యెహోవా దినము కొరకు సిద్ధముగా ఉండుము!
మొదటి థెస్సలొనీకయుల నుండి ఉన్నతాంశములు
యెహోవా దినము! ప్రాచీన థెస్సలొనీకలోని క్రైస్తవులు అది వెంటనే వచ్చునని తలంచిరి. వారు సరియేనా? అది ఎప్పుడు వచ్చును? మన సామాన్య శకము దాదాపు 50వ సంవత్సరములో కొరింథునుండి, థెస్సలొనీకయులకు అపొస్తలుడైన పౌలు వ్రాసిన మొదటి పత్రికలో అది ఒక అవశ్యకమైన అంశముగా సంబోధించబడెను.
రోమా రాష్ట్రమైన మాసిదోనియకు పరిపాలనా పీఠమైన థెస్సలొనీకలో పౌలు సీల సంఘమును స్థాపించిరి. (అపొ.కార్యములు 17:1-4) ఆ తర్వాత థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రికలో, పౌలు వారిని మెచ్చుకొని, సలహానిచ్చి, యెహోవా దినమునుగూర్చి చర్చించెను. ప్రత్యేకముగా యెహోవా దినము ఎంతో సమీపముగా ఉన్నందున, మనము కూడ ఈ పత్రికనుండి ప్రయోజనము పొందగలము.
మెచ్చుకొనుము మరియు ప్రోత్సహించుము
పౌలు మొదట థెస్సలొనీకయులను మెచ్చుకొనెను. (1 థెస్సలొనీకయులు 1:1-10) వారు నమ్మకముగా పనిచేసి సహనము చూపినందున మెచ్చుకొనుట తగినదే. వారు “పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు వాక్యము నంగీకరించుట” కూడ మెచ్చుకొనదగిన విషయమే. పౌలు వలెనే మీరును యితరులను మెచ్చుకొందురా?
అపొస్తలుడు శ్రేష్ఠమైన మాదిరినుంచెను. (2:1-12) ఫిలిప్పీలో అవమానము జరిగినను, ఆయన థెస్సలొనీకయులకు ‘సువార్తను బోధించుటకు దేవునియందు ధైర్యము తెచ్చుకొనెను.’ ఆయన ముఖస్తుతిని, లోభత్వమును, మహిమను వెదకుటను విసర్జించెను. పౌలు తనకొరకు అధిక ఖర్చుకలిగియున్న భారమువలెగాక, బిడ్డలను గారవించు స్తన్యమిచ్చు తల్లివలె ఆయన వారిమధ్య ఉండెను. ఈనాడు పెద్దలకు అది ఎంత శ్రేష్ఠమైన మాదిరి!
పౌలు తర్వాతి మాటలు హింసింపబడినప్పుడు స్థిరముగా నిలిచియుండుటకు థెస్సలొనీకయులను ప్రోత్సహించెను. (2:13–3:13) వారి స్వజనులద్వారా కలిగిన హింసను వారు సహించిరి, మరియు వారి ఆత్మీయస్థితినిగూర్చి తిమోతి పౌలుకు మంచివార్తను తెలియజేసెను. వారు ప్రేమయందు వర్ధిల్లుటకు మరియు వారు హృదయములయందు స్థిరులగుటకు అపొస్తలుడు ప్రార్థించెను. అదేప్రకారము, యెహోవా సాక్షులు యిప్పుడు, హింసింపబడుచున్న తోటి విశ్వాసులకొరకు ప్రార్థింతురు, సాధ్యమైతే వారిని ప్రోత్సహింతురు, వారి నమ్మకత్వమునుగూర్చిన నివేదికలను విన్నప్పుడు సంతోషించుదురు.
ఆత్మీయముగా మెలకువగా ఉండుము!
థెస్సలొనీకయులు ఆ పిమ్మట ఉపదేశమును పొందిరి. (4:1-18) వారు మరింత సహోదరప్రేమను ప్రదర్శించుచు, వారి అక్కరలు తీరుటకు చేతులతో పనిచేయుచు, దేవునికి ప్రీతిపాత్రమైన విధానమందు వారు మరింత సంపూర్ణముగా నడువవలసి యుండెను. అంతేకాకుండ, మృతినొందియున్న ఆత్మద్వారా జనించిన విశ్వాసులు యేసు ప్రత్యక్షతన మొదట లేపబడి ఆయనతో ఐక్యము చేయబడుదురను నిరీక్షణతో వారు ఒకరినొకరు ఓదార్చుకొనవలెను. ఆ తర్వాత, బ్రతికియున్న అభిషక్తులు వారి మరణ పునరుత్థానమందు క్రీస్తుతో మరియు అప్పటికే పరలోక జీవనమునకు పునరుత్థానులైన వారితో చేరుదురు.
ఆ తర్వాత పౌలు యెహోవా దినమునుగూర్చి చర్చించి వారికి మరిఎక్కువ ఉపదేశమును యిచ్చెను. (5:1-28) “శాంతి భద్రతల” కేక వచ్చిన తర్వాత, ఆకస్మికముగా నిశ్చయమైన నాశనముతో యెహోవా దినము దొంగవలె వచ్చుచుండెను. కాబట్టి థెస్సలొనీకయులు రక్షగా విశ్వాసప్రేమలను కవచమును, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణముగాను కలిగియుండి ఆత్మీయముగా మెలకువగా ఉండవలెను. సంఘమును నడిపించువారి యెడల వారు మిక్కిలి గౌరవమును కలిగియుండవలెను, అలాగే మనము తప్పక చేయవలసియున్న రీతిగానే వారును దుష్టత్వమును విసర్జించవలెను.
థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన మొదటి పత్రిక మనతోటి విశ్వాసులను మెచ్చుకొనుటకు, ప్రోత్సహించుటకు మనలను ప్రోత్సహించవలెను. అలాగే అది ప్రవర్తనయందును దృక్పధమందును మాదిరికరముగా ఉండుటకు మనలను కదిలించవలెను. నిశ్చయముగా దాని ఉపదేశము యెహోవా దినము కొరకు సిద్ధముగా ఉండుటకు మనకు సహాయపడగలదు. (w91 1/15)
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
కవచము మరియు శిరస్త్రాణము: ఆత్మీయ మెలకువను బలవంతపెట్టుచు, పౌలు యిలా వ్రాసెను: “మనము . . . మత్తులమై యుండక, విశ్వాసప్రేమలను కవచమును రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.” (1 థెస్సలొనీకయులు 5:8) కవచమనగా, యుద్ధ యోధుని గుండె దానిక్రింది భాగమును కాపాడుటకు లోహపు పొలుసులు, గొలుసులు లేక పూర్తిగా లోహముతో చేయబడిన తొడుగైయున్నది. అదేవిధముగా, విశ్వాసమను కవచము మనలను ఆత్మీయముగా కాపాడును. మరి ప్రాచీనకాల శిరస్త్రాణము విషయమేమి? యిది యుద్ధములో పోరాడువానిని కాపాడుటకు తలనిమిత్తమై తరచుగా లోహముతో చేయబడు సైనిక శిరస్త్రాణమై యున్నది. యుద్ధశూరిని తలను శిరస్త్రాణము కాపాడినట్లుగానే, యథార్థతను కాపాడుకొనుటకు ఒక క్రైస్తవుని శక్తిమంతుని చేయుచు, రక్షణయనే నిరీక్షణ అతని మానసిక శక్తులను కాపాడును. యెహోవా ప్రజలు అటువంటి కవచమును ధరించుకొనుట ఎంత అవశ్యకము!—ఎఫెసీయులు 6:11-17.