ఆమేన్—దాని భావము, వాడుక
ఇంగ్లీషులో, గ్రీకులో ఆమెన్ అనే పదం హెబ్రీపదమైన ఆమెన్ యొక్క ప్రతిలేఖనమై యుంది. దాని భావమేమంటే, “అట్లగును గాక,” లేదా “నిశ్చయంగా అలానే.” అది తీసుకొనబడిన హెబ్రీ మూల పదానికి (ఆమాన్) “విశ్వసనీయంగా ఉండు; నమ్మకంగా ఉండు” అనే భావమున్నది.
ఒక వ్యక్తిని ఒక ప్రమాణానికి లేదా నిబంధనకు మరియు దాని పరిణామాలకు చట్టబద్ధంగా బాధ్యున్ని చేయడానికి, (సంఖ్యాకాండము 5:22; ద్వితీయోపదేశకాండము 27:15-26; నెహెమ్యా 5:13) చేసిన ప్రార్థనను (1 దినవృత్తాంతములు 16:36), స్తుతిని (నెహెమ్యా 8:6), లేదా వ్యక్తపర్చబడిన సంకల్పమును (1 రాజులు 1:36; యిర్మీయా 11:5) స్థిరపరచుటకు హెబ్రీ లేఖనాల్లో ఈ పదం పవిత్ర భావంతో ఉపయోగింపబడింది. ప్రతి కీర్తన లేదా స్తుతిగీతపు ముగింపున ఇశ్రాయేలీయుల సమాజం ఏకంగా “ఆమెన్” అని పలకడాన్ని బహుశ సూచిస్తూ మొదటి నాలుగు స్కంధాలు లేదా సమకూర్చిన కీర్తనలు ఈ మాటతో ముగించబడ్డాయి.—కీర్తన 41:13; 72:19; 89:52: 106:48.
ఆ హెబ్రీ పదమగు ఆమాన్ “నమ్మదగిన దేవుడని” యెహోవాకు అన్వయించి (ద్వితీయోపదేశకాండము 7:9; యెషయా 49:7) ఆయనిచ్చే జ్ఞాపికలు, వాగ్దానాలు “నమ్మదగినవని” “విశ్వసనీయమైనవని” వర్ణించినది. (కీర్తన 19:7; 89:28, 37) క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “ఆమెన్” అనే బిరుదు “నమ్మకమైన సత్యసాక్షిగా” క్రీస్తు యేసుకు అన్వయింపబడినది. (ప్రకటన 3:14) తన ప్రకటన మరియు బోధనా పనిలో ఒక వాస్తవ విషయం, వాగ్దానం, లేదా ప్రవచనాన్ని గూర్చి తాను చెప్పినదాని నిశ్చయమైన సత్యవాదిత్వాన్ని, యథార్థతను చాటిచెప్పుటకు యేసు తరచు ఈ మాటను ఒకేమాటగా ప్రయోగించాడు. (మత్తయి 5:18: 6:2, 5, 16; 24:34) ఈ సందర్భాల్లో గ్రీకు పదమైన (ఆమెన్) “నిశ్చయముగా” (KJ, “నిజముగా”) లేదా యోహాను గ్రంథమంతటిలోవలె (యోహాను 1:51) రెండుసార్లు వచ్చినప్పుడు ‘మరి నిశ్చయముగా’ అని అనువదించబడింది. యేసు ఈ విధంగా “ఆమెన్” అని ఉపయోగించుట పవిత్ర సాహిత్యంలో ఉన్నతమైన విషయంగా చెప్పబడింది, కాగా ఇది ఆయనకు దేవుడిచ్చిన అధికారానికి పొందికగా ఉండింది.—మత్తయి 7:29.
అయితే, 2 కొరింథీయులు 1:19, 20లో పౌలు చూపినట్లుగా “ఆమెన్” అనే బిరుదు యేసుకు కేవలం సత్యం మాట్లాడువాడనే కాకుండ దేవుని నిజమైన ప్రవక్తని, దేవునికి బదులుగా మాట్లాడువాడని ఆలాగే దేవుని వాగ్దానాలన్నీ ఆయనయందే నెరవేర్పును కలిగియున్నవని కూడ అన్వయించును. బలిపూర్వక మరణం పర్యంతం ఆయన గడిపిన నమ్మకమైన, విధేయతతో కూడిన జీవితం దేవుని వాగ్దానాల్ని, ప్రకటనలన్నింటిని నిజం చేయడాన్ని స్థిరపరచి సాధ్యం చేసింది. దేవుడు వాగ్దానం చేసిన, దేవుని సంకల్పాల ప్రకటనలకు ఆయన సజీవ సత్యమై యుండెను.—యోహాను 1:14, 17; 14:6; 18:37 పోల్చండి.
లేఖల్లో ప్రత్యేకంగా పౌలు వ్రాసిన లేఖల్లో, రచయిత దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు (రోమీయులు 1:25; 16:27; ఎఫెసీయులు 3:21; 1 పేతురు 4:11) లేదా ఆ లేఖ అందుకున్న వారికి ఏదోవిధంగా దేవుని అనుగ్రహం కలగాలనే అభీష్టాన్ని వ్యక్తం చేసినప్పుడు “ఆమెన్” అనే మాట అనేకమార్లు ఉపయోగింపబడింది. (రోమీయులు 15:33; హెబ్రీయులు 13:20, 21) రచయిత వ్యక్తంచేసిన దానిని చిత్తశుద్ధితో నొక్కిచెప్పినప్పుడు కూడ అది ఉపయోగింపబడింది.—ప్రకటన 1:7; 22:20.
మొదటి దినవృత్తాంతములు 16:36లో మరియు కీర్తనల్లో (41:13; 72:19; 89:52; 106:48) వ్యక్తపరచబడిన ప్రార్థనలు ఆలాగే ధర్మశాస్త్ర లేఖల్లో వ్యక్తం చేయబడిన మాటలు ఆయా ప్రార్థనల ముగింపులో “ఆమెన్” సరిగా ఉపయోగింపబడడాన్ని సూచిస్తున్నవి. సొలొమోను విషయమై దావీదు చేసిన ముగింపు ప్రార్థన (1 దినవృత్తాంతములు 29:19) లేదా దేవాలయ ప్రారంభసమయంలో సొలొమోను చేసిన ప్రతిష్ఠిత ప్రార్థన (1 రాజులు 8:53-61) వంటివి సరిగా వ్యక్తంచేయబడినను, వ్రాయబడిన ప్రార్థనలన్నీ అలాంటి ముగింపును కలిగిలేవన్నది నిజం. (1 దినవృత్తాంతములు 29:20 గమనించండి.) అదేప్రకారం, యేసు ప్రార్థనల్లో (మత్తయి 26:39, 42; యోహాను 17:1-26) లేదా అపొస్తలుల కార్యములు 4:24-30లో శిష్యులు చేసిన ప్రార్థనయందు అది ఉపయోగింపబడినట్లు వ్రాయబడలేదు. అయితే, ముందు అందించబడిన రుజువు, ప్రార్థన ముగింపుయందు “ఆమెన్” అని ఉపయోగించడం సరియైనదేనని బలంగా సూచిస్తున్నది, ఆలాగే 1 కొరింథీయులు 14:16లో పౌలు చెప్పినమాట ప్రత్యేకంగా క్రైస్తవ సమావేశముగా ఏర్పడినవారు ప్రార్థనకు ఆమెన్ చెప్పడం ఆనవాయితిగా ఉండెనని చూపిస్తున్నది. అంతేకాకుండ, ప్రకటన 5:13, 14; 7:10-12; మరియు 19:1-4 వ్రాయబడినట్లు పరలోకమందలి ఉదాహరణలన్నియు ప్రార్థనలను లేదా ప్రవిత వాక్కులను స్థిరపరచుటకు దానిని ఉపయోగించడాన్ని, ఆ విధంగా ఈ ఒక్కమాటను ఉపయోగించుట ద్వారా నమ్మకానికి, బలమైన గుర్తింపుకు, వారి హృదయాల్లోవున్న నిజమైన నిరీక్షణకు గట్టి ఆధారాన్నిస్తున్నవి.