, లోకవిధానాలకు వేరుగా ఉండే విషయంలో కుటుంబ ప్రమాణాలు, సృష్టికర్తయైన యెహోవా దేవుని నడిపింపుకూ, ఆత్మకు అనుగుణ్యంగా ఎలా ఉంటాయో తదేకంగా ఆయన తన పిల్లలతో తర్కించాడు. వారు నడువవలసిన మార్గంలో తర్ఫీదు ఇవ్వడం, వారికొరకు ఎక్కువ సమయాన్ని, ప్రేమను, ప్రగాఢమైన శ్రద్ధను చూపడం ఫలితంగా, ఆ ఆరుగురు పిల్లలు వారియెదుట ‘ఉంచబడిన మార్గమునుండి వైదొలగక’ యున్నారు.—సామెతలు 22:6.

ప్రపంచవ్యాప్తంగా, అలాంటి బలమైన కుటుంబ వ్యవస్థలు వేలాదిగా ఉన్నవి. ఇవన్ని వాటి సృష్టికర్తకు ఎంతటి స్తుతిని తెస్తాయి! నిస్వార్థపరులైన, ప్రేమగల తల్లిదండ్రులకు ఎంతటి దీవెన తెస్తాయి! సంవత్సరాలు గడిచేకొలది, వారి కృషిఫలితంగా మేలుపొందిన పిల్లలద్వారా అలాంటి తల్లిదండ్రులు గొప్పగా మెచ్చుకొనబడతారు. తదుపరి శీర్షికలో దైవభక్తిగల తల్లిదండ్రులవలన పెంచబడిన ఒక స్త్రీ కథ పరిశీలించి, దానినుండి నేర్చుకోదగిన విలువైన పాఠాలను గుర్తించండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి