ఎందుకు మతమును గంభీరముగా తీసికొనవలెను?
“మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించలేడు.” (మత్తయి 4:4, ది న్యూ ఇంగ్లీషు బైబిల్) తరచూ చెప్పబడు ఈ మాటలు, నేడు కనుమరుగైన మానవ అవసరతను తెల్పుచున్నవి. మన నిర్మాణములో ఆత్మీయభాగమున్నదని, దానియవసరతలను తీర్చవలసి ఉన్నదని అవి సూచించుచున్నవి. అందువలననే ఈ మాటలు పలుకుచున్న యేసుక్రీస్తు, యింకా యిట్లనెను: “తమకు దేవుని అవసరత నెరిగిన వారు ఎంతో ధన్యులు.”—మత్తయి 5:3, NEB.
మతము మాత్రమే మనకున్న “దేవుని అవసరతను” తీర్చగలదు. ఆరంభము, సంకల్పము, మరియు జీవితమున కర్థములను గూర్చిన ప్రాథమిక ప్రశ్నలకు మతము మాత్రమే జవాబివ్వగలదు. మన జీవితమున కర్థము మరియు సారమును కేవలము మతము మాత్రమే యివ్వగలదు. కానీ ఏ మతంబడితే ఆ మతం యిదంతయు చేయలేదు. సమరయ స్త్రీతో యేసు ఇట్లు చెప్పెను: “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించుదురు.” (యోహాను 4:23) ‘సత్యముతో’ ఆరాధించుటయొక్క భావమేమనగా ఎంతోకాలమునుండి గౌరవించబడుచున్న సంప్రదాయములను, ఆచారములను పాటించుటకన్న మించినదై యున్నది. ఈ ఆచారములు వీటిని పాటించు వారికి తరచు క్షేమముగా ఉన్నామనే తాత్కాలిక భావన కలిగించుచు, వారిని ఆత్మీయముగా ఆకలితో వదలివేయుచున్నవి.
ఉదాహరణకు, యింతకుముందు జపానులో అమెరికా రాయబారిగా పనిచేసిన ఎడ్విన్ ఒ. రిస్‌చర్, ఇట్లు అభిప్రాయపడెను: “చాలమంది ప్రజలకు, షింటో మరియు బౌద్ధమతములు, అర్థవంతమైన నమ్మకములు గలవాటికన్న ఎక్కువగా సంప్రదాయమే, ఒక వాడుక ఆయెను.” చాలమంది జపాను ప్రజలు, ఎట్టి ప్రయత్నము లేకుండా లభించిన వారి మతముతో ఆలాగే నుండుటకు తృప్తిపడుచున్నారు. కానీ జపానులో “క్రొత్త మతములు” పుట్టుకొచ్చినవి. ఇవి తమ సాంప్రదాయ మతము యెడల పెరుగుచున్న వారి అసంతృప్తిని ప్రతిబింబించుచున్నవి.
“క్రొత్త మతములు” తమ ప్రియతమ నాయకునిపై కేంద్రీకరించుచున్నవిగాని—దేవునిపై కాదు. చాలమంది ఈ మతనాయకులు దేవునిచే ప్రేరేపించబడిరని చెప్పుకొనుచున్నారు. కానీ వాటి సిద్ధాంతములు, అంతరించిపోతున్న బౌద్ధ, షింటో, మరియు ఇతర మతముల విశ్వాసములు మెరుగుపర్చబడి, వాటిని స్థాపించిన నాయకుల వేదాంతముతో నిండినవై యున్నవి. వారిపిలుపు, వాగ్దానము చేయబడిన మంచి జీవితము మరియు అతీతమైన లేక స్వస్థపరచు శక్తులపై తరచు ఉంటున్నది. కానీ ఈ మతములు, వాటిననుసరించుచున్న వారికి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించునట్లు వారికి బోధించుచు, రుజువు చేసికొనుచున్నవా? అట్టివి అరుదు. ఒక విషయమేమనగా, మత విధానములు నేడు ఉంటున్నవి, రేపు పోతున్నవి. వెర్రిగానుండు వారి అభిమానము వాటిని గంభీరముగా తీసికొనుటకు కారణమేమి లేకుండా చేయుచున్నది.
గంభీరముగా తీసికొనవలసిన ఒక మతము
అయినను, మన పరిధిలోనే ఒక మతమున్నది. ఏ యితర ఆరాధనా పద్ధతి తీసికొన్ననూ, అది యింకా ముందునుండే ఉన్నది. అది పరిశుద్ధ బైబిలునుండి బోధింపబడిన మతము. 35 శతాబ్దములకు పూర్వము బైబిలు వ్రాయబడుటకు ప్రారంభమయ్యెను. దాని ముందటి అధ్యాయములలో భద్రము చేయబడి కొన్ని ‘చరిత్రలు,’ అంతకుముందు కాలము వేయి సంవత్సరములకు పైగానున్న కాలమునకు చెందినవి.a మతముయొక్క ప్రారంభములను గూర్చి లభ్యమగు పురాతన వృత్తాంతములందు గలవు. బైబిలు మతమును గంభీరముగా పరిశీలించుటకు అది ఒక్కటే కారణము.
బైబిలునుగూర్చి ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా యిట్లు చెప్పుచున్నది: “దానివెలుగు ‘లోకమంతటిలోనికి వెళ్లెను.’ ఇప్పుడది నైతిక మరియు మతమునకు నిధియని దృష్టింపబడుచున్నది. ప్రపంచ నాగరికతనుగూర్చిన ఆశ పెరుగుచుండగా తరగని దానిబోధ యింకా విలువైనదిగా అభయమిచ్చుచున్నది.” ఒక పుస్తకము నిజమైన మతమునకు నమ్మదగిన నడిపింపైనచో అది విశాలముగా ముద్రించబడవలయునని, సత్యమును వెదకువారికి అందుబాటులో నుండవలయునని నీవు ఆశించవా?
బైబిలు విషయము ఆలాగే ఉన్నది. అది 1,928 భాషలలోనికి పూర్తిగానో లేక కొంత భాగమో తర్జుమాచేయబడినది. చరిత్రలో అది చాలా విస్తృతముగా ముద్రించబడిన పుస్తకము. అదియునుగాక అది చారిత్రకముగా మరియు విజ్ఞాన శాస్త్రీయముగా సరిగా నున్నట్లు నిరూపించబడినది. బైబిలు ప్రవచనములు చాలా ఖచ్ఛితముగా నెరవేరినట్లు పురావస్తు శాస్త్రము మరియు చరిత్ర నిరూపించుచున్నవి. అభిచారము, మర్మము, నిగూఢ శక్తుల మతములనుండి యిది స్వతంత్రముగా నున్నది. దేవునిచే ప్రేరేపించబడినదని బైబిలు తానుగా చెప్పుకొనుచున్నదానితో యిది పొందిక కలిగియున్నది.b—2 తిమోతి 3:16.
నిజమైన మతముయొక్క “ఫలములు”
బైబిలు ననుసరిస్తున్నామని అనేక మతములు చెప్పుకొనుట వాస్తవము కాదా? క్రైస్తవులమని చెప్పుకొనెడి వారిలో కలహములు, శత్రుత్వము మరియు వేషధారణ అగుపడుట లేదా? అవును, కానీ బైబిలును నిరాకరించుటకు యిది కారణము కారాదు. క్రైస్తవ మతము పాటించెడి వారనేకులు దేవునిచేత తిరస్కరింపబడుదురని యేసుక్రీస్తు స్వయముగా సూచించెను. (మత్తయి 7:13, 14, 21-23 చూడుము.) అయితే బైబిలులో బోధింపబడిన సత్యమైన మతమును పాటించు వారిని ఒకడు గుర్తించుట ఎలా? యేసు ఇట్లు జవాబిచ్చెను: “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికిమాలినచెట్టు కాని ఫలములు ఫలించును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలిసికొందురు.”—మత్తయి 7:16, 17, 20.
నిజమే. తమ ఆరాధికులలో మంచికి, ప్రయోజనకరమైన ఫలితములకు సత్యమైన మతము బలముగల శక్తిగా నుండవలయును. ఉదాహరణకు జపానీయుడైన ఆకినోరిని తీసికొనుము. ఆయన స్వంత మాటలలో అతడు “పోటీ స్వభావమునకు ప్రతిరూపము.” అతడు పేరుగాంచిన విశ్వవిద్యాలయమునుండి పట్టభద్రుడగుటద్వారా తన ఆశయములను విజయవంతముగా సాధించెను. ప్రతిష్టనొందిన వ్యాపార సంస్థలో ఉద్యోగము పొందెను. తనయొక్క జీవితములో మతముండవలయునని అతడు భావించలేదు. ‘మతము బలహీనుల కొరకని, వారు ఆనుకొను కర్రవంటిదని’ అతడు భావించెను.
అంతయు సవ్యముగా జరుగుచుండెను. చివరకు వత్తిడి, అలసటవలన అతడు అపాయకరమైన రోగముతో దిగిపోయెను. ఆయన మెడ జరిగెను. గడ్డము ఎడమ భుజమువద్ద “అంటుకు” పోయెను. ఆకినోరి వ్యాపార సంస్థలోని అనేకమంది “స్నేహితులు” అతని దురవస్థలో అతని నోదార్చలేకపోయిరి. (సామెతలు 17:17 పోల్చుము.) అందువలన అతడు మత్తుపానీయముల ఊబిలోనికి మునిగిపోయెను. ప్రాణము తీసికొనవలయునని కూడా అతడాలోచించెను.
అయినను, యింతలో ఆకినోరి భార్య యెహోవాసాక్షుల వద్ద బైబిలు పఠనము ప్రారంభించెను. ఒకరోజు సంభాషణలో గలతీయులు 6:7 నందుగల లేఖనమునుగూర్చి ఆమె అతనితో చెప్పెను. అది యిట్లు చదువబడుచున్నది: “ఒక మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.” ఈ మాటలకు ఆశ్చర్యపడినవాడై, ఆకినోరి ఆమెతో పఠనములో చేరెను. అతడు నేర్చుకొనినది, జీవితము యెడలగల అతని దృష్టిని మార్చివేసెను. ఆకినోరి దృక్పధము ప్రకాశవంతమైనందున, ఒత్తిడిద్వారా చొప్పించబడిన అతని బాధ అదృశ్యమగుట కారంభమయ్యెను. ఒక బైబిలు సామెత చెప్పినట్లుగా: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.” (సామెతలు 14:30) నిజమే, సత్యమైన మతము మంచి ఫలములను ఫలించును!
నిజమైన మతము ఎట్లు మంచికి నడిపించగల శక్తియో చూచుటకు వచ్చిన మరొక జపానీయుడు తోషిరో. మతము ననుసరించుటలో విలువగలదని అతడు నమ్మినప్పటికి, దానిని గురించి అతడేమియు చేయలేదు. తన స్వంత యింటిని సంపాదించుటకే అతని ఆసక్తిని కేంద్రీకరించెను. అయినను, అతని ఆశయసిద్ధి అతనాశించిన తృప్తినివ్వలేదు. పైగా అతను పనిచేయు స్థలమును చూడగా అక్కడ కపటముతో కూడిన జీవితము సర్వసాధారణమయ్యెను. తద్వారా వ్యక్తిగత సంబంధములు చెడిపోయెను. తాను చూచిన దానితో తోషిరో విసుగుచెందెను.
ఆయనను దర్శించుమని ఒక రోజు అతని భార్య తమ ప్రాంతములోని యెహోవాసాక్షుల సంఘములోని పెద్దను ఆహ్వానించెను. ఆ పెద్ద తనతోటి పనివారికంటే వేరైయున్నాడని తోషిరో వెంటనే గ్రహించెను. కారణమేమి? ఆ పెద్ద మనఃపూర్వకముగా బైబిలు సూత్రములను జీవితములో పాటించుచుండెను. అందుకు ముగ్ధుడై, తోషిరో వెంటనే బైబిలు పఠించుటకు ఆహ్వానమంగీకరించెను. బైబిలు మతము తనజీవిత విధానముగా చేసికొనుట కారంభించెను.
మీరుకూడ యెహోవాసాక్షులను ఎరిగియుండుటకై మిమ్ముల నాహ్వానించుచున్నాము. వారి “ఫలములు” వారు “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించుచున్నారనుటకు సాక్ష్యమిచ్చుచున్నవి. బైబిలు బోధలు తమ జీవితములలో పనిచేయునట్లుగా వారు శ్రమపడుచున్నారు. వ్యక్తిగతముగా వారు పరిపూర్ణతకు ఎంతో దూరమున నున్నారు. అయినను, నిజమైన మతము మంచికి నడిపించుటకు ఎంత ఆత్మీయ శక్తిగలదో వారు ఒక గుంపుగా ప్రదర్శిస్తున్నారు.
వేలమంది యెహోవాసాక్షులు ఒకప్పుడు తమ జీవిత విధానము యెడల అసంతోషముగానే ఉండిరి. కాని బైబిలు సూత్రములు పాటించి, చాలామంది మెచ్చుకోదగినంతగా మార్పునొంది. బైబిలు చెప్పుచున్న “ఆత్మఫలము” లను అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహములను అలవర్చుకొని వ్యక్తిగత సంతోషమునకు కారణమును కనుగొనిరి.—గలతీయులు 5:22, 23.
సత్యమైన మతమును పాటించుటవలన శాశ్వత ప్రయోజనములు వచ్చును
సత్యమైన మతము వ్యక్తులలో మార్పుతెచ్చుట లేక వ్యక్తిగత సమస్యలను సులభతరము చేయుటకన్న యింకా ఎక్కువ చేయవలయును. కలుషితము, అణుయుద్ధ బెదిరింపులు, పరిసర ప్రాంతములను దోచుకొనుట మున్నగు భూగోళ సమస్యలు అందమైన మన భూమిని పాడుచేయునట్లగు పడుచున్నవి. ఆర్థిక సమస్యలు లక్షలాదిమంది బాగోగులను, సంతోషమును అణచివేయుచున్నవి. ఈ భూగోళ సమస్యలు పరిష్కరించలేని ఏ మతమును గంభీరముగా తీసికొన నవసరము లేదు.
బైబిలు మతమట్టి నిరీక్షణను అందించుచున్నది. పరలోక ప్రభుత్వము లేక “రాజ్యము” ద్వారా నీతియుక్తమైన లోకమును తెచ్చెదనని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు. (మత్తయి 6:9, 10; 2 పేతురు 3:13; ప్రకటన 21:3, 4) మానవ రుగ్మతలన్నింటికి ఈ రాజ్యమే సర్వరోగనివారిణి. భూవ్యాప్తముగా అట్టి శాశ్వత ప్రయోజనములను గూర్చి బైబిలు మనకిట్లు అభయమిచ్చుచున్నది: “లోకము దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.” అవును. సంతోషకరమైన నిత్యజీవము నిజమైన ప్రతి క్రైస్తవుని నిరీక్షణ! (1 యోహాను 2:17; యోహాను 17:3) నిజమైన మతమును పాటించుటను గంభీరముగా తీసికొనువారు మాత్రమే, రానున్న రాజ్యమువలన ప్రయోజనము పొందుదురు. కాబట్టి బైబిలును చాలా ఆసక్తితో పఠించవలసిందిగా మేము మిమ్మును అర్ధించుచున్నాము.c (యోహాను 17:3) మీ జీవితములో దేవుని వాక్యముయొక్క వెలుగు ప్రకాశించనిచ్చుట కారంభించినది మొదలుకొని అమితానందము నొందెదరు, ఏలయనగా ‘దేవుని యవసరత’ మీకు క్రమక్రమముగా నిండినది. నిజంగా శాశ్వత ఆశీర్వాదములు మీవియగును. ఎందుకనగా మీరు మతమును—నిజమైన మతమును గంభీరముగా తీసికొంటిరి. (w91 2/1)
[అధస్సూచీలు]
a ఉదాహరణకు ఆదికాండమ 2:4; 5:1; 6:9 చూడుము.
b మరింత సమాచారము కొరకు, ఈ పత్రిక ప్రకాశకులనుండి లభ్యముకాగల “ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్?” అను పుస్తకమును చూడుము.
c ఈ విషయములో మీకు సహాయము చేయుటకు యెహోవాసాక్షులు ఆనందింతురు. ఈ పత్రిక ప్రకాశకులకుగాని, మీ ప్రాంతములోని యెహోవాసాక్షులనుగాని సంప్రదించుట ద్వారా ఉచిత బైబిలు పఠనము ఏర్పాటు చేయబడగలదు.
[5వ పేజీలోని చిత్రాలు]
పందొమ్మిది వందల భాషలకు పైగా బైబిలు దొరకుట అది దేవునిచే ప్రేరేపించబడినదనుటతో అనుగుణ్యముగా ఉన్నది
[7వ పేజీలోని చిత్రాలు]
పరలోక ప్రభుత్వము క్రింద ప్రపంచమంతటి సమాధానకర పరిస్థితుల నిరీక్షణను బైబిలు తెల్పుచున్నది