కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 5/1 పేజీ 30
  • విశ్వాసమందు స్థిరులైయుండుడి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విశ్వాసమందు స్థిరులైయుండుడి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దైవిక సూత్రములపై ఆధారపడిన ప్రవర్తన
  • సహనము ఆశీర్వాదములను తెచ్చును
  • మన అమూల్యమైన విశ్వాసమును గట్టిగా పట్టుకొని ఉందాము!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • వివాహిత జంటలకు జ్ఞానవంతమైన మార్గనిర్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • మేకప్‌ వేసుకోవడం, నగలు పెట్టుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 5/1 పేజీ 30

విశ్వాసమందు స్థిరులైయుండుడి!

మొదటి పేతురునుండి ఉన్నతాంశములు

యెహోవా సాక్షులు అనేక శ్రమలను లేదా తమ విశ్వాసమును గూర్చిన పరీక్షలను ఎదుర్కొనుచున్నారు. కొన్ని దేశములలో గొప్పహింస ఉన్నను వారు తమ రాజ్యప్రచారపు పనిని చేయుచున్నారు. దేవునితో వారికిగల సంబంధమును నాశనముచేయుటకు యివి మరి యితర ప్రయత్నముల వెనుకనున్నవాడు అపవాదియైన సాతాను. కాని అతడు విజయమొందజాలడు, ఎందుకంటె యెహోవా తన సేవకులను విశ్వాసమందు స్థిరముగా, అవును, దృఢముగా చేయును.

“అనేక విధములైన శోధనలచేత దుఃఖించుచున్న” ‘తన సహోదరులను బలపర్చుటకు’ అపొస్తలుడైన పేతురునకు ఆధిక్యత యివ్వబడెను. (లూకా 22:32; 1 పేతురు 1:6, 7) దాదాపు సా.శ. 62-64లో బబులోను నుండి వ్రాసిన తన మొదటి పత్రికలో అతడలా చేసాడు. అందులో పేతురు, యూదయ మరియు అన్యులనుండి క్రైస్తవులైన వారికి సలహా ఓదార్పు మరియు ప్రోత్సాహమునిచ్చి సాతాను దౌర్జన్యములకు తట్టుకొని “విశ్వాసమందు స్థిరులై యుండుటకు” వారికి సహాయముచేసెను. (1 పేతురు 1:1, 2; 5:8, 9) ఇప్పుడు అపవాదియొక్క సమయము దగ్గరపడింది అతని దాడులు మరీ తీవ్రమగును, పేతురుయొక్క ప్రేరేపిత మాటలనుండి యెహోవా ప్రజలు నిశ్చయంగా ప్రయోజనము పొందగలరు.

దైవిక సూత్రములపై ఆధారపడిన ప్రవర్తన

మన నిరీక్షణ పరలోకసంబంధమైనదైనా లేక భూసంబంధమైన దైనా, శోధనలను సహించి దైవిక మార్గములో నడచుకొనునట్లు అది మనకు సహాయముచేయవలెను. పరలోక స్వాస్థ్యము పొందు నిరీక్షణ అభిషక్తులను శోధనలలో సంతోషించునట్లు చేయును, నిజంగా అది వారి విశ్వాసమును శుద్ధిచేయుచున్నది. క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన ఆత్మీయ గృహమువలె దేవునికి అంగీకృతమగు బలులను వారు అర్పించి, ఆయనకు మహిమను తెచ్చు శ్రేష్టమైన విధముగా తాము నడచుకొనుచున్నారు.

మనతోటి మానవులందరితో గల మన వ్యవహారములు దైవిక సూత్రములచే నడిపించబడవలెను. (2:13-3:12) మానవ పాలకులకు మనము లోబడి యుండాలని పేతురు చూపెను. దాసులు తమ యజమానులకు, భార్యలు తమ భర్తలకులోబడియుండాలి. క్రైస్తవ భార్యయొక్క దైవిక ప్రవర్తన తన అవిశ్వాస భర్తను నిజమైన విశ్వాసమునకు రాబట్టును. విశ్వాసియైన భర్త ‘బలహీనమైన ఘటమని తన భార్యను సన్మానించవలెను.’ క్రైస్తవులందరు, ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపొంది, సహోదర ప్రేమకల్గి మేలుచేయుచు సమాధానమును వెంటాడవలెను.

సహనము ఆశీర్వాదములను తెచ్చును

శ్రమల విషయములో నిజక్రైస్తవుల నమ్మకమైన సహనము ఆశీర్వాదములను తెచ్చును. (3:13–4:19) ఒకవేళ మనము నీతి విషయములో శ్రమపడినయెడల, మనము సంతోషించాలి. అంతేకాదు, మనలను దేవునియొద్దకు తెచ్చుటకు క్రీస్తు శరీరవిషయములో శ్రమపడెను గనుక ఇకమీదట మనము శరీరాశలనుబట్టి జీవించకూడదు. శోధనలను మనము సహించిన యెడల, యేసు ప్రత్యక్షతనందు మహానందములో పాలుపొందుదుము. క్రీస్తునామము నిమిత్తము, లేదా ఆయన శిష్యులముగా నిందపాలైన యెడల యెహోవా ఆత్మను మనము కల్గియున్నామని అది రుజువు పర్చుచున్నది గనుక సంతోషమును కలుగజేయును. కనుక దేవుని చిత్తమునుబట్టి మనము శ్రమపడినట్లయితే ఆయనకు మనలను మనము అప్పగించుకొని మేలు చేయుటయందు కొనసాగుదము.

క్రైస్తవులముగా మన కర్తవ్యములను నమ్మకముగా కొనసాగించి, దేవునియొక్క బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులమై ఉందము. (5:1-4) పెద్దలు దేవుని మందను ఇష్టపూర్వకముగా కాయవలెను, యెహోవా మనలను నిజంగా లక్ష్యము చేయుచున్నాడని ఎరిగి, మనలో ప్రతి ఒక్కరము మన చింతయావత్తు ఆయన మీద వేయుదము. మనమెదుర్కొనుచున్న శ్రమలనే మన సహోదరులు కూడ ఎదుర్కొనుచున్నారని యెరిగి ఎన్నటికి కృంగిపోక సాతానును కూడ మనము ఎదిరించవలెను. యెహోవా దేవుడు మనలను బలపర్చి, విశ్వాసమందు స్థిరులమైయుండునట్లు చేయునని ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకొనుము. (w91 3/15)

[30వ పేజీలోని బాక్సు/చిత్రం]

స్త్రీల అలంకరణ: క్రైస్తవ స్త్రీలకు సలహానిచ్చుచు పేతురు యిట్లనెను: “జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.” (1 పేతురు 3:3, 4) సా.శ. మొదటి శతాబ్ద కాలములో అన్యస్త్రీలు తరచు శృంగారమైన కేశాలంకరణ చేసికొని తమ పొడవాటి జుత్తును డంబమైన రూపములలో జడలు అల్లి ఆ జడలలో బంగారు ఆభరణములను పెట్టుచుండేవారు. బహుశ అనేకులు ప్రదర్శించుటకు అలా చేసియుండవచ్చు—అది క్రైస్తవులకు తగదు. (1 తిమోతి 2:9, 10) అయితే, అన్ని రకముల అలంకరణ తప్పుకాదు, ఎందుకంటె “వస్త్రములు ధరించుకొనుట” అనుదానిని కూడ పేతురు చేర్చాడు, అది అవసరతయైయున్నది. ప్రాచీన కాలమందలి దేవుని సేవకులచే బంగారు ఆభరణములు వాడబడినవి. (ఆదికాండము 24:53; నిర్గమకాండము 3:22; 2 సమూయేలు 1:24; యిర్మీయా 2:32; లూకా 15:22) అయినప్పటికిని సొగసైన ఆభరణములను శరీరేచ్చల సంబంధిత అలంకరణను క్రైస్తవ స్త్రీ జ్ఞానయుక్తంగా విడనాడును మరియు ఏదైనా పరిమళ ద్రవ్యములను వాడితే తగుమాత్రంగా ఉండునట్లు జాగ్రత్తపడును. తాను అంతరంగమైన అలంకరణకు ప్రాధాన్యతనివ్వాలే తప్ప బాహ్యమైన దానికి కాదని అపొస్తలుని సలహాయొక్క భావము. తాను నిజంగా ఆకర్షణీయంగా ఉండాలంటే, తగుమాత్రపు దుస్తులు ధరించుకోవాలి. మరియు దేవునికి భయపడు స్వభావాన్ని కల్గియుండాలి.—సామెతలు 31:30; మీకా 6:8.

[క్రెడిట్‌ లైను]

Israel Department of Antiquities and Museums; Israel Museum/David Harris

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి