“దైవిక బోధ” జిల్లా సమావేశములు
యెహోవాచేత ఉపదేశింపబడాలని ఇచ్ఛయించు వారందరు ఆసక్తితో “దైవిక బోధ” జిల్లా సమావేశాల కొరకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత సమస్యలు, ప్రపంచ అల్లర్లు పెరుగుతున్న ఈ కాలంలో క్రైస్తవులకు రక్షణప్రదమైన లేఖన ఉపదేశపు వివిధ అంశాలను ఈ నాలుగు రోజుల కార్యక్రమం నొక్కితెల్పుతుంది. ‘హితబోధకు విరోధమైన ఏ విషయములోనైనను’ స్థిరంగా నిలువబడుటకు ఆ కార్యక్రమం వారికి సహాయపడుతుంది. (1 తిమోతి 1:10) దేవుని వాక్యపు మంచి బోధకులుగా తయారయ్యేందుకు కూడ హాజరైన వారినందరిని అది ప్రోత్సహిస్తుంది.
అనుకరించడానికి మనకు ఎంత శ్రేష్ఠమైన మాదిరులు కలవు! ఎవరో కాదు యెహోవా దేవుడే మన మహాగొప్ప బోధకుడు. యెహోవా “భూజంతువులకంటె మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షులకంటె మనకు ఎక్కువ జ్ఞానము” కలుగజేస్తున్నాడని ఎలీహు సరిగా యోబుతో చెప్పాడు. యెహోవాను ప్రస్తావించి ఆయనిలా కూడ అడిగాడు: “ఆయనను పోలిన బోధకుడెవడు?” (యోబు 35:11; 36:22) యెషయా 30:20లో దేవుడు ‘మహాగొప్ప బోధకుడని’ సూచింపబడింది.
యెహోవా తర్వాత బోధకునిగా రెండవ స్థానంలో కేవలం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. ఆయన “బోధకుడని,” “ఉపదేశకుడని” పేరుగాంచి, సువార్తల్లో దాదాపు 50 సార్లు ఆయనలా పిలువబడ్డాడు. సంచలనాత్మకంగా ఆయనెన్నో స్వస్థతలు, అద్భుతాలు చేసినను, యేసు వైద్యునిగా కాక బోధకునిగానే, ఉపదేశకునిగానే పేరుగాంచాడు.—మత్తయి 8:19; లూకా 5:5; యోహాను 13:13.
అన్నింటికంటే ఆవశ్యకముగా, యేసు తనవలెనే వారును బోధకులై యుండునట్లు తన శిష్యులకు, అపొస్తలులకు బోధించాడు. దీనిని మనం మత్తయి 10:5 నుండి 11:1 వరకు మరియు లూకా 10:1-11లో చూడగలం. పరలోకానికి ఆరోహణమయ్యే ముందు, యేసు మత్తయి 28:19, 20లో వ్రాయబడిన ప్రఖ్యాత బోధనా పనినిగూర్చి ఆజ్ఞాపించాడు. అక్కడిలావుంది: “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి.” యేసు తొలి అనుచరులు ఈ బోధనా ఆజ్ఞను ఎంత ఆసక్తిగా, నైపుణ్యంతో నెరవేర్చారో అపొస్తలుల కార్యములు, దాని తర్వాత వ్రాయబడిన క్రైస్తవ ప్రేరేపిత లేఖలు వివరించాయి.
క్రితమెన్నటికంటే నేడు ఈ బోధించే పని మరింత అత్యవసరమై యుంది. మనమీ విధానంయొక్క అంత్యదినాల్లో జీవిస్తున్నాము, అందువలన మన జీవితాలు ఇందులో ఇమిడివున్నాయి. ప్రజలు మహాబబులోను పాపములలో పాలివారుకాకుండ, దాని తెగుళ్లు వారికి సంభవించకుండా ఉండాలంటే వారు బోధించి బబులోను నుండి బయటకు వచ్చి యెహోవా పక్షమున, ఆయన రాజ్యము పక్షమున నిలువబడడానికి సహాయం చెయ్యాలి.—ప్రకటన 18:4.
తమ బోధనా ఆజ్ఞను నెరవేర్చే ప్రయత్నంలో యెహోవాసాక్షులందరికి సహాయ పడడానికి, యెహోవా తన సంస్థద్వారా “దైవిక బోధ” జిల్లా సమావేశాల్ని ఏర్పాటుచేశాడు. ఈ నాలుగు దిన సమావేశములు ఇండియాలో 1993 సెప్టెంబరులో ఆరంభమౌతాయి. యెహోవాకు సమర్పించుకున్న ప్రతి సేవకుడు ఈ సమావేశాల్లో కనీసం ఒకదానికి నిశ్చయంగా హజరై, గురువారం మధ్యాహ్నం మొదలయ్యే పాట, ప్రార్థన దగ్గరనుండి ఆదివారం మధ్యాహ్నం ప్రార్థనతో ముగింపబడేంత వరకు శ్రద్ధతో వినేవాడై యుండాలి.