కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 7/1 పేజీలు 3-4
  • ఆలకించుటకు మనకు ఎవరో ఒకరు అవసరము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆలకించుటకు మనకు ఎవరో ఒకరు అవసరము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • “మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 7/1 పేజీలు 3-4

ఆలకించుటకు మనకు ఎవరో ఒకరు అవసరము

మానవులుగా మనము జీవితములో సంతోషమును, సంతృప్తిని కనుగొనుటకు ప్రయత్నింతుము. అయితే వ్యక్తిగత సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, మన కష్టాలనుగూర్చి చెప్పుకొనుటకు ఎవరైనా ఉంటే అది ఎంత సహాయకరముగా మరియు ఓదార్పుకరముగా ఉండును!

డా. జార్జి స్టీవెన్‌సన్‌ ఇట్లనుచున్నాడు: “బయటకు చెప్పుకొనుట మీ బాధను తగ్గించుటకు సహాయపడును, మీ చింతను స్పష్టముగా చూచుకొనుటకు సహాయపడును, దానినిగూర్చి మీరేమి చేయవలెనో చూచుటకు తరచు అది మీకు సహాయము చేయును.” డా. రోజ్‌ హిల్‌ఫ్రెర్‌డిన్‌, “మన కష్టాలను మనమందరము పంచుకోవాలి. చింతను మనము పంచుకోవాలి. ప్రపంచములో వినుటకు ఇష్టపడు మరియు అర్థము చేసికొనగల వారు ఎవరో ఒకరున్నారని మనము భావించాలి” అని అభిప్రాయపడెను.

ఏ మానవుడును ఈ అవసరతను సంపూర్ణముగా తీర్చలేడు. సమయాభావం మరియు ఇతర వాస్తవాలనుబట్టి, మనకు అత్యవసర మున్నప్పుడు తోటి మిత్రులు అందుబాటులో లేకపోవచ్చును, లేక మనము మన అత్యంత సన్నిహితులతో కొన్ని విషయాలను చర్చించుటకు వెనుకాడవచ్చును.

అయితే, నిజమైన క్రైస్తవులు తమమొర నాలకించువాడు పూర్తిగా లేకుండా ఎన్నడూ ఉండరు, ఏలయనగా ప్రార్థనా మార్గం అన్ని సమయాలలోను అందుబాటులో ఉన్నది. యెహోవా అను నామముగల మన సృష్టికర్తయగు దేవునికి ప్రార్థించుమని, బైబిలు పదేపదే ప్రోత్సహించుచున్నది. చిత్తశుద్ధితో, యేసు నామమున మరియు దేవుని చిత్తానుసారముగా ప్రార్థించవలెనని మనము నిర్దేశించబడ్డాము. వ్యక్తిగత మరియు రహస్యమైన స్వంత విషయాలు సహితం ప్రార్థనకు సరియైన అంశములే. “ప్రతి విషయములోను . . . మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని మనము ఫిలిప్పీయులు 4:6లో చెప్పబడియున్నాము. ఎంత అద్భుతమైన బహుమానం! దీనులైన తన సేవకులు తామెప్పుడు కోరితే అప్పుడు తనను సమీపించి చేయు ప్రార్థనలను స్వాగతించుటకు మన విశ్వ సార్వభౌమ పరిపాలకుడు అన్ని సమయములలో సిద్ధముగా ఉన్నాడు.—కీర్తన 83:18; మత్తయి 6:9-15; యోహాను 14:13, 14; 1 యోహాను; 5:14.

కానీ, దేవుడు నిజముగా ఆలకించునా? ప్రార్థనా సఫలత మానవ సామర్థ్యతకు పరిమితమై యుండునేమోయని కొందరు ఆశ్చర్యపడవచ్చును: ఒక వ్యక్తి తన ఆలోచలనుకూర్చి మాటలలో వాటిని వ్యక్తంచేస్తూ ప్రార్థిస్తాడు. ఆ విధముగా తన సమస్యను వివరించిన మీదట, అతడు సరియైన పరిష్కారాన్ని వెదకి, దానిని కనుగొనుటకు దోహదపడు సమస్తమును చేయుటలో అప్రమత్తుడై ఉంటాడు. తన సమస్య పరిష్కరింపబడినప్పుడు, అతడు దేవుని స్తుతిస్తాడు, అయితే నిజానికి అతడు కోరిన ఫలితాలను తెచ్చినది అతని మనస్సు మరియు కృషియే.

నిజానికి ప్రార్థనకున్న యావత్తు ఇదే అని ఈనాడు అనేకమంది తలంచుదురు. మరి మీరు? ప్రార్థనాశక్తి ఆ విధముగా పరిమితమేనా? నిజమే, ఒకవ్యక్తి మానసిక శారీరక ప్రయత్నాలు, అతడు చేసిన ప్రార్థనలకు అనుగుణ్యముగా ఉండుటలోను, ప్రత్యుత్తరము పొందుటలోను ప్రాముఖ్యమైన పాత్ర వహించును. అయితే, ఈ విషయమందు దేవుని స్వంత పాత్ర ఏమైయున్నది? దేవునికి నీవు ప్రార్థించునప్పుడు ఆయన ఆలకించునా? మీ ప్రార్థనలు ప్రాముఖ్యమని లెక్కించి, అందలి విషయాలకు అవధానమిస్తూ ఆయన వాటికి ప్రత్యుత్తరమిచ్చునా?

ఈ ప్రశ్నలకు సమాధానములు ప్రాముఖ్యము. దేవుడు మన ప్రార్థనలకు అట్టి ధ్యానమివ్వనట్లయిన, ఆ ప్రార్థనకు మానసిక విలువకంటే ఎక్కువేమీ లేదు. మరొకవైపున, మన ప్రతి ప్రార్థనను దేవుడు స్వీకరించి, వాటిని శ్రద్ధతో విన్నట్లయిన, అటువంటి ఏర్పాటు విషయమై మనమెంతగా కృతజ్ఞులమై యుండవలెను! ప్రతి దినము ఆ ఏర్పాటును సద్వినియోగము చేసికొనుటకు అది మనలను కదిలించవలెను.

కాబట్టి, ఈ అంశములు తర్వాతి శీర్షికలో ప్రస్తావించబడినందున, వాటిని మీరు చదువవలెనని మేము మిమ్మును ఆహ్వానించుచున్నాము. (w92 4/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి