రాజ్య ప్రచారకుల నివేదిక
పరాగ్వేలో ప్రత్యేకంగావున్న ప్రాంతములో పనిచేయుట ఫలితాన్నిస్తుంది
తమ ప్రాంతాలన్నింటిలో రాజ్యసువార్తను ప్రకటించు అవసరత విషయమై వాచ్‌టవర్ సొసైటి పరాగ్వే బ్రాంచి పూర్తి అప్రమత్తతో ఉంది. (అపొ. కార్యములు 1:8) రానైయున్న “మహాశ్రమలలో” ఈ దుష్ట విధానమునకు యెహోవా అంతము తీసుకురాకముందు సమస్త ప్రజలు రాజ్యమునుగూర్చి నేర్చుకొనుటకు మరియు ఆయనను సేవించుటకు సమయము ఇదే. (మత్తయి 24:21, 22) సంఘాలకు నియమించబడని ప్రాంతములలో ప్రజలకు సహాయపడేందుకు ఏమిచేయబడుచున్నదో క్రింది అనుభవము చూపుచున్నది. బ్రాంచి నివేదిక ఇలావుంది:
తాత్కాలిక ప్రత్యేక పయినీర్లద్వారా ప్రత్యేకంగావున్న సమస్త ప్రాంతములో పనిచేయుటకు ఏర్పాట్లుచేయబడినవి. 1990వ సేవా సంవత్సరమందలి నవంబరు నుండి జనవరి వరకున్న నెలలలో, ఇంతవరకు రాజ్యప్రచారకులు లేని వంద నగరాలు మరియు చిన్న పట్టణాలలో 39 మంది సహోదర సహోదరీలు పనిచేశారు. వారు 6,119 పుస్తకాలను, 4,262 చిన్న పుస్తకాలను మరియు 5,144 పత్రికలను అందించగలిగారు. ఈ పని ఫలితంగా ప్రచారకుల క్రొత్తగుంపులు ఏర్పడుచున్నవి.
◻ నియమించబడని ప్రాంతములో పనిచేయుచున్న ఒక పయినీరు సహోదరి ఒక స్త్రీకి మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను పుస్తకాన్ని ఇచ్చింది. ఆ పయినీరు ఆమెతో బైబిలు పఠనం చేస్తానని చెప్పినప్పుడు ఆమె దానికి సంతోషంగా ఒప్పుకుంది. పయినీరు తిరిగివచ్చినప్పుడు, అక్కడ ఆ స్త్రీయే గాకుండా ఆమె భర్త, వారి పదిమంది పిల్లలుకూడా ఉన్నారు. ఆ తర్వాతి సందర్శనమప్పుడు, ఆ కుటుంబము వారి స్నేహితులు, పొరుగువారుకూడా బైబిలు పఠనమునకు సిద్ధముగా ఉన్నారు! పఠనము చాలాబాగుంది, యెహోవా అనుగ్రహించు నిరీక్షణ మరియు ఆశీర్వాదములు అద్భుతమని చెప్పి ఆ స్త్రీయే వారిని ఆహ్వానించింది. ఈ సంగతి ఇంతకుముందు ఆమెకు ఎవరూ ఎప్పుడు చెప్పలేదు, కావున ఈ సువార్త తన పొరుగువారు మరియు స్నేహితులుకూడా వినవలెనని ఆమె భావించింది.
పయినీరు పఠనము చేసిన ప్రతిసారి, ఒక చిన్న సంఘంలా కన్పించేంతమంది అక్కడ హాజరయ్యేవారు. ఆసక్తిగల ఈ వ్యక్తులందరు అనేక ప్రశ్నలడిగి పఠనమందు భాగము వహించేవారు. ఈ ప్రాంతములో ఒకసారి పనిచేసిన తర్వాత తన తోటివారితో మరొక క్రొత్త ప్రాంతమునకు తాను వెళ్లవలసియుండునని ఆ పయినీరు చెప్పినప్పుడు, ఆ స్త్రీ ఎంతో బాధపడుతూ తమ సంగతి ఏమగునని అడిగింది. ఆ పఠనమును కొనసాగించుటకు వారికి దగ్గరలోగల సంఘమందలి సహోదరులతో ఏర్పాట్లు చేయబడెను. ఈ ఆసక్తిగల, గొర్రెవంటి ప్రజలకు సహాయము చేయుటకు ఇప్పుడు అక్కడ ప్రత్యేక పయినీర్లు నియమించబడ్డారు.
◻ నియమించబడని మరొక ప్రాంతములో ఇంటింటి సేవకు వెళ్లుచుండగా, ఒక పయినీరు సహోదరి పది సంవత్సరాల క్రితమే నిత్య జీవమునకు నడుపు సత్యము అను పుస్తకమును సంపాదించిన ఒక మనుష్యుని కలిసికొనెను. అప్పటినుండి అతడు యెహోవాసాక్షులతో సంబంధాన్ని కోల్పోయాడు. అయితే సైన్యముల కధిపతియగు యెహోవా అని తాను పిలిచిన, యెహోవా మాత్రమే సత్య దేవుడని ఆయనను మాత్రమే ఆరాధించాలని అతనికి తెలుసు. తనంతట తానే చొరవ తీసికొని, తనకు తెలిసిన ప్రతివారితో యెహోవాను గూర్చి మాట్లాడుచుండెను. నిజానికి, అతడు దేవుని గూర్చి మాట్లాడుటకు ప్రతివారము 3 కిలోమీటర్లు నడిచివెళ్లి ఆసక్తిగల ఒక జంటను సందర్శించేవాడు. ఎందుకనగా ఆయన ఇలా అనేవాడు, ‘నేను సందర్శించడాన్ని మానుకుంటే, వారు యెహోవాను గూర్చి మరచిపోతారు.’ ఈ వివాహిత జంటకు తోడుగా, బైబిలు పఠనమును కోరినవారు అక్కడ ఇంకనూ పదిమంది వున్నారు—ఇదంతా ఈ ఆసక్తిగల వ్యక్తి వారికి ప్రచారము చేసినందున కలిగినదే.
మరివిశేషంగా, పయినీరు ఆయనను కలిసికొనుటకు కొద్దిదినముల ముందు, అదే వ్యక్తి తనకు విగ్రహాలలో నమ్మకంలేదని వివరిస్తూ, కన్యక ప్రతిమతో స్థానిక మతగురువును, అతని ఊరేగింపును తన ఇంట ప్రవేశించుటకు అనుమతించలేదు. దానికి ఆ మతగురువుకు ఎంతో కోపంవచ్చింది. ఆ రాత్రే సహాయము కొరకు ఆ వ్యక్తి యెహోవాకు ప్రార్థించాడు. కావున పయినీరు ఆయనను సందర్శించినప్పుడు అతడెంతగా సంతోషించి ఉప్పొంగెనో ఊహించుము! వెంటనే ఒక క్రమపద్ధతిలో బైబిలు పఠనమునకు ఏర్పాట్లు చేయబడెను, మరియు ఆ వ్యక్తి దైవపరిపాలనా సంస్థ సహవాసమందు అభివృద్ధినొందుచునే ఉన్నాడు.
ఈ నియమించబడని ప్రాంతాలలో సమగ్రముగా సాక్ష్యమిచ్చేందుకు సహోదరులు కృషిచేయుచుండగా, పరాగ్వేలో సమకూర్చు పనిని యెహోవా నిజముగా ఆశీర్వదించుచున్నాడు.—మత్తయి 24:14. (w92 4/15)