కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 2/1 పేజీలు 4-7
  • అరాచకత్వ లోకములో నేరమును ఎదుర్కొనుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అరాచకత్వ లోకములో నేరమును ఎదుర్కొనుట
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నేర మనస్తత్వము మరియు న్యాయము
  • అభ్యాససిద్ధమైన వివేకం మరియు సాధారణ జ్ఞానం
  • దాడిచేయబడి మీరు దోచుకొనబడితే అప్పుడేమి?
  • నేరము సమసిపోయినప్పుడు
  • పోలీసులు వారి భవిష్యత్తు ఏమిటి?
    తేజరిల్లు!—2002
  • ఎందుకింతటి ఎక్కువ నేరమున్నది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • అరాచకత్వ లోకములో నేరము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • నేరముయొక్క అంతము ఇప్పుడు సమీపంగా ఉన్నది!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 2/1 పేజీలు 4-7

అరాచకత్వ లోకములో నేరమును ఎదుర్కొనుట

రాత్రిపూట బయటకు వెళ్లుటకు మీరు భయపడుచున్నారా? మీ తలుపులకు కిటికీలకు రెండు లేక మూడు తాళాలు మీకు అవసరమా? మీ కారు లేక సైకిలు ఎప్పుడైనా దొంగిలించబడిందా? మీ కారునుండి రేడియో ఎప్పుడైనా ఎత్తుకుపోబడిందా? పొరుగుప్రాంతాలలో కొన్నింటియందు మీరు భయపడుదురా?

వీటిలో దేనికైనను మీరు అవును అని సమధానమిచ్చినట్లయిన, మీరు అరాచకత్వ లోకములో నేరము నెదుర్కొనుటకు ప్రయత్నించుచున్నారు. దాని విషయమై మీరేమి చేయగలరు? మీరు ఎదుర్కొనుటకు బైబిలు సహాయపడగలదా?

నేర మనస్తత్వము మరియు న్యాయము

నేరముతోయున్న లోకములో, మూడు ప్రధానాంశములు కలవు: నేరస్థులు, పోలీసులు మరియు బలియగువారు. నేరమునకు బలికాగల వ్యక్తిగా, దానిని ఎదుర్కొనుటకు మీకు ఏమి అవసరము? ఈ మూడు రకాల మనుష్యులలో ఎవరిమీదనైనా మీరు ప్రభావము చూపగలరా? ఉదాహరణకు, నేరస్థులను మీరు మార్చగలరా?

సరే, అనేకమంది నేరస్థులు నేరమును తమ వృత్తిగా చేసికొనియున్నారు. వారు దానిని సులభమైన జీవిత మార్గముగా ఎంపికచేసికొనిరి. ‘ఇతరులు సంపాదించిన దానిమీద నీవు జీవించగల్గినప్పుడు ఎందుకు పనిచేయాలి?’ ఇది వారి తత్వముగా కన్పించుచున్నది. బలికాగల సగటువ్యక్తి పెద్దగా పోరాడకుండానే తన డబ్బును ఇచ్చివేయునని ఈ దోపిడిదొంగలకు తెలుసు. వారిని పట్టుకొనుట, జైలుకు పంపుట మొదలగునవి కష్టమే. అందువలన వారికి నేరము ప్రయోజనకరముగానే ఉంటుంది.

అంతేకాకుండా, కోర్టు వ్యవహరములు చిక్కులతో, ఎక్కువ సమయము తీసికొనుటతో ముడిపడియుండును. అనేక దేశములలో చాలాకొద్దిగా న్యాయస్థానములు, న్యాయాధీశులు, చెరసాలలు కలవు. నేరస్థుల విచారణాభారము వ్యవస్థనే ముంచివేయును. న్యాయముయొక్క చక్రములు ఎంతమెల్లగా తిరుగుచున్నవంటే, పరిస్థితి మూడువేలకు పైగా సంవత్సరముల పూర్వము బైబిలులో వర్ణించబడిన రీతిగా ఉన్నది: “దుష్‌క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయమువిడిచి హృదయపూర్వకముగా దుష్‌క్రియలు చేయుదురు.” ఈ బైబిలు సూత్రము సూచించుచున్నట్లుగా, నేరస్థుల సంఖ్యను తగ్గించుట లేక వారిని మార్చుటద్వారా పరిష్కారమునకు కొద్దిగా నిరీక్షణ కలదు.—ప్రసంగి 8:11.

రెండవ రకపు వారు అనగా, పోలీసు విషయమేమి? పోలీసువారు పరిస్థితిని చక్కబెట్టుదురను నిరీక్షణ ఏమైనా కలదా? చట్టాలు తరచు నేరస్థుల హక్కులవైపే మొగ్గు చూపుచున్నవని, నీతినియమాలు లేని న్యాయవాదులు దోషులు బయటపడులాగున చట్టాలను ఉపయోగించుచున్నారని మరిన్ని, మరింత పెద్దవైన చెరసాలల బారీ ఖర్చులను మోయుటకు సమాజములు వెనుకాడుచున్నవని, పోలీసు బలగాల సిబ్బంది తక్కువగా యుండుటతో నేరప్రవాహమును అడ్డుకొనగల్గుట తక్కువగా యున్నదని, వారంతటవారే సమాధానమిత్తురు.

దానితో ఇక మిగిలిన మూడవ రకపు ప్రజలు, బలికాగల వ్యక్తులు: అనగా మనమే, ప్రజలము. ఈ అరాచక పరిస్థితిని మరిశ్రేష్ఠమైన రీతిలో ఎదుర్కొనుటకు మనకైమనము సహాయము చేసికొనుటకు మనము చేయగలదేమైనా కలదా?

అభ్యాససిద్ధమైన వివేకం మరియు సాధారణ జ్ఞానం

బైబిలు పుస్తకమగు సామెతలు ఇట్లు చెప్పుచున్నది: “లెస్సయైన (అభ్యాససిద్ధమైన NW) జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము, . . . అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు నీ పాదము ఎప్పుడును తొట్రిల్లదు.” ఒకవ్యక్తిని బహుశ నేరమునకు బలిచేయు పరిస్థితులలో ఈ సలహా అన్వయింపబడ గలదు. ఈ రంగమందు అభ్యాససిద్ధమైన జ్ఞానము మనకు సహాయపడగల కొన్ని మార్గములేమై యున్నవి?—సామెతలు 3:21-23.

నేరస్థులు దుష్టమృగములను పోలి కాచుకొనియుందురు. సులభముగా దొరుకు ఎరకొరకు వారు చూతురు. సులభముగా బలికాగల వ్యక్తినుండి అంతే మొత్తము తాము పొందగలిగినప్పుడు, దానికొరకు పోరాడుటకు మరియు పట్టుబడు సాధ్యత విషయమై సాహసించుటకు వారు ఇష్టపడరు. కావున వృద్ధులు, రోగులు, కంగారుగా ఉండువారు, ప్రమాదకర పరిస్థితుల విషయమై అప్రమత్తంగా ఉండని వారివెంట వారు వెళ్లుదురు. దాడిచేయుటకు తమకు అనుకూలమైన స్థలము, సమయమును ఆ క్రూరులు ఎంపికచేసికొందురు. ఇక్కడే బలికాగల వ్యక్తులు అభ్యాససిద్ధమైన జ్ఞానమును ఉపయోగించ వచ్చును.

బైబిలు వర్ణించిన రీతిగా, కీడును ప్రేమించు వారు తరచు తమ పనులను అంధకారమందు చేయుదురు. (రోమీయులు 13:12; ఎఫెసీయులు 5:11, 12) ప్రజలపై, ఆస్తిపై జరిగించు అనేక నేరములు ఈనాడు రాత్రులందు జరిగింపబడుచున్నవి. (యోబు 24:14; 1 థెస్సలొనీకయులు 5:2 పోల్చుము.) కావున, జ్ఞానియైన వాడు సాధ్యమైనప్పుడు రాత్రులందు ప్రమాదస్థలములలో బయటకు వెళ్లడు. నేరముతో నిండిన న్యూయార్కు నగరములో, సూర్యాస్తమయము తర్వాత, ప్రత్యేకముగా రాత్రి పది గంటల సమయములో తమ అపార్టుమెంటుకు తిరిగివచ్చుచుండగా అనేకమంది ప్రజలు దోపిడికి గురియైనట్లు ప్రతిదిన పోలీసు నివేదిక తెల్పుచున్నది. ఈ దోపిడిదారులు బలికాగల వ్యక్తుల కొరకు చూస్తు జనసంచారము అధికముగా లేని ప్రాంతములలో ఉందురు. కాబట్టి, ఒక బస్సు లేక టాక్సి కొరకు వేచియుండుట లేదా ప్రమాదకరమైన స్థలముగుండా నడిచివెళ్లుట దీనిలో మీరు ఏదోఒకటి చేయవలసి యున్నట్లయిన, ఓపికతో వేచియుండండి. లేనట్లయిన ఎదురగు అనుభవము బాధాకరముగా ఉండును.

ఒక క్రైస్తవుడు రాత్రి పదిగంటలప్పుడు బస్సు కొరకు వేచియుండుటకు బదులు, కాస్తంత వెలుతురున్న ప్రాంతములో కొద్దిదూరముకూడ నడవకముందే తీవ్రముగా కొట్టబడి దోచుకొనబడెను. వీధిలో ఇతర మనుష్యులున్నారు, కాని ముగ్గురు దొంగలు ఆ అజాగ్రత్తపరుని చిక్కుల్లో పడవేసారు. బలికాగల ఈ వ్యక్తి వీధిలో బయలుదేరిన వెంటనే అందులో ఒకడు మిగతావారికి సైగచేశాడు. ఒక్కమాటైనా మాట్లాడకుండా వారు అతనిపై దాడిచేసి దోచుకున్నారు. దానిని వారెంత వేగంగా చేశారంటే ప్రక్కనున్నవారు సహితము జోక్యము చేసికొనుటకు సమయము లేకపోయెను. ఆ తర్వాత బలైన ఆ వ్యక్తి ఇలా అంగీకరించాడు: “ఇంకొకసారి నేను బస్సుకొరకు వేచియుందును.”

డిక్కెన్‌ వ్రాసిన నవల ఒలివర్‌ ట్విస్ట్‌ పాత్రధారి, యువకుడైన జేబుదొంగ, ఆధునిక వీధి నేరములకు సంబంధించి సరియైన చిత్రీకరణగా యున్నాడు. పాత్రయందలి తప్పించుకొనిపోవు దొంగవలె కాకుండా, ఈనాటి దొంగలు, దోచుకొనువారు వయస్సుతో పరిమితము లేకుండా, ఒక తుపాకి లేక కత్తిని తమవెంట తీసుకువెళ్లుదురు మరియు దానిని ఉపయోగింతురు. అజాగ్రత్తగావున్న యాత్రికులు, సందర్శకులు, రద్దీగావున్న నగరములో ఊరకనే అటునిటుచూస్తు వెళ్లేవారు, దేనికివెనుకాడని అటువంటి అపరాధకుల లక్ష్యమైయుందురు. కన్నుమూసి తెరిసేలోగా వారు వారికి దొరికినది దొంగిలించుకొని వెళ్లిపోవుదురు! దొంగకు ఏది గుబులు పుట్టించును? కనబడేలాగున ధరించిన బంగారపు గొలుసో లేక వెలగల ఆభరణాలో. లేక ఒక యాత్రికుని మెడలో వ్రేలాడుచుండిన కెమెరాయో. అది “వచ్చి నన్ను తీసికో!” అను సూచికను ధరించుటకు సమానమై యుండును. అందువలన, వివేచన అవసరము. ఏ ఆభరణములనైనను కనబడనీయవద్దు, మరియు కెమెరా అందరికి కనబడునట్లు తీసికెళ్లకుము, బహుశ దానిని షాపింగ్‌ సంచిలో దాచుకొనవచ్చును. ఇది అభ్యాససిద్ధమైన జ్ఞానము.

నేరమును ఎదుర్కొనుటకు జాగ్రత్తగా ఉండుట మరొక మార్గమై యున్నది. బైబిలు ఇట్లు చెప్పుచున్నది: “జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు.” (ప్రసంగి 2:14) నేర సమస్యకు ఈ హెచ్చరికను అన్వయించుట, ఏ పనిలేక అనుమానాస్పదముగా తిరుగుచున్న వారిని గమనించుటకు నడిపించును. నీవు పేవ్‌మెంట్‌పై నడచుచుండగా నీ వెనకాలేవచ్చి నీ సంచిని లాక్కొని పారిపోగల దొంగలను కనిపెట్టుము. అలా వెళ్తూవెళ్తూ ప్రజల సామగ్రిని లాక్కొనివెళ్లుటకు కొందరు సైకిళ్లపై పోవుచుందురు, కావున ఎన్నడును పేవ్‌మెంటు అంచున నడువకుము, ప్రత్యేకముగా బ్రీఫ్‌కేసుతో లేక చేతిసంచితో వెళ్లునప్పుడు. దాదాపు ఖాళీగావుండే సబ్‌వే కార్లలో వెళ్లకుము. ఎక్కువ వెలుతురు ఎక్కువ ప్రజలున్న ప్రాంతములలో నీవు సురక్షితముగా ఉందువు. దొంగలు తాము గమనింపబడుట మరియు గుర్తింపబడుటను కోరుకొనరు.

ప్రజలు ఎక్కువగా నేరము విషయమై అప్రమత్తంగా ఉన్నట్లయిన మరొక సాధారణమైన నేరమగు కన్నపు దొంగతనమును తరచు దూరము చేయవచ్చును. బైబిలు సరియైన రీతిలో ఈ పోలికను ఉపయోగించినది: “దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.” (యోవేలు 2:9) అభ్యాససిద్ధమైన జ్ఞానము కిటికీలు, తలుపులు తాళము వేయకుండా వదలవద్దని నీకు ఆదేశించును. బాగుచేయుట కంటే ముందే దానిని అడ్డుకొనుట ఎంతో శ్రేష్ఠమనుట అన్నిసమయములలో నిజమైయున్నది. మీ ఇంటిని కాపాడుకొనుటకు చేయు అదనపు ఖర్చు నిజముగా దొంగతనము మరియు శరీరహానికి వ్యతిరేకముగాచేయు భీమాయైయండును.

దాడిచేయబడి మీరు దోచుకొనబడితే అప్పుడేమి?

అవును, మీరెన్ని జాగ్రత్తలు తీసికొన్నను, మిమ్ములను దోపిడిదొంగ ఆపుజేసినట్లయిన అప్పుడేమి? గాభరా పడకుండుటకు లేక తొందరపడి పరుగెత్తకుండుటకు ప్రయత్నించండి. గుర్తుంచుకొనండి దొంగకూడ భయపడుతూ వుండవచ్చు మీ చర్యలను అతడు తప్పుగా భావించవచ్చును. అతడు లేక ఆమె (అవును, మీపై దాడిచేయుటకు వచ్చిన వ్యక్తి స్త్రీయైకూడా వుండవచ్చును.) అనుమతించినట్లయిన ఆ వ్యక్తితో మాట్లాడుటకు, తర్కించుటకు ప్రయత్నించుము. తాము మంచివాడైన మరియు నిజమైన క్రైస్తవుని ముట్టడించుచున్నామని తెలిసికొనుటద్వారా కొన్నిసార్లు దోపిడిదొంగలు మెత్తబడిరి. ప్రతిస్పందన ఎట్లున్నను, వారు కేవలము మీ డబ్బు లేక సామగ్రిని మాత్రమే కోరుచున్నట్లయిన ఎదిరించుటకు ప్రయత్నించకుము. వారడుగు దేనినైనను ఇచ్చివేయుము. ఒక వ్యక్తి కలిగియున్న దేనికంటెను అతని ప్రాణము విలువైనదని బైబిలు బోధించుచున్నది.—మార్కు 8:36 పోల్చుము.

నిశితముగా పరీక్షించుచున్నట్లు కాకుండా, దొంగయొక్క ప్రత్యేక లక్షణములను, అనగా అతడు వేసుకున్న దుస్తులను లేక అతని ఆకారమును గమనించుటకు ప్రయత్నించుము. అతడెటువంటి ఉచ్ఛారణను కలిగియున్నాడు? నేరమును పోలీసుకు తెలియజేయునప్పుడు ఈ వివరములన్నియు ఉపయుక్తమగును, ఎందుకంటే అనేకమంది నేరస్థులు క్రమముగా ఒకే విధమైన తమదైన శైలిలో మాట్లాడుట ప్రవర్తించుట చేయుదురు కావున వారిని మరింత సులభముగా గుర్తించవచ్చును.

ఆత్మ-రక్షణ కొరకు ఏదైనా ఒక ఆయుధమును వెంటతీసుకు వెళ్లుట విషయమేమి? ఒక క్రైస్తవుడు ఆయుధములు వెంటతీసుకు వెళ్లుట నిశ్చయముగా జ్ఞానయుక్తము కాదు. మీరు ఆయుధము తీయబోవుచున్నారని దొంగ కనిపెట్టిన వెంటనే, అతడు మిమ్ములను గాయపరచుటకు లేక హత్య చేయుటకు పూనుకొనును. అంతేకాకుండా, నీవు హింసాయుత ప్రతిదాడికి ఆయుధములు ధరించినట్లయిన, “సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అను బైబిలు సూత్రమును ఎట్లు అనుసరించగలవు?—రోమీయులు 12:18.

ఎన్ని జాగ్రత్తలు తీసికొన్నను, ఏదో ఒకరోజు నీవు దోపిడికి గురికావను అభయమేమియు లేదు. నేరము విస్తారమైయున్న నగరములలో, కావల్సిందల్లా నీవు సరికాని స్థలములో సరికాని సమయములో ఉండుటయే. ఇది జరిగి ఎంతోకాలము కాలేదు, న్యూయార్కులో ఒక న్యాయవాది ఓ కప్పు కాఫీ త్రాగుదామని తన ఆఫీసునుండి బయటకు వచ్చాడు. ఆయన బడ్డీలోకి ప్రవేశించుచుండగా, కొందరు యువకులు అక్కడకు పరుగెత్తుకొనివచ్చి ఆ స్థలాన్ని ముట్టడివేశారు. ఆ దాడిలో న్యాయవాది తలలోనుండి తుపాకిగుండు దూసుకుపోగా ఆయన అక్కడిక్కడే చనిపోయాడు. ఎందుకనగా, “కాలము మరియు అనుకోని సంఘటన జరిగినందున,” ఆయన తన ప్రాణము పోగొట్టుకొనెను. ఎంత విచారకరము! లోకమును ముంచివేయుచున్న ప్రస్తుత నేర ప్రవాహమునకు శాశ్వత పరిష్కార నిరీక్షణ ఏమైనా కలదా?—ప్రసంగి 9:11 NW.

నేరము సమసిపోయినప్పుడు

క్రితమందలి ఏ తరము కంటెను మరింత భయంకర సంఘటనలు చూచు తరము వచ్చునని, దాదాపు రెండువేల సంవత్సరముల పూర్వము యేసు ముందుగనే చెప్పెను. దూరదర్శిని మరియు తక్షణ సమాచారము ద్వారా, లక్షలాది, కాదు కోట్లాదిమంది ప్రజలు తమ స్థానిక వార్తలలో జరుగుచున్న భయంకర పాశవిక చర్యలను కళ్లారా చూచుచున్నారు. లోకము ఒక గ్రామమువలె అయినది, ప్రపంచవార్తలు ఆ మరుక్షణమే స్థానిక వార్తలగుచున్నవి. తత్ఫలితముగా, ప్రతిదినము వాస్తవికత ఇంటిని తట్టుచున్నది, మరియు యేసు ప్రవచించినట్లుగా, “లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు.”—లూకా 21:26.

పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరమునుండి జరిగిన సంఘటనలను, “యుగసమాప్తికి” ముందు జరుగు సంఘటనల్ని యేసు ముందుగనే చూసెను. (మత్తయి 24:3-14) అయితే ఆయన ఇట్లుకూడ తెల్పెను: “మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి.” (లూకా 21:31) అనగా త్వరలోనే దేవుని నీతియుక్తమైన పరిపాలన నాటకీయమైన రీతిలో భూమిపై ప్రభావము చూపునని దాని భావము.—మత్తయి 6:9, 10; ప్రకటన 21:1-4.

ఆ పరిపాలన క్రింద, కేవలము దీనులు, సమాధానపరచువారు, మరియు దేవునికి విధేయులగు వారు మాత్రమే భూపరదైసు పరిస్థితులలో భాగము వహింతురు. కీడు చేయువారికి మరియు నేరస్థులకు ఏమి సంభవించును? “వారు గడ్డివలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలెనే వాడిపోవుదురు. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.”—కీర్తన 37:2, 9.

సమాధానకరమైన మరియు శాశ్వతమైన లోక ప్రభుత్వముయొక్క ఈ బైబిలు-ఆధారిత నిరీక్షణను గూర్చి మీరు మరియెక్కువ నేర్చుకొనగోరినట్లయిన, మీ పొరుగునున్న లేక స్థానిక రాజ్యమందిరములో యెహోవాసాక్షులను కలిసికొనుము. ఎలాంటి ఖర్చులేకుండా, బైబిలును అర్థము చేసికొనుటకు మీకు వారు సంతోషముతో సహాయపడుదురు. (w91 1/5)

[6వ పేజీలోని బాక్సు]

“కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.”

[7వ పేజీలోని చిత్రాలు]

చార్లెన్‌ డిక్కెన్స్‌ జేబుదొంగ పాత్రధారి, క్రొత్తతరహాలో ఆధునిక దోపిడిదొంగలకు పోలికగాయున్నాడు

[క్రెడిట్‌ లైను]

Graphic Works of GEORGE CRUIKSHANK, by Richard A. Vogler, Dover Publications, Inc.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి