కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 1/1 పేజీ 31
  • గురియొద్దకు చేరుకొనుడి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • గురియొద్దకు చేరుకొనుడి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • క్రైస్తవ లక్షణములు స్పష్టమైనవి
  • గురియొద్దకు పరుగెత్తుడి
  • ఫిలిప్పీయులు 4:13—“క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను”
    బైబిలు వచనాల వివరణ
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • బహుమానాన్ని మనసులో ఉంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • “మనం అధైర్యపడం”!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 1/1 పేజీ 31

గురియొద్దకు చేరుకొనుడి!

ఫిలిప్పీయులనుండి ఉన్నతాంశములు

అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ క్రైస్తవులను నిత్యజీవ బహుమానము పొందుటకై గురియొద్దకు ముందుకుసాగుడని కోరెను. కాబట్టి, సా.శ. 60 లేక 61లో రోమునందు ఆయన మొదటిసారి ఖైదీగా ఉన్నప్పుడు ఆయన వారికి పత్రిక వ్రాసెను. దాదాపు పది సంవత్సరముల క్రితము ఫిలిప్పీలో తాను స్థాపించిన సంఘమునకు ఈ పత్రిక పంపబడెను. ఈ పట్టణము మాసిదోనీయుడైన ఫిలిప్పుచే నిర్మించబడిన పట్టణము. (అలెక్జాండర్‌ ది గ్రేట్‌ యొక్క తండ్రి) సా.శ. మొదటి శతాబ్దమునకు అది మాసిదోనియా జిల్లకు ముఖ్యపట్టణమైనది. ఇప్పుడు అది గ్రీసుకు ఉత్తరభాగమున మరియు యుగోస్లేవియా దక్షిణభాగమున ఉన్నది.—అపొస్తలుల కార్యాలు 16:11, 12.

ఫిలిప్పీలోని విశ్వాసులు బీదవారైనను ధారళముగా ఇచ్చువారు. అనేకమారులు పౌలు అవసరముల నిమిత్తమై వారు కొంతపంపియుండిరి. (ఫిలిప్పీయులు 4:14-17) అయితే ఆయన పత్రిక కేవలము కృతజ్ఞతను తెల్పునదే కాదు. ప్రోత్సాహము నిచ్చునదై, ప్రేమను వ్యక్తపరచి, ఉపదేశమును అనుగ్రహించెను.

క్రైస్తవ లక్షణములు స్పష్టమైనవి

ఫిలిప్పీలోని విశ్వాసులయెడల తాను కలిగియున్న ప్రేమను తెలియజేస్తూ పౌలు ఉత్తరము ప్రారంభమాయెను. (1:1-30) సువార్త వ్యాపమునకై వారుపంపిన చందాలకై యెహోవాకు కృతజ్ఞతను తెలిపి వారి ప్రేమ ఇంకా విస్తరించవలెనని ఆయన ప్రార్థించెను. తాను బంధింపబడుట ‘వారు దేవునివాక్యమును బహు నిర్భయముగా మాట్లాడుటకు’ కారణమాయనని పౌలు సంతోషించెను. క్రీస్తుతో కూడా ఉండుటకు ఆయన ఆశించినను ఇంకను వారికి పరిచర్యచేయవలెనని భావించెను. మరియు ఆయన వారిని “సువార్త విశ్వాసపక్షమున పోరాడవలెననియు కోరెను.”

తరువాత ప్రవర్తన మరియు స్వభావము విషయములో ఉపదేశమివ్వబడెను. (2:1-30) ఇతరుల యెడల వ్యక్తిగత శ్రద్ధచూపి క్రీస్తులాంటి దీనత్వమును ప్రదర్శించుమని ఫిలిప్పీయులు ప్రోత్సహించబడిరి. వారు “లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు” మరియు “జీవవాక్యమును గట్టిగా చేతపట్టుకొని” ఉండవలెనని బలవంతపెట్టబడిరి. వారియొద్దకు తిమోతిని పంపుటకు పౌలు నిరీక్షిస్తూ త్వరలో తానే వస్తానను నమ్మకముతో యుండెను. బహుగా వ్యాధిగ్రస్తుడైయున్న ఎపఫ్రొదితును గూర్చి పునఃనిశ్చయతను కలుగజేయుటకు ఈ నమ్మకమైన సేవకుని పౌలు పంపుచుండెను.

గురియొద్దకు పరుగెత్తుడి

తదుపరి పౌలు, వారు గురియొద్దకు పరుగెత్తుచుండగా తమనమ్మకమును ఎచ్చట నిలుపవలెనను విషయమును ఫిలిప్పీయులకు చూపెను. (3:1-21) దానిని యేసుక్రీస్తు నందుంచవలెను, కొందరు చేయుచున్నట్లు శరీరమందునో లేక సున్నతియందునో కాదు. “క్రీస్తునుగూర్చిన బహు శ్రేష్టమైన జ్ఞానమునిమిత్తము” పౌలు సమస్తమును నష్టముగా ఎంచుకొనెను. అపొస్తలుడు “క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురియొద్దకు పరుగెత్తుచుండెను.” మరియు ఫిలిప్పీయులను కూడా అదే మానసిక స్వభావమును కలిగియుండవలెనని ఆయన ప్రోత్సహించెను.

పౌలుయొక్క ముగింపు సలహాను అన్వయించుకొనుట పిలిప్పీయులు గురిని మరియు బహుమానమును తమ దృష్టియందు నిలుపుటకు సహాయపడును. (4:1-23) తమ చింతలను ప్రార్థనద్వారా దేవునికి అప్పగించి తమమనస్సులను ఆరోగ్యవంతమైన తలంపులతో నింపుకొనమని పురికొల్పెను. పౌలు వారి ఔదార్యమునకు మెచ్చుకొని వందనములతో మరియు ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మితిలేని కృప వారు చూపు ఆత్మతోయుండును గాక అని కోరెను.

ఫిలిప్పీయులకు పౌలు వ్రాసినపత్రిక ఔదార్యమును, ప్రేమను మరియు దీనత్వమును ఉత్పన్నము చేయునదిగా ఉన్నది. క్రీస్తుయందు నమ్మకమును, దేవుని హృదయపూర్వక ప్రార్థనను ప్రోత్సహించుచున్నది. నిశ్చయముగా పౌలు మాటలు యెహోవాసాక్షులకు నిత్యజీవ బహుమానమును పొందుటకు గురియొద్దకు సాగునట్లు సహాయపడును. (w90 11⁄15)

[31వ పేజీలోని బాక్సు/చిత్రం]

గురియొద్దకు: “వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరుగెత్తుచున్నాను.” అని పౌలు వ్రాసెను. (ఫిలిప్పీయులకు 3:13, 14) అపొస్తలుడు తనమట్టుకు తాను పందెములోనున్నవానివలె పోరాడుచున్నాడు. పరుగెత్తువాడు తన చివరి గీతను దాటుటకు పోరాడునట్లు పౌలు వెనుకకు చూచుటలో సమయమును మరియు ప్రయాసను వృధా చేయలేదు. భూజీవితమును నమ్మకముతో ముగించిన తరువాత పౌలు మరియు ఇతర అభిషక్త క్రైస్తవులకు ఉన్న బహుమానము పరలోక జీవితము. మననిరీక్షణ భూసంబంధమైనదైన లేక పరలోకసంబంధమైనదైన యెహోవాకు యథార్థతను కనపరచుచు ఆయనయొక్క సాక్షులముగా గురియొద్దకు ముందుకు సాగుదము.—2 తిమోతి 4:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి