మీకు జ్ఞాపకమున్నవా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి వాటిని గుణగ్రహించారా? అయితే, ఈ క్రింది ప్రశ్నలకు మీరు సమాధానములు చెప్పగలరేమో చూడండి:
◻ వెలివేయబడిన కొంతమంది వ్యక్తులు పశ్చాత్తాపము పొందులాగున కదలింపబడుదురేమో అని చూచుటకై వారిని కలిసికొనుటలో చొరవతీసికొనుటకు ఆత్మీయ కాపరులకు ఏ ఆధారమున్నది?
ఇశ్రాయేలీయులు చెరలో ఉండి పశ్చాత్తాపము నొందకముందు కూడా ఒక కాపరివలె యెహోవా వారిని వెదకుటలో చొరవతీసికొని వారియొద్దకు తన ప్రవక్తలను పంపాడు. క్రైస్తవ కాపరులు తప్పిపోయిన గొర్రెలవలె పశ్చాత్తాపమునొందిన వారికి సహాయముచేయుటలో శ్రద్ధకలిగియున్నారు. (లూకా 15:4-7 ను పోల్చుము.)—2/1, పుటలు 17-19.
◻ క్రైస్తవ సంఘములోకి ఒకరు తిరిగి చేర్చుకొనబడినప్పుడు మన భావములు, క్రియలు ఏమైయుండాలో యేసు యొక్క తప్పిపోయిన కుమారుని దృష్టాంతము ఎట్లు చూపుతుంది? (లూకా 15:22-32)
తప్పిపోయిన తన కుమారుడు తిరిగివచ్చినప్పుడు సంతోషమును కనపరచిన తండ్రిని అనుకరించుట మన గురియైయుండవలెను. కాబట్టి తిరిగి చేర్చుకొనబడిన సహోదరునితో మనము స్వేచ్ఛగా మాట్లాడి, ఇప్పుడు సత్యములో అభివృద్ధిచేసికొనమని ప్రోత్సహించవలెను.—2/1, పుట 21.
◻ జెఫన్యా 2:3 నందలి ప్రవచనము “యెహోవా ఉగ్రత దినమున ఒకవేళ మీరు తప్పించబడునట్లు” అని ఎందుకు చెప్పుచున్నది?
జీవమునకు రక్షించబడుట అనేది నమ్మకత్వము, సహనముపై ఆధారపడియున్నది. (మత్తయి 24:13) కావున ఎవరైతే దేవుని నీతియుక్తమైన ప్రమాణములకు కట్టుబడియుండి స్వచ్ఛమైన భాషను మాట్లాడుతూ ఉంటారో అట్టివారు మాత్రమే యెహోవా ఉగ్రత దినమున దాచబడుదురు. (జెఫన్యా 2:1, 2)—5/1, పుట 21.
◻ ఆభరణములు మరియు అలంకరణను ఉపయోగించుటనుగూర్చి క్రైస్తవ స్త్రీలు దేనిని మనస్సునందుంచుకొనవలెను?
అందమునకు దోహదపడు అట్టి ఉపకరణములను బైబిలు నిషేధించుట లేదు. (నిర్గమకాండము 32:2, 3; ఎస్తేరు 2:7, 12, 15) అయితే అణకువ ఉండవలెను. ఒక స్త్రీ సులభంగా యెజెబెలువలె అతిగా పెదాలకు, చెంపలకు రంగు పూసుకొనుట, కనుబొమలు దిద్దుట మొదలగువాటిద్వారా లోక విధానమును అనుకరించు అవకాశము కలదు. (2 రాజులు 9:30) కావున పరిమళ ద్రవ్యములను అతి విస్తారంగా పూసుకొనుట లేక వేసికొన్న ఆభరణములు విపరీత ధోరణిని ప్రదర్శించటంగాని లేకుండా జాగ్రత్తపడవలెను.—2/1, పుటలు 30-1.
◻ యేసుయొక్క ఏ బోధనా పద్ధతులు తమ పిల్లలకు బోధించుటలో తల్లిదండ్రులు ఫలవంతమైన వాటిగా కనుగొన్నారు?
క్రైస్తవ తల్లిదండ్రులు బాలురైన తమ పిల్లలకు క్రైస్తవ సత్యములు ఆసక్తికరంగా ఉండునట్లు దృష్టాంతములను ఉపయోగించవచ్చును. పెద్దవారైన తమ పిల్లలు నిజంగా ఏమి తలస్తున్నారని వివేచించుటకు మంచి ఆలోచనతో కూడిన ప్రశ్నలను వారు ఉపయోగించవచ్చును. (మత్తయి 17:24-27 పోల్చుము.)—5/1, పుట 30.
◻ మత్తయి 5:8లో చెప్పబడినట్లు “హృదయ శుద్ధిగలవారు” ఎట్లు “దేవుని చూచెదరు”?
యథార్థతను కాపాడుకొనువారి పక్షముగా దేవుడు పనిచేయుట గమనించుటద్వారా వారు “దేవుని చూచెదరు.” (నిర్గమకాండము 33:20; యోబు 19:26; 42:5 పోల్చుము.) ఏమైనను, మత్తయి 5:8లో “చూచుట” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదమునకు “మనస్సుతో చూచుట, వివేచించుట, తెలిసికొనుట” అను అర్థములు కూడ ఉన్నవి. యేసు పరిపూర్ణంగా దేవుని వ్యక్తిత్వమును ప్రతిబింబించినందున, ఆ వ్యక్తిత్వముయెడల గల లోతైన వివేచన “హృదయ శుద్ధిగలవారు” “దేవుని చూచు”నట్లు చేసెను.—(యోహాను 14:7-9)—3/1, పుట 11.
◻ జ్ఞాపకార్థ చిహ్నములలో కొందరెందుకు అయుక్తంగా పాలుపుచ్చుకొనియున్నారు?
ఇంక పరిపక్వతకెదగని కొందరు దేవుని సంకల్పములను గూర్చిన సమతూకమైన మెప్పును కలిగియుండకపోవచ్చును. “పొందగోరువానివలననైనను, ప్రయాస పడువాని వలననైనను కాదుగాని, కరుణించు దేవునివలననే” ఈ అభిషేకము జరుగుతుందని వారు బహుశా ఒప్పుకొనకపోవచ్చును. (రోమీయులు 9:16) క్రొత్త నిబంధనలోకి తీసికొనబడి క్రీస్తుతోపాటు సహవారసులగుటను నిర్ణయించేది అతడు లేక ఆమె కాదు. యెహోవా ఎన్నికయే ముఖ్యమైనది, ఆ ఎన్నికకు ఆయన ఆత్మయే సాక్ష్యమిచ్చును. (రోమీయులు 8:16; 1 కొరింథీయులు 12:18)—3/1, పుట 29.
◻ జెఫన్యా 3:9లో మాట్లాడబడిన “స్వచ్ఛమైన భాష” (NW) ఏమి?
దేవుడు మరియు ఆయన సంకల్పములనుగూర్చిన సత్యముయొక్క సరైన గ్రహింపు.—3/1, పుటలు 22-3.
◻ నేరమునకు బలికాకుండుటకై ఆచరణాత్మకమైన ఏ ముందు జాగ్రత్తలను తీసికొనవచ్చును?
సాధ్యమైనంత వరకు రాత్రిసమయమందు అపాయకరమైన స్థలములలో ఉండవద్దు. నీ ఆభరణములను బహిరంగముగా ప్రదర్శించవద్దు. కెమెరా మొదలగు వస్తువులను మీ దుకాణపు సంచిలో పెట్టుకొనండి. మీరు బ్రీఫ్‌కేసును, లేక సంచిని పట్టుకొని వెళ్లునప్పుడు దారిప్రక్కగా నడిచే మార్గంలో ఒక అంచున నడిచేవిషయంలో జాగ్రత్తగా ఉండండి. (సామెతలు 3:21-23 చూడుము.) 2/1, పుటలు 5-6.