కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 3/1 పేజీలు 3-4
  • మతము—ఆసక్తి ఎందుకు లోపించుచున్నది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మతము—ఆసక్తి ఎందుకు లోపించుచున్నది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎందుకు మతమును గంభీరముగా తీసికొనవలెను?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మతాలు దేవునికి ఎలా చెడ్డపేరు తెస్తున్నాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మతం దానివల్ల మీకు ప్రయోజనమేదైనా ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 3/1 పేజీలు 3-4

మతము—ఆసక్తి ఎందుకు లోపించుచున్నది?

“మతము లేని మనుష్యుడు కిటికీలు లేని ఇంటివలె నున్నాడు” అని ఒక జపానీయుడనెను. తన కుమారుడు విట్సుకు మత జ్ఞానోదయమవసరమని తెల్పుచూ అతడిట్లనెను. అయినను, మిట్సు తన తండ్రి మాటలను గంభీరముగా తీసికొనలేదు. ఇదేవిధముగా భావించు ప్రజలు ఇతర చోట్లవలె, జపానులోకూడ పెరుగుచున్నట్లున్నది. ‘కిటీకీలు లేని ఇళ్లవలె’ నుండుటతో వీరు తృప్తిపడుచు, వారి జీవితములలో మత సంబంధమైన వెలుగు ప్రకాశింపనిచ్చుటలో ఆసక్తిని కనబర్చుటలేదు.

కావున, జపానులో జాతీయ స్వభావమును అధ్యయనము చేసినప్పుడు, 69 శాతము ప్రజలు తాము మత సంబంధమైన వ్యక్తులుగానట్లు తెల్పిరి. పిన్నవయస్కులలో ఈ శాతము యింకా పెరిగినది. ఆలాగే ఒకనాడు పవిత్ర బౌద్ధమత దేశమనబడిన థాయ్‌లాండ్‌లో, పురపాలక పరిధిలో నివసించు వారిలో 75 శాతము మంది బౌద్ధదేవాలయముల కేమాత్రము వెళ్లుటలేదు. ఇంగ్లాండులో గత 30 ఏళ్లలో ఎనిమిదింట ఒకటి చొప్పున ఆంగ్లికన్‌ చర్చీలు, మూసివేయుచు వచ్చిరి. కారణమేమనగా వాటిని ఉపయోగించువారు లేరు.

అయినను, జపానులో మత ఉచ్చులు యింకా అగుపడుచున్నవి. కానీ ఖరీదైన చైనీయుల పింగాణీ వస్తువులవలె, అరుదైన సందర్భములలో—అనగా వివాహము, అంత్యక్రియల సమయములలో అవి బయటకు తేబడుచున్నవి. ఆత్మీయ జ్ఞానోదయము కన్న, ప్రాంతీయ సంస్కృతికి, కుటుంబ వారసత్వమును కాపాడుటలో అది నిర్వహిస్తున్న పాత్రనుబట్టి మతమును గౌరవించుచున్నారు. మతమనగా బలహీనులయొక్క, కలవరపడువారియొక్క స్థలమని చాలామంది దృష్టింతురు; దానినుండి స్పష్టమైన ఏ ప్రయోజనములు పొందు విషయమును వారు చూడలేక పోతున్నారు. ‘మతమవసరమని నీవు భావించినప్పుడు లేక దానికొరకు నీకు సమయమున్న, అది ఉండుట మంచిదే. కానీ, జీవించుటకు, నీ బిల్లులు కట్టుటకు నీవు నీపైనే ఆధారపడవలెనని’ కొందరందురు.

కాని ఈ నిర్లక్ష్యవైఖరి వెనుక ఏమున్నది? చాల కారణములు చెప్పవచ్చును.—మొదటగా, సాంఘిక వాతావరణము గలదు. చాలామంది యువకులు మతసంబంధమైన శిక్షణను కొంచెమైనను లేక అసలే తీసికోలేదు. కాబట్టి ధనార్జనకు ప్రాధాన్యతనిచ్చు సంఘములో జీవించు అనేకులు ఐశ్వర్యాసక్తిగల వ్యక్తులుగా తయారగుటలో రవ్వంతైనను ఆశ్చర్యములేదు.

మతము రాజకీయ వ్యవహారములందు, యుద్ధ ప్రయత్నములందు కలుగజేసికొని ప్రజలను మతమునుండి దూరము చేసినది. అట్లే కొన్ని దేశములలో దురాశపరుల, అవినీతి టి. వి. సువార్తికుల, ప్రముఖ మతనాయకుల కుంభకోణ ప్రవర్తన కూడ అట్లు చేసినది. జపానులో షింటో మతము విషయములో ఏమైనదో అది దీనిని వివరించుచున్నది. “1945 ఆగష్టులో అపజయముతో యుద్ధము (రెండవ ప్రపంచ యుద్ధము) ముగియగా షింటో ఆలయములు తీవ్ర దుస్థితిని ఎదుర్కొనినవి” అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ జపనీస్‌ రెలిజియన్స్‌, వివరించినది. విజయము తథ్యమని, యుద్ధమునకు పురిగొల్పిన షింటో మతము ప్రజలను నిరుత్సాహపర్చినది. దేవుడు లేక బుద్ధుడు లేడను తత్వము వేగముగా ప్రచారమైనది.

అయినను, స్వప్రయోజనములతోనో, దూరదృష్టిలేని దృక్పధములతోనో మనము తృప్తిపడవలయునా?—ఇప్పుడే, ఇక్కడే? చాలామంది మానవులు అన్వేషణా మనస్సుతో ఉన్నారు. వారు ఎక్కడినుండి వచ్చిరో, ఎక్కడికి వెళ్లుచున్నారో, ఎందుకు జీవించుచున్నారో, ఎలా జీవించాలో తెలిసికొనగోరుచున్నారు. నిరీక్షణతో వారు ముందుకు పోతున్నారు. జీవితమునుగూర్చిన ప్రశ్నలను ప్రక్కకునెట్టుట లేక “ఈ సంగతులు తెలిసికొనలేము” అని అణచివేయుట మానవులను తృప్తిపరచదు. “లోకములోనున్న దానిని మించి దేనికొరకో వెదకుట—అనే ఆశ్చర్యకరమైన కఠిన బాధ” ఉన్నట్లుగా నాస్తికుడైన బెర్ట్‌రాండ్‌ రస్సెల్‌ కూడ మాట్లాడెను. నిజమైన మతము ఆ అన్వేషణను ఆపగలుగును. కాని ఎట్లు? అంత గంభీరముగా తీసికొను నిదర్శనమును ఏమతమైనను, కలిగియున్నదా? (w91 2/1)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి