మీకు జ్ఞాపకం ఉన్నాయా?
ఇటీవలి ది వాచ్‌టవర్ సంచికలను మీరు చదివి ఆనందించారా? అట్లయితే ఈ క్రిందివాటిని జ్ఞాపకం తెచ్చుకోవడం నిస్సందేహంగా మీకు ఆసక్తిని కల్గిస్తుంది:
◻ మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మయొక్క వివిధ క్రియలవలన ఏ నమ్మదగిన రుజువు ఇవ్వబడింది?
ఈ క్రియలు 1,500 సంవత్సరాల ఇశ్రాయేలీయుల సమాజమును దేవుడు ఇక ఎంతమాత్రము తన ప్రత్యేక జనాంగముగా ఉపయోగించుకోవడం లేదని ఇప్పుడు ఆయన అంగీకారము తన అద్వితీయ కుమారునివలన స్థాపించబడిన నూతన క్రైస్తవ సంఘముపై నున్నదని దృశ్యమైన సాక్ష్యాన్నిచ్చాయి. (హెబ్రీయులు 2:2-4 పోల్చుము.)—w92 11/15, పేజి 5.
◻ యెహోవాసాక్షుల అసాధారణ పెరుగుదలకు కారణమేమిటి?
ముఖ్యముగా, ఇది దేవుని ఆశీర్వాదమువలన కలుగుతుంది. ఇది దేవుని పని. యెహోవాసాక్షులు వారి సువార్త పనిలో బోధించేది బైబిలుపై ఆధారపడినదే. వారి విజయానికి మరొక కీలకమేమనగా క్రైస్తవ సంఘముపైన నియమించబడిన శిరస్సుగా వారు క్రీస్తు యేసును పూర్తిగా గుర్తించడమే.—w92 12/1, పేజీ 19.
◻ బత్షెబాతో చేసిన ఘోర పాపం విషయంలో దావీదుయెడల యెహోవా ఎందుకు కనికరము చూపించాడు?
దావీదుతో దేవుడు చేసిన రాజ్యనిబంధన మూలంగా ముఖ్యంగా ఇలా జరిగింది. అయితే దావీదుయొక్క స్వంత కనికరము, ఆయన నిజమైన పశ్చాత్తాపము కూడా ఇందుకు కారణమైయున్నది. (1 సమూయేలు 24:4-7; 2 సమూయేలు 7:12; 12:13; కీర్తన 51:1, 2, 17)—w93 3/15, పేజీలు 10, 11.
◻ యేసు మెస్సీయ అని బలపరచు ఏ మూడు విధాల సాక్ష్యాన్ని గ్రీకు లేఖనములు ఇస్తున్నవి?
మొదటి సాక్ష్యాధారం ఆయన వంశావళి. (మత్తయి 1:16; లూకా 3:23-38) మరొక సాక్ష్యము నెరవేరిన ప్రవచనం. యేసును మెస్సీయగా గుర్తించే దానియేలు 9:25లో కనబడేటువంటి ప్రవచనాలు అక్షరార్థముగా ఎన్నోవున్నాయి. మూడవ సాక్ష్యమేమంటే దేవుని స్వంత వాంజ్మూలమే; దీనిని ఆయన మూడు సందర్భాలలో తన స్వంత స్వరంతో వినిపించాడు. (మత్తయి 17:5; లూకా 3:21, 22; యోహాను 12:28)—wE92 12/1, పేజీలు 10, 12.
◻ మత్తయి 24:37లో వ్రాయబడిన ప్రకారం “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని ప్రత్యక్షతయు ఆలాగే ఉండును” అని చెప్పడంలో యేసు భావమేమిటి?
నోవహు ఓడను నిర్మిస్తూ, జలప్రళయమొచ్చి చెడిపోయిన ఆ లోక విధానమును తుడిచి పెట్టక మునుపు ఆయన కొన్ని దశాబ్దముల కాలంపాటు దుష్టులను హెచ్చరిస్తూనే ఉండెను. అలాగే క్రీస్తు అదృశ్య ప్రత్యక్షత అది చివరకు గొప్పనాశనంతో ముగిసేముందు కొన్ని దశాబ్దముల కాలము ఉండును. ఈ కాలంలో భూవ్యాప్తంగా సాక్ష్యమివ్వబడుతుంది.—wE92 12/1, పేజీ 6.
◻ ఒక మంచి గృహబైబిలు పఠనానికి కావలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలేంటి?
పఠనానికి కావలసిన సమయాన్ని సంపాదించుకోవాలి. టివి, లేక ఇతర అంతరాయాలవలన మనము నిమగ్నమై పోకుండునట్లు చూసుకోవాలి. కుటుంబానికి కావలసిన ప్రత్యేక అవసరతలను పరిగణనలోకి తీసుకోవాలి. పిల్లలు వారు నేర్చుకొంటున్నదాన్ని గ్రహిస్తున్నారో లేదో పసిగట్టడానికి దృక్పథాన్ని బయలుపరచే ప్రశ్నలు ఉపయోగించాలి. (మత్తయి 17:25) పఠన వాతావరణాన్ని పరిస్థితులకు తగినట్లు మలుచుకోగలినంత మృదువుగా ఉంచాలి. ఉత్సాహంతో ఉంటూ ప్రతిఒక్కరూ పఠనములో పాల్గొనేలా చెయ్యాలి.—w93 1/15, పేజి 17.
◻ రక్తంలో మిశ్రితమైయున్న పదార్థాలు ఆహార ఉత్పత్తులలో ఎంతవరకు కలిసియున్నాయనే దాన్నిగూర్చి క్రైస్తవులు ఎంతవరకు శ్రద్ధవహించాలి?
కలిసివుండే సాధ్యతనుబట్టి లేక కేవలము పుకార్లనుబట్టి కలతచెందకుండునట్లు క్రైస్తవులు జాగ్రత్తపడాలి. లేబుల్స్ పరిశీలించే విషయంలోనేగాని, కటికవారిని విచారించడంలోనేగాని సహేతుకతను కలిగివుండాలి. ఆహారంలోనేగాని, లేక వైద్య చికిత్సలోనేగాని రక్తము బాగా వాడబడుతుందని తెలిసినట్లయితే, రక్తమును విసర్జించుడి అను దేవుని ఆజ్ఞకు లోబడుటకు క్రైస్తవులు జాగ్రత్తపడాలి. (అపొస్తలుల కార్యములు 15:28, 29)—w93 1/15, పేజీలు 30-1.
◻ సామెతల గ్రంథము ఇశ్రాయేలువారిలో ఉపయోగించబడిన బోధనా పద్ధతుల ఆత్మీయ గంభీరతను ఎలా ఉన్నతపరుస్తుంది?
సామెతల గ్రంథము దాని సంకల్పము “జ్ఞానములేనివారికి” ఉన్నత విషయాలైన జ్ఞానము, క్రమశిక్షణ, వివేకము, వివేచనా శక్తి, బుద్ధికుశలత, ఆలోచనా సామర్థ్యమును—“యెహోవాయందు భయభక్తుల”తో కలిగియుండుటను బోధించడం అని తెలియజేస్తుంది. (సామెతలు 1:1-7; 2:1-14)—w93 2/1, పేజి 12.
◻ విద్యపట్ల యౌవనస్థులు ఏ సమతూకమైన దృష్టిని ఈనాడు కలిగియుండవలెను?
అనుకున్న ఫలితాన్ని సాధించుటకు ఒక సాధనంగానే క్రైస్తవులు విద్యను దృష్టించాలి. ఈ అంత్యదినములలో వారి సంకల్పము వారి సాధ్యమైనంతమట్టుకు చేయగలిగితే పూర్తి కాల పరిచర్యద్వారా యెహోవాను సమర్ధవంతముగా సేవించడమైయుంది.—w93 2/1, పేజి 18.
◻ ఇశ్రాయేలు జనాంగాన్ని పదియవంతు చెల్లించాలని యెహోవా ఎందుకు కోరెను?
మొదటిగా యెహోవా మంచితనముయెడల వారికున్న గుణగ్రహణమును స్పష్టమైన రీతిలో వారు ప్రదర్శించగలందులకు. రెండవది, లేవీయులు ధర్మశాస్త్రమును బోధించుటతోపాటు వారి విధులలో నిమగ్నమైయుండులాగున వారి మద్దతుకై దోహదపడగలరు. (2 దినవృత్తాంతములు 17:7-9 చూడుము)—w93 3/1, పేజి 9.
◻ క్రైస్తవులు తీసుకురావాలని కోరబడే పదోవంతు ఏమిటి? (మలాకీ 3:10)
మనము యెహోవాకు లేక ఆయన సేవలో ఉపయోగించేందుకు చెల్లించాల్సిన వంతును ఈ పదోవంతు సూచిస్తుంది. మనకు ఆయన యెడలగల ప్రేమకు, మనము ఆయనవారమైయున్నామని మన గుర్తింపుకు ఇది సూచనయైయున్నది.—w93 3/1, పేజి 15.