ప్రపంచ ఆర్థిక భవిష్యత్తును ప్రవచించుట
ఆర్థిక వ్యాపారరంగంలో అస్థిరత్వం, 1987 స్టాక్ మార్కెట్ పతనాన్ని ముందే సూచించడంలో ఆర్థిక సమీక్షకులు విఫలులవడం కొంతమంది వ్యాపారులను వారి ఆర్థిక భవిష్యత్తు తెలుసుకునేందుకు జ్యోతిష్కులను ఆశ్రయించేలా చేసిందని అకౌంటెన్సి ఏజ్ అనే లండన్ పత్రిక చెబుతుంది. “ఈ విధంగా ఆర్థిక భవిష్యత్తును సూచించే జ్యోతిష్కులు వారి వివరణాత్మకమైన వ్యాపార జ్యోతిష్యాన్నిబట్టి మంచి ప్రఖ్యాతినొందిన జ్యోతిష్య కేంద్రాల పట్టికలో చేరారు.”
ఒక సలహాదారుడు 30 సంవత్సరాల ప్రతిదిన ఆర్థిక డాటాలో తాను గమనించిన వ్యాపార హెచ్చుతగ్గులను గ్రహాల చలనంతో సరిపోల్చిచూస్తాడు. ఈ ఆధారంగా తాను భవిష్యత్తును ప్రవచిస్తుంటాడు. చాలా మంది ఖాతాదారులు తన సలహా విషయంలో 1987కి ముందు తాత్సారంగా ఉన్నా, ఎంతో మొండివైఖరితో వ్యవహరించే ఆర్థిక పెట్టుబడీదారులు సయితం ప్రస్తుతం అతన్ని సంప్రదిస్తున్నారు.
ఆర్థిక భవిష్యత్తుగూర్చి చెప్పే మరో జ్యోతిష్కుడు, “వ్యాపారాభివృద్ధిగలిగే కాలాన్ని అంచనావేయడానికి,” దీనిలో ఒక్కొక్కరి వ్యక్తిగత మెలకువ ఎలా ఉంటుందో ప్రవచించడానికి వారు పుట్టిన తేదీల చార్టును తయారుచేసి వాడుతుంటాడు. ఇంకో ఆయన వెండి వ్యాపారంలో చంద్ర గమనాన్నిబట్టి ఒడుదుడుకులు ఉంటాయని నమ్ముతున్నాడు. సాధారణ ఆర్థిక సమీక్షకులకు పోలిస్తే, ఈ జ్యోతిష్కుని ప్రవచనం ఎక్కువగా విఫలం కావడంలేదని” ఇతని ఖాతాదారులు నమ్ముతున్నట్లు జ్యోతిష్కునికి తెలుస్తుంది.
ఏవేమైనా, ఏ జ్యోతిష్కానికి సంబంధంలేని, ఓ ఆర్థిక భవిష్యత్సూచన మాత్రం ఉంది. అది కచ్చితంగా నెరవేరుతుంది. అది విఫలమవడానికి ఏ విధంగా తావివ్వని యెహోవాదేవునిచే ప్రేరేపింపబడి బైబిల్లో వ్రాయబడి ఉంది. “ఆయన అబద్ధ మాడనేరని” దేవుడు. (తీతు 1:2) ఆయన తన ప్రవక్తయైన యెహెజ్కేలు ద్వారా ఇలా ప్రకటించాడు: “తమ వెండిని వీధులలో పారవేయుదురు. తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియేగాని బంగారమేగాని వారిని తప్పించజాలదు.”—యెహెజ్కేలు 7:19.
ఇది ఎప్పుడు జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రవచించిన “మహాశ్రమలలో” జరుగుతుంది. యెహెజ్కేలు దానిని “యెహోవా ఉగ్రత దినము” అని పలికాడు. (మత్తయి 24:21; యెహెజ్కేలు 7:19) జ్యోతిష్కులు ప్రవచించినప్పటికి, ఆర్థిక వృద్ధి వారి భద్రతకు అభయమివ్వలేదు. రాజకీయ, మత, వ్యాపార రంగాలన్ని తుడిచిపెట్టబడే ఆ ప్రపంచ అస్థవ్యస్థతలో గొప్ప విమోచకుడైన యెహోవాదేవుని యందలి నమ్మకం మాత్రమే అట్టి భద్రతకు అభయమిస్తుంది.—సామెతలు 3:5, 6; జెఫన్యా 2:3; 2 పేతురు 2:9.