“విను ప్రతివాడును ‘రమ్ము’ అని చెప్పవలెను!”
“ఆత్మయు పెండ్లి కుమార్తెయు ‘రమ్ము’ అని చెప్పుచున్నారు. వినువాడును ‘రమ్ము’ అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్ఛయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.”—ప్రకటన 22:17.
ఈ సంవత్సరమంతయు “వినుప్రతివాడును ‘రమ్ము!’ అని చెప్పవలెను” అను తమ సాంవత్సరిక వచనమునకు అనుగుణ్యముగా ప్రపంచమంతట 200 దేశముల కంటె ఎక్కువ దేశములలోని యెహోవాసాక్షులు తమ్మును తాము వినియోగించుకొందురు
1. ఏ “జలముల” యొద్దకు “రమ్ము!” అని ఆహ్వానింపబడుతున్నాము?
“రమ్ము” అని మీరు ఆహ్వానింపబడుచున్నారు! దేనికొరకు రావలెను? ఎందుకు, నీటితో మీ దాహమును తీర్చుకొనుటకు రమ్ము. ఇది సామాన్యమైన నీరు కాదుగాని, బావియొద్ద ఉన్న సమరయ స్త్రీతో మాట్లాడునప్పుడు: “నేనిచ్చిన నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని” యేసుక్రీస్తు ఆమెతో చెప్పిన అవే నీళ్లయి ఉన్నవి. (యోహాను 4:14) యేసు ఈ “నీళ్లను” ఎక్కడ నుండి తెచ్చెను?
2. ఈ “జలముల” ఊట ఏమిటి, మరియు ఏ సంఘటన తరువాత అవి ప్రవహించుట ఆరంభించును?
2 అపొస్తలుడైన యోహాను ఈ “నీళ్లు” వెలువడు ఊటను దర్శనమందుచూచు ఆధిక్యతగలవాడై, ప్రకటన 22:1 లో ఇట్లు గుర్తించెను: “మరియు స్పటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము నొద్దనుండి, ఆ పట్టణపు రాజవీధుల మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను.” అవును, జీవమునిచ్చు మూలముగల స్పటికమువలె మెరయు ఆ జలముల మూలాధారము, జీవదాతయైన యెహోవాయే. ఆయన వాటిని గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభ్యపరచుచున్నాడు. (ప్రకటన 21:6 తో పోల్చుము.) “దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము” ప్రస్తావించబడింది గనుక, 1914లో మెస్సియా రాజ్యము స్థాపించబడిన తరువాతనే అంటే ప్రభువు దినము ఆరంభమైన తరువాతనే ఈ జీవజలములు ప్రవహించుట ప్రారంభించాయి.—ప్రకటన 1:10.
3, 4. ఈ “నీళ్లు” దేనిని సూచించుచున్నవి, మరియు ఎవరికి అందుబాటులో ఉన్నవి?
3 ఈ జీవజలము దేనిని సూచించుచున్నది? అది పరదైసుగా మార్చబడిన భూమిపై పరిపూర్ణ మానవజీవితమును, పరిపూర్ణతయందు నిత్యజీవమును తిరిగి అందించుటకై చేసిన దేవుని ఏర్పాటును సూచించుచున్నది. ఆ జీవజలములు యేసుక్రీస్తు ద్వారా చేయబడిన జీవన ఏర్పాటులన్నిటిని సూచించుచున్నవి. ఇదంతయు ఇప్పుడు లభ్యమవుతున్నదా? లేదు, ఇదంతయు కాదు. ఎందుకనగా దేవుడు మొదట అదృశ్య పరిపాలకుడగు అపవాదియైన సాతాను ఆధీనములో ఉన్న ప్రస్తుత దుష్ట విధానమును తీసివేయవలెను. ఈ రాజ్యసువార్తను విని దానికి తగినట్లు మన జీవితములను దిద్దుకొనుట ద్వారా అందుబాటులో ఉన్నంతవరకు ఈ “జలమును” పుచ్చుకొని మనము మన జీవితములలో ఓదార్పును పొందవచ్చును.—యోహాను 3:16; రోమీయులు 12:2.
4 ఆవిధముగా, “జీవపు నదిని” యోహానుకు చూపిన తరువాత దర్శనముతో పాటు తన దూతను పంపుటయందుగల తన సంకల్పమును యేసు యోహానుకు వివరించెను. అటుతరువాత యోహాను ఈ ప్రకటనను వినెను: “ఆత్మయు పెండ్లికుమార్తెయు ‘రమ్ము’ అని చెప్పుచున్నారు. వినువాడును ‘రమ్ము’ అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” (ప్రకటన 22:17) కావున భూమిపై నిత్యజీవమును పొందుటకు దేవుడు తన గొఱ్ఱెపిల్ల ద్వారా చేసిన ఏర్పాటులలోనుండి దప్పిగొనిన వాడు వచ్చి త్రాగుటను ప్రారంభించవలెనని దేవుని సేవకులు ఆ ఆహ్వానమును అందించుచున్నారు.—యోహాను 1:29
జీవజలములయొక్క అవసరత ఉత్పన్నమవుట
5. మానవజాతికి ఈ దైవిక ఏర్పాటు యొక్క అవసరత ఎట్లు ఉత్పన్నమయినది?
5 విశాదకరంగా మానవ కుటుంబముయొక్క మొదటి తల్లిదండ్రులు పరదైసు గృహములో పరిపూర్ణ మానవ జీవితమును నిరంతరము ఆనందించు అవకాశమును తమ సంతానమునకు ఇచ్చురీతిగా జీవనమార్గమును అనుసరించలేదు. మానవజాతి అంతయు నిత్యజీవము అనుభవించు నిమిత్తము ఆదాము విధేయతా పూర్వకంగా దేవుని సేవించు తెలివిగల నిర్ణయము చేయవలసియుండెను. తిరుగుబాటు స్వభావముగల ఒక ఆత్మీయప్రాణియొక్క ప్రభావముక్రింద హవ్వ మానవజాతియొక్క మరణమునకు దారితీయు మార్గమును చేపట్టెను. మరియు పరిపూర్ణుడైన ఆమె భర్తయగు ఆదాము, ఆమెయొక్క మరణపాత్రమైన మార్గముతో ఏకీభవించుటకు ఎన్నుకొనెను. ఆవిధముగా మానవజాతియొక్క తదుపరి తరములకు ప్రకృతిసిద్ధమైన జీవమును ఇచ్చిన వానిగా మానవ కుటుంబమంతటిలో మరణమును ప్రవేశపెట్టిన వాడు ఆయనే ఆయెను. అందుకొరకే బైబిలు ఇట్లు చెప్పుచున్నది. “ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను.” (రోమీయులు 5:12) ఆదాము మరియు హవ్వ పాపములో పడిపోయిన తరువాతనే వారు మానవ కుటుంబములోనికి క్రొత్త సభ్యులను చేర్చారు.—కీర్తన 51:5.
6. ఈ “జలములు” అందుబాటులో ఉండుటకు యెహోవా ఎందుకు ఏర్పాటు చేసెను?
6 పరదైసు భూమిపై పరిపూర్ణ మానవులు నిండియుండవలెనను దేవుని సంకల్పమును పూర్తిచేయుటకు అడ్డంకు ఎల్లప్పుడు నిలిచియుండునా? ఉండదు! అని దానికి బైబిలు జవాబిచ్చుచున్నది. అయినప్పటికిని తన సంకల్పమును పూర్తిచేయు నిమిత్తము, యెహోవా ఆదాముయొక్క విపత్కరమైన తప్పిదమునకు ప్రతిక్రియగా అదే సమయములో తన న్యాయము మరియు నీతికి పూర్తి పొందికతో ఒక ప్రేమగల ఏర్పాటును చేసియున్నాడు. దానికి ఆయన పూర్ణమైన మరియు అత్యున్నతమైన వ్యక్తీకరణయైయున్నాడు. ఆయన దీనిని “జీవజలముల నది” ద్వారా చేయుచున్నాడు. దానిద్వారా జీవపు ఊటకు దూరమైయున్న విధేయతగల మానవజాతికి ఆయన పరిపూర్ణ మానవ జీవితమును తిరిగి అనుగ్రహించును. యేసుక్రీస్తుయొక్క వెయ్యేండ్ల పరిపాలనలో ఈ నది దాని పూర్తి పరిమాణములతో ప్రవహించును. ఆవిధముగా క్రీస్తుయొక్క వెయ్యేండ్ల పరిపాలనా సమయమంతటిలో మనుష్యులందరూ, మృతులలోనుండి పునరుత్థానము పొందిన వారితో సహా ఆ “జీవజలముల నది” నుండి త్రాగవలెను. —యెహెజ్కేలు 47:1-10 తో పోల్చుము; అపొస్తలుల కార్యములు 24:15.
7. ఏ ఆధారముతో ఈ జలముల ఏర్పాటు చేయబడినది?
7 యెహోవా తన స్వంత జీవితమును ఆనందించును. మరియు తెలివిగల జీవితమను ఈ ఆధిక్యతను తన సృష్టిలో కొందరికి అనుగ్రహించుటలోను ఆయన ఆనందించును. యెహోవాయొక్క జీవమిచ్చు ఏర్పాటుకు ఆ ఆధారము యేసుయొక్క విమోచన బలియాగము. (మార్కు 10:45; 1 యోహాను 4:9, 10) అంతేకాకుండా దేవుని వాక్యము కూడా ఇమిడియున్నది. దాన్ని బైబిలు కొన్ని మార్లు “నీళ్లు” అని పిలుచును. (ఎఫెసీయులు 5:26) మొదటి మానవజత అయిన ఆదాము మరియు హవ్వ కొరకు దేవుడు చేసిన తొలి ఏర్పాటులను కోల్పోయిన మానవ సృష్టికి “రమ్ము” అని చెప్పుటకు యెహోవా స్వతంత్రుడైయున్నాడు.
పెండ్లికుమార్తె తరగతి “రమ్ము” అను ఆహ్వానమును అందించుచున్నది
8. ఎవరికి మరియు ఎప్పుడు ఈ జలములు మొదట అందించబడెను?
8 యెహోవా యొక్క ఆదిసంభూతుడైన ఆత్మీయ కుమారుడగు గొఱ్ఱెపిల్లయొక్క సూచనార్థకమైన పెండ్లికుమార్తె తరగతి వారు “రమ్ము” అని ఆహ్వానించు వారిలో మొదటివారు. (ప్రకటన 14:1, 3, 4; 21:9) క్రీస్తుయొక్క ఆత్మీయ పెండ్లికుమార్తె తనకుతాను “రమ్ము” అని చెప్పుకొనుటలేదు. అంటే 1,44,000 బలముతో పెండ్లి కుమార్తె తరగతిని పూర్తిచేయుటకు యెహోవా ఇంకను సమకూర్చువారితో అలా చెప్పుట లేదు. ఆ ఆహ్వానపు మాటలు ఆర్మగెద్దోను తరువాత భూమిపై పరిపూర్ణ జీవితమును పొందు నిరీక్షణగల మనుష్యులకు అందించబడుతుంది. (ప్రకటన 16:14, 16) 1914 నుండి ఈ విధానముయొక్క అంత్యసమయములో దేవునియొక్క పరిశుద్ధాత్మ సహకారముతో పెండ్లికుమార్తెచే అందించబడుచున్న ఈ ఆహ్వానమును మనము వినియున్నాము.
9. అది ఒక చిన్న గుంపు కొరకే కాదని మనకెట్లు తెలియును?
9 ఆహ్లాదకరంగా బైబిలులోని ఆఖరి పుస్తకము, “ఎవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము” ఈ దేవుని రాజ్య సువార్త ప్రకటనకు జవాబిచ్చి తమ్మును తాము ఆ రాజరిక ప్రభుత్వము వైపు ఉంచుకొందురని చూపుచున్నది. (ప్రకటన 7:9, 10, 16, 17) మీరు కూడా ఆ గొప్పసమూహములో ఒకరైయున్నారా? అయితే “విను ప్రతివాడును ‘రమ్ము!’ అని చెప్పవలెను.”
ఆత్మయు పెండ్లి కుమార్తెయు “రమ్ము” అని చెప్పుచున్నారు
10. ఆ సూచనార్థకమైన జలములు ఎచ్చటనుండి ఉత్పన్నము కావలెను, మరియు ఎందుకు?
10 అయితే దేవుడు మరియు సూచనార్థకమైన పెండ్లికుమారుడు ప్రకటన 22:17లో ఎందుకు ప్రస్తావించబడలేదు? మొదట ఆ వచనము ఎవరి ఆధ్వర్యంలో ఆ ఆత్మపనిచేస్తుందో చెప్పుటలేదని గమనించుము. అయినప్పటికి ఆత్మనుగూర్చి చెప్పు ఆ విషయము మన దృష్టిని యెహోవా దేవునిపైకే మరల్చుతుంది. ఆ తండ్రి ఈ దృశ్యమునుండి తీసివేయబడుటలేదు. ఎందుకనగా ఆయనే పరిశుద్ధాత్మయొక్క మూలము. రెండవదిగా కుమారుడు తన తండ్రితో పూర్తిగా సహకరించును. తాను స్వయంగా చెప్పురీతిగా, “తండ్రియేది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటినిచేయునో వాటిని కుమారుడును ఆలాగే చేయును.” (యోహాను 5:19) అంతేకాదు ఈ ఆహ్వానము మొట్టమొదట యెహోవా దేవుని నుండియే ఉత్పన్నమైనదైయుండగా, దైవిక నడిపింపును, లేక “ప్రేరేపిత వాక్కులను” మానవులు “వాక్యము” అయిన యేసుక్రీస్తు ద్వారా పొందగలరు. (ప్రకటన 22:6, NW; మరియు ప్రకటన 22:17 రెఫరెన్సు బైబిలు ఫుట్‌నోట్; యోహాను 1:1) కావున సరియైనరీతిగా పెండ్లికుమారుడైన క్రీస్తును ఈ ఆహ్వానముతో జతపరచుదుము. అవును, పెండ్లికుమారుని తండ్రియైన యెహోవాదేవుడు మరియు పెండ్లికుమారుడైన యేసుక్రీస్తు ఇద్దరు పరిశుద్ధాత్మద్వారా పెండ్లికుమార్తెతో కలసి “రమ్ము” అని చెప్పుదురని మనము నిశ్చయతను కలిగియుండగలము.
11, 12. (ఎ) త్రాగుటకు ఆహ్వానము నిచ్చుపని విస్తారముగా ఎదుగునని ముందుగానే ఏది సూచించెను? (బి) సమయము గడిచిన కొలది ఆ విషయము ఎట్లు స్పష్టమాయెను?
11 దశాబ్దముల నుండి “జీవజలముల” కొరకు దప్పిగొనిన వారికి “రమ్ము” అను ఈ ఆహ్వానము అందించబడుతుంది. 1918లో కూడా ఈ పెండ్లికుమార్తె తరగతి విశేషముగా భూమిపై జీవించగలవారినిగూర్చి ఒక సందేశము ప్రకటించుచుండెను. అది “ఇప్పుడు జీవించుచున్న లక్షలు ఎన్నడు చావకుండవచ్చు” అను బహిరంగ ప్రసంగమైయుండెను. అది ఎందరో ఆర్మగెద్దోనును తప్పించుకొని దేవుని మెస్సియా రాజ్యము క్రింద పరదైసు భూమిపై నిత్యజీవమును పొందగలరన్న నిరీక్షణను అందించెను. కాని ఆ సందేశము సామాన్యమైయున్న నీతిని ప్రస్తావించెనుగాని ఆ తప్పించుకొను ఆధిక్యతయొక్క మార్గమును ఖచ్చితముగా చూపలేదు.
12 “రమ్ము” అను ఈ ఆహ్వానమును అధిక ప్రజలకు అందించుటకు 1922లో దేవుని సేవించుటకు ఆసక్తిగల వారందరికి “రాజును ఆయన రాజ్యమును ప్రకటించుడి” అను సందేశమియ్యబడెను. 1923లో ఈ పెండ్లికుమార్తె తరగతి మత్తయి 25:31-46 లోని యేసుయొక్క ఉపమానములోని గొఱ్ఱెలు మరియు మేకలు ఆర్మగెద్దోనుకు ముందే గుర్తించబడునని అర్థము చేసికొనిరి. ఆ తరువాత 1929లో ది వాచ్‌టవర్ మార్చి 15వ సంచికలో “కృపాసహితమగు ఆహ్వానము” అను వ్యాసము ప్రచురించబడెను. దాని ముఖ్యలేఖనము ప్రకటన 22:17 యై యుండెను. మరియు అది పెండ్లి కుమార్తె తరగతివారు “రమ్ము” అను ఆహ్వానమును అందించుటకు కలిగియున్న బాధ్యతను ఎత్తిచూపెను.—87-9 పుటలుa
“రమ్ము” అని చెప్పుటలో వేరేగొఱ్ఱెలు కలియుట
13, 14. 1930 వ దశాబ్దములో ఆ సూచనార్థకమైన జలములను ఇతరులు కూడా త్రాగుదురను ఏ అదనపు వివరణ స్పష్టముచేయబడెను?
13 అంతేకాకుండా 1932 లోనే దివాచ్‌టవర్ “రమ్ము” అని చెప్పుటలో “వేరేగొఱ్రెలు” తమ వంతుగా కలిగియున్న బాధ్యతను సూచించెను. (యోహాను 10:16) దాని ఆగస్టు సంచిక 232 పుట 29వ పేరాలో ఇట్లు చెప్పెను: “యెహోవా సాక్షులు ఇప్పుడు యెహూవలె ఆసక్తిని కలిగియున్నారు. మరియు వారు యెహోనాదాబు తరగతి (వేరే గొఱ్ఱెలు) వారిని తమతో కూడా వచ్చి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నదని ప్రకటించుటలో కొంతభాగము తీసుకొనవలెనని ప్రోత్సహించాలి.” తరువాత ప్రకటన 22:17 నుండి ఎత్తి వ్రాస్తు ఆ పేరాగ్రాఫ్ ఇట్లు చెప్పెను: “అభిషక్తులు రాజ్యసువార్తను ప్రకటించుటలో భాగము వహించబోవు వారందరిని ప్రోత్సహించవలెను. ప్రభువు సందేశమును ప్రకటించుటకు వారు అభిషక్తులై యుండవలసిన అవసరము లేదు. యెహోవాయొక్క అధిక మంచితనము చేత, ఆర్మగెద్దోనులోనుండి సజీవులుగా దాటి వెళ్లి, భూమిపై నిత్యజీవమును అనుభవించగల ప్రజలకు ఈ జీవజలములను తీసుకువెళ్లుటకు వారు అనుమతించబడ్డారని ఇప్పుడు తెలుసుకొనుట యెహోవాసాక్షులకు గొప్ప ఓదార్పునిచ్చును.”b
14 1934 నుండి ఈ వేరే గొఱ్ఱెలు తమను తాము యెహోవాకు నీటి బాప్తిస్మముతో సమర్పించుకొని పెండ్లికుమార్తె తరగతి వారితో కలిసి దప్పిగొన్న మరి ఇతరులతో “రమ్ము” అనవలెనని అభిషక్త శేషమువారు చూపించుచుండిరి. ఆలాగున అప్పుడు దప్పిగొనిన వేరే గొర్రెలను “ఒకే కాపరి” యేసుక్రీస్తు క్రింద “ఒకే మందగా” సమకూర్చుటకు పెండ్లికుమార్తె తరగతిచే అందించబడుచున్న ఒక నిశ్చయమైన ఆహ్వానము ఉండెను. (యోహాను 10:16) 1935లో అభిషక్త శేషము వారి సాధారణ సమావేశమునందు వారు “రమ్ము” అని చెప్పుచున్న గొఱ్ఱెలవంటి వారి తరగతికి చెందిన ప్రజలు నిజముగా ప్రకటన 7:9-17 లో చెప్పబడిన “గొప్పసమూహము”యే అని గుర్తించుటకు వారు కదల్చబడిరి. ఇది ఆహ్వానించు పనికి గొప్ప వేగము అందించినది.
15. “రమ్ము” అను ఆహ్వానములో “ఆత్మ” ఎట్లు భాగము వహించెను?
15 “రమ్ము” అని చెప్పుటలో పెండ్లి కుమార్తె తరగతి దేవుని ఆత్మతో ఏకీభవించియుండెను. ఆయన తన ఆత్మద్వారా లిఖిత వాక్యములోని ప్రవచనములయొక్క అర్థమును విప్పుటద్వారా పెండ్లికుమార్తెయొక్క శేషము ఈ ఆహ్వానమును అందించేలా చేసెను. వారి ఆహ్వానమునకు ఆధారమైయున్న ఈ ప్రవచనములు దేవుని ఆత్మయొక్క ప్రేరేపణ వలన కలిగెను. కావున వాస్తవముగా దేవుని ఆత్మ క్రీస్తు మరియు పెండ్లి కుమార్తెలతో ప్రవహిస్తూ గొఱ్ఱెల వంటి ప్రజల గొప్పసమూహమునకు “రమ్ము” అని చెప్పుచున్నది.—ప్రకటన 19:10.
16. ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఈనాడు ఇవ్వబడుతున్న ఆహ్వానముతో ఎట్లు సంబంధమును కలిగియున్నారు?
16 ఈ శేషముచే ప్రాతినిధ్యము వహించబడుచున్న ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఈ దినము వరకు “రమ్ము” అని చెప్పుచున్నారు. ఈ శేషము వారు వేరేగొఱ్రెలతో ఇంకను ఇతరులను “రమ్ము” అని ఆహ్వానించమని చెపుతున్నారు. ఈనాడు లభ్యమవుతున్న “జీవజలములను” వారు తమకు తాము ఉంచుకొనరాదు. ఆత్మయు పెండ్లికుమార్తెయు ఇచ్చు ఆజ్ఞను అనుసరించి “విను ప్రతి వారును రమ్మని చెప్పవలెను.” తమ దప్పికను తీర్చుకొన్నవారందరు ఈ ఆహ్వానమును ఇతరులకు తెలియజేయవలెను. జాతి, దేశ, భాష మరియు ప్రస్తుత మతమున్నవారికిని విభేధం లేకుండా ప్రతిచోట ఉన్న వారందరికి వారు దానిని అందించవలెను. “జీవజలములలో” అందుబాటులో ఉన్నవాటిని ఉచితముగా పుచ్చుకొనుటకు యెహోవాసాక్షులు ఆహ్వానమునందించి ప్రజలకు సహాయము చేయుదురు.
17. ఎటువంటి “జలము” ఈనాడు అందుబాటులో ఉన్నవి?
17 భూవ్యాప్తంగా గొఱ్ఱెపిల్లయైన యేసుక్రీస్తు గొప్పసమూహమును “జీవజలముల బుగ్గలయొద్దకు” నడిపించుచున్నాడు. (ప్రకటన 7:17) ఇది కలుషితమైన జలము కాదుగాని, దాని ఊట నుండి కూడా స్వచ్ఛమైన చల్లని ఆరోగ్యవంతమైన నీరు. ఈ సూచనార్థకమైన నీళ్లు బైబిలు సత్యమును అర్థము చేసికొనుట అనుదానికంటే ఎక్కువ అర్థమును కలిగియున్నవి. అవి ఇప్పుడు కూడా గొప్పసమూహమును సంతోషముగల పరిపూర్ణ నిత్యజీవమును పొందు మార్గములో ఉండుటకు దేవుడు యేసుక్రీస్తుద్వారా చేసిన ఏర్పాటులైయున్నవి.
ప్రకటనచేయుటలో ఇప్పుడే కూడిరండి
18. మన సమయములో ఇవ్వబడుతున్న ఆహ్వానము ఎంత విస్తారముగా ఉన్నది?
18 అప్పుడే ఈ గొప్పసమూహము సంఖ్య కొన్ని లక్షలుగా పెరిగినది. వారు ఆసక్తితో రాజ్యసువార్తను సకల జనములకు ప్రకటించుట కొనసాగించుచున్నారు. 212 దేశాలకు వ్యాపించిన రాజ్యసువార్తను ప్రకటించుపనిలో తమ క్షేత్రసేవను వారు క్రమంగా రిపోర్టుచేయుచున్నారు. ఈ విధానముయొక్క అంత్య దినములలో సమయము అనుమతించిన కొలది, గొప్ప సమయపాఠకుడైన యెహోవా దేవుని ఓపిక మరియు దీర్ఘశాంతముబట్టి ఈ ఆహ్వానము కొనసాగుతుంది. సరియైన సమయము ఆయనకే తెలియును. మరియు బైబిలు ప్రవచనములలో పదేపదే చెప్పబడిన తన వాగ్థానము ప్రకారముగా అందరికి తాను యెహోవా అని తెలియపరచు కీలక సమయమేదో ఆయనకే తెలియును.—యెహెజ్కేలు 36:23; 38:21-23; 39:7.
19. ఈ “జలము” ఉచితముగా ఇవ్వబడుతుందని మనమెట్లు చెప్పగలము?
19 ఇంకా సమయము ఉన్నంతవరకు గొప్పసమూహము వారు ఆనందముతో పెండ్లికుమార్తె బృందముయొక్క శేషముతో కలిసి ‘ఇచ్ఛయించువానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము’ అని చెప్పుటలో భాగము వహింతురు. ఈ జీవితములను రక్షించు సువార్తను ప్రకటించువారు ఉచితముగా ప్రకటించుచున్నారు. భూవ్యాప్తముగా రాజ్యసందేశమును వ్యాపించుటలో తాము చేయుపనికి ఏమియు వసూలు చేయుటలేదు.
20. ఈ “జలము” అందుబాటులో ఉన్నందున ఏమి పరిణమించును?
20 ఇచ్ఛయించువారు పుచ్చుకొని జీవమును రక్షించు పరిణామములతో పూర్తి సంతృప్తి పొందునిమిత్తము జీవజలములు భూవ్యాప్తంగా అందుబాటులో ఉన్నవి. విమోచించబడిన మానవజాతి ఇక్కడే పరదైసుగా రూపాంతరము పొందిన భూమిపైనే నిరంతర జీవితమును ఆనందించుచు యెహోవాయొక్క అమూల్య సంకల్పపు సత్యత్వమును ఘనపరచుదురు. మన సృష్టికర్త ఈ భూమిని శూన్యముగా ఉండుటకు చేయలేదు కాని భూవ్యాప్తమైన ఏదెను తోట లేక ఆనందమునిచ్చు పరదైసుగా ఉండి దేవుని స్వరూపము మరియు పోలిక కలిగిన పరిపూర్ణ మానవసృష్టికి నివాసస్థలముగా ఉండుటకు చేసెను.
21. భూమికొరకు దేవుని సంకల్పము ఎట్లు నెరవేరును?
21 నిశ్చయముగా అటువంటి నూతన లోకములో జీవించుట వర్ణించలేనంత గొప్ప ఆధిక్యత మరియు ఆనందము నిచ్చునదైయుండును. అప్పుడు మొదటి మానవజతకు ఆదికాండము 1:27, 28 లో దేవుడిచ్చిన ఉత్తరువు ధారళంగా పూర్తవుతుంది. మానవ కుటుంబముపై వచ్చిన విపత్తును యెహోవా నైపుణ్యతతో పరిష్కరిస్తున్నందుకు ఆయనకు వందనములు. ఈ భూమి పరదైసుగా మార్చబడి పరిపూర్ణ మానవజాతితో నింపబడునంతమటుకు లోపరచబడుతుంది. అవును, దేవుడు తాను చేసినది యావత్తు చూచినపుడు ఇదిగో, అది చాలా మంచిదిగా ఉండును. నీవు అక్కడ ఉందువా? అట్లయిన ఇప్పుడే నీవు గుణగ్రహణతో జీవజలములను ఉచితముగా పుచ్చుకొనుట ఆరంభించవలెను. “రమ్ము!” ఇప్పుడు ప్రవహించుట ఆరంభించి వెయ్యేండ్ల కాలములో పూర్తి పరిమాణములలో ప్రవహించనైయున్న జీవజలములతో నిండుగా నీ దాహమును తీర్చుకొనుము. ఈ తియ్యని ఆహ్వానమును వినువారును “రమ్ము!” అని చెప్పవలెను. (w90 12/15)
[అధస్సూచీలు]
a మరి యితర విషయములతో సహా ఆ వ్యాసము ఇట్లు చెప్పెను: “గడచిన కొన్ని సంవత్సరములలో సత్యమునుగూర్చి ఇవ్వబడిన విస్తీర్ణ సాక్ష్యము మరి యెప్పుడును ఇవ్వబడలేదు. శేషించినవారు వారికి సంతోషమైన సందేశమును తెచ్చి వారితో ఇట్లందురు: ‘ఇచ్ఛయించువానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము.’ వారు ప్రభువు పక్షమున నిలచియుండి సాతానును నిరోదించి, ఆశీర్వాదములను పొందగలరని చెప్పబడిరి. వినయముగలవారై నీతిని అనుసరించి ఆయన ఉగ్రతదినమందు దాచబడినవారై ఆర్మగెద్దోను మహాదినమును దాటి మరణములేకుండా నిరంతరము జీవించగల తరగతి ప్రజలు వీరు కారా? (జెఫన్యా 2:3) నమ్మకమైన శేషము తరగతి వారు కృపాసహితమగు ఆహ్వానమునిచ్చుటలో కూడి ‘రమ్ము’ అని అందురు. నీతిని మరియు సత్యమును ఆశించు వారందరికి ఈ వర్తమానము ప్రకటించబడవలెను. అది ఇప్పుడు జరుగబడవలెను.”
b ఆగస్టు 15, 1934 ది వాచ్‌టవర్ వేరేగొర్రెల బాధ్యతను గూర్చి 249వ పుట పేరా 31లో ఇలా చెప్పెను: “యెహోనాదాబు వర్గము వారు సత్యముయొక్క ఈ సందేశమును ‘విని’ విను మరి ఇతరులకు ‘రమ్ము’ అని చెప్పవలెను. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము. ఇచ్ఛయించు వానిని జీవజలములను ఉచితముగా పుచ్చుకొననిమ్ము, (ప్రకటన 22:17) యెహోనాదాబు తరగతి వారితో అనగా అభిషక్తులతో వెళ్లి రాజ్యసందేశమును ప్రకటించవలెను.”
మీ జవాబు ఏమైయున్నది?
◻ ప్రకటన 22:17 లో ఏ “జలము”లను గూర్చి చెప్పబడినది?
◻ ఆ “జలముల” ఊట ఏది?
◻ ఈ “జలముల” అవసరమేమి? మరియు అవి ఎప్పుడు ప్రవహించుట మొదలవును?
◻ మన ముఖ్యలేఖనములో “ఆత్మ” దేనిని సూచించుచున్నది? మరియు “పెండ్లికుమార్తె” ఇందు ఎట్లు ఇమిడియున్నది?
◻ ఎవరు ఈ “జలములను” పుచ్చుకొనవచ్చును? మరియు దాని పరిణామమేమి?