కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w93 3/15 పేజీ 31
  • పురుషుని కర్తవ్యము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పురుషుని కర్తవ్యము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • పిల్లలపై వారికి అవసరమైన శ్రద్ధ చూపించడం
    తేజరిల్లు!—2005
  • మీ యింటివారి రక్షణకొరకు కష్టించి పనిచేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • దేవుని క్రమశిక్షణలో పిల్లలను పెంచడం
    తేజరిల్లు!—2005
  • దేవుని సేవలో ఐక్యమైయున్న పెద్ద కుటుంబాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
w93 3/15 పేజీ 31

పురుషుని కర్తవ్యము

రోపా, జాపాటో, కాసా, ఎ కోమెడా! ఈ మాటలు పురుషుడు తన కుటుంబానికి అందించాల్సిన నాలుగు ప్రాథమిక అవసరాలను పేర్కొన్న ఒక ప్రాచీన స్పానీష్‌ పాటలోనుండి తీసుకొనబడ్డాయి. అవేవనగా తన కుటుంబానికి అవసరమైన వస్త్రాలు, చెప్పులు, నివాసం, మరియు ఆహారం. అత్యంత బాధ్యతాయుతమైన పురుషులు ఆ భారాన్ని మోయడానికి సగర్వంగా కృషిసల్పుతారు.

అయిననూ, నీవు కుటుంబాన్ని కల్గియున్న పురుషుడవైతే, నీ కుటుంబానికున్న అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయావసరతలయెడల నీవు శ్రద్ధవహిస్తున్నావా? ఇంటిలో మతపరమైన విషయాలకు శ్రద్ధవహించుట నిజంగా పురుషుని కర్తవ్యము కాదని తలంచే అనేకులవలె నీవును ఉన్నావా? కొన్ని సంస్క్రతులలో తన పిల్లలకు దేవునిగూర్చి బైబిలునుగూర్చి ఉపదేశించుటకు సమయం తీసుకోవడం కూడా పురుషుని కర్తవ్యముగా పరిగణించబడుటలేదు.

ముఖ్యంగా గృహ యజమానియైన పురుషునికి తన కుటుంబమందున్న వారిలో దేవునియెడల ప్రేమ, దైవిక నియమాలయెడల ప్రగాఢ గౌరవాన్ని నాటే బాధ్యతను దేవుని వాక్యము అతనిపై మోపుచున్నది. దృష్టాంతానికి, ఎఫెసీయులు 6:4 నందు క్రైస్తవ పురుషులకు లేఖనమిలా ఉపదేశిస్తున్నది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.”

కొందరికి ఈ మాటలతో పరిచయమున్నప్పటికిని, ఈ లేఖనము నిర్దిష్టంగా గృహయజమానియైన తండ్రికి నిర్దేశించబడినవని సంపూర్ణంగా గుణగ్రహించలేక పోతున్నారు. ఉదాహరణకు, స్పానిష్‌ పోర్చుగీస్‌ మాట్లాడు ప్రజలు ఎఫెసీయులు 6:4 నందలి మాటలు తండ్రికి, తల్లికి, సంబోధించబడినవని అర్థం చేసుకోవచ్చను. ఈ భాషల్లో “తండ్రులు” మరియు “తల్లిదండ్రులూ” అనే వాటికి ఒకే పదమున్నది. అయితే, ఎఫెసీయులు 6 అధ్యాయం మొదటి వచనములో తల్లి లేక తండ్రి అని అర్థమిచ్చే గొనియాసిసన్‌ నుండి వచ్చిన గొనియస్‌ అనే గ్రీకు పదమునుపయోగించి తల్లి, తండ్రి అని యిద్దరినిగూర్చి సంబోధించెను. కాని 4వ వచనములో వాడబడిన గ్రీకుపదము పేటిరెస్‌ అనగా తండ్రులారా అని అర్థం. అవును, ఎఫెసీయులు 6:4 నందు పౌలు తన మాటలను ప్రత్యక్షంగా కుటుంబములోని పురుషునికి సంబోధించాడు.

ఒకవేళ కుటుంబములో నడిపింపు తీసుకునే పురుషుడు లేకపోతే ఈ బాధ్యతను స్త్రీ స్వీకరించాలి. అనేకమంది తల్లులు తమ పిల్లలను యెహోవా శిక్షలోను బోధలోను ఆయన సహాయముతో విజయవంతంగా పెంచగల్గారు. అయితే, క్రైస్తవపురుషుడు ఉండగా, అతడే నడిపింపు తీసుకోవాలి. ఈ బాధ్యతనతడు నిర్లక్ష్యంచేస్తే, మంచి ఆత్మీయ పోషణా కార్యక్రమాన్ని కల్గియుండడానికి మిగతా కుటుంబానికి మరెంతో కష్టమౌతుంది. అట్టి వ్యక్తి తన నిర్లక్ష్య ధోరణికి యెహోవాకు లెక్క చెప్పాల్సి ఉంటుంది.

క్రైస్తవ సంఘములో అధ్యక్షులు పరిచాకులకొరకు నిర్దేశింపబడిన లేఖనార్హతలలో ఈ విషయమై దేవుని అభిప్రాయమేమిటో తేటతెల్లమవుతుంది. అట్టి స్థానం కొరకు ఎంపిక చేయబడిన వ్యక్తి “సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటి వారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. (ఎవడైనను తనయింటి వారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?)” అని బైబిలు నిర్దిష్టంగా పేర్కొంటున్నది.—1 తిమోతి 3:4, 5, 12; తీతు 1:6.

కుటుంబయజమాని తన పిల్లల ఆత్మీయ సంక్షేమము నిమిత్తం వినోదాలను వ్యక్తిగత సౌఖ్యాలను త్యాగం చేయడానికి సంసిద్ధుడై యుండాలి. కొన్నిసార్లు ఒక క్రమపద్ధతిలో తగినంత సమయాన్ని అతడు తగ్గించాల్సి ఉంటుంది. (ద్వితీయోపదేశకాండము 6:6, 7) ఏది ఏమైనప్పటికి, దేవుడిచ్చిన పనిని తనకున్న ప్రేమ, శ్రద్ధ, మూలంగా వారికి వస్త్రాలు, చెప్పులు, నివాసం, ఆహారమును సమకూర్చుటకంటె యింకెంతో చేస్తాడు.

పిల్లలను “యెహోవా శిక్షలోను బోధలోను” పెంచుట సవాలుతో కూడినది. అందుకే పురుషునిదే ప్రాథమిక బాధ్యత. క్రైస్తవ తండ్రులు ఈ కర్తవ్యాన్ని సరిగా నిర్వహిస్తే, దైవభయముగల తన పిల్లలను అతను యెహోవా ఆశీర్వాదముగా పరిగణించగలడు. కీర్తన గ్రంథకర్తతోపాటు తాను యిలా చెప్పగలడు: “యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు.”—కీర్తన 127:4, 5.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి