కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 7/15 పేజీలు 18-23
  • మన విశ్వాసానికి సద్గుణాన్ని ఎలా అమర్చవచ్చును?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన విశ్వాసానికి సద్గుణాన్ని ఎలా అమర్చవచ్చును?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సద్గుణమంటే ఏమిటి
  • అసంపూర్ణులం అయినా సద్గుణవంతులమే
  • సద్గుణము, మన తలంపులు
  • సద్గుణము, మన సంభాషణ
  • సద్గుణము, మన క్రియలు
  • చురుకైన మంచితనమే సద్గుణం
  • మీరు సద్గుణాన్ని వెంబడిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • మనం సద్గుణాల్ని ఎలా అలవర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సద్గుణాల్ని ఎందుకు అలవర్చుకోవాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • విశ్వాసముంచుట ద్వారా దేవుని వాగ్దానములకు ప్రత్యుత్తరమివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 7/15 పేజీలు 18-23

మన విశ్వాసానికి సద్గుణాన్ని ఎలా అమర్చవచ్చును?

“మీ విశ్వాసమునందు సద్గుణమును . . . అమర్చుకొనుడి.—2 పేతురు 1:5.

1, 2. యెహోవా ప్రజలు సద్గుణ క్రియలు చేయాలని మనమెందుకు ఎదురుచూడాలి?

యెహోవా ఎల్లప్పుడు సద్గుణంతోనే ప్రవర్తిస్తాడు. నీతిగల దానిని మేలైన దానినే ఆయన చేస్తాడు. కాబట్టే, దేవుడు ‘తన మహిమనుబట్టి, గుణాతిశయమును బట్టి’ అభిషక్త క్రైస్తవులను పిలిచాడని అపొస్తలుడైన పేతురు ఆయన్ని గూర్చి మాట్లాడగల్గాడు. సద్గుణ సంపన్నుడైన వారి పరలోకపు తండ్రిని గూర్చిన అనుభవజ్ఞానము వారికి నిజమైన దైవభక్తిగల జీవితాన్ని వెంబడించు అవసరతను చూపింది.—2 పేతురు 1:2, 3.

2 “ప్రియులైన పిల్లలవలె దేవునినిపోలి నడుచుకొనుడని” అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ఉద్బోధించాడు. (ఎఫెసీయులు 5:1) తమ పరలోకపు తండ్రివలెనే, యెహోవా ఆరాధికులు తామే పరిస్థితిలో ఉన్ననూ సద్గుణముతో ప్రవర్తించాలి. అయితే ఈ సద్గుణమంటే ఏమిటి?

సద్గుణమంటే ఏమిటి

3. “సద్గుణము” ఎట్లు నిర్వచింపబడింది?

3 ఆధునిక నిఘంటువులు “సద్గుణమును” “నైతిక శ్రేష్ఠత; మంచితనము” అని నిర్వచిస్తున్నవి. అది “సరియైన చర్య, తలంపు; ప్రవర్తనా మంచితనమై” యుంది. సద్గుణముగల వ్యక్తి నీతిపరుడు. “సరియైన కట్టడకు తగినట్టు మార్చుకొనుట” అని కూడా ఈ సద్గుణము నిర్వచింపబడింది. అయితే, క్రైస్తవులకీ “సరియైన కట్టడ” దేవుని ద్వారా తీర్మానించబడి, ఆయన పవిత్ర వాక్యమగు బైబిలునందు స్పష్టం చేయబడింది.

4. క్రైస్తవులు వృద్ధిచేసుకోవడానికి కృషిచేయాల్సిన ఏ లక్షణాలను 2 పేతురు 1:5-7 ప్రస్తావిస్తున్నది?

4 నిజ క్రైస్తవులు యెహోవా దేవుని నీతికట్టడల ప్రకారం మార్చుకొని, విశ్వాసముంచుట ద్వారా ఆయన అమూల్యమైన వాగ్దానాలకు ప్రతిస్పందిస్తారు. వారు పేతురు యిచ్చిన ఈ సలహాను లక్ష్యపెడతారు: “మీ మట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.” (2 పేతురు 1:5-7) ఈ లక్షణాల్ని పెంపొందించుకోవడానికి ఒక క్రైస్తవుడు కష్టించి పనిచేయాలి. ఇది కేవలం కొద్ది రోజుల్లో, కొద్ది సంవత్సరాల్లో చేసేది కాదు, దీనికి ఎడతెగని యావత్‌ జీవిత ప్రయత్నం అవసరం. ఎందుకనగా, మన విశ్వాసానికి సద్గుణమును అమర్చుటే ఒక పెద్ద సవాలు.

5. లేఖనాల ప్రకారం సద్గుణమంటే ఏమిటి?

5 “సద్గుణము” అని అనువదింపబడిన ఆదిమ గ్రీకుపద కావ్యభావం “ఏ విధమైన శ్రేష్ఠతనైననూ” సూచిస్తుందని నైఘంటికుడైన ఎమ్‌. ఆర్‌. విన్సెంట్‌ చెబుతున్నాడు. దేవుని “గుణాతిశయములను” లేదా సద్గుణాలను సుదూరప్రాంతాల్లో ప్రచురం చేయడానికి క్రైస్తవులు పిలువబడ్డారని చెప్పినప్పుడు పేతురు బహువచన రూపాన్ని ఉపయోగించాడు. (1 పేతురు 2:9) లేఖనానుసారంగా చూస్తే, ఈ సద్గుణము మామూలుగా కాకుండ, “నైతిక బలం, నైతిక శక్తి, ఆత్మబలంగా” వర్ణింపబడింది. ఈ సద్గుణాన్ని ప్రస్తావించినప్పుడు, దేవుని సేవకులు ప్రదర్శిస్తూ, కాపాడుకోవాలని కోరబడిన నిర్భయమైన నైతిక శ్రేష్ఠత పేతురు మనస్సులో ఉండెను. అయితే మనం అసంపూర్ణులం గనుక, దేవుని దృష్టిలో సద్గుణమైన దాన్ని మనం నిజంగా చేయగలమా?

అసంపూర్ణులం అయినా సద్గుణవంతులమే

6. అసంపూర్ణులమైననూ, మనం దేవుని దృష్టిలో సద్గుణ క్రియలు చేయగలమని ఎందుకు చెప్పగలము?

6 వారసత్వంగా వచ్చిన అసంపూర్ణత, పాపం మనలోవుంది, కాబట్టి దేవుని దృష్టిలో సద్గుణమైన దాన్ని నిజంగా మనమెలా చేయగలమని మన మాలోచించవచ్చు. (రోమీయులు 5:12) సద్గుణ తలంపులు, మాటలు, ప్రవర్తనను ఉద్భవింపజేసే స్వచ్ఛమైన హృదయాల్ని మనం కలిగివుండాలంటే మనకు నిశ్చయంగా యెహోవా సహాయం అవసరం. (లూకా 6:45 పోల్చండి.) బత్షెబ విషయంలో పాపం చేసిన తరువాత, పశ్చాత్తాపముతో కీర్తనల రచయిత దావీదు యిలా యాచించాడు: “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము.” (కీర్తన 51:10) దేవునినుండి దావీదు క్షమాపణను, సద్గుణవర్తనకు అవసరమైన సహాయాన్ని పొందాడు. కాబట్టి, మనం గంభీరమైన తప్పుచేసిననూ, పశ్చాత్తాపంతో దేవుడు, సంఘపెద్దలిచ్చే సహాయాన్ని అంగీకరించినట్లయిన మనం మరలా సద్గుణ మార్గానికి వచ్చి దానిలోనే నిలిచియుండగలము.—కీర్తన 103:1-3, 10-14; యాకోబు 5:13-15.

7, 8. (ఎ) మనం సద్గుణవంతులముగా ఉండాలంటే, దానికేమి అవసరం? (బి) సద్గుణవంతులుగా ఉండడంలో క్రైస్తవులకు ఏ సహాయం కలదు?

7 వారసత్వంగా లభించిన పాపము కారణంగా, సద్గుణవర్తన మననుండి కోరేదాన్ని చేయడానికి మనం ఎడతెగక అంతరంగ పోరాటం పోరాడాలి. మనం సద్గుణవంతులుగా ఉండాలంటే, పాపానికి దాసులయ్యేందుకు మనల్నెన్నడూ అనుమతించకూడదు. బదులుగా మనం ఎల్లప్పుడు సద్గుణవంతంగా తలస్తూ, మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ “నీతికి దాసులుగా” ఉండాలి. (రోమీయులు 6:16-23) మన శరీర కోరికలు, పాపభావాలు బలంగా ఉంటాయి, అందువలన వీటికి మరియు దేవుడు మననుండి కోరే సద్గుణ సంగతులకు మధ్య జరిగే పోరాటాన్ని మనమెదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనమేం చేయాలి?

8 ఒక విషయమేమంటే, యెహోవా పరిశుద్ధాత్మ లేక చురుకైన శక్తియిచ్చే నడిపింపును మనం అనుసరించాలి. దానికి మనం పౌలు యిచ్చిన ఈ సలహాను లక్ష్యపెట్టాలి: “ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.” (గలతీయులు 5:16, 17) అవును, నీతికొరకైన శక్తిగా దేవుని ఆత్మను, సత్ప్రవర్తనకు నడిపింపుగా ఆయన వాక్యమును మనము కలిగివున్నాము. మనకు యెహోవా సంస్థ ప్రేమపూర్వకమైన సహాయము, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” సలహా కూడ మనకున్నది. (మత్తయి 24:45-47) అలా మనం పాప స్వభావాలకు వ్యతిరేకంగా విజయవంతమైన పోరాటం పోరాడగలము. (రోమీయులు 7:15-25) మనకేదైనా చెడు తలంపు కలిగినట్లయిన, వెంటనే దానిని పెరికివేసి, సద్గుణానికి మచ్చతెచ్చే ఏ పనిచేయడానికైనా కలిగే శోధనను ఎదుర్కోవడానికి దేవుని సహాయము కొరకు ప్రార్థించాలి.—మత్తయి 6:13.

సద్గుణము, మన తలంపులు

9. సద్గుణవర్తనకు ఎలాంటి తలంపులు అవసరం?

9 ఒక వ్యక్తి ఆలోచనా సరళితో సద్గుణం ఆరంభమౌతుంది. దైవానుగ్రహం పొందాలంటే, మనం నీతిగల, మేలైన, సద్గుణ సంగతులను ఆలోచించాలి. పౌలు యిలా చెప్పాడు: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యానముంచుకొనుడి.” (ఫిలిప్పీయులు 4:8) నీతియుక్తమైన, పవిత్రమైన సంగతులపై మనమనస్సు నిలపాలి, ఆలాగే సద్గుణరహితమైనది ఏదైనాసరే మనకు ఆమోదయోగ్యంగా ఉండకూడదు. పౌలు యిలా చెప్పగల్గాడు: “మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి.” మనము పౌలువలె—తలంపులో, మాటలో, ప్రవర్తనలో సద్గుణవంతులమైతే—మనం మంచి సహవాసులముగా, క్రైస్తవ జీవిత మాదిరులుగా ఉంటాము, కాగా ‘దేవుని సమాధానం మనకు తోడైయుంటుంది.’—ఫిలిప్పీయులు 4:9.

10. సద్గుణవంతులుగా ఉండుటకు 1 కొరింథీయులు 14:20 యొక్క వ్యక్తిగత అన్వయింపు మనకెలా సహాయపడుతుంది?

10 తలంపులో సద్గుణవంతులుగా నిలిచియుండి, అలా మన పరలోక తండ్రిని ప్రీతిపర్చాలని మనం కోరినట్లయిన, పౌలు యిచ్చిన ఈ సలహాను మనం అన్వయించుట అవసరం: “సహోదరులారా, మీరు బుద్ధివిషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి; బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి.” (1 కొరింథీయులు 14:20) అంటే క్రైస్తవులముగా మనం దుష్టత్వపు జ్ఞానాన్ని లేదా దుష్టత్వపు అనుభవాన్ని వెదకమని దాని భావం. ఈ రీతిలో మన మనస్సులు చెరపబడునట్లు అనుమతించడానికి బదులు మనమీ విషయంలో శిశువులవలె అనుభవంలేని, అమాయకులుగా ఉండుటకు జ్ఞానయుక్తంగా ఎంచుకుంటాము. అదేసమయంలో, మనం లైంగిక దుర్నీతి, తప్పిదాలుచేయుట యెహోవా దృష్టిలో పాపమని పూర్తిగా అర్థంచేసుకున్న వారిగావుంటాము. సద్గుణవంతులై ఉండుట ద్వారా ఆయనను ప్రీతిపర్చాలనే హృదయపూర్వక కోరిక మనకు ప్రయోజనాన్నిస్తుంది, ఎందుకంటె అది సాతాను అధికారము క్రిందగల ఈ లోకపు అపవిత్ర వినోదాన్ని, మనస్సును చెరిపే ఇతర ప్రభావాల్ని విసర్జించుటకు మనలను పురికొల్పుతుంది.—1 యోహాను 5:19.

సద్గుణము, మన సంభాషణ

11. సద్గుణవంతులుగా ఉండుటకు ఎలాంటి సంభాషణ అవసరం, ఈ విషయంలో యెహోవా దేవుడు, యేసుక్రీస్తులో మనకెటువంటి మాదిరి కలదు?

11 మన తలంపులు సద్గుణంగలవైతే, మనం మాట్లాడే విషయాలపై ఇది గట్టి ప్రభావం చూపాలి. సద్గుణవంతులుగా ఉండటంటో స్వచ్ఛమైన, యోగ్యమైన, సత్యమైన, క్షేమాభివృద్ధికరమైన సంభాషణ ఇమిడివుంది. (2 కొరింథీయులు 6:3, 4, 7) యెహోవా ‘సత్యదేవుడు.’ (కీర్తన 31:5) తన వ్యవహారములన్నింటిలో ఆయన యథార్థవంతుడు, అబద్ధమాడనేరడు గనుక ఆయన వాగ్దానములన్నీ నిశ్చయములు. (సంఖ్యాకాండము 23:19; 1 సమూయేలు 15:29; తీతు 1:2) దేవుని కుమారుడైన, యేసుక్రీస్తు “కృపాసత్య సంపూర్ణుడు.” భూమిపైనున్నప్పుడు తన తండ్రియొద్దనుండి పొందినట్లే ఆయన అన్నిసమయాల్లో సత్యమే మాట్లాడాడు. (యోహాను 1:14; 8:40) అంతేకాకుండ, యేసు “పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు.” (1 పేతురు 2:22) మనము దేవునికి, క్రీస్తుకు నిజమైన సేవకులమైనట్లయిన, “సత్యమను దట్టీ” కట్టుకున్నవారిగా మన మాటలో సత్యంగా, ప్రవర్తనలో యథార్థంగా ఉంటాము.—ఎఫెసీయులు 5:9; 6:14.

12. మనం సద్గుణవంతులుగా ఉండాలంటే, ఎలాంటి సంభాషణల్ని విసర్జించాలి?

12 మనం సద్గుణవంతులమైతే, మనం విసర్జించవలసిన సంభాషణా విధానాలు కొన్నివున్నాయి. మనం పౌలు యిచ్చిన సలహాచే నడిపించబడతాము: “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి.” “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైననూ ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు.” (ఎఫెసీయులు 4:31; 5:3, 4) మన నీతియుక్త హృదయాలు క్రైస్తవునికి తగని సంభాషణను విసర్జించుటకు మనల్ని పురికొల్పుతుంది గనుక మనతో సహవసించడం ఇతరులకు సేదదీర్పునిస్తుంది.

13. క్రైస్తవులెందుకు తమ నాలుకను అధీనంలో ఉంచుకోవాలి?

13 దేవుని ప్రీతిపర్చాలని, సద్గుణ విషయాలే మాట్లాడాలనే కోరిక నాలుకను అధీనంలో పెట్టుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. పాప స్వభావాలున్నందున, ఆయా సమయాల్లో మనమందరము తప్పిపోవుదుము. అయిననూ, శిష్యుడైన యాకోబు చెప్పేదేమంటే ‘మనం గుర్రముల నోటికి కళ్లెం పెట్టినట్లయిన,’ మనం నడిపే దిశకు అవి తిరుగుతాయి. కాబట్టి నోటికి కళ్లెం వేయుటకు మనం గట్టిగా కృషిచేస్తూ దాన్ని కేవలం సద్గుణవంతంగా ఉపయోగించుటకు ప్రయత్నించాలి. అదుపులేని నాలుక “పాపప్రపంచముగా” తయారౌతుంది. (యాకోబు 3:1-7) ఈ భక్తిహీన లోకమందలి ప్రతి దుష్టలక్షణము అదుపులోవుంచని నాలుకకు సంబంధించినదై యుంటుంది. అబద్ధసాక్ష్యము, దూషణ, కొండెములాడుట వంటి హానికరమైన సంగతులకు అదే బాధ్యతవహిస్తుంది. (యెషయా 5:20; మత్తయి 15:18-20) అదుపులేని నాలుక దూషించినప్పుడు, కత్తిపోటువంటి లేదా పచ్చి అబద్ధాలు మాట్లాడినప్పుడు, దానిలో మరణకరమైన విషం నిండివుంటుంది.—కీర్తన 140:3; రోమీయులు 3:13; యాకోబు 3:8.

14. సంభాషణలో క్రైస్తవులు ఏ ద్వందవైఖరిని విసర్జించాలి?

14 యాకోబు సూచించినట్లుగా, ఒకప్రక్క దేవుని గూర్చిన మంచి సంగతులు మాట్లాడుచు ‘యెహోవాను స్తుతిస్తూ’ మరోవైపు కీడుకలగాలని “మనుష్యులను శపిస్తూ” నాలుకను దుర్వినియోగపర్చడం పరస్పర విరుద్ధమై యుంటుంది. కూటాల్లో దేవుని స్తుతిగీతాలు పాడి, ఆ తర్వాత బయటకు వెళ్లి తోటి విశ్వాసుల్ని దూషించుట ఎంత పాపము! ఒకే జెలనుండి తియ్యని నీరును చేదునేరును ఊరజాలదు. మనం యెహోవాను సేవిస్తున్నట్లయిన, మనం అరుచికరంగా మాట్లాడుటకు బదులు సద్గుణ విషయాలే మాట్లాడాలని ఇతరులు అపేక్షించడం సబబే. కాబట్టి మనం దూషణను విసర్జించి మన సహవాసులకు ప్రయోజనమిచ్చే మాటల్ని, ఆత్మీయంగా వారికి క్షేమాభివృద్ధిని కలుగజేసే సంగతులనే మాట్లాడుదాము.—యాకోబు 3:9-12.

సద్గుణము, మన క్రియలు

15. మోసపూరిత పద్ధతులను విసర్జించుట ఎందుకు ప్రాముఖ్యము?

15 క్రైస్తవుల తలంపుల్లో, మాటల్లో సద్గుణం ఉట్టిపడాలి, మరి మన క్రియల సంగతేమి? సద్గుణ ప్రవర్తనే దేవుని అంగీకారం పొందుటకున్న ఏకైక మార్గం. యెహోవా సేవకుడెవరూ ఈ సద్గుణాన్ని వదిలేసి, కుతంత్రంగా, మోసపూరితంగా ఉంటూ అలాంటి సంగతులు దేవుని అంగీకారం కలిగివుంటాయని తలంచలేడు. సామెతలు 3:32 యిలా చెబుతున్నది: “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.” యెహోవా దేవునితో మనకున్న సంబంధాన్ని మనం కాపాడుకున్నట్లయిన, ఆలోచనను రేకెత్తించే ఆ మాటలు మనం కుతంత్రాలు పన్నకుండా లేదా ఎలాంటి మోసపూరిత క్రియలు చేయకుండా మనల్ని అడ్డగించాలి. అంతెందుకు, యెహోవాకు హేయమైన ఏడు సంగతుల్లో, “దుర్యోచనలు యోచించు హృదయము” కూడా వుంది. (సామెతలు 6:16-19) కాబట్టి మనం అటువంటి క్రియలను విసర్జించి, మన తోటి మానవుల ప్రయోజనార్థమును, మన పరలోకపు తండ్రి మహిమకొరకు సద్గుణ విషయాల్నే చేద్దాము.

16. ఎట్టి వేషధారణా క్రియల్లోనూ క్రైస్తవులు ఎందుకు పాల్గొనకూడదు?

16 సద్గుణాన్ని ప్రదర్శించడానికి మనం నమ్మకస్థులుగా ఉండడం అవసరం. (హెబ్రీయులు 13:18) తన మాటలకు, క్రియలకు పొందికలేని వేషధారి సద్గుణవంతుడు కాదు. “వేషధారి” అని అనువదింపబడిన గ్రీకు (హిపోక్రైటెస్‌) పదానికి “జవాబు చెప్పువాడని” అర్థం, ఆలాగే అది రంగస్థల నటుడ్ని కూడా సూచిస్తుంది. గ్రీకు రోమా రంగస్థల నటులు ముసుగులు ధరించేవారు గనుక, నటన కనబర్చేవారిని సూచించడానికి అలంకారికంగా ఈ పదం ప్రయోగంలోకి వచ్చింది. వేషధారులు “అపనమ్మకస్థులై” ఉంటారు. (లూకా 12:46ను మత్తయి 24:50, 51తో పోల్చండి.) వేషధారణ (హిపొక్రిసిస్‌) దుష్టత్వాన్ని, కపట స్వభావాన్నికూడ సూచించవచ్చును. (మత్తయి 22:18; మార్కు 12:15; లూకా 20:23) నమ్మేవ్యక్తి పైపై నవ్వులు, పొగడ్తలు, కేవలం నటనగల క్రియల ద్వారా మోసగింపబడుట ఎంత విశాదకరం! అయితే మనం నమ్మకస్థులైన క్రైస్తవులతో వ్యవహరిస్తున్నామని మనం తెలుసుకొన్నప్పుడు అదెంతో హృద్యానందంగా ఉంటుంది. మనం సద్గుణసంపన్నులుగా, నిష్కపటులుగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరైతే “నిష్కపటమైన సహోదరప్రేమ” కనబరుస్తూ, “నిష్కపటమైన విశ్వాసము” కలిగియుంటారో వారిపైనే ఆయన ఆమోదం ఉంటుంది.—1 పేతురు 1:22; 1 తిమోతి 1:5.

చురుకైన మంచితనమే సద్గుణం

17, 18. ఆత్మఫలమైన మంచితనాన్ని మనం ప్రదర్శిస్తే, ఇతరులతో మనమెలా వ్యవహరిస్తాము?

17 విశ్వాసానికి మనం సద్గుణాన్ని అమర్చినట్లయిన, దేవునికి ఆమోదయోగ్యంకాని సంగతులను తలంచకుండా, మాట్లాడకుండా, చేయకుండా ఉండుటకు కృషిచేస్తాము. అయితే, క్రైస్తవ సద్గుణాన్ని ప్రదర్శించుటకు మనం చురుకుగా మంచితనాన్ని అవలంబించడం కూడ అవసరం. నిజానికి ఈ సద్గుణం మంచితనమని నిర్వచింపబడింది. ఈ మంచితనం కేవలం మానవ ప్రయత్న ఫలితం కాదుగాని, యెహోవా పరిశుద్ధాత్మ ఫలమే. (గలతీయులు 5:22, 23) మంచితనమనే ఈ ఆత్మ ఫలాన్ని మనం కనబరిస్తే, ఇతరుల మంచిని ఆలోచించడానికి, అసంపూర్ణతవున్ననూ వారి మంచి లక్షణాల్ని మెచ్చుకోవడానికి మనం పురికొల్పబడతాము. నమ్మకంగా వారనేక సంవత్సరాలు యెహోవాను సేవించారా? అట్లయిన వారిని మనం గౌరవించాలి, వారిని గూర్చి, దేవునికి వారు చేసిన సేవనుగూర్చి మంచిగా మాట్లాడాలి. తన నామము యెడల వారుచూపిన ప్రేమను, విశ్వాసంతో వారుచూపిన సద్గుణాన్ని మన పరలోకపు తండ్రి గమనిస్తున్నాడు, కాబట్టి మనమూ ఆలాగే చేయాలి.—నెహెమ్యా 13:31; హెబ్రీయులు 6:10.

18 సద్గుణం మనలను ఓపిక గలవారిగా, అర్థం చేసుకొనేవారిగా, కనికరం గలవారిగా చేస్తుంది. తోటి యెహోవా ఆరాధికుడు మనోవేదనతో లేదా కృంగిన మనస్సుతో బాధపడుతున్నట్లయిన, మనం ఓదార్పుగా మాట్లాడి, మన ప్రేమగల పరలోకపు తండ్రి మనలను ఓదార్చినట్లే అతన్ని ఓదార్చుటకు మనం ప్రయత్నిస్తాము. (2 కొరింథీయులు 1:3, 4; 1 థెస్సలొనీకయులు 5:14) తాము ప్రేమించిన వారు బహుశ మరణించినందున దుఃఖపడుతున్న వారియెడల మనం సానుభూతి చూపిస్తాం. బాధను తగ్గించగల దేనినైననూ మనం చేయగల్గినట్లయిన, దాన్ని మనం చేస్తాం, ఎందుకంటే స్ఫూర్తిదాయకమైన సద్గుణం ప్రేమగల, ప్రయోజనమిచ్చే చర్యను పురికొల్పుతుంది.

19. తలంపులో, మాటలో, క్రియలో మనం సద్గుణవంతులమైతే ఇతరులు బహుశ మనలనెట్లు చూస్తారు?

19 తలంపులో, మాటలో, క్రియలో మనం సద్గుణసంపన్నులమైతే యెహోవాను గూర్చి మంచిగా మాట్లాడుతూ ఆయనను సన్నుతించినట్లు, ఇతరులు బహుశ మనల్నిగూర్చి దీవెనకరంగా మాట్లాడుతారు. (కీర్తన 145:10) జ్ఞానయుక్తమైన ఒక సామెత ఇట్లంటున్నది: “నీతిమంతుల తలమీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.” (సామెతలు 10:6) దుష్టుడు, హింసాప్రవృత్తిగల వ్యక్తిలో తనను ఇతరులకు ప్రియమైన వానిగాచేయు సద్గుణముండదు. ప్రజలు అతన్నిగూర్చి మంచిగా మాట్లాడుతూ, నమ్మకంగా అతన్ని ఆశీర్వదించరు గనుక అతడేమి విత్తునో ఆ పంటనే కోయును. (గలతీయులు 6:7) యెహోవా సేవకులవలె సద్గుణంతో తలస్తూ, మాట్లాడుతూ, ప్రవర్తించు వారికదెంత శ్రేష్ఠమో! తమ నాశీర్వదించుటకు, తమను గూర్చి మంచిగా మాట్లాడుటకు పురికొల్పబడిన వారి ప్రేమను, నమ్మకాన్ని, గౌరవాన్ని వారు గెలుచుకుంటారు. అంతేకాదు, తమ భక్తిగల సద్గుణం ఫలితంగా వారు యెహోవా అమూల్యమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు.—సామెతలు 10:22.

20. సద్గుణసంపన్న తలంపులు, మాటలు, క్రియలు యెహోవా ప్రజల సంఘమందు ఎలాంటి ప్రభావం కలిగియుండగలవు?

20 సద్గుణ తలంపులు, సంభాషణ, ప్రవర్తన నిశ్చయముగా యెహోవా ప్రజల సంఘానికి ప్రయోజనమిస్తాయి. తోటి విశ్వాసులు పరస్పరం ఎప్పుడైతే ప్రేమగల, గౌరవపూర్వకమైన తలంపులు కలిగివుంటారో, అప్పుడు వారిలో సహోదర ప్రేమ వెల్లివిరుస్తుంది. (యోహాను 13:34, 35) యథార్థమైన మెప్పుకోలు, ప్రోత్సాహముతో పాటువుండే సద్గుణ సంభాషణ ఆప్యాయతా భావంగల సహకారాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. (కీర్తన 133:1-3) ఆలాగే సద్గుణంగల హృదయపూర్వకమైన క్రియలు ఇతరులును అదేరీతిలో ప్రతిస్పందించుటకు ప్రోత్సహిస్తాయి. అన్నింటికంటే పైగా, క్రైస్తవ సద్గుణాన్ని అభ్యసించడం ఫలితంగా సద్గుణసంపన్నుడైన పరలోకపు తండ్రియగు యెహోవా ఆమోదం, ఆశీర్వాదం మనకు లభిస్తాయి. కాబట్టి మనం విశ్వాసముంచుట ద్వారా దేవుని అమూల్యమైన వాగ్దానాలకు ప్రతిస్పందించడమే మన ధ్యేయంగా కలిగివుందాం. ఆలాగే మన విశ్వాసానికి సద్గుణాన్ని అమర్చుటకు అన్నివిధాల చిత్తశుద్ధితో కృషిచేద్దాము.

మీ జవాబులేమి?

◻ “సద్గుణమును” మీరెలా నిర్వచిస్తారు, అసంపూర్ణులైన ప్రజలు ఎందుకు సద్గుణవంతులుగా ఉండగలరు?

◻ సద్గుణానికి ఎలాంటి తలంపులు అవసరము?

◻ మన సంభాషణపై సద్గుణం ఎందుకు ప్రభావం చూపాలి?

◻ మన క్రియలపై సద్గుణం ఏ ప్రభావం చూపాలి?

◻ సద్గుణవంతులుగా ఉండుటలోగల కొన్ని ప్రయోజనాలేమి?

[21వ పేజీలోని చిత్రం]

ఒకే జెలనుండి తియ్యని నీరు, చేదు నీరు ఊరజాలవు గనుక, యెహోవా సేవకులు కేవలం సద్గుణ విషయాలే మాట్లాడాలని ఇతరులు సరిగా అపేక్షిస్తారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి