కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 5/1 పేజీ 30
  • పొగాకు మరియు మతాధికారులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పొగాకు మరియు మతాధికారులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • పొగాకు నైతికతా?
    తేజరిల్లు!—1992
  • పొగాకు ప్రతివాదుల మాటలు నీటిమూటలు
    తేజరిల్లు!—1995
  • పొగతాగడం తప్పా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • పొగాకు కంపెనీలు అగ్నిజ్వాలల్లో చిక్కుకున్నాయి
    తేజరిల్లు!—1996
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 5/1 పేజీ 30

పొగాకు మరియు మతాధికారులు

జాన్‌ కోవన్‌ అనే వైద్యుడు, 115 సంవత్సరాల క్రితం ది యూజ్‌ ఆఫ్‌ టొబాకో వర్సెస్‌ ప్యూరిటీ, చేస్టిటీ అండ్‌ సౌండ్‌ హెల్త్‌ అనే శీర్షికతో ఒక పుస్తకాన్ని వ్రాశాడు. పొగాకు ఉపయోగం వల్ల వచ్చే ప్రమాదకరమైన పరిణామాలను గూర్చి ఈ మధ్య సంవత్సరాలలో కనుగొనిన విషయాల దృష్ట్యా, ఈనాడు ఎవరైనా దేవున్ని సేవించుటకు ప్రయత్నించుచున్న వారికి మతాధికారుల పొగాకు ఉపయోగంపై ఇతని పరిశీలనలు ఎంతో ఉచితమైనవి మరియు ముందు జాగ్రత్తగలవి. నాల్గవ అధ్యాయంలో, పొగాకు నైతిక ప్రభావాన్ని గురించి డా. కోవన్‌ ఇలా వ్యాఖ్యానించాడు:

స్పష్టంగా చూపబడినట్టు—“ఒకవేళ పొగాకు ఉపయోగం శారీరకంగా తప్పైతే—అది ఆవశ్యకంగా నైతికంగా కూడా తప్పై యుండాలి; ఎందుకంటే, శరీరాన్ని భ్రష్టపరచునది లేక ఉద్వేగపరచేదేదైనా, నాడీ మండలాన్ని దాని నుండి మెదడును, ఆపై మనస్సును భ్రష్టపరచుననేది శరీర ధర్మం. ఒక మనిషి తన శారీరక స్వభావం సరిగ్గా ఉపయోగించుటవల్ల లేదా దుర్వినియోగ పరచుటవల్ల అతని మనస్సు అంటే అతని ఆలోచనలు, అతని భావాలు, అతని క్రియలు ప్రభావితం చెందుతాయి. పొగాకు, దాని పేరును తీరును, అలవాట్లను బట్టి, మలినకరమైనది, మరి అది చేసే హానిని పరిగణించక పోయినను దానివల్ల ఎలా మనస్సులో శుభ్రమైన, స్వచ్ఛమైన, సరైన, నైతిక భావాలు మరియు క్రియలు ఆరంభముకాగలవు లేక అభివృద్ధి చెందగలవు. క్రీస్తు, భూమిపై తన ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతు అంటే స్వచ్ఛత, పవిత్రత, ప్రేమ మరియు ధాతృత్వాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ,—పొగత్రాగి, నశ్యంపీల్చి పొగాకు నమిలితే ఆ సంగతి ఎలా ఉండేది. అట్టి తలంపే ధర్మోల్లంఘనగా లేదా? అయినను పరిచారకులు అంటే ఆయన సిద్ధాంతాలను ధర్మశాస్త్రాలను ప్రతిపాదించేవారు, అనుచరులు, ప్రచారకులు,—దుర్గంధంతో, విషపూరితమైన కలుపు మొక్కలవల్ల తమ శరీరాలను మలినపరచు కొంటూ ఆత్మలను కళంకం చేసుకొంటున్నారు. అట్టి మనుష్యులు, లేక వారి అనుచరులు, క్రీస్తు వంటి ఉన్నతమైన, నైతిక జీవితాన్ని జీవించగలరా? లేదని నేననుకుంటున్నాను.

“ఒక తిండిబోతు, ఒక త్రాగుబోతు, లేక పొగాకునుపయోగించే వాడిలో ఆత్మశుద్ధి ఉన్నట్లు నీవు ఊహించగలవేమో. ప్రయత్నించు? ఆ ఆలోచనలలో వీటికి విరుద్థంగా, అస్వభావికంగా, విసుగు పుట్టించేదేదో ఉంది. శరీర పరిస్థితి మరియు బాహ్య స్పర్శేంద్రియాలు దెబ్బతిన్నట్లే, ఆంతరంగిక వ్యక్తిత్వం, నైతిక స్వభావం కూడ దెబ్బతింటుంది. స్వచ్ఛమైన ఆత్మ మలినమైన స్థలంలో నివసించదు, నివసించలేదు. భౌతిక విషయాలకు మరియు ఆత్మీయ విషయాలకు మధ్య స్వాభావిక సాదృశ్యం కలదు, అందువలననే ఒకదాని గుణలక్షణాలు మరొకదాని గుణాన్ని తెలియజేస్తాయి. ఒక మత బోధకుడు, పొగాకుకు దాసుడై . . . అతడు పొగాకు ఉపయోగం హానికరమైన అలవాటని, నైతికంగా తప్పని అందరి ఎదుట ఎంతో సరళంగా నిష్కపటంగా ఒప్పుకొనవచ్చు; అయినను అతడు తనలో ఒక ఉద్వేగాన్ని కనుగొంటాడు. ఆ ఉద్వేగం కృత్రిమంగా ఉత్పత్తి చేయబడి, తన శరీర అవయవాలలోని నియమంగా మారి, సంతృప్తిలేని వ్యామోహంతో అట్టి అలవాటులో కొనసాగమని అతన్ని పురికొల్పుతుంది. మరియు అతని సహజతర్కం మరియు మనస్సాక్షి ఏకమైనా ఈ కృత్రిమ ధర్మమే బలంగా ఉంటుంది. పొగాకు ఉపయోగం మన శరీరాలలో నాటుకుపోయిన దేవుని ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా అతిక్రమించినట్టు కాదా? దేవుని ధర్మశాస్త్రంలో దేన్నైనా ఉల్లంఘించడం అపరాధం మరియు పాపం కాదా? ఒక వ్యక్తి దేవుని ధర్మశాస్త్రాలలో ఒక దానిని వాడుకగా అతిక్రమిస్తే, ఇతర శాసనాలను అతిక్రమించుటకు అట్టి పరివర్తన సులభం మరియు స్వాభావికం కాదా? ఆఖరుగా, ఒక వ్యక్తి తన ప్రవర్తన ద్వారా తోటి మానవులకు తమ శరీరాలపట్ల ఎడతెగక అపరాధం చేయుటను సిఫారసు చేయుచు, ఒక నైతిక బోధకునిగా ఎట్లుండగలడు?”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి