కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 1/1 పేజీలు 5-8
  • నూతనసృష్టి బయల్పరచబడెను!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నూతనసృష్టి బయల్పరచబడెను!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి’ యొక్క సృష్టి
  • క్రొత్త ఆకాశము క్రొత్త భూమి
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రవచించినట్లుగా సమస్తమూ నూతనమైనవిగా చేయటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • దేవుడు వాగ్దానం చేసిన నూతనలోకం
    అప్రమత్తంగా ఉండండి!
  • పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని సమకూర్చడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 1/1 పేజీలు 5-8

నూతనసృష్టి బయల్పరచబడెను!

జ్ఞానియైన సొలొమోను రాజు ఒకసారి యిలా అన్నాడు: “సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.” (ప్రసంగి 1:9) మనం నివసించే భౌతిక ప్రపంచం విషయంలో అది సత్యమే, కాని యెహోవా ఆత్మీయ సృష్టికి సంబంధించి సామ్రాజ్య విశాలత విషయమేమి? ఆ సామ్రాజ్యంలో సొలొమోనుకంటె గొప్పవాడు, అవును జీవించిన వారిలోకెల్ల మహాగొప్ప మనిషి ఒక అసాధారణ నూతనసృష్టిగా అయ్యాడు. ఇదెలా జరిగింది?

మన సామాన్య శకం 29వ సంవత్సరంలో పరిపూర్ణ మానవుడైన యేసు యొర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరువబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” (మత్తయి 3:16, 17) ఆ విధంగా, క్రీస్తు యేసను నరుడు దేవుని చిత్తం చేయడానికి అభిషేకించబడి నూతనసృష్టిలో మొదటివాడయ్యాడు. ఆ తర్వాత, తన బలియాగ మరణం ద్వారా, దేవునికి, మనుష్యులలో నుండి ఎంపికచేయబడిన గుంపుకు యేసు మధ్యవర్తి అయ్యాడు. వీరిలో ప్రతిఒక్కరు పరలోక రాజ్యమందు యేసుతోకూడ పరిపాలించు ఉత్తరాపేక్షతో పరలోక నిరీక్షణకు దేవుని ఆత్మద్వారా జన్మించినవారై “నూతన సృష్టిగా” తయారైరి.—2 కొరింథీయులు 5:17; 1 తిమోతి 2:5, 6; హెబ్రీయులు 9:15.

ఆత్మద్వారా జన్మించిన అభిషక్త క్రైస్తవులు, నూతన సృష్టిగావుండే నిజమైన క్రైస్తవ సంఘముగా క్రీస్తునందు ఏకమగుటకై శతాబ్దాలుగా సమకూర్చబడిరి. “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు” అని అపొస్తలుడైన పేతురు చెప్పినట్లుగా ఒక సంకల్పము నిమిత్తం దేవుడు దానిని ఈ లోకంనుండి పిలిచాడు. (1 పేతురు 2:9) దేవుని మొదటి నూతనసృష్టియైన క్రీస్తు యేసువలెనే, ఆ తదుపరి వచ్చిన ఈ నూతనసృష్టికి కూడ సువార్త ప్రకటించే ప్రాథమిక బాధ్యత ఉన్నది. (లూకా 4:18, 19) చివరకు 1,44,000 మందిగా తయారగు దాని సభ్యులంతా వ్యక్తిగతంగా, “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.” (ఎఫెసీయులు 4:24; ప్రకటన 14:1, 3) దీనికొరకు వారు గలతీయులు 5:22, 23లో వివరింపబడిన “ఆత్మ ఫలాలను” పెంపొందించుకొని, వారి గృహనిర్వాహకత్వమును నమ్మకముగా కాపాడుకొనవలెను.—1 కొరింథీయులు 4:2; 9:16.

ఆధునిక కాలములలో ఈ నూతనసృష్టి సంగతి ఏమయింది? బైబిలు యొక్క కాలపట్టిక చూపించునట్లుగా, 1914వ సంవత్సరములో ప్రకటన 11:15 నందలి మాటలు నెరవేరెను: “ఈ లోక రాజ్యము మన ప్రభువు [యెహోవా] రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలును.” నూతనముగా నియమించబడిన రాజుగా క్రీస్తుచేసిన మొదటి చర్య ఏమనగా, ఆయన సాతానును, అతని దయ్యములను పరలోకమునుండి భూపరిధికి పడద్రోసెను. ఇది మొదటి ప్రపంచ యుద్ధము, దాని అనుబంధ దురవస్థల రూపమున “భూమికి . . . శ్రమ” తీసుకొచ్చెను.—ప్రకటన 12:9, 12, 17.

భూమిపైనున్న నూతనసృష్టిలోని శేషింపబడిన వారు, “[స్థాపించబడిన] ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చునని” యేసుచెప్పిన ప్రవచన నెరవేర్పులో భాగము వహించాలని ఇది వారికొక హెచ్చరికగా కూడ పనిచేసింది. ఆ “అంతం” ఏమిటి? యేసు ఇంకను యిలా వివరించాడు: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.”—మత్తయి 24:3-14, 21, 22.

ఈ భూమిపై క్రితమెన్నడూ జరుగనంత విస్తారముగా ప్రకటించే పనిలో పనిరద్దీ కలిగియుండుటకు నూతనసృష్టిలోని అభిషక్తులను యెహోవా ఆత్మ పురికొల్పింది. ఆసక్తితో 1919లో రాజ్యాన్ని ప్రకటించే ఆ కొద్దివేలమంది 1930వ దశాబ్దపు మధ్యకాలం నాటికి 50,000 లకు పెరిగారు. ప్రవచింపబడినట్లుగా, “వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను.”—రోమీయులు 10:18.

రక్షింపబడుటకు కేవలము నూతన సృష్టియందలి మిగులు సభ్యులు మాత్రమే సమకూర్చబడుదురా? లేదు, ఎందుకంటే పరలోకానికి చెందిన ఆత్మీయ ఇశ్రాయేలీయులు మాత్రమే కాదుగాని, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక్క గొప్పసమూహానికి” చెందిన ఇతరులు కూడ సమకూర్చబడు పర్యంతము దేవదూతలు మహాశ్రమలనే వాయువులు పట్టుకొనియుందురని కూడ ప్రవచనము తెలియజేసింది. వారికేమి లభిస్తుంది? పరదైసు భూమిపై నిత్యజీవము ననుభవించుటకు వారు నిరపాయముగా “మహాశ్రమలనుండి” బయటకు వస్తారు.—ప్రకటన 7:1-4, 9, 14.

సంతోషదాయకముగా, 229 దేశాలనుండి సమకూర్చబడిన ఈ గొప్పసమూహము దాదాపు 45,00,000 మంది చురుకైన సాక్షులుగా విస్తరించారు. పోయిన సంవత్సరం ఏప్రిల్‌ 17న జరిగిన యేసు మరణ జ్ఞాపకార్థ దినానికి హాజరైన 1,14,31,171 మంది సూచిస్తున్నట్లు, ఇంకా అనేకులు వస్తున్నారు. ఈ లక్షలాదిమందిలో కేవలము 8,683 మంది మాత్రమే జ్ఞాపకార్థ చిహ్నములలో పాలుపంచుకుంటూ నూతనసృష్టి యొక్క మిగుల సభ్యులుగా ఉన్నారు. ఈ చిన్న గుంపుకు చెందిన వారే స్వయంగా ఈనాటి విస్తారమైన ప్రకటన పనిని ఏనాటికి నెరవేర్చలేకపోయేవారు. ఈ పనిని జరిగించుటలో గొప్పసమూహముగా తయారైన ఈ లక్షలాదిమంది వీరితో తమ భుజాలుకలిపి పనిచేస్తున్నారు. (జెఫన్యా 3:9) అంతేకాదు, యెరూషలేము ప్రాకారములను బాగుచేయుటలో యాజకులతో కలిసి పనిచేసిన ఇశ్రాయేలీయులుకాని నెతీనీయులవలె, గొప్పసమూహములో బహుగా శిక్షణనొందిన సభ్యులు ఆత్మీయ ఇశ్రాయేలీయుల అభిషక్త పరిపాలక సభతోపాటు ఇప్పుడు పరిపాలక మరియు ఇతర బాధ్యతాయుతమైన పనులను చేస్తున్నారు.—నెహెమ్యా 3:22-26.

‘క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి’ యొక్క సృష్టి

ఈ సమకూర్పుతో ఎట్టి ఆనందం చేకూరుతుంది! అది యిలా వుండునని యెహోవా సెలవిచ్చినట్లే జరుగుతున్నది: “ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిగూర్చి మీరు ఎల్లప్పుడు హర్షించి ఆనందించుడి, నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను నా జనులను గూర్చి హర్షించెదను. రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు.” (యెషయా 65:17-19) యేసుక్రీస్తు మరియు గత 19 శతాబ్దాలుగా మానవజాతి నుండి కొనబడిన నూతనసృష్టి యొక్క పునరుత్థాన సభ్యులైన 1,44,000 మందిచే చివరకు యెహోవా సృజించు ఆ క్రొత్త ఆకాశము తయారగును. సొలొమోను కాలముతోసహా, యెరూషలేమునందు పరిపాలించిన భూసంబంధమైన ఏ ప్రభుత్వముకంటెనూ అది అత్యంత మహిమగలదై యుండును. ప్రకటన 21వ అధ్యాయములో అత్యంత శోభాయమానముగా వర్ణింపబడిన పరలోక పట్టణమగు నూతన యెరూషలేమునది స్థిరపరస్తుంది.

నూతన యెరూషలేమనగా, మరణించి, ఆత్మీయముగా పునరుత్థానమై పరలోకములో పెండ్లికుమారుని చేరుకునే క్రీస్తుయొక్క ఆత్మీయ పెండ్లి కుమార్తెయగు 1,44,000 మంది అభిషక్త అనుచరులే. “పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చిరని” అనగా ఈ భూమిపైనున్న మానవజాతికి ఆశీర్వాదములనిచ్చుటలో ఆయనచే ఉపయోగింపబడుదురని ప్రకటన 21:1-4లో వారు చిత్రీకరింపబడిరి. ఆ విధంగా ఈ ప్రవచనం నెరవేరును: “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”

దేవుని సృష్టియగు ఆ క్రొత్త ఆకాశం విషయమై మనమెంతగా కృతజ్ఞులమై యుండగలము! మానవజాతిని ఇప్పటివరకు పట్టిపీడించిన తాత్కాలిక, అవినీతికర మానవ పరిపాలనలకు భిన్నంగా, దేవుడుచేసిన ఈ ప్రభుత్వ ఏర్పాటు శాశ్వతమై యుండును. ఆ నూతన సృష్టి, వారి ఆత్మీయ సంతానమగు గొప్ప సమూహము అదనంగా దేవుడుచేసిన ఈ వాగ్దానమందు ఉల్లసింతురు: “నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును ఇదే యెహోవా వాక్కు.”—యెషయా 66:22.

“క్రొత్త భూమి” నూతనసృష్టియగు అభిషక్తుల ఈ సంతతితో ఆరంభమగును. ఇది భూమి మీదనున్న క్రొత్త, దైవభక్తిగల మానవ సమాజమై యున్నది. నేటి మానవ సమాజమందలి ద్వేషము, నేరము, హింస, అవినీతి మరియు లైంగిక దుర్నీతియంతా, ప్రయోజనమిచ్చు క్రొత్త ఆకాశంయొక్క నడిపింపు క్రింద పనిచేయు క్రొత్త భూసమాజముగా పూర్తి మార్పుచెందవలసిన అవసరతను నిశ్చయముగా నొక్కితెల్పుచున్నవి. యెహోవా దానినే సంకల్పించాడు. క్రొత్త ఆకాశమును సృజించినట్లుగానే, “మహాశ్రమలనుండి” కాపాడబడి, భూమిని నింపుటకు విస్తరించే సమాధానకర నూతనలోక సమాజపు కేంద్రబిందువుగా ఒక గొప్పసమూహాన్ని సమకూర్చుట ద్వారా ఆయన క్రొత్త భూమిని సృజిస్తున్నాడు.—ప్రకటన 7:14.

మహాశ్రమల తర్వాత ఏమి జరుగునని మనమపేక్షించ గలము? క్రొత్త భూమిని పరిపాలించు క్రొత్త ఆకాశముగా తయారుకాగల తొలి సభ్యులగు తన అపొస్తలులతో మాట్లాడుచు, యేసు యిలా వాగ్దానం చేశాడు: “(ప్రపంచ) పునర్జననమందు మనుష్యకుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనముల మీద ఆసీనులై యుందురు” (మత్తయి 19:28) ఈ నూతన యెరూషలేము నందలి 1,44,000 మంది మానవజాతికి తీర్పుతీర్చుటలో యేసుతో భాగము వహిస్తారు. స్వార్థం, ద్వేషం స్థానంలో ప్రేమ నెలకొనగా దానిపైనే మానవ సమాజం నిర్మించబడుతుంది. జాతి, తెగ మరియు దేశీయ సమస్యలు నిర్మూలించబడతాయి. పునరుత్థానం క్రమేణ ప్రియులైన వారిని జీవానికి తెస్తుంది. కోట్లసంఖ్యలోవుండే నమ్మకమైన మానవజాతి ఒక పెద్ద ఐక్య కుటుంబముగా తయారై పరదైసుగా మార్చబడిన భూమిపై నిత్యజీవమనుభవించుటకు పునరుద్ధించబడుతుంది.

ఇది ఊహాజనిత లోకం లేక ఆదర్శలోకం కంటే ఎంతో ఉన్నతమైనదై ఉంటుంది. అది శాశ్వతమైన సృష్టియైయుంటుంది అనగా, “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:13) నిశ్చయముగా, ఇది ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఉత్తరాపేక్ష మరియు మహిమాన్వితమైన వాగ్దానమైయుంది. ఆయనిట్లన్నాడు: “ఇదిగో సమస్తమును నూతమైనవిగా చేయుచున్నాను.” విశ్వాసాన్ని పురికొల్పే విధంగా ఆయనింకా యిలా అన్నాడు: “ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి.”—ప్రకటన 21:5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి