సమీప భవిష్యత్తులోని పరిశుభ్ర భూమియందు ఆనందించుము!
పరిశుభ్రతకు, క్రమమునకు దేవుడైన యెహోవా, ఈ భూమినంతటిని పరదైసుగా మార్చుటకు తన ఆది సంకల్పాన్ని నెరవేర్చుననుట మనకెంత సంతోషదాయకము! (యెషయా 11:6-9) ఆయనిట్లు వాగ్దానం చేశాడు: “నానోట నుండి వచ్చు వచనము . . . నిష్ఫలముగా నాయొద్దకు మరలక నేను పంపిన కార్యమును సఫలము చేయును.” “దేవుడు అబద్ధమాడజాలడు” గనుక అవి వట్టి మాటలు కావు.—యెషయా 55:11; హెబ్రీయులు 6:18.
జీవపర్యావరణాన్ని బాగుచేయలేనంతగా మానవులు పాడుచేయకముందే యెహోవా ప్రేమతో కలుగజేసుకొనుననుట మనకెంతగా ఉపశమనం కలుగజేస్తుంది!—ప్రకటన 11:18.
పశ్చాత్తాపపడని, విచక్షణ లేకుండ కాలుష్యం కల్గించే వారిని మరియు పరిశుభ్రత, క్రమముల కొరకైన తన సూత్రాలను తిరుగుబాటు ధోరణితో పెడచెవినబెట్టు వారిని యెహోవా నిర్మూలిస్తాడు. పునరుద్ధరింపబడిన పరదైసును చిక్కులబెట్టుటకు ఎవరును అనుమతింపబడరు.—సామెతలు 2:20-22.
మిగిలివున్న భౌతిక కాలుష్య కారకాలను ఎలా పెరికివేయాలో దేవుని రాజ్య పరిపాలనా కాలమందు, క్రీస్తుయేసు నడిపింపు క్రింద మానవులకు నేర్పబడుతుంది. ఇప్పుడు కాదు, ఆ పిమ్మట అసాధారణమైన భౌగోళిక పారిశుద్ధ కార్యక్రమమునకు దోహదపడుటకు దేవుని సేవకులందరు వ్యక్తిగతముగా మరియు సామూహికముగా చురుకుగ్గా పాల్గొనుట అవసరమౌతుంది.—యెహెజ్కేలు 39:8-16 పోల్చండి.
ప్రస్తుత విధానాంతము నుండి తప్పించుకొనువారు నేడు ఏ విధంగా ఆత్మీయ పరిశుభ్రపు పనిలో పాల్గొంటున్నారో అదే అంకిత భావంతో, ఉత్సాహంతో ఈ భౌతిక పారిశుద్ధ్య కార్యక్రమమునకు తమ మద్దతునిస్తారు.—కీర్తన 110:3.
క్రితమెన్నడూ లేనంతగా దేవుని రాజ్యము ద్వారా జరిగించబడు మహాగొప్ప పారిశుద్ధ్య పనిద్వారా పరిశుభ్రపరచబడిన భూమి తయారుకావడం తథ్యం. కాలుష్యపు ప్రతి ఆనవాళ్లన్నీ నిర్మూలించబడతాయి. ఎక్కడా ఎలాంటి రాతలు గోడలపై కన్పించవు. ఏ సముద్ర తీరంలో లేదా ఉద్యానవన ప్రాంతాల్లో పారేసిన సీసాలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, చూయింగ్ గమ్, చాక్లెట్ల పేపర్లు, వార్తాపత్రికల మరియు పత్రికల చిత్తు కాగితాలు చిందరవందరగా పడివుండవు.
రాబోవు పరిశుభ్ర భూమిని గూర్చి ఆనందించుము!
[7వ పేజీలోని చిత్రం]
త్వరలో జరుగనైయున్న భౌగోళిక పారిశుధ్య పనియందు నీవునూ పాల్గొందువా?