స్వచ్ఛమైన భాష ఆరాధికుల గొప్పసమూహమును ఐక్యపరచుచున్నది
దేవుడు అనుగ్రహించిన స్వచ్ఛమైన భాష క్రైస్తవ ఐక్యతకొరకైన శక్తియైయున్నది. పశ్చిమ బెర్షిన్లో మంగళవారము నుండి శుక్రవారము, అనగా 1990 జూలై 24 నుండి 27 వరకు జరిగిన యెహోవా సాక్షుల సమావేశమునకు హాజరైనవారందరికి ఆ రుజువు స్పష్టమై యున్నది, ఏలయనగా అక్కడ 64 వివిధ దేశములనుండి వచ్చిన సాక్షులు హాజరైయుండిరి.
పోలెండునందు “దైవభక్తి” అను జిల్లాసమావేశములు 1989 వేసవి కాలములో జరిగినప్పుడు, రష్యా మరియు జెకొస్లొవేకియానుండి వేలాదిమంది ప్రతినిధులు హజరుకాగా, తూర్పు జర్మనీనుండి కేవలము కొన్నివందలమంది ప్రతినిధులు మాత్రమే వచ్చిరి. అప్పటినుండి రాజకీయముగా ప్రపంచ పరిస్థితులు ఎంతగా మారిపోయినవి! ఈ సారి, పశ్చిమ బెర్షిన్లోని ఒలంపియా స్టేడియంలో తూర్పు జర్మనీనుండి వచ్చిన దాదాపు 30,000 మంది ప్రతినిధులు సాక్షులను కలిసికొనిరి. సాధారణముగా గురువారము నుండి ఆదివారము వరకు జరుగు ఇతర వందలాది సమావేశములలోకెల్లా ఈ సమావేశము విశిష్టమైయున్నది.
మంగళవారము తన స్వాగతోపన్యాసములో, యెహోవా సాక్షులు స్వచ్ఛమైన భాషను మాట్లాడుటలో అభివృద్ధి సాధించుటకు 1919 నుండి సమావేశములు వహించిన పాత్రను వివరించి చెప్పెను. అదే ప్రకారము, ఈ సమావేశముకూడ హాజరైన వారందరు స్వచ్ఛమైన భాషను మాట్లాడు తమ సామర్థ్యమును వృద్ధిపరచుకొనుటకు మరియు దాని ప్రకారము జీవించుటకు సహాయము చేయుననియు, యెహోవా ప్రజలు తలదువ్వుకొనుట మరియు ప్రవర్తనద్వారా తాము స్వచ్ఛమైన భాషను మాట్లాడుటలో అభివృద్ధి సాధించామనుటను ప్రదర్శింతురని ఆయన ప్రతినిధులకు గుర్తుచేసెను.
“జనులందరి కొరకు ఒక స్వచ్ఛమైన భాష”
సరియైన రీతిలో, సమావేశ ముఖ్యాంశ ప్రసంగము ముందు ప్రస్తావించబడిన ఈ మూలాంశమునే కలిగియుండెను. అది జెఫన్యా 3:9 (NW)పై ఆధారపడియున్నది, అక్కడ దేవుడిట్లు వాగ్దానము చేసెను: “అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి స్వచ్ఛమైన భాష నిచ్చెదను.” ఈ స్వచ్ఛమైన భాషలో దేవుని మరియు ఆయన సంకల్పముల సత్యముయెడల సరియైన అవగాహన మరియు ప్రశంస చేరియున్నది. దీనిని కేవలము యెహోవా మాత్రమే తన పరిశుద్ధాత్మద్వారా అనుగ్రహించగలడు. సమస్త నైతిక అపరిశుభ్రతనుండి వేరుగానున్న, స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుటకు సత్యముయెడల ప్రేమ కలిగియుండుట ప్రేరణగా యుండవలెను.
అంతేకాకుండ, స్వచ్ఛమైన భాష మాట్లాడుట అనగా కేవలము ఏదోఒక పదజాలమును ఉపయోగించుట కాదు. బదులుగా, మన పెదవులనుండివచ్చు దానితో పొందికగా మనజీవిత విధానముండవలెను. వాస్తవానికి, మన స్వరము, ముఖ కవళికలు, మరియు చేష్టలుకూడ ప్రాముఖ్యము, ఏలయనగా అవి మనము అంతరంగమందు ఎటువంటి వారమో ప్రతిబింబించును. విస్తరించుచున్న స్వచ్ఛమైన భాషతో మనమూ సాగిపోవుటకు, మనము తదేకమైన పఠన కార్యక్రమము, మరియు క్రమముగా సంఘకూటములన్నింటికి హాజరగుట ఉండవలెను.
స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుట
మంగళవారము మధ్యాహ్నమందలి ప్రసంగము నొక్కి తెల్పినట్లుగా, స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుట అనగా “ప్రాథమిక విషయములనుండి పూర్ణసిద్ధికి ఎదుగుట” అని దానిభావము. మనము ఆత్మీయముగా ఎదుగుచునుండవలెనంటే అభివృద్ధి ఆవశ్యకము. అనగా ఆత్మీయ పురోగమనమును మరియు బైబిలు సూత్రములను అనుదినము అన్వయించుటకు చేయబడిన ఏర్పాట్లనుండి ప్రయోజనమును తీసికొనుటయని దాని భావము.
స్వచ్ఛమైన భాషయందు నైపుణ్యతగల వారమగుటకు, మనము “యెహోవాచేత ఉపదేశము పొందుట,” ఇది గురువారము ఉదయము జరిగిన ఒక గోష్ఠియొక్క శీర్షికనామము. మొదటి ప్రసంగీకుడు ఇది ఎట్లు ‘యేసుద్వారా మాదిరిగా యుంచబడెనో’ చూపించెను. యేసు యెహోవాద్వారా ఉపదేశింపబడెనని ఆయన మాటలు మరియు చర్యలు స్పష్టముచేసెను. కావున మనము ఆయన బోధించిన విధానమందు ఆయనను అనుకరించుటకు కోరుకొందుము. మరియు యేసు అన్ని సమయములలో తన తండ్రి చిత్తమునకు లోబడినట్లుగానే, మనముకూడ లోబడవలెను.
తర్వాత ముగ్గురు ప్రసంగీకులు కూటములు మరియు సమావేశములద్వారా యెహోవా ఎట్లు బోధించుచున్నాడో చూపించిరి. మనము సంఘమందలి ఐదుకూటములనుండి ప్రయోజనము పొందుదుము గనుక వాటిలో దేనినికూడ మనము నిర్లక్ష్యము చేయకూడదు. మన ఆత్మీయ పూరోగాభివృద్ధికి ప్రతి కూటము ఆవశ్యకము. అంతేకాకుండా యెహోవా ప్రాంతీయ సమావేశములద్వారా, జిల్లాసమావేశములద్వారా, మరియు ప్రత్యేకదిన సమావేశ కార్యక్రమములద్వారా కూడ బోధించుచున్నాడు. వీటన్నింటినుండి ప్రయోజనము పొందవలెనంటే, మనము జాగ్రత్తగా విని నేర్చుకొనిన సంగతులను అభ్యసించవలెను.
ఈ గోష్ఠి తర్వాత “వ్యక్తిగత పఠనమునకై త్యాగముచేయుట” అను ప్రసంగమివ్వబడెను. దానికొరకు సమయము కనుగొనుటకు, మనము తక్కువ ప్రాముఖ్యమైన సంగతులనుండి సమయము కొనుటకు ఎఫెసీయులకు 5:15, 16 లోని సలహాను లక్ష్యపెట్టవలెను.
స్వచ్ఛమైన భాషను నేర్చుకొనుటకు మన న్యాయసమ్మతమైన గమ్యమేదనగా సమర్పించుకొని బాప్తిస్మము తీసికొనుట. “స్వచ్ఛమైన భాషను నేర్చుకొనువారి బాప్తిస్మము” అను ప్రసంగములో ఈ సత్యము నొక్కితెల్పబడెను. ఈ భాష అనేకులను సమర్పణ మరియ బాప్తిస్మములకు నడిపించుచున్నది. అయితే, ఒకడు ఆ పిమ్మట ఆసక్తితో సువార్తను ప్రకటించుచు, క్రొత్త స్వభావమును ధరించుకొనుచు, లోకమునుండి వేరైయుంటూ యేసు మాదిరిని ఎడతెగక అనుసరించవలెను.
బలమైన ఆత్మీయాహారము
ప్రవచనార్థక నాటకముల నెరవేర్పుపై ఆధారపడిన బలమైన ఆత్మీయాహారమును పొందుటకుకూడ సమావేశ ప్రతినిధులు ఆనందించిరి. గురువారము మధ్యాహ్నము, యెహెజ్కేలు ప్రవచనమునుండి తీసికొనబడిన మూలాంశములపై ఆధారపడి రెండు ప్రసంగములివ్వబడెను. “ప్రకాశమానమైన యెహోవా రథము ముందుకు కదలివెళ్లుచున్నది” అను మొదటి ప్రసంగము, బ్రహ్మాండమైన, మహిమగల, భయంకరమైన పరలోక వాహనము మొకటి మెరుపువేగముతో కదలిపొవుటను వర్ణించెను. అది యెహోవా పరలోక సంస్థకు చిత్రీకరణయైయున్నది, దాని ప్రతి కదలికను ప్రేమతో నిర్దేశించుచు, తన సంకల్పములను నెరవేర్చుటకు ఉపయోగించుచు దేవుడు దానిని నడిపించుచున్నాడు. యెహెజ్కేలు, ప్రత్యేకముగా 1919నుండి ఆత్మాభిషేకుల శేషమునకు చిత్రీకరణగాయున్నాడు. 1935నుండి మరివిశేషముగా “గొప్ప సమూహము” వారితో చేరియున్నది.—ప్రకటన 7:9.
దాని తర్వాత ప్రసంగముయొక్క మూలాంశము, “దృశ్యమైన సంస్థతోపాటు నడచుట.” దేవుని దృశ్యసంస్థ ఆయన పరలోక రథమునుపోలిన సంస్థతోపాటు ముందుకు సాగిపోవుచున్నదనుటలో సందేహము లేదు. యెహెజ్కేలు చేసినట్లుగానే, ఈనాడు యెహోవా సేవకులు ఉదాసీనత, అపహాస్యము, లేక వ్యతిరేకత ఉన్నను తమకప్పగింపబడిన ఆజ్ఞను విధేయతతో నెరవేర్చవలెను. సరిసమానముగా సాగిపోవుట ఇప్పుడును, మరియు వేగముగా సమీపించుచున్న నూతన లోకమందలి నిత్యజీవమందును అనేక ఆశీర్వాదములకు నడిపించును.
శుక్రవారము ఉదయము, యెషయా 28వ అధ్యాయముపై ఆధారపడిన మూడు ప్రసంగములద్వారా కూడ బలమైన ఆత్మీయాహారము అందించబడెను. వీటిలో మొదటిది ప్రాచీన ఇశ్రాయేలు మరియు యూదాలోని త్రాగుబోతులు క్రీస్తుమత సామ్రాజ్యమందలి ఆత్మీయ త్రాగుబోతులకు చిత్రీకరణయైయున్నారని శక్తివంతమైన మాటలతో చూపించెను. మొదటివారు యెహోవాయొక్క కఠినమైన తీర్పునెదుర్కొనినట్లుగానే క్రీస్తుమత సామ్రాజ్యములోని వారును ఎదుర్కొందురు.
దాని తర్వాత ఇవ్వబడిన ప్రసంగముయొక్క మూలాంశము “వారి ఆశ్రయము—ఒక అబద్ధము!” దానియందు ఈ తీవ్ర హెచ్చరిక ఇవ్వబడెను: పూర్వము యూదా నమ్మిన ఐగుప్తు ఎట్లు వ్యర్థమైన ఆశ్రయముగా నుండెనో, అదే ప్రకారము రాజకీయ శక్తులతో క్రీస్తుమత సామ్రాజ్యపు పొత్తుకూడ ఉండును. యెషయా 28పై ఆధారపడిన, “యెహోవా అసాధారణమైన పనినిగూర్చి హెచ్చరిక చేయుచుండుము” అను మూడవ ప్రసంగము దేవుని ప్రజలనుద్దేశించి ఇవ్వబడెను. క్రీస్తుమత సామ్రాజ్యము యెడల యెహోవా జరిగించుపని సరియైన రీతిలో అసాధారణమని పిలువబడును, ఏలయనగా అది దానికి పూర్తిగా ఆశ్చర్యము కలిగించురీతిలో సంభవించును. ఈనాడు, యెహోవా కొద్దిపాటి అభిషక్త క్రైస్తవులకు మరియు 40లక్షలకంటె ఎక్కువగాయున్న “వేరేగొర్రెలకు” మహిమాకిరీటమై యున్నాడు. (యోహాను 10:16) ప్రసంగీకుడు ఈ ఉత్తేజకరమైన మాటలతో ముగించెను: “మన ఆసక్తి, దృఢసంకల్పము, మరియు యథార్థత మన దేవుడైన యెహోవాయొక్క నిత్యస్తుతికి దోహదపడును గాక!”
స్వచ్ఛమైన భాషను మాట్లాడుటయనగా సహోదర ప్రేమచూపించుటని దానిభావము
బుధవారము మధ్యాహ్నము, స్వచ్ఛమైన భాష మాట్లాడుటయనగా “అనాధ పిల్లలను మరియు విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట” అనికూడ అర్థమని ప్రతినిధులకు చెప్పబడెను. వ్యక్తిగత శిక్షణనిచ్చుటద్వారా తండ్రిలేని పిల్లలకు సహాయము చేయవచ్చును. దయగల ప్రోత్సాహకరమైన మాటలద్వారా, మన క్రైస్తవ కార్యక్రమములలో మరియు విందువినోదాలలో వారినికూడ చేర్చుటద్వారా, నిజముగా అవసరతయందుండి, పాత్రులైనట్లయిన వస్తుదాయక సహాయమందించుటద్వారా మనము విధవరాండ్రయెడల శ్రద్ధచూపవచ్చును. ఇవి ఏ విధముగా జరిగింపబడుచున్నవో పరిచయములు చూపించెను.
గురువారము మధ్యాహ్నము మరొక హృదయంగమమైన ప్రసంగము “క్రైస్తవులు ఎలా ఒకరినొకరు పరామర్శించుకొంటారో” చూపించెను. ప్రత్యేకముగా ఉప్పెనలు మరియు భూకంపములవంటి విపత్తులు జరిగినప్పుడు, అధికారులకు వ్రాయవలసిన అవసరమున్నప్పుడు, లేక ప్రాంతీయ అవసరతలు ఉన్నప్పుడు ఒకరికొకరు శ్రద్ధచూపుటలో యెహోవా సాక్షులు శ్రేష్ఠమైన పేరును కలిగియున్నారు. అయితే మానవ బలహీనతల కారణముగా కష్టములెదురైనప్పుడు, మనము మత్తయి 5:23, 24 మరియు 18:15-17 లో యేసు ఇచ్చిన సలహాలో చేరియున్న సూత్రములను అన్వయింపజేయవలెను. ప్రత్యేకముగా సహోదరుల మధ్య వ్యాపార లావాదేవీలు విషయము వచ్చినప్పుడు పరస్పర గౌరవము మరియు శ్రద్ధ అవసరము అలా యజమానిగాని లేక కార్మికుడుగాని తమ ఆత్మీయ సంబంధమును తమ స్వార్థప్రయోజనాలకొరకు ఉపయోగించడు.
స్వచ్ఛమైన భాషను మాట్లాడుటయనగా మన ప్రవర్తనను కనిపెట్టుకొనుటయని భావము
మన ప్రవర్తనను కనిపెట్టుకొను అవసరత పదేపదే నొక్కిచెప్పబడినది. ఆ విధముగా, మంగళవారము మధ్యాహ్నము మొదటి ప్రసంగీకుడు “దేవుని వాక్యము విని దానిని గైకొనుట” అను మూలాంశముమీద మాట్లాడెను. సమావేశములకు మనము వచ్చుటలో రెండు ప్రధాన కారణములు కలవని ఆయన చూపించెను. అవేవనగా, ఖచ్ఛితమైన జ్ఞానము సంపాదించుట మరియు ఆ జ్ఞానముచొప్పున ప్రవర్తించుటకు కదిలింపబడుట.
బుధవారము ఉదయము మొదటి ప్రసంగము “క్రీస్తు ‘దుర్నీతిని ద్వేషించెను’—మరి మీరు?” అను పరిశోధనాత్మక ప్రశ్నను వేసెను. కేవలము నీతిని ప్రేమించుట మాత్రమే సరిపోదు. మంచి మనస్సాక్షిని కలిగియుండుటకు, యెహోవాతో మంచి సంబంధమును కాపాడుకొనుటకు, ఆయన నామమునకు నింద తీసికొనిరాకుండుటకు, దుర్నీతి ఫలములను—క్షయత మరియు మరణము—కోయకుండుటకు మనము దుర్నీతినికూడ ద్వేషించవలెను.
“లోకభ్రమలను విసర్జించి, రాజ్య వాస్తవాలను అనుసరించండి” అను మూలాంశముగల ఆ తర్వాత ప్రసంగము దానికి దగ్గర సంబంధమును కలిగియున్నది. తమ తప్పిదముల కొరకు సాతాను, హవ్వ మరియు పడిపోయిన దూతలు వీరందరు భ్రమలను వెంటాడిరి. లోకభ్రమలలో వస్తుదాయక స్వప్నములు లేక అవినీతి వ్యవహారములుగల వ్యక్తులు ఉందురు, ఘోర తప్పిదము చేయకపోయినను దాని ఫలితముగా భంగపాటు కలుగును. ఈ భ్రమలను ఎదుర్కొనుటకు, మనము పఠనము, ప్రార్థన, కూటములకు హాజరగుట, మరియు బహిరంగ పరిచర్యద్వారా రాజ్య వాస్తవాలను వెంటాడవలెను.
నీతిగల క్రైస్తవ జీవితములను జీవించుటకు, మనము బుధవారము మధ్యాహ్నము ఇవ్వబడిన “క్రైస్తవులారా—మీ రాబడియందే జీవించుము” అను ప్రసంగములో ఇవ్వబడిన సలహాను లక్ష్యపెట్టవలెను. దీనిని చేయకుండుట అటు శరీరకముగా ఇటు ఆత్మీయముగా హానికరమగు ప్రభావములను అనుభవించవలసియుండును. జ్ఞానయుక్తమైన విధామేమనగా, ఒకడు అనవసరమైన అప్పులు చేయక నిజమైన జమాఖర్చుల లెక్కను కలిగియుండి దానికి అంటిపెట్టుకొనియుండుట ద్వారా స్వార్థకాంక్షలను త్రొక్కిపట్టుటయే. అన్ని సమయములలో మనము దైవభక్తిని పెంపొందించుకొను అవసరత కలదు. స్వయం-సంతృప్తితోపాటు, ఇది లాభసాధకమై యున్నది.—1 తిమోతి 6:6-8.
మంగళవారము ఇవ్వబడిన “మీ స్నేహితులు యెహోవాకు కూడ స్నేహితులా?” అను ప్రసంగములో మన సహవాసులను కనిపెట్టుకొనవలసిన ప్రాముఖ్యత నొక్కితెల్పబడెను. మన స్నేహితులు క్రీస్తు స్వభావమును ధరించుకొనిన క్రైస్తవులైయుండి ప్రకటించు పనిలో ఆసక్తిగా పనిచేయువారై యుండవలెను. లోకములోని పరిచయస్థులు దేవుని స్నేహితులుకారు, కాగా మనకు హాని జరుగకుండా వారితో కలివిడిగా తిరుగలేము. సంఘములో సహితము మన సహవాసము నిజముగా క్షేమాభివృద్ధికరమైనదిగా ఉండాలంటే మనము వారిని ఎంపిక చేసికొనవలెను.
ప్రవర్తననుగూర్చి ముందు చెప్పబడిన సలహా ఆధునిక నాటకముద్వారా సజీవముగా నొక్కితెల్పబడెను. దాని పేరేమనగా “అపవాది తంత్రములను విజయవంతముగా ఎదుర్కొనుట.”
కుటుంబముల కొరకు స్వచ్ఛమైనభాష ఇచ్చిన సలహా
బుధవారము ఇవ్వబడిన “తలిదండ్రులారా—మీ బాధ్యతలను నిర్వర్తించుడి!” అను ప్రసంగము గొప్పగా అవసరమై యుండెను. తలిదండ్రులు తాముగా దేవుని చిత్తమును ఎరిగియుండి తమ శక్తివంచనలేకుండా దానిని చేయుచున్న వారైయుండవలెను. ఆలాగే వారు దేవుని వాక్యమును తమ పిల్లలలోకూడ అభ్యసింపజేయవలెను. అంతేకాకుండ, కేవలము పిల్లలను క్రైస్తవ కూటములకు మరియు ప్రాంతీయ పరిచర్యకు తీసికొనిపోవుట మాత్రమే సరిపోదు. వారికి యెహోవాను ప్రేమించుట నేర్పవలెను మరియు వారు దైవిక సంగతులను చేయుటలోని అభ్యాససిద్ధమైన జ్ఞానమును చూడవలెను.
ఆ పిమ్మట “మన కాలమందలి కుటుంబము” అను విషయముపై గోష్ఠి జరిగినది. మొదటి ప్రసంగీకుడు కుటుంబము దేవునినుండి వచ్చినదని చూపించెను. ఆత్మీయ విషయముల సంబంధముగా తండ్రులు తప్పక సంభాషించవలెను. తల్లులు గృహమును చక్కదిద్దువారును, పిల్లలు తల్లిదండ్రులకు సహకరించుటద్వారా యెహోవా యెడల గౌరవము చూపవలెను.
ఆ తర్వాత ప్రసంగీకుడు కుటుంబము “శత్రువుల దాడిక్రింద ఉన్నదని” చూపించెను. ఆర్ధిక వత్తిడి తనవంతు కుటుంబములను పాడుచేయుచున్నది. పనిస్థలములు తప్పిదముచేయు శోధనలతో నిండుచున్నవి, వార్తామాధ్యమములు హింస, లైంగిక అవినీతి, వస్తుదాయక ప్రలోభములతో దుర్గంధభూయిష్టముగా తయారయినవి. తొలిదశలోనే ఉపదేశమివ్వబడవలెను, మరియు లోక ప్రభావములను అధిగమించి వచ్చుటకు తీవ్రమైన పట్టుదల అవసరము. వాచ్‌టవర్ సొసైటి అందించుచున్న దైవపరిపాలనా పనిముట్లను మంచిగా ఉపయోగించుకొనవలెను.
ఆ తర్వాత ప్రసంగము, కుటుంబమును ‘నూతన లోకములోనికి భద్రపరచుట’ అను అంశమును ప్రస్తావించుచు, తలిదండ్రులు కలిగియుండవలసిన గంభీరమైన బాధ్యతను నొక్కితెల్పినది. పిల్లలకు బహుశ్రద్ధతో శిక్షణనివ్వవలెను. కుటుంబ బైబిలు పఠనములను ఎట్లు జరిగించవలెను ఏమి పఠించవలెను ఇత్యాదివిషయములపై శ్రేష్ఠమైన సలహా ఇవ్వబడెను, ఇదంతయు పిల్లల హృదయములను చేరవలెనను ఉద్దేశ్యముతో. అప్పుడు మాత్రమే పిల్లలు తలిదండ్రులు ఒక కుటుంబముగా నూతన లోకములోనికి భద్రపరచబడుటకు నిరీక్షించగలరు.
అనేకమంది సాక్షులు కలిగియున్న కుటుంబ పరిస్థితి మీద శ్రేష్ఠమైన సలహానిస్తు “విభాగింపబడిన గృహములో తట్టుకొనుట” అను ప్రసంగమివ్వబడెను. అటువంటి పరిస్థితిలో ఉన్నవారు అవిశ్వాసిగాయున్న వ్యక్తి ఒకనాటికైనా విశ్వాసికాకపోరు అను నిరీక్షణను ఎన్నటికిని విడనాడకూడదని సలహానివ్వబడిరి. అవిశ్వాసితో సమయమును గడుపుము మరియు ఒక క్రైస్తవ భాగస్వామినుండి కోరబడు యావత్తును నీవు చేరుకొనుచున్నావని నిశ్చయపరచుకొనుము. పెద్దలనుండి లేక బహుశ విభాగిత కుటుంబములలోని ఇతరులనుండి నీవు సహాయము పొందవచ్చును.
ఇతరులతో స్వచ్ఛమైన భాషను మాట్లాడుట
సరియైన రీతిలో, స్వచ్ఛమైన భాషను ఇతరులకు బోధించు అవకాశములను ఉపయోగించుటకు ఎంతో శ్రద్ధ ఇవ్వబడెను. ఆ విధముగా, బుధవారము ఉదయము సమావేశ ప్రతినిధులు “మీ విలువైన సమయమును జ్ఞానముతో ఉపయోగించుము” అను ప్రసంగమును వినిరి. దానిని చేయుటకు మనము మత్తయి 6:33 చెప్పుదానిని మదిలో యుంచుకొని ముఖ్యమైన వాటిని ముందు స్థిరపరచుకొనవలెను, అది ఇట్లనుచున్నది: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” దానియందు వ్యక్తిగత బైబిలు పఠనమునకు, కూటములన్నింటికి హాజరగుటకు మరియు క్రమముగా ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుటకు సమయమును కేటాయించుట ఇమిడియున్నది. దీనికి ఆనందకరమైనను తక్కువ ప్రాముఖ్యమైన కార్యములనుండి సమయమును కొనుట అవసరము. అనేక పరిచయములు కొందరు దీనిని ఎట్లు చేయుచున్నారో చూపించెను.
మనము యెహోవా సాక్షులమను సంగతిని మనమెన్నటికిని మరువకూడదు. గురువారము మధ్యాహ్నము, “ప్రతి సందర్భములో స్వచ్ఛమైన భాషను మాట్లాడుము” అను మూలాంశము క్రింద అనేక ప్రదర్శనలు ఆ అంశమునే నొక్కితెల్పినవి. ఆ ప్రదర్శనలు దీనిని వీధి సాక్ష్యమందు, తటస్థ్య సాక్ష్యమందు, టెలిఫోను ఉపయోగించి ఎట్లు చేయవచ్చునో చూపించెను. యెహోవా దేవుని యెడల మరియు పొరుగువారి యెడల మనకున్న నిస్వార్థమైన ప్రేమ ప్రతి అవకాశమందును మనము స్వచ్ఛమైన భాషను మాట్లాడుటకు మనలను కదిలించును.
“తప్పించుకొనునట్లు అడుగని వారికిగల ఆశీర్వాదములు” అను ఆ తర్వాత ప్రసంగము దీనికి దగ్గర సంబంధమును కలిగియున్నది. ప్రపంచవ్యాప్తముగా బోధించు యెహోవా సాక్షుల సంస్థ క్రీస్తుమత సామ్రాజ్యమునకు పూర్తిగా భిన్నమై యున్నది. ఆయావ్యక్తులుగా అధికారిక వ్యతిరేకత, విస్తారమైయున్న ఉదాసీనత, ఆర్ధిక సమస్యలవంటి వత్తిడులన్నింటిని మనము ఎదిరించవలెను. రీజనింగ్ ఫ్రం ది స్క్రిప్చర్స్ అను పుస్తకముపై ఆధారపడిన ప్రదర్శనలు ఈ సమస్యలను ఎట్లు అధిగమించవచ్చునో చూపించినవి.
ఆసక్తితో దేవునిచిత్తము చేయుట అను బైబిలు నాటకముకూడ ఆసక్తితో ప్రకటించుటను ప్రోత్సహించినది. యెహోవా నామముకొరకు యెహూ ఎంత ఆసక్తిని కలిగియుండెను కాగా దేవుని పనికొరకు మనముకూడ అటువంటి ధైర్యమును ఆసక్తిని ప్రదర్శించుట ఎంత ప్రాముఖ్యమో అది చూపించెను.
సమావేశ విడుదలలు
సమావేశమందు ఇంగ్లీషులో మరియు జర్మనులో రెండు ప్రముఖమైన ప్రచురణలు విడుదల చేయబడెను. ఈ రెంటిలో మొదటిది “రక్తముతో నీ జీవమును రక్షించుకొనుట—ఎట్లు? అను ప్రసంగము సందర్భముగా పరిచయము చేయబడెను. ప్రసంగీకుడు మొదట రక్తమార్పిడులతో ఉన్న ప్రమాదములను వివరించెను. రక్తహీనతను పూరించుటకు రక్తమునకు అనేక ప్రత్యామ్నాయములు కలవని ఆయన సూచించెను. అయితే రక్తము అనారోగ్యకరమైనదని యెహోవా సాక్షులు రక్తమును విసర్జించుట లేదుగాని దానిని అంగీకరించుట అపరిశుద్ధమని వారు దానిని విసర్జించుచున్నారు. రక్తము కలుషితమైనదని కాదుగాని, అది దేవునికి అమూల్యమైనదని వారు దానిని విసర్జించుచున్నారు. జీవమును నిజముగా రక్షించు రక్తము యేసుక్రీస్తు అర్పించిన విమోచన క్రయధనము మాత్రమే. ముగింపునందు ప్రసంగీకుడు 32 పుటల రక్తము నీ జీవమునెట్లు కాపాడగలదు? అను బ్రొషూరును పైకెత్తిచూపుట ద్వారా శ్రోతలను ఆనందపరచెను.
“జనులారా, యెహోవా కొరకు వెదకుడి” అను ప్రసంగము సందర్భముగా విలువైన రెండవ ప్రచురణ విడుదల చేయబడెను. ఎక్కువలోఎక్కువ ప్రజలు దేవునికొరకు వెదకుట లేదు. దేవుని వాక్యమును మానవుడు లక్ష్యపెట్టనందున ఉనికిలోనికి వచ్చిన వివిధ మతములు దేవునికొరకు అతడు వెదకుట ఎట్లు దారితప్పినదో చూపించుచున్నవి. ప్రతి సంవత్సరము మన జ్ఞాపకార్థదిన హజరు చూచుచుండగా, యెహోవావైపు నిలుచుటకు సహాయపడవలసిన ప్రజలు దశలక్షలలో ఉన్నారు. యెహోవా నిజముగా ప్రేమగల మరియు కనికరముగల దేవుడనియు “బహుగా క్షమించుటకు” సిద్ధముగా ఉన్నాడనియు యెషయా 55:6, 7 చూపుచున్నది. ఆయన సాక్షులుగా, ఇతరులును ఏకమనస్సుతో యెహోవాను సేవించుటకు మనతో చేరునట్లు మనము సహాయపడులాగున మనకు స్వచ్ఛమైన భాష ఇవ్వబడినది.
జనసమూహములు బహుగా తరలివెళ్లుట జరుగుచున్న కారణముగా యెహోవా ప్రజల ఎదుట ఈనాడు ఒక సవాలున్నది. తత్ఫలితముగా, మన ప్రాంతములో అన్నిరకముల మతముల వారుండవచ్చును. కావున మనము హిందువులకు, బౌద్ధులకు, షింటో మతస్థులకు ఇంకా ఇతర అనేకులకు సహాయపడులాగున సొసైటి మ్యాన్కైండ్స్ సెర్చ్ ఫర్ గాడ్ అను 384 పుటలగల ఒక శ్రేష్ఠమైన సాహిత్యమును అందజేసెను. అది అధికారికముగా క్రీస్తుమత సామ్రాజ్యమునకు వెలుపలగల ముఖ్యమైన మతముల మూల బోధలను అందించినది. అంతేకాకుండ అది క్రీస్తుమత సామ్రాజ్యములోని అబద్ధమతముల చరిత్రయొక్క జాడను వెలికితీసినది. వివిధమతముల వారని చెప్పుకొను అనేకులతో బైబిలు పఠనములను ప్రారంభించుటకు ఈ పుస్తకము మార్గము తెరువగలదు.
బహిరంగ ప్రసంగము మరియు ముగింపు వ్యాఖ్యానములు
శుక్రవారము బహిరంగ ప్రసంగముయొక్క మూలాంశమేమనగా “స్వచ్ఛమైన భాషద్వారా ఏకముకమ్ము.” ఐక్యమత్యమునకు ఇప్పుడు వివిధములైన మూడువేల భాషలు అడ్డంకుగాయున్నను, స్వచ్ఛమైన భాష ఐక్యపరచు బలమైన శక్తిగా ఉన్నది. అది బబులోను తప్పిదములకు వ్యతిరేకముగా యెహోవా సాక్షులను సంరక్షించినది మరియు వారికి ఆత్మీయముగా మరియు శరీరకముగా ప్రయోజనమును కలుగజేయు బైబిలు సూత్రములద్వారా జీవించుటకు సహాయపడినది. అందరు స్వచ్ఛమైన భాషను నేర్చుకొను మరియు మాట్లాడు అవసరతయెడల శ్రద్ధ చూపవలెను, ఏలయనగా కేవలము అలాచేయువారు మాత్రమే హార్‌మెగిద్దోనును తప్పించుకొందురు. జెఫన్యా 2:1-3 లోని సలహాను లక్ష్యపెట్టుటను జారవిడుచుకొను సమయము లేదు.
“ప్రార్థనల విషయమై మెలకువగా ఉండు” అవసరతమీద చక్కని లేఖన సలహా తర్వాత, “స్వచ్ఛమైన భాషకు అనుగుణ్యముగా నడచుకొనుట” అను మూలాంశముపై ఆధారపడి ముగింపు ప్రసంగమివ్వబడెను. స్వచ్ఛమైన భాష ప్రకారము నడచుకొనువారి సంఖ్య నిజముగా వృద్ధియగుచున్నది. పరిశుభ్రత, క్రమబద్ధత, మరియు వ్యవస్థాపరమైన పొందికద్వారా సమావేశములకు హాజరైనవారు స్వచ్ఛమైన భాషయెడల తమ శ్రద్ధను చూపించిరి. క్రొత్తగా విడుదలైన ముద్రిత సాహిత్యములు మరింత ప్రభావితముగా స్వచ్ఛమైన భాషను వ్యాప్తిచేయుటకు యెహోవా సాక్షులకు సహాయము చేయును.
సమావేశముయొక్క చివరి ప్రసంగీకుడు అందరు సహనము చూపవలసిన అవసరత కలదని గుర్తుచేసెను. ఈ సమావేశము ఫలితముగా, అందరు ముందుకు సాగిపోవు తమ తీర్మానమందు బలపడవలెనని ఆయన సూచించెను. ఆ పిమ్మట ఆయన ఈ మాటలతో తన ప్రసంగమును ముగించెను: “ఇప్పుడు మరియు ఎల్లకాలము మన ప్రేమగల పరలోకపు తండ్రియైన, యెహోవా దేవుని మహిమపరచులాగున మనము దేవుడు అనుగ్రహించిన స్వచ్ఛమైనభాష ప్రకారము ఎడతెగక నడచుకొందము గాక!” (w91 1/15)
[22, 23వ పేజీలోని చిత్రాలు]
1. ఒలంపియా స్టేడియం, పశ్చిమ బెర్షిన్
2. ముద్రిత సమావేశ కార్యక్రమము
3. తూర్పు జర్మనీ నుండి రెండువందల బస్సులు ప్రతినిధులను తెచ్చెను
4. పోలిష్ సమావేశ ప్రతినిధులు విడుదల చేయబడిన ముద్రిత ప్రచురణలను అందుకొనుటకు సంతోషించిరి
5. పుష్పాలంకరణ క్రొత్త అందాలను సమకూర్చెను
6. పశ్చిమ బెర్షిన్లో ఒక కార్యక్రమమందు పరిపాలనా సభ సభ్యులలో ఒకరైన, ఎ.డి.ష్రోడర్
[24వ పేజీలోని బాక్సు]
పశ్చిమ బెర్షిన్లో సమావేశమునకు శిఖరాగ్ర సంఖ్యలో 44,532 మంది హాజరైరి, కాగా దానిలో 1,018 మంది బాప్తిస్మము తీసికొనిరి. బాప్తిస్మపు సభ్యులు ఒలంపియా స్టేడియంనుండి బయటకు పోవుటకు 19 నిమిషములు పట్టగా ఈ సమయమంతటిలో చప్పట్లు మారుమ్రోగెను. ఇంగ్లీషు మాట్లాడు ప్రతినిధులకు ప్రత్యేక కార్యక్రమ సమయములు ఏర్పాటుచేయబడెను. వీరిలో దాదాపు 6,000 మంది వారి భాషలో కార్యక్రమమంతటిని వినిరి. ఈ సమావేశములో, పోలెండునుండి వచ్చిన 4,500 మందియు ఉండిరి; మధ్యాహ్నపుకాల ఘడియలలో వారి ప్రయోజనార్థమై పరిపాలక సభ సభ్యులు రెండు గంటలపాటు క్లుప్తముగా ప్రసంగములనిచ్చిరి.