కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 5/1 పేజీలు 21-26
  • స్వచ్ఛమైన భాషను మాట్లాడి నిరంతరము జీవించుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వచ్ఛమైన భాషను మాట్లాడి నిరంతరము జీవించుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వచ్ఛమైన భాషను ఎలా నేర్చుకోవాలి
  • కల్మషములు చొరబడుట
  • స్వచ్ఛమైన భాష ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది
  • దానిని ఉపయోగిస్తామా లేక పోగొట్టుకొంటామా
  • ఐక్యముగా నిలబడుదుము
  • ‘స్వచ్ఛమైన భాషను’ మీరు అనర్గళంగా మాట్లాడుతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • స్వచ్ఛమైన భాషచే ఐక్యముకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • స్వచ్ఛమైన భాష ఆరాధికుల గొప్పసమూహమును ఐక్యపరచుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ‘భూమంతటా ఒక్క భాష ఉండెను’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 5/1 పేజీలు 21-26

స్వచ్ఛమైన భాషను మాట్లాడి నిరంతరము జీవించుము

“యెహోవాను వెదకుడి . . . వినయముగలవారై, నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు.”—జెఫన్యా 2:3.

1. (ఎ) ఒక పరభాషను నేర్చుకొనుటకు విద్యార్థులు ఏ పద్ధతులను ఉపయోగిస్తారు? (బి) స్వచ్ఛమైన భాషను మాట్లాడుట ఎందుకు?

వ్యాకరణము పద్ధతిద్వారా, లేక మాట్లాడుకొనే-భాషా పద్ధతిద్వారా విద్యార్థులు ఒక క్రొత్తభాషను నేర్చుకొనవచ్చును. వ్యాకరణ పద్ధతిలోనైతే సాధారణంగా వారు అచ్చుపుస్తకములను ఉపయోగించి వ్యాకరణ నియమాలను నేర్చుకుంటారు. మాట్లాడే భాషా పద్ధతిలోనైతే వారి గురువు మాట్లాడే శబ్దాలను, పద ధోరణిని అనుకరిస్తారు. “స్వచ్ఛమైన భాషను” నేర్చుకొనుటలో ఈ రెండు పద్ధతులు ఉపయోగించబడును. ‘యెహోవా ఉగ్రత దినమందు దాచబడ’ వలెనని మనము నిరీక్షించినట్లయిన ఈ భాషను మనము మాట్లాడుట ప్రాముఖ్యము.—జెఫన్యా 2:1-3; 3:8, 9.

2. స్వచ్ఛమైన భాషకు వ్యాకరణ నియమాలని పిలువబడగలవాటిని మనమెట్లు నేర్చుకొనగలము?

2 ఈ స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుటకు ఉపయోగించబడు ముఖ్యమైన అచ్చు పుస్తకమేమనగా బైబిలు. దానిని మరియు బైబిలు ఆధారితమైన ప్రచురణలను శ్రద్ధగా పఠించుట స్వచ్ఛమైన భాషకు వ్యాకరణ నియమాలు అని పిలువబడగల వాటిని అవి మీకు బోధించును. ఒక యెహోవాసాక్షివలన నిర్వహించబడు గృహబైబిలు పఠనము ఇందుకు మంచి ప్రారంభం. ఇప్పటికే దేవునికి సమర్పించుకొన్నవారైతే లేఖనములను క్రమముగా పట్టుదలతో పఠించుట ప్రాముఖ్యము. అయితే స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుటకు ప్రత్యేకంగా సమర్ధవంతమైన మార్గములేమైనా కలవా? దానిని మాట్లాడుటద్వారా ఏ ప్రయోజనములు కలుగును?

స్వచ్ఛమైన భాషను ఎలా నేర్చుకోవాలి

3. స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుటకు ఒక మార్గమేమి?

3 ఒక భాషా విద్యార్థి క్రమక్రమంగా అనేక వ్యాకరణ నియమాలను చెప్పగలుగునట్లే, స్వచ్ఛమైన భాషను నేర్చుకొనే ఒక మార్గమేమనగా, మీరు నేర్చుకొనుచున్న సత్యములను, మీరు అప్పటికే తెలిసికొనియున్న అంశములతో జోడించుటైయున్నది. ఉదాహరణకు, ఒక సమయానికి మీరు యేసుక్రీస్తు దేవునికుమారుడని మాత్రమే తెలిసికొనియున్నారు గాని ఆయన విధులను గూర్చి మీకు అంత ఎక్కువగా తెలియదు. అప్పటినుండి మీ బైబిలు పఠనము, ప్రస్తుతము క్రీస్తు పరలోకరాజుగా పరిపాలిస్తున్నాడని, తన వెయ్యేండ్ల పరిపాలనా కాలములో విధేయులైన మానవజాతిని పరిపూర్ణతకు తెచ్చునని బోధించియుండవచ్చు. (ప్రకటన 20:5, 6) కావున, మీరు క్రితమే ఎరిగియున్న వాటితో క్రొత్తతలంపులను జోడించి చూచుట స్వచ్ఛమైన భాష యొక్క మీ అవగాహనను వృద్ధిచేయును.

4. (ఎ) స్వచ్ఛమైన భాషయొక్క ‘వ్యాకరణ నియమాలను’ నేర్చుకొను మరొక పద్ధతేమి, ఏ బైబిలు వృత్తాంతము దీనిని వివరించుటకు ఉపయోగించబడినది? (బి) గిద్యోను ఆయన మూడువందలమంది మనుష్యులు చర్య తీసికొన్నప్పుడు ఏమి సంభవించినది? (సి) గిద్యోనునుగూర్చిన వృత్తాంతము ఏ పాఠమును బోధించుచున్నది?

4 స్వచ్ఛమైన భాషయొక్క వ్యాకరణ నియమాలను నేర్చుకొనుటకు ఇంకొక మార్గమేమనగా బైబిలు సంఘటనలను మనస్సులో దృష్టీకరించుకొనుట. ఉదహరణకు న్యాయాధిపతులు 7:15-23 నందు వ్రాయబడిన వృత్తాంతమును ‘చూచుటకు వినుటకు’ ప్రయత్నించండి. ఇశ్రాయేలు న్యాయాధిపతియైన గిద్యోను ప్రతిగుంపులో వందమంది మనుష్యులతో తన సైన్యమును మూడు గుంపులుగా విభాగించాడు. చీకటిలో, వారు మెల్లగా గిల్బోవ పర్వతమును దిగి, నిద్రిస్తూవున్న మిద్యానీయుల దండును చుట్టుముట్టుచున్నారు. ఈ మూడవందలమంది ఆయుధములను బాగా ధరించివున్నారా? సైనికపరంగా వారేమి ధరించలేదు. అహంకార సైనిక వాదులు వారిని చూస్తే పెద్దపెట్టున అపహాస్యంతో నవ్వగలరు. ఎందుకనగా ఒక్కొక్కరి చేతిలో కేవలం ఒక బూర, ఒక పెద్ద నీటికుండ, ఆ కుండలో దివిటీ మాత్రమే ఉన్నవి. ఇక వినండి! సూచన ఇవ్వబడగానే, గిద్యోనుతోనున్న వందమంది తమ బూరలను ఊది, వారి కుండలను పగలగొట్టవలెను. మిగతా రెండువందలమందీ ఆలాగే చెయ్యాలి. అందరూ మండుతున్న దివిటీలను పైకెత్తగా వారు ఇలా కేకలువేయటం మీరు వింటారు: “యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము!” మిద్యానీయులను ఇది ఎంత భయకంపితులను చేస్తుంది! వారి గుడారములలోనుండి వారు తడబడుతూ, పైకెగసినట్లు చెలరేగుతున్న మంటలను నిద్రమత్తుతో నిండిన కండ్లను తెరచుకుంటూ చూచుట వారిలో అగోచరమైన భయమును పుట్టిస్తుంది. మిద్యానీయులు పారిపోవుటకు సిద్ధము కాగా గిద్యోను మనుష్యులు బూరలను అలాగే ఊదుతుండిరి. దేవుడు వారి శత్రువులు ఒకరినొకరు హతమార్చుకొనునట్లు చేస్తున్నాడు. స్వచ్ఛమైన భాషలో ఇది ఎంత శక్తివంతమైన పాఠము! దేవుడు తన సేవకులను ఏ సైనిక శక్తి లేకుండానే విడిపించగలడు. “యెహోవా . . . తన ఘనమైన నామము నిమిత్తమై తన జనులను విడనాడడు” కూడా.—1 సమూయేలు 12:22.

5. క్రైస్తవ కూటములు మన భాషను స్వచ్ఛంగా చేసికొనుటకు ఎట్లు సహాయము చేయగలవు?

5 మాట్లాడే భాషా విధానము ద్వారా విద్యార్ధులకు ఒక పరభాషను బోధించునప్పుడు, వారు గురువుయొక్క శబ్దాలను, పద పద్ధతులను ఖచ్చితంగా మరలామరలా పునఃరుచ్ఛరించుటకు ప్రయత్నిస్తారు. క్రైస్తవ కూటములలో స్వచ్ఛమైన భాషను మాట్లాడుటకు ఎంత మంచి అవకాశములున్నవి! ఇతరులు లేఖన సత్యమను భాషలో తమ్మునుతాము వ్యక్తపరచుకొనుటను మనము విందుము, మనకై మనము వ్యాఖ్యానించే ఆధిక్యతను కూడా పొందవచ్చును. ఏదైనా తప్పు చెబుతామేమోనని మనము భయపడతామా? దాన్ని మన ముఖ్య చింతగా చేసికొనకూడదు. కావలికోట పఠనములాంటి కూటమును నిర్వహించే పెద్దయొక్క దయగల దిద్దుబాటునుబట్టి తప్పుదిద్దుకొంటూ మన భాషను స్వచ్ఛంగా చేసుకోవచ్చును. అందుచేత, క్రైస్తవ కూటములకు క్రమముగా హాజరై వాటిలో పాల్గొనుము.—హెబ్రీయులు 10:24, 25.

కల్మషములు చొరబడుట

6. యెహోవాసాక్షులకు మరియు క్రీస్తుమత సామ్రాజ్యపు మత సంస్థలకు మధ్య ఎందుకు అంతటి బేధమున్నది?

6 యెహోవా సంకల్పములను తెలియజేస్తూ, ఆయన పరలోక రాజ్యమును ప్రకటించువారు ఆయన సాక్షులుగా స్వచ్ఛమైన భాషను మాట్లాడెదరు. వారు ఆయన నామమును తెలియజేస్తూ, “భుజములు కలిపి” (NW) లేక యేక మనస్సుతో ఆయనను సేవిస్తారు. (జెఫన్యా 3:9) క్రీస్తుమతసామ్రాజ్య మతములు బైబిలును కలిగియున్నను వారు స్వచ్ఛమైన భాషను మాట్లాడుట లేక విశ్వాసముతో ఆయన నామమున ప్రార్థించుట చేయరు. (యోవేలు 2:32) వారికి లేఖనములపై ఆధారపడిన అనుగుణ్యమైన వర్తమానము లేదు. ఎందుకు? ఎందుకనగా వారు దేవుని వాక్యమునకంటె ఉన్నతంగా మతపారంపర్యాచారములను, లోక తత్త్వ జ్ఞానములను, రాజకీయపరమైన భక్తిని ఉన్నతంగా పెట్టుదురు. వారి సంకల్పములు, నిరీక్షణలు, పద్ధతులు ఈ దుష్టలోకమునకు సంబంధించినవి.

7. యెహోవాసాక్షులకు మరియు అబద్ధమతములకు మధ్యనున్న ఏ బేధములు 1 యోహాను 4:4-6 నందు సూచించబడినవి?

7 క్రీస్తుమతసామ్రాజ్యము—నిజానికి, పూర్తి ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యము—యెహోవాసాక్షులు మాట్లాడునట్లే ఒకే భాషను మాట్లాడదు. అపొస్తలుడైన యోహాను స్వచ్ఛమైన భాషను మాట్లాడువారినిగూర్చి ఆసక్తికరంగా ఇలా వ్రాసెను: “మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు. వారు లోకసంబంధులు గనుక లోకసంబంధులైనట్టు మాటాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు.” (1 యోహాను 4:4-6) అబద్ధబోధకులను యెహోవా సేవకులు జయించియున్నారు, అందుకు కారణమేమనగా తన ప్రజల సంబంధియైన దేవుడు, అవినీతికర మానవ సమాజములో అనగా “లోకములో ఉన్నవానికంటె [అపవాది] గొప్పవాడు.” మతభ్రష్టులు “లోకసంబంధులై,” దాని దుష్టాత్మను కలిగియున్నారు గనుక, “లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.” అయితే గొర్రెలాంటి వారు మాత్రము యెహోవా ప్రజలు ఆయన సంస్థద్వారా అందించబడిన బైబిలు సత్యముయొక్క స్వచ్ఛమైన భాషను మాట్లాడుదురని గ్రహించి దేవునికి సంబంధించినవారి మాట వినెదరు.”

8. ధర్మవిరోధి యొక్క గుర్తింపేమిటి?

8 గొప్ప మతభ్రష్టత్వము ముందుగానే ప్రవచింపబడినది. ‘ధర్మవిరుద్ధమైన మర్మము’ సా.శ. మొదటి శతాబ్దములో అప్పటికే పనిచేస్తూ ఉంది. కాలక్రమీణ సంఘములో బోధించు స్థానమును స్వీకరించిన, లేక ఆక్రమించుకొన్న మనుష్యులు అనేక అబద్ధ సిద్ధాంతములను బోధించారు. వారి భాష స్వచ్ఛతకు బహు దూరమైపోయింది. తద్వారా అబద్ధమత పారంపర్యాచారములకు, లోక తత్త్వజ్ఞానమునకు, లేఖనానుసారముగాని బోధలకు కట్టుబడినట్టి, సంయుక్తంగా కలసి “ధర్మవిరోధియై” యున్న క్రీస్తుమతసామ్రాజ్యపు మతగురువులు బయలుదేరిరి.—2 థెస్సలొనీకయులు 2:3, 7.

స్వచ్ఛమైన భాష ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది

9. మతసంబంధముగా 19 వ శతాబ్దములో ఏ పరిస్థితులు వృద్ధిచెందినవి?

9 దేవునికి భయపడు కొద్దిమంది ప్రజలు మాత్రమే ‘పరిశుద్ధుల కప్పగింపబడిన విశ్వాసము నిమిత్తమై గట్టి పోరాటమును పోరాడుచున్నారు.’ (యూదా 3) అటువంటి విశ్వాసులను మనమెక్కడ కనుగొనగలము? కొన్ని శతాబ్దములుగా అబద్ధమతము అనేకమందిని ఆత్మీయచీకటిలో ఉంచింది. అయితే తన అంగీకారముగల కొద్దిమంది ప్రజలు దేవునికి తెలుసు. (2 తిమోతి 2:19) ఆ తర్వాత, 19 శతాబ్దములో పారిశ్రామిక, వ్యాపార, సాంఘిక మార్పులు జరుగుతుండగా, అబద్ధమత గందరగోళమగు సాధారణ బాబెలునుండి కొన్ని స్వరములు బయలువెడలినవి. చిన్నచిన్న గుంపులు కాలముల సూచనలను చదివి, యేసు రెండవ రాకడను గూర్చి ప్రవచించుటకు ప్రయత్నించినవి. కాని వారిలో అందరూ స్వచ్ఛమైన భాషను మాట్లాడలేదు.

10. దేవుడు ఏ “రెండవ రాకడ” గుంపును స్వచ్ఛమైన భాషను మాట్లాడుటకు ఎన్నుకొన్నాడు, వారికి యెహోవా హస్తము తోడైయున్నదని ఎందుకు రుజువయ్యింది?

10 ఏలాగైనను, 1879 లో రెండవరాకడను గూర్చి పలుకు ఏ స్వరము ఆయన సాక్షులుగా యెహోవావలన ఎన్నుకొనబడుతుందో స్పష్టమాయెను. ఆ సమయంలో చార్లెన్‌ టేజ్‌ రస్సల్‌చే నడిపించబడుతున్న ఒక చిన్న బైబిలు పఠన గుంపు యు.ఎస్‌.ఎ., పెన్సిల్‌వేనియా, పిట్స్‌బర్గునందు సమకూడుతుంది. యేసు రెండవరాకడ ఆయన అదృశ్య ప్రత్యక్షతను ప్రారంభిస్తుందని, లోకమంతటికి విపత్కర కాలము ముందున్నదని, తదుపరి క్రీస్తు వెయ్యేండ్లపరిపాలన మొదలై, భూమిపై పరదైసును పునఃస్థాపిస్తుందని, అందులో విధేయులైన మానవులు నిత్యజీవితముతో ఉంటారను నిశ్చయతను వారు కలిగియుండిరి. 1879లో ఈ బైబిలు విద్యార్ధులు ఇప్పుడు ది వాచ్‌టవర్‌ అని పిలువబడుతున్న పత్రికను ప్రచురించుటకు ప్రారంభించారు. దాని మొదటి సంచిక కేవలము 6,000 మాత్రమే పంచిపెట్టబడినవి. కానీ “యెహోవా హస్తము” ఆ సాక్షులకు తోడైయుండెను గనుక ప్రస్తుతము ఈ పత్రిక 111 భాషలలో ప్రచురింపబడుతూ, ఒక్కొక్క సంచిక సరాసరి 1,50,00,000 కంటె ఎక్కువగా ముద్రించబడుతుంది.—అపొస్తలుల కార్యములు 11:19—21 పోల్చుము.

11, 12. స్వచ్ఛమైన భాష మాట్లాడువారివలన అర్థము చేసికొనబడిన కొన్ని లేఖన సత్యములేవి?

11 బైబిలు మరియు యెహోవాసాక్షుల ప్రచురణలద్వారా, ప్రత్యేకంగా ఆసక్తిగల ఈ క్రైస్తవుల సువార్త ప్రకటనద్వారా స్వచ్ఛమైన భాష ప్రపంచవ్యాప్తముగా తెలియబడింది. దానిని మాట్లాడువారు ఎంత గొప్ప ప్రయోజనములను అనుభవిస్తున్నారు! మర్మముతోకూడిన విలక్షణ భాషలో త్రిత్వవాదములోని దేవుడు దేవుడే, క్రీస్తు దేవుడే పరిశుద్ధాత్మదేవుడే అనుటకు బదులు, యెహోవా సర్వోన్నతుడు, ఆయనకంటె తక్కువవాడైన యేసుక్రీస్తు ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని అద్భుతకరమగు చురుకైన శక్తి అను బైబిలు స్థానమును వారు అంగీకరిస్తారు. (ఆదికాండము 1:2; కీర్తన 83:18; మత్తయి 3:16, 17) స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు క్షుద్రజీవులనుండి మనుష్యుడు పరిణామము చెందలేదుగాని ప్రేమగల దేవునివలన సృష్టించబడ్డాడని ఎరుగుదురు. (ఆదికాండము 1:27; 2:7) మరణముతో ఆత్మ ఉనికిలో ఉండకుండా నశిస్తుందని వారికి తెలుసు. ఇది మరణించినవారిని గూర్చిన భయమును తొలగించు సత్యము. (ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) నరకము మానవజాతియొక్క సామాన్యమైన సమాధియేగాని ఒక క్రూరమైన దేవుని వలన ఏర్పాటుచేయబడిన అగ్నిబాధతో కూడినది కాదని అర్థమైంది. (యోబు 14:13) పునరుత్థానము మృతులకొరకు దేవుడిచ్చిన నిరీక్షణయనికూడ వారికి తెలుసును.—యోహాను 5:28, 29; 11:25; అపొస్తలుల కార్యములు 24:15.

12 స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు రక్తము మరియు ప్రాణముయెడల గౌరవము చూపెదరు. (ఆదికాండము 9:3, 4; అపొస్తలుల కార్యములు 15:28, 29) క్రీస్తు భూజీవితము విధేయులైన మానవజాతికొరకు చెల్లించబడిన విమోచన క్రయధనమని వారు గ్రహిస్తారు. (మత్తయి 20:28; 1 యోహాను 2:1, 2) వారి ప్రార్థనలు యేసుక్రీస్తుద్వారా యెహోవాకే చేయబడాలని ఎరిగినవారై వారెప్పుడును “పరిశుద్ధులుగా ఎంచబడువారికి” ప్రార్థనలు చేయరు. (యోహాను 14:6, 13, 14) దేవుడు విగ్రహారాధనను ఖండిస్తునందున, వారి ఆరాధనలో ప్రతిమలను ఉపయోగించరు. (నిర్గమకాండము 20:4-6; 1 కొరింథీయులు 10:14) వారు అపవాది పొత్తువలన కలుగు అపాయములనుకూడా తొలగించుకుంటారు, ఎందుకనగా అభిచారమును తిరస్కరిస్తారు. అది బైబిలులోను ఖండించబడినది.—ద్వితీయోపదేశకాండము 18:10-12; గలతీయులు 5:19-21.

13. స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు ఎందుకు దిగ్భ్రమ చెందరు?

13 స్వచ్ఛమైన భాషను మాట్లాడు యెహోవాసేవకులు కాలప్రవాహములో తాము ఎక్కడ జీవిస్తున్నామనుదాన్ని గూర్చి దిగ్భ్రమచెందరు. యేసు మహిమగల అదృశ్య ఆత్మగా ప్రత్యక్షమైయుండి, వారు “యుగాంతమందు” ఉన్నారని యెహోవా వారికి బోధించెను. (దానియేలు 12:4; మత్తయి 24:3-14; 2 తిమోతి 3:1-5; 1 పేతురు 3:18) బలమైన పరలోకసైన్యము తన వెనుకనుండగా ఈ విధానముపైకి దేవుని తీర్పును అమలుచేయు యుద్ధము ప్రారంభించుటకు క్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. (దానియేలు 2:44; ప్రకటన 16:14, 16; 18:1-8; 19:11-21) ఔను, ఈ స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు విధేయులైన మానవులందరికి పరదైసు భూమిపై క్రీస్తు ఆధ్వర్యములోని దేవుని రాజ్యము త్వరలోనే గొప్ప ఆశీర్వాదములను తెచ్చునను సువార్తను ప్రకటించుటలో రద్దీగా ఉన్నారు. (యెషయా 9:6, 7; దానియేలు 7:13, 14; మత్తయి 6:9, 10; 24:14; లూకా 23:43) వీటన్నిటితో, మనము సంగతులను కేవలము పైపైన మాత్రమే చూశాము. నిశ్చయంగా ఈ స్వచ్ఛమైన భాష సంపన్నమైనది, భూమిమీద ఉన్న అత్యంత ప్రశస్తమైన భాషయైవున్నది.

14. స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు ఏ ఇతర ప్రయోజనములను అనుభవిస్తున్నారు?

14 ఈ స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు అనుభవించు ప్రయోజనములలో హృదయములను, మానసిక శక్తులను కాపాడగల “దేవుని సమాధానము” ఇమిడివున్నది. (ఫిలిప్పీయులు 4:6, 7) ఆరోగ్యము, సంతోషము, యెహోవాను సంతోషరపరచుట వలన కలుగు తృప్తిని ఇచ్చు బైబిలు నియమములకు వారు విధేయులవుతారు. (1 కొరింథీయులు 6:9, 10) ఔను ఈ స్వచ్ఛమైన భాషను మాట్లాడువారు దేవుడు వాగ్దానముచేసిన నూతన విధానములో నిత్యజీవమును పొందు నిరీక్షణను కూడ కలిగియున్నారు.—2 పేతురు 3:13.

దానిని ఉపయోగిస్తామా లేక పోగొట్టుకొంటామా

15. స్వచ్ఛమైన భాషను బాగుగా గ్రహించుకొనుట వలన మీరెట్లు ప్రయోజనము పొందెదరు?

15 నూతనలోకములో మీరు స్వచ్ఛమైన భాషను మాట్లాడాలంటే, మీరు దానిని ఆ భాషలోనే తలంచగలిగేంత బాగుగా ఎరగాలి. ఒక వ్యక్తి భాషను నేర్చుకొంటున్నప్పుడు, మొదట తాను తన స్వంత భాషలో తలంచి, తన తలంపులను క్రొత్త భాషలోకి తర్జుమాచేసుకుంటాడు. అయితే క్రొత్తభాషలో తాను ప్రవీణుడయ్యేకొలది, తర్జుమాచేసుకొనే పద్ధతి అవసరంలేకుండానే అతడు దానిలో ఆలోచించుటకు మొదలుపెట్టును. అలాగే శ్రద్ధగల పఠనము ద్వారా సమస్యలను పరిష్కరించుకొని “జీవమార్గములో ఉండుటకు” బైబిలు ఆజ్ఞలను, సూత్రములను ఎలా అన్వయించుకొనవలెనో తెలుసుకొనునంతగా స్వచ్ఛమైన భాషయొక్క అవగాహనను పొందెదవు.—కీర్తన 16:11.

16. మీరు స్వచ్ఛమైన భాషను క్రమంగా ఉపయోగించక పోతే ఏమి సంభవించగలదు?

16 స్వచ్ఛమైన భాషను మీరు క్రమముగా వాడాలి, లేనట్లయిన దానిని బాగా మాట్లాడే సామర్ధ్యమును కోల్పోతారు. వివరించుటకు: సంవత్సరముల క్రితం మనలో కొంతమందిమి ఒక పరభాషను నేర్చుకొన్నాము. ఆ భాషలోని కొన్ని పదములను మన గుర్తుతెచ్చుకోగలిగినను, చాలావరకు మనము దానిని అనునిత్యము ఉపయోగించటంలేనందున, దానిపైన ఉన్న అధికారాన్ని కోల్పోతాము. స్వచ్ఛమైన భాష విషయంలోను అదే సంభవించవచ్చు. దానిని మనము క్రమంగా ఉపయోగించక పోతే, దానిపై మనము కల్గివున్న అధికారాన్ని కోల్పోతాము. అది ఆత్మీయముగా దుఃఖకరమైన ఫలితాలను కలిగివుంటుంది. కాబట్టి మనము దానిని కూటములలో, క్రైస్తవ పరిచర్యలో క్రమముగా మాట్లాడుదాము. ఈ చర్యలతో పాటు వ్యక్తిగత పఠనముకూడ జోడైతే, అది స్వచ్ఛమైన భాషలోని సంగతులను సరిగా చెప్పుటకు మనకు సహాయపడగలదు. అది ఎంత ప్రాముఖ్యము!

17. మాట్లాడు భాష జీవమును రక్షించుటో లేక మరణకరమో కాగలదని ఏది వివరించుచున్నది?

17 మాట్లాడేమాటలు జీవితమును రక్షించగలవు లేక మరణకరము కాగలవు. గిలాదువాడగు న్యాయాధిపతియైన యెఫ్తాకు ఇశ్రాయేలు గోత్రమువారైన ఎఫ్రాయిమీయులకు మధ్య జరిగిన పోరాట సమయములో ఇది చూపబడింది. యోర్దాను నది దాటిపోవుటకు ప్రయత్నించు ఎఫ్రాయీమీయులను గుర్తించుటకు గిలాదువారు “షిబ్బోలెతను” మాటను పలకమని అడిగారు. ఈ పదములో మొదట “షి” అను శబ్దం వస్తుంది. అయితే ఎఫ్రాయీమీయులు ఆ మొదటి అక్షరమును తప్పుగా పలుకుతూ “షిబ్బోలెతు” అని పలుకుటకు బదులు “సిబ్బోలెతు” అని పలికి, యోర్దాను రేవుల దగ్గరవున్న సైనిక కాపరులకు తమ్మును తాము అప్పగించుకొనిరి. దాని ఫలితంగా, 42,000 ఎఫ్రాయీమీయులు వధించబడ్డారు. (న్యాయాధిపతులు 12:5, 6) అదేప్రకారంగా, క్రీస్తుమతసామ్రాజ్యపు మతగురువులు బోధించేది, బైబిలు సత్యముతో బాగా పరిచయములేనివారికి దాదాపు స్వచ్ఛమైన భాషమాదిరే వినపడుతుంది. అయితే అబద్ధమత పద్ధతిలో మాట్లాడుట యెహోవా ఉగ్రత దినమందు ఒకనికి మరణకరమవుతుంది.

ఐక్యముగా నిలబడుదుము

18, 19. జెఫన్యా 3:1-5 యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

18 విశ్వాసఘాతకురాలైన పురాతన యెరూషలేమును దాని ఆధునిక భాగస్వామియైన క్రీస్తుమతసామ్రాజ్యమును సూచిస్తూ, జెఫన్యా 3:1-5 నందు ఇలా చెప్పబడింది: “ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు. దాని మధ్య దాని న్యాయాధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాస ఘాతకులు; దానియాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్టిత వస్తువులను అపవిత్రపరతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు.” ఆమాటల ప్రాముఖ్యత ఏమైయున్నది?

19 పురాతన యెరూషలేము, అలాగే ఆధునిక క్రీస్తుమత సామ్రాజ్యము ఈ రెండునూ, యెహోవాకు వ్యతిరేకముగా తిరుగుబాటుచేసి తమ్మును తాము అబద్ధ ఆరాధనచే కలుషితము చేసికొన్నవి. వారి నాయకుల చెడుక్రియ బాధకు నడిపింది. దేవుడు పదేపదే హెచ్చరిక చేసినను వారు వినలేదు, ఆయనయొద్దకు రాలేదు. వారి అధిపతులు అహంకారముతో నీతిని లెక్కచేయక బలవంతముగా అపహరించెడు సింహములవలె ఉన్నారు. వారి న్యాయాధిపతులు అన్నపానములులేక అలమటించు తోడేళ్లవలె న్యాయమును పీలికలుగా చింపియున్నారు. ‘వారి యాజకులు ప్రతిష్టతమైనవాటిని అపవిత్రపరచి దేవుని ధర్మశాస్త్రమును నిరాకరించారు. అందుచేత యెహోవా వారిమీద దోషారోపణచేయుచు ‘తన కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగుచేసి రాజ్యములను సమకూర్చబోవుచున్నాడు.’—జెఫన్యా 3:8.

20, (ఎ) యెహోవా ఉగ్రత దినమందు రక్షించబడాలంటే ఏమి చేయవలెను? (బి) దేవునినుండి నిత్య ఆశీర్వాదములను అనుభవించుటకు మీరు ఎట్లు నిరీక్షించగలరు?

20 యెహోవా ఉగ్రత దినము అతివేగముగా సమీపించుచున్నది. కాబట్టి దేవుని నూతన లోకములోనికి రక్షించబడుటకు ఆలస్యములేకుండ స్వచ్ఛమైన భాషను నేర్చుకొని మాట్లాడండి. అలా చేయుటద్వారానే ప్రస్తుతమున్న ఆత్మీయ విపత్తునుండి, రాబోవు ప్రపంచ విపత్తునుండి నీవు రక్షించబడగలవు. దేవుని ఉగ్రత దినమునుగూర్చి, ఆయన రాజ్యమునుగూర్చి హృదయమునుప్పొంగజేయు వర్తమానమును యెహోవాసాక్షులు ప్రకటించుచున్నారు. ఆయన రాజరికపు మహిమనుగూర్చి ప్రకటించుటకు వారు ఎంతగా సంతోషించెదరు! (కీర్తన 145:10-13) వారితో ఐక్యమైనయెడల స్వచ్ఛమైన భాషకు మూలకారకుడు, సార్వభౌమాధిపతియైన యెహోవానుండి ఇతర ఆశీర్వాదములతోపాటు నిత్యము జీవించు నిరీక్షణను మీరు ఆనందించగలరు. (w91 5/1)

మీరెట్లు సమాధానమిస్తారు?

◻ స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుటకు కొన్ని పద్ధతులేమి?

◻ స్వచ్ఛమైన భాషను మాట్లాడుట ఎందుకు ప్రయోజనకరము?

◻ స్వచ్ఛమైన భాషను మనము క్రమముగా వాడకపోతే ఏమి సంభవించగలదు?

◻ ఒక వ్యక్తి యెహోవా ఉగ్రత దినమున రక్షించబడి నిత్య ఆశీర్వాదములను ఎట్లు అనుభవించగలడు?

[22వ పేజీలోని చిత్రాలు]

గిద్యోను ఆయన మనుష్యులు తమ బూరలను ఊది, దివిటీలను ఎత్తిపట్టుకొనిరి

[24వ పేజీలోని చిత్రాలు]

1879 నుండి చార్లెన్‌ టేజ్‌ రస్సల్‌ ఆయన సహచరులు స్వచ్ఛమైన భాషను వృద్ధిచేయుటకు దేవునిచే ఉపయోగించబడిరని స్పష్టమయినది

[26వ పేజీలోని చిత్రాలు]

స్వచ్ఛమైన భాషను మాట్లాడుటలో మీరును యెహోవాసాక్షులతో ఐక్యమయ్యారా?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి