కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 1/1 పేజీలు 18-23
  • మన మహోన్నత సృష్టికర్తతో కలిసి మందను కాయుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మన మహోన్నత సృష్టికర్తతో కలిసి మందను కాయుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాయొక్క సహకాపరి
  • “దేవుని సమాధానము” ననుభవించుట
  • ఉపకాపరులు ముందుండాలి!
  • దైవపరిపాలన ప్రకారం మందను కాయుట
  • యెహోవా నియమించిన కాపరులకు లోబడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • యెహోవా అమూల్యమైన గొర్రెలను మృదువుగా కాయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • కాపరులారా, మహాగొప్ప కాపరులను అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • క్రైస్తవ కాపరులారా, ‘మీ హృదయాలను విశాలపర్చుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 1/1 పేజీలు 18-23

మన మహోన్నత సృష్టికర్తతో కలిసి మందను కాయుట

“యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు.”—కీర్తన 23:1, 3.

1. యెహోవా ప్రేమగల ఎటువంటి ఉపశమనాన్ని దయచేస్తున్నాడు?

“దావీదు కీర్తనయగు” 23వ కీర్తన అలసిన అనేక ఆత్మలకు ఉపశమనాన్ని కలుగజేసింది. ఆరవ వచనంలో వ్యక్తపరచిన నమ్మకాన్ని కలిగియుండుటకు అది వారిని ప్రోత్సహించినది: “నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.” ప్రపంచమందలి అన్ని దేశాలనుండి ఇప్పుడు సమకూర్చబడుచున్న ప్రజలతో ఏకమై, యెహోవా ఆరాధనా మందిరంలో ఎల్లకాలము ఉండాలని నీవును కోరుచున్నావా? “మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును,” మన మహోన్నత సృష్టికర్తయగు యెహోవా దేవుడు ఆ గమ్యాన్ని చేరుటకు నీకు సహాయం చేస్తాడు.—1 పేతురు 2:25.

2, 3. (ఎ) యెహోవా ప్రేమపూర్వకంగా ఎట్లు తన ప్రజలను కాయుచున్నాడు? (బి) యెహోవా “మంద” నాటకీయముగా ఎట్లు వృద్ధియైనది?

2 “క్రొత్త ఆకాశములు . . . క్రొత్త భూమికి” సృష్టికర్తయైన వాడు, “దేవుని మందిరమైన” క్రైస్తవ సంఘానికి కూడ వ్యవస్థాపకుడును సర్వోన్నత అధ్యక్షుడునై యున్నాడు. (2 పేతురు 3:13; 1 తిమోతి 3:15) “ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్ద నున్నది. ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. గొఱ్ఱెల కాపరివలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును” అని యెషయా 40:10, 11 స్పష్టంగా చెప్పునట్లు ఆయన తన ప్రజలను కాయుటలో మిక్కిలి శ్రద్ధను కలిగి యున్నాడు.

3 విశాల భావమందు ఈ “మంద” లోను క్రైస్తవ సత్యమందు దీర్ఘకాలంగా ఉన్నవారు ఆలాగే ఆఫ్రికా, తూర్పు ఐరోపాలలో ప్రస్తుతం అధిక సంఖ్యలో బాప్తిస్మం పొందుతున్నవారు—అంటే ఇటీవలి కాలంలో సమకూర్చబడుతున్న “గొఱ్ఱెపిల్లల” వంటివారును ఉన్నారు. యెహోవా బలమైన, రక్షిత బాహువు వారిని తన రొమ్మున చేర్చుచున్నది. వారు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నను, వారిప్పుడు తమ ప్రేమగల దేవుడును, కాపరియునైన వానితో సన్నిహిత సంబంధంలోనికి వచ్చారు.

యెహోవాయొక్క సహకాపరి

4, 5. (ఎ) “గొఱ్ఱెల మంచికాపరి” ఎవరు, ప్రవచనమెట్లు ఆయనను సూచిస్తున్నది? (బి) వేరుచేయు ఎటువంటి పనిని యేసు పర్యవేక్షిస్తున్నాడు, దాని అసాధారణ ఫలితమేమి?

4 పరలోకంలో తన తండ్రి కుడిపార్శ్వమున సేవచేస్తూ, “గొఱ్ఱెల మంచి కాపరియైన” యేసుక్రీస్తు కూడ “గొఱ్ఱెలకు” కనికరంతో కూడిన శ్రద్ధనిస్తున్నాడు. మొదట అభిషక్తులైన “చిన్నమందకు” ఆ తర్వాత తన “వేరే గొఱ్ఱెలగు” నేటి గొప్పసమూహము యొక్క ప్రయోజనార్థమై ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. (లూకా 12:32; యోహాను 10:14, 16) మహాగొప్ప బోధకుడైన యెహోవా దేవుడు సమస్త గొర్రెలనుద్దేశించి యిలా చెప్పుచున్నాడు: “ఇదిగో నేను నేనే . . . గొఱ్ఱెలకును . . . గొఱ్ఱెలకును మధ్య . . . తీర్పు తీర్చుదును. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.”—యెహెజ్కేలు 34:20-24.

5 “నా సేవకుడైన దావీదు” అను బిరుదు, ప్రవచనార్థకముగా దావీదు సింహాసనమును స్వతంత్రించుకొను “సంతానమైన” యేసుక్రీస్తును సూచిస్తున్నది. (కీర్తన 89:35, 36) జనాంగములకు తీర్పుతీర్చు ఈ కాలమున, యెహోవా సహ కాపరియు, రాజు అయిన దావీదు కుమారుడగు క్రీస్తు యేసు, నిజానికి “మేకలై” యుండి “గొఱ్ఱెలు” అని చెప్పుకుంటున్న వారినుండి “గొఱ్ఱెల” వంటి మనుష్యులను వేరుచేస్తున్నాడు. (మత్తయి 25:31-33) గొర్రెలను మేపుటకు సహితం ఈ “కాపరి” నియమించబడ్డాడు. ఈ ప్రవచనము యొక్క ఎంతటి గొప్ప నెరవేర్పును నేడు మనం చూస్తున్నాము! ఒక నూతన ప్రపంచ క్రమం ద్వారా మానవజాతిని ఐక్యపరుస్తామని రాజకీయ నాయకులు మాట్లాడుతుండగా ఈ కాపరి ప్రపంచములో కేవలం దేవుని సంస్థమాత్రమే చేపట్టగల వివిధ భాషల సాక్ష్యపు ప్రచార దండయాత్ర ద్వారా సమస్త దేశాల్లోని గొర్రెలను వాస్తవంగా ఐక్యపరుస్తున్నాడు.

6, 7. “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు” గొర్రెలకు “తగినవేళ ఆహారము” అందుబాటులో ఉండునట్లు ఎలాచేస్తున్నాడు?

6 రాజ్య వర్తమానం నిర్విరామంగా క్రొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండగా, ఆ కాపరిచే ఆజ్ఞాపించబడిన అభిషక్త క్రైస్తవులైన “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు,” “తగినవేళ ఆహారం” అందించడానికి ప్రతి విధమైన యేర్పాటును చేస్తున్నాడు. (మత్తయి 24:45) ప్రపంచవ్యాప్తంగా వాచ్‌టవర్‌ సొసైటికున్న 33 ముద్రణా బ్రాంచి కార్యాలయాలలో అనేకం మరిన్ని మంచి బైబిలు పాఠ్యపుస్తకాలు, పత్రికల కొరకు పెరుగుచున్న డిమాండును తట్టుకోవడానికి తగినట్లు ఉత్పత్తి ఏర్పాట్లు చేస్తున్నవి.

7 దాదాపు 200 భాషలలో అనువాద నాణ్యతను మెరుగుపరచడానికి మరియు యావత్‌ ప్రపంచంలో సేవచేయడానికి అవసరమయ్యే అదనపు భాషలలోనికి అనువదించుట మొదలు పెట్టడానికి యెహోవాసాక్షుల పరిపాలక సభ సకల ప్రయత్నాలు చేస్తున్నది. అపొ. కార్యములు 1:8 నందు యేసు తన శిష్యులకిచ్చిన ఆజ్ఞకు యిది మద్దతుగా ఉన్నది: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు . . . భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” అంతేకాకుండా, ఇప్పటికే పూర్తిగా లేక పాక్షికంగా 14 భాషలలో అనువదించబడిన న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ది హోలీ స్క్రిప్చర్స్‌ ప్రస్తుతం ఐరోపా, ఆఫ్రికా, తూర్పు దేశాలకు చెందిన మరో 16 భాషలలోనికి అనువదించబడుతున్నది.

“దేవుని సమాధానము” ననుభవించుట

8. గొర్రెలతో యెహోవా చేసిన సమానార్థ నిబంధన ద్వారా వారెట్లు బహుగా ఆశీర్వదించబడిరి?

8 యెహోవా తన కాపరియగు క్రీస్తు యేసు ద్వారా, బాగుగా మేపబడుతున్న తన గొర్రెలతో “సమాధానవిషయమైన . . . నిబంధన” చేస్తున్నాడు. (యెషయా 54:10) చిందింపబడిన యేసు రక్తమందు విశ్వాసముంచుట ద్వారా, ఆ గొర్రెలు వెలుగులో నడువగల్గుచున్నారు. (1 యోహాను 1:7) ‘క్రీస్తు యేసు వలన వారి హృదయాలకు, తలంపులకు కావలిగావుండే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును’ వారనుభవిస్తున్నారు. (ఫిలిప్పీయులు 4:7) యెహెజ్కేలు 34:25-28 యింకను వివరిస్తున్నట్లుగా, యెహోవా తన గొర్రెలను ఆత్మీయ పరదైసులో సురక్షితంగాను, ఫలభరితంగాను వర్ధిల్లజేస్తున్నాడు. తన గొర్రెలను గూర్చి ఈ ప్రేమగల కాపరి యిలా చెప్పుచున్నాడు: “నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, . . . ఎవరివలనను భయములేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.”

9. ‘కాడికట్లు’ తెంపబడుటతో దేవుని ప్రజలకు ఎలాంటి ఆశీర్వాదములు తెరువబడ్డాయి?

9 ఇటీవల సంవత్సరాలలో, అనేక దేశాల్లో యెహోవాసాక్షులు ఇప్పటికే “వారి కాడికట్లు” తెంపబడుటను చవిచూశారు. మునుపెన్నడూలేనంత ప్రకటించే స్వేచ్ఛను వారు పొందారు. పనిని తుదముట్టించుటకు మనం కదంత్రొక్కి ముందుకు సాగుచుండగా, ప్రతిదేశంలోనున్న మనమంతా యెహోవా మనకు దయచేస్తున్న భద్రతను బాగుగా ఉపయోగించుకుందాం. మానవజాతి క్రితమెన్నడు చూడని మహాశ్రమల కాలాన్ని మనం సమీపిస్తుండగా యెహోవా ఎంతటి అభయాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు!—దానియేలు 12:1; మత్తయి 24:21, 22.

10. మంచి కాపరియగు, క్రీస్తు యేసుకు సహాయం చేయడానికి యెహోవా ఎవరిని దయచేశాడు, వీరిలో కొందరిని అపొస్తలుడైన పౌలు ఎలా సంబోధించాడు?

10 దుష్టులపై పగతీర్చుకునే దినానికి యెహోవా సిద్ధపడుతూ, మందయెడల శ్రద్ధచూపుటలో మంచి కాపరియగు క్రీస్తు యేసు సహాయార్థమై ఆయన ఉపకాపరులను దయచేశాడు. వీరు ప్రకటన 1:16లో సంపూర్ణ సంఖ్యగా యేసు కుడిచేతిలోని “ఏడు నక్షత్రములుగా” వర్ణింపబడ్డారు. మొదటి శతాబ్దములో ఈ ఉపకాపరుల ప్రతినిధి బృందాన్ని సంబోధిస్తూ అపొస్తలుడైన పౌలు యిలా చెప్పాడు: “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.” (అపొ. కార్యములు 20:28) ఈనాడు, ప్రపంచ వ్యాప్తంగా 69,558 సంఘాలలో వేలాదిమంది ఉపకాపరులు సేవచేస్తున్నారు.

ఉపకాపరులు ముందుండాలి!

11. తరచు సేవచేసిన ప్రాంతాలలో కొంతమంది కాపరులు ఎలా విజయవంతంగా నాయకత్వం వహించారు?

11 ఈ అంత్యదినాలలో పలుమార్లు సేవచేయబడిన ప్రాంతాలలో ఈ కాపరులు నడిపింపు తీసుకోవాలి. మందయొక్క ఉత్సాహాన్ని వారెట్లు ఉన్నత స్థాయినందుంచగలరు? కాపరులు బహుగా మెచ్చుకునే రీతిలో సేవచేస్తున్నారు, మరియు వారు విజయం సాధించిన మార్గాల్లో ఒకటేమనగా, సహాయ, క్రమ పయినీరు సేవను ప్రోత్సహించుటే. అనేకమంది కాపరులు తాముగా ఈ సేవలో భాగము వహించారు, కాగా అలా సేవ చేయలేని ప్రచారకులు సహితం సేవాప్రాంతంలో కనబడే ఉదాసీనతను అధిగమించుటకు సహాయపడే ఆనందముతో సేవచేస్తూ పయినీర్‌ స్ఫూర్తిని ప్రదర్శించారు. (కీర్తన 100:2; 104:33, 34; ఫిలిప్పీయులు 4:4, 5) ఆ విధంగా, దుష్టత్వం, అరాచకత్వం లోకాన్ని ముంచివేస్తుండగా, గొర్రెవంటి ప్రజలనేకమంది రాజ్య నిరీక్షణయెడల జాగృతం చేయబడుతున్నారు.—మత్తయి 12:18, 21; రోమీయులు 15:12.

12. అత్యంత వేగంగా వృద్ధియగుచున్న ప్రాంతాలలో ఏ గంభీరమైన సమస్య ఉంది, కొన్నిసార్లు యిది ఎలా పరిష్కరించబడుతుంది?

12 మరొక సమస్యేమంటే మందను కాయుటకు అర్హులైన కాపరులు తరచు తగినంతమంది ఉండుటలేదు. తూర్పు ఐరోపాలో జరుగుతున్నట్లుగా వేగంగా అభివృద్ధినొందుతున్న ప్రాంతాలలో అనేక క్రొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి వాటికి నియమిత పెద్దలులేరు. ఇష్టతచూపే గొర్రెలు ఆ భారాన్ని మోస్తున్నారు, అయితే వారికి బొత్తిగా అనుభవం లేనందున, సంఘాలలోనికి వస్తున్న గొర్రెలకు శిక్షణ యివ్వడానికి వారికి సహాయం అవసరం. అభివృద్ధి అమిత వేగంగా జరుగుతున్న బ్రెజిల్‌, మెక్సికో, జైరివంటి దేశాలలో సేవను వ్యవస్థీకరించుటకు, క్రొత్తగావచ్చిన ఇతరులకు శిక్షణనిచ్చేందుకు యువకులుగానున్న సాక్షులనే ఉపయోగించాల్సివస్తుంది. పయినీర్లు ఉత్తమమైన సహాయాన్నిస్తున్నారు, ఈ ప్రాంతంలో సహోదరీలు కొత్త సహోదరీలకు శిక్షణనిస్తున్నారు. యెహోవా తన ఆత్మచే ఫలితాల్ని ఆశీర్వదిస్తున్నాడు. అభివృద్ధి అలా కొనసాగుచునే యున్నది.—యెషయా 54:2, 3.

13. (ఎ) కోత విస్తారముగా ఉంది గనుక, సాక్షులందరు దేనికొరకు ప్రార్థించాలి? (బి) రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు మరియు యుద్ధకాలంలోను దేవుని ప్రజల ప్రార్థనకెట్లు సమాధానం దొరికింది?

13 ప్రకటించు పని బాగుగా జరుగుచున్న దేశాల్లో, ఇటీవలనే నిషేధాలు ఎత్తివేసిన దేశాల్లో ఆలాగే క్రొత్తగా సేవ ప్రారంభించిన దేశాల్లో మత్తయి 9:37, 38లో యేసు పలికిన మాటలు యింకను వర్తించును: “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.” ఎక్కువమంది కాపరులను యెహోవా దయచేయవలెనని కూడ మనం ప్రార్థించాలి. తానలా చేయగలడని ఆయన ప్రదర్శించాడు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు మరియు ఆ యుద్ధకాలంలో కౄరులైన అష్షూరీయులను పోలిన నిరంకుశులు యెహోవాసాక్షులను నాశనం చేయాలని ప్రయత్నించారు. అయితే వారి ప్రార్థనలకు జవాబుగా, యెహోవా వారి సంస్థను శుద్ధిచేసి, దానిని నిజముగా దైవ పాలనా సంస్థగా తీర్చిదిద్ది, అవసరమైన “గొఱ్ఱెలకాపరులను” అనుగ్రహించాడు.a ఇది యీ ప్రవచనానుసారముగా ఉన్నది: “అష్షూరు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వాని నెదిరించుటకు మేము ఏడుగురు గొఱ్ఱెలకాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమింతుము”—నాయకత్వం వహించడానికి కావల్సినదానికంటే ఎక్కువమంది సమర్పిత పెద్దలు అనుగ్రహింపబడ్డారు.—మీకా 5:5.

14. సంస్థలో ఎటువంటి అసాధారణమైన అవసరత ఉంది, సహోదరులకు ఎలాంటి ప్రోత్సాహమివ్వబడింది?

14 బాప్తిస్మం పొందిన పురుషులైన సాక్షులందరు మరిన్ని ఆధిక్యతలకు అర్హులగు గొప్ప అవసరత కలదు. (1 తిమోతి 3:1) అత్యవసర పరిస్థితి నెలకొనియున్నది. ఈ విధానాంతము వేగంగా సమీపిస్తున్నది. హబక్కూకు 2:3 యిలా చెప్పుచున్నది: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, . . . అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” సహోదరులారా, అంతం రాకముందే మందనుకాసే ఈ పనియందలి మరిన్ని ఆధిక్యతల కొరకు అర్హులగుటకై మీరు ముందుకు రాగలరా?—తీతు 1:6-9.

దైవపరిపాలన ప్రకారం మందను కాయుట

15. యెహోవా ప్రజలు ఏ విధంగా దైవపరిపాలన పద్ధతిగా ఉన్నారు?

15 యెహోవా సంస్థయొక్క విస్తరణయందు సంపూర్ణంగా భాగము వహించుటకు గాను, ఆయన ప్రజలు తమ నిర్వహణకు దైవపరిపాలనా దృష్టిని కలిగియుండాలి. దీనిని వారెట్లు నెరవేర్చగలరు? సరే, “దైవపరిపాలన” అనే మాటకు అర్థమేమిటి? వెబ్‌స్టర్స్‌ న్యూ ట్వెంటియత్‌ సెంచరీ డిక్షనరీ “దైవపరిపాలన” అనగా “దేవునిచే పరిపాలింపబడే దేశమని” నిర్వచిస్తున్నది. ఈ భావమందు యెహోవా ప్రజల “పరిశుద్ధ జనము” దైవపరిపాలనా సంబంధమైనది. (1 పేతురు 2:9; యెషయా 33:22) ఆ దైవపరిపాలనా జనాంగమందలి సభ్యులుగా లేదా సహవాసులుగా, నిజమైన క్రైస్తవులు దేవుని వాక్యానికి, దాని సూత్రాలకు లోబడి జీవిస్తూ సేవచేయాలి.

16. ప్రాథమికంగా మనం దైవపరిపాలనా సంబంధులమని మనమెట్లు చూపించుకొనగలము?

16 క్రైస్తవులెట్లు దైవపరిపాలనా సంబంధులై ఉండాలో అపొస్తలుడైన పౌలు స్పష్టముగా వివరిస్తున్నాడు. మొదట, వారు “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనని” ఆయన చెప్పుచున్నాడు. క్రైస్తవుని వ్యక్తిత్వం, దేవుని వాక్యంలో ప్రస్తావించబడిన ఆయన నీతి సూత్రాల కనుగుణ్యంగా మలచబడినదై యుండాలి. అతడు యెహోవాకు, ఆయన నియమాలకు విధేయుడై యుండాలి. ఇది ఎలా చేయవచ్చునో ఉదహరించిన తర్వాత, పౌలు యిలా ఉద్భోదిస్తున్నాడు: “ప్రియులైన పిల్లలవలె దేవునినిపోలి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 4:24–5:1) విధేయులైన పిల్లలవలె, మనం దేవున్ని అనుకరించాలి. మనం నిజంగా దేవునిచే నడిపించబడుతున్నామని చూపిస్తే అది నిజమైన క్రియాత్మక దైవపరిపాలనయై యుంటుంది.—కొలొస్సయులు 3:10, 12-14 కూడ చూడండి.

17, 18. (ఎ) దైవపరిపాలనా పద్ధతిగల క్రైస్తవులు దేవుని ఏ అసాధారణ లక్షణాన్ని అనుకరిస్తారు? (బి) మోషేకు చెప్పిన మాటలయందు యెహోవా ఎలా తన ప్రాథమిక లక్షణాన్ని నొక్కితెల్పాడు, అయితే ఆయన ఎలాంటి హెచ్చరికను కూడా జోడించాడు?

17 మనమనుకరించగల దేవుని ముఖ్యలక్షణమేమిటి? అపొస్తలుడైన యోహాను దానికి 1 యోహాను 4:8లో జవాబిస్తూ యిలా అంటున్నాడు: “దేవుడు ప్రేమాస్వరూపి.” ఎనిమిది వచనాల తర్వాత అనగా 16వ వచనంలో ఆయన ఈ అవశ్యకమైన సూత్రాన్ని పునరుక్తిస్తున్నాడు: “దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు; ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.” మహాగొప్ప కాపరియగు యెహోవా ప్రేమకే మూర్తిమంతమై యున్నాడు. యెహోవా గొర్రెలయెడల ప్రగాఢ ప్రేమను చూపిస్తూ దైవపరిపాలనా కాపరులు ఆయనను అనుకరిస్తారు.—1 యోహాను 3:16, 18, 4:7-11లను పోల్చండి.

18 మహాగొప్ప దైవపాలకుడు తనకుతానుగా మోషేకు యిలా బయల్పరచుకున్నాడు: “యెహోవా కనికరము, దయ దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించును.” (నిర్గమకాండము 34:6, 7) అవసరమైనప్పుడు దోషులను శిక్షిస్తానని స్థిరంగా హెచ్చరిస్తూనే, యెహోవా ఆ విధంగా తన అసమానమైన దైవపరిపాలనా లక్షణమగు ప్రేమయొక్క వివిధ ముఖరూపములను నొక్కితెల్పుచున్నాడు.

19. పరిసయ్యులకు భిన్నమైన రీతిలో, క్రైస్తవ కాపరులెట్లు దైవపరిపాలనా రీతిలో ప్రవర్తిస్తారు?

19 సంస్థలో బాధ్యతాయుత స్థానమందున్న వారు దైవపరిపాలన ప్రకారం ఉండవలెనంటే అర్థమేమి? తన కాలమందలి శాస్త్రులు, పరిసయ్యులను గూర్చి యేసు యిలా చెప్పాడు: “మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు.” (మత్తయి 23:4) అదెంత కఠినం, ప్రేమలేనితనం! అనంతమైన మానవ కల్పిత నియమాలతో మందపై భారము మోపుటద్వారా కాక, బైబిలుయొక్క ప్రేమపూర్వక సూత్రాలను అన్వయించుట ద్వారా మందను కాయవలెనని నిజమైన దైవపరిపాలన లేదా దేవుని పరిపాలన కోరుచున్నది. (మత్తయి 15:1-9 పోల్చుము.) అదే సమయంలో, సంఘ పరిశుభ్రతను కాపాడుటకు తమ ప్రేమకు స్థిరత్వాన్ని జోడించుట ద్వారా దైవపరిపాలనా కాపరులు దేవుని అనుకరించాలి.—పోల్చుము రోమీయులు 2:11; 1 పేతురు 1:17.

20. దైవపరిపాలనా పద్ధతిగల కాపరులు సంస్థాపరమైన ఏ యేర్పాట్లను గుర్తిస్తారు?

20 ఈ అంత్యదినాలలో యేసు తన యావదాస్తిపై నమ్మకమును బుద్ధిమంతుడైన దాసుని నియమించాడని, మందను కాయుటకు పెద్దలను నియమించడానికి పరిశుద్ధాత్మ ఈ దాసున్ని నడిపించినదని నిజమైన కాపరులు గుర్తిస్తారు. (మత్తయి 24:3, 47; అపొ. కార్యములు 20:28) కాబట్టి, దైవపరిపాలనా ప్రకారం ఉండడంలో ఈ దాసునియెడల, ఆ దాసుడు ఏర్పాటుచేసిన సంస్థాపరమైన ఏర్పాట్లయెడల, సంఘమందలి పెద్దల ఏర్పాటుయెడల మిక్కిలి గౌరవం కలిగియుండుట యిమిడియున్నది.—హెబ్రీయులు 13:7, 17.

21. ఉపకాపరులకు యేసు ఏ శ్రేష్ఠమైన మాదిరినుంచాడు?

21 నడిపింపు కొరకు అన్నివేళలా యెహోవావైపు, ఆయన వాక్యంవైపు చూడడం ద్వారా యేసు తానుగా ఒక శ్రేష్ఠమైన మాదిరినుంచాడు. ఆయనిట్లన్నాడు: “నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాడు. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.” (యోహాను 5:30) ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉపకాపరులు కూడ అటువంటి దీన స్వభావాన్నే పెంపొందించుకోవాలి. నడిపింపు కొరకు ఒక పెద్ద అన్ని సమయాలలో యేసు చేసినట్లుగానే దేవుని వాక్యాన్ని సంప్రదిస్తే అతడు నిజంగా దైవపరిపాలనా సంబంధియై యుంటాడు.—మత్తయి 4:1-11; యోహాను 6:38.

22. (ఎ) ఏ విధంగా అందరూ దైవపరిపాలనా సంబంధులై యుండుటకు కృషిచేయాలి? (బి) గొర్రెలకు యేసు ఏ దయాపూర్వక ఆహ్వానమిచ్చాడు?

22 బాప్తిస్మం పొందిన పురుషులారా, సంఘమందలి ఆధిక్యతలకు అర్హులగుటకు ముందడుగు వేయండి! ప్రియమైన గొర్రెలారా, మీరంతా ప్రేమ చూపుటలో దేవున్ని, క్రీస్తును అనుకరిస్తూ దైవపరిపాలనా సంబంధులై యుండుడి. యేసు యిచ్చిన ఈ ఆహ్వానానికి ప్రత్యుత్తరమిచ్చినందున కాపరులు, మంద ఒకే విధంగా ఆనందింతురు గాక. “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.”—మత్తయి 11:28-30. (w93 1/1)

[అధస్సూచీలు]

a జూన్‌ 1 మరియు 15, 1938 వాచ్‌టవర్‌ సంచికలలో “ఆర్గనైజేషన్‌,” అను పేరుతో వచ్చిన శీర్షికలను చూడండి.

మీరు వివరించగలరా?

◻ యెహోవా “మంద” ఏమిటి, దానిలో ఎవరు చేరియున్నారు?

◻ “గొఱ్ఱెల మంచికాపరిగా” యేసు మొదటి శతాబ్దంలోను, నేడును ఎలా పనిచేశాడు?

◻ మందయెడల శ్రద్ధచూపుటలో ఉపకాపరులు ఏ కీలకపాత్ర వహిస్తారు?

◻ “దైవపరిపాలన” అనే పదంయొక్క అసలు భావమేమి?

◻ ఒక క్రైస్తవుడు—ప్రత్యేకంగా ఒక ఉపకాపరి—దైవపరిపాలనా సంబంధుడై యుండుటకు ఎలా ప్రవర్తించాలి?

[20వ పేజీలోని చిత్రం]

అంకిత భావంగల కాపరిగా యెహోవా తన మందయెడల శ్రద్ధ వహిస్తాడు

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా దేవుని లక్షణమగు ప్రేమను అనుకరించుటే దైవపరిపాలనను క్రియాత్మకంగా ఉంచుట

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి