కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 9/15 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ “రక్షణనిరీక్షణ”ను ఉజ్వలంగా ఉంచుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • ఇదే రక్షణ దినం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • క్రైస్తవులు, మానవ లోకం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • యెహోవా నేడు మన నుండి ఏమి అడుగుతున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 9/15 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

రోమీయులు 9:3లో అపొస్తలుడైన పౌలు యిలా వ్రాశాడు: “దేహసంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును.” అంటే తోటి యూదులను కాపాడుటకు తాను ప్రాణత్యాగం చేస్తానని ఆయన భావమా?

ప్రేమ విషయంలో యేసు ఉత్కృష్టమైన మాదిరి నుంచాడు. పాపులైన మానవుల కొరకు ఆయన తన ప్రాణాన్ని లేదా జీవితాన్ని ధారపోయుటకు ఇష్టపడ్డాడు. తన విమోచన క్రయధన బలిద్వారా సాధ్యమైనంత ఎక్కువమంది ప్రయోజనం పొందులాగున యేసు, ప్రజలకు తానుచేసిన పరిచర్యలో తోటివారికొరకు అనగా యూదుల కొరకు తననుతాను ఎక్కువగా లభ్యపరచుకున్నాడు. (మార్కు 6:30-34) రక్షణ సమాచారం యెడల వారినుండి ప్రతిస్పందన లేకపోవడం, వ్యతిరేకత యూదుల యెడల యేసుకుండిన ప్రేమగల శ్రద్ధనెన్నడూ పాడుచేయలేదు. (మత్తయి 23:37) మరియు ‘తన అడుగుజాడల్లో నడచుటకు ఆయన మనకు మాదిరి ఉంచాడు.’—1 పేతురు 2:21.

ప్రేమ విషయంలో అసంపూర్ణ మానవులకు యేసు మాదిరి ననుకరించుట సాధ్యమేనా? అవును, దీనికిగల ఉదాహరణను మనం అపొస్తలుడైన పౌలునందు చూడగలము. తోటి యూదుల యెడల ఆయనెంత ప్రేమగలవాడై యుండెనంటే, వారికొరకు “క్రీస్తునుండి వేరై శాపగ్రస్తుడనైయుండ” నిష్టపడుదునని ఆయన వారి కొరకైన ప్రేమతో చెప్పాడు.

అక్కడ పౌలు అంశాన్ని అతిశయోక్తిగా లేదా అతిశయాలంకారంగా చెప్పాడు. మత్తయి 5:18లో యేసుకూడా ఇదేవిధంగా అతిశయాలంకారంగా చెబుతూ యిలా అన్నాడు: “ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదు.” ఆకాశము, భూమి గతించిపోవని యేసుకు తెలుసు. ఆలాగే పౌలు శాపగ్రస్తుడూ కాడు, యూదులందరు క్రైస్తవత్వాన్ని హత్తుకోరు. అయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడనుగ్రహించే రక్షణ యూదులకు లభింపజేయడానికి తానేమైనా చేయగలనని పౌలు తెల్పుచున్నాడు. “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని తోటి క్రైస్తవులను అపొస్తలుడు ప్రోత్సహించగల్గాడనుటలో ఆశ్చర్యమేమీ లేదు.

నేడును, క్రైస్తవులు అవిశ్వాసుల యెడల యేసు, పౌలు కలిగియుండిన శ్రద్ధనే కలిగియుండాలి. పొరుగువారి యెడల మన ప్రేమను, రక్షణ మార్గాన్నిగూర్చి నేర్చుకోవడంలో వారికి సహాయపడడాన్ని తొలగించుటకు మనం సాక్ష్యమిచ్చే ప్రాంత ప్రజల అనాసక్తిని లేదా వారి వ్యతిరేకతను మనమెన్నడూ అనుమతించకూడదు.—మత్తయి 22:39.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి