కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 5/1 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫిలిప్పీయులు 4:13—“క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను”
    బైబిలు వచనాల వివరణ
  • గురియొద్దకు చేరుకొనుడి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • “వెనుకతట్టు” చూడకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • విద్యాధికుడైన వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 5/1 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

అపొస్తలుడైన పౌలు తాను “వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు”న్నానని చెప్పినప్పుడు ఆయన భావమేమైయుంది? (ఫిలిప్పీయులు 3:13) ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దేనినైనా మరచిపోగలడా?

లేదు, అనేక సందర్భాల్లో మనం మన మనస్సులో ఉన్న జ్ఞాపకాన్ని ఉద్దేశ్యపూర్వకంగా తీసివేసుకోలేము. వాస్తవమేమిటంటే, మనం జ్ఞాపకముంచుకోవాలని కోరుకునే ఎన్నిటినో మనం మరచిపోతాము, కాని మరచిపోవలసిన అనేక విషయాలను జ్ఞాపకముంచుకుంటాము. మరి ఫిలిప్పీయులు 3:13 నందలి మాటలను వ్రాసినప్పుడు పౌలు భావమేమైయుంది? వాటిని అర్థం చేసుకోవడానికి ఆ సందర్భం మనకు సహాయం చేస్తుంది.

ఫిలిప్పీయులు 3వ అధ్యాయంలో, పౌలు తాను “శరీరమును ఆస్పదము చేసి”కోవడం గురించి వివరిస్తున్నాడు. తన నిష్కళంకమైన యూదా పూర్వరంగం గురించి, ధర్మశాస్త్రం ఎడల తనకుగల ఆసక్తి గురించి అంటే ఇశ్రాయేలు దేశంలో ఆయనకు అనేక ప్రయోజనాలు కలుగజేసి ఉండగల విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. (ఫిలిప్పీయులు 3:4-6; అపొస్తలుల కార్యములు 22:3-5) అయినప్పటికీ, సూచనార్థకంగా చెప్పాలంటే, ఆయన అలాంటి ప్రయోజనాలను నష్టంగా ఎంచి, వాటిని నిరాకరించాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన అంతకంటే శ్రేష్ఠమైనదాన్ని అంటే “యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము”ను కనుగొన్నాడు.—ఫిలిప్పీయులు 3:7, 8.

ఈ లోకంలో ఒక స్థానం సంపాదించుకోవాలన్నది కాదుగాని, ‘మృతులలో నుండి శీఘ్ర పునరుత్థానం’ కావాలన్నది పౌలు ముఖ్య లక్ష్యమైయుంది. (ఫిలిప్పీయులు 3:11, 12) అందుకే, ఆయనిలా వ్రాశాడు: “వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.” (ఫిలిప్పీయులు 3:13, 14) “వెనుక ఉన్నవి మరచి” అని పౌలు చెప్పినప్పుడు, ఆయన తన మనస్సులో నుండి ఏదో విధంగా “వెనుక ఉన్నవి” జ్ఞాపకంలో ఉండకుండా చెరిపి వేసుకున్నాడన్న భావంలో చెప్పలేదు. ఆయన వాటిని ఇంతకు క్రితమే వ్రాశాడు గనుక వాటిని ఆయన ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నాడన్నది స్పష్టమౌతుంది. అంతేగాక, ఆదిమ గ్రీకులో, ముగిసిపోయినది కాదుగాని ఇంకా కొనసాగుతున్న క్రియను సూచించే క్రియాపద రూపాన్ని ఆయన ఉపయోగించాడు. ఆయన “మరచి” అని చెబుతున్నాడు గాని “మరచిపోయిన” అని చెప్పడంలేదు.

“మరచి” (ఎ·పి·లాన్‌·థాʹన్‌వో·మాయ్‌) అని అనువదింపబడిన గ్రీకు పదానికి వివిధ రకాలైన భావాలున్నాయి, వాటిలో ఒకటి “శ్రద్ధ లేకుండా ఉండడం,” లేక “నిర్లక్ష్యం చేయడం.” ఎక్సెజెటికల్‌ డిక్షనరి ఆఫ్‌ ది న్యూ టెస్ట్‌మెంట్‌ (హార్సట్‌ బాల్జ్‌ మరియు గెర్హార్డ్‌ ష్నీడర్‌ ఎడిట్‌ చేసినది) చెప్పేదాని ప్రకారం, ఫిలిప్పీయులు 3:13 నందున్న “మరచి” అనేదాని భావం అదే. తాను విడిచి పెట్టిన వాటి గురించి పౌలు తదేకంగా ఆలోచించలేదు. అవి ఎక్కువ శ్రద్ధనివ్వదగినవి కావన్నట్లు దృష్టించడం ఆయన నేర్చుకున్నాడు. పరలోక నిరీక్షణతో పోల్చినప్పుడు అవి “పెంట” వలె ఉన్నవి.—ఫిలిప్పీయులు 3:8.

పౌలు మాటలను నేడు ఎలా అన్వయించుకోవచ్చు? పౌలు వలె ఒక క్రైస్తవుడు దేవుని సేవచేయడానికి త్యాగాలు చేసివుండవచ్చు. పూర్తికాల సేవ కొరకు అతడు లాభదాయకమైన ఉద్యోగాన్ని వదులుకొని ఉండవచ్చు. లేక అతడు, అతని కుటుంబీకులు సత్యాన్ని నిరాకరిస్తున్నందున అతనికి ఆర్థికంగా సహాయపడని సంపన్న కుటుంబానికి చెందినవాడై ఉండవచ్చు. అలాంటి త్యాగాలు మెచ్చుకొనదగినవే, గాని అవి ఎల్లప్పుడూ వాటి గురించే తలంచ వలసిన విషయాలు కావు. ఒక క్రైస్తవుడు తన కొరకు వేచివున్న మహిమకరమైన భవిష్యత్తు దృష్ట్యా “వెనుక ఉన్నవి” ‘మరచిపోతాడు,’ అంటే వాటి గురించి శ్రద్ధ కలిగివుండడం మానుకుంటాడు.—లూకా 9:62.

పౌలు మాటల వెనుకనున్న సూత్రాన్ని బహుశ మరో విధంగా అన్వయించుకోవచ్చు. దేవుని గురించి తెలుసుకోక మునుపు చెడు ప్రవర్తన కలిగివుండిన క్రైస్తవుని విషయమేమిటి? (కొలొస్సయులు 3:5-7) లేక బహుశ క్రైస్తవుడైన తర్వాత అతడు గంభీరమైన పాపం చేయగా, సంఘం అతనిపై క్రమశిక్షణ చర్య తీసుకున్నదనుకోండి. (2 కొరింథీయులు 7:8-13; యాకోబు 5:15-20) అతడు నిజంగా పశ్చాత్తాపపడి, తన మార్గాలను మార్చుకుని ఉంటే, అతడు ‘కడుగబడిన’ వాడౌతాడు. (1 కొరింథీయులు 6:9-11) జరిగిపోయింది గతం. అతడు తాను చేసినది అక్షరార్థంగా ఎన్నడూ మరచిపోకపోవచ్చు—వాస్తవానికి, పాపాన్ని మళ్లీ చేయకుండా ఉండేలా ఆ అనుభవం నుండి అతడు నేర్చుకోవడం జ్ఞానయుక్తంగా ఉంటుంది. అయినప్పటికీ, తనను తాను ఎడతెగక తక్కువ చేసుకుంటూ ఉండకుండా ఉండడం ద్వారా అతడు ‘మరచిపోతాడు.’ (యెషయా 65:17 పోల్చండి.) యేసు బలి ఆధారంగా క్షమించబడి, అతడు గతం గురించి ఎక్కువ శ్రద్ధ కల్గివుండడు.

ఫిలిప్పీయులు 3:13, 14 నందు, పౌలు తనను తాను, పరుగు పందెంలో గమ్యాన్ని చేరడానికి ‘వేగిరపడుతున్న’ పరుగెత్తేవానిగా వర్ణించుకున్నాడు. పరుగెత్తేవాడు వెనక్కు కాదు ముందుకే చూస్తాడు. అలాగే, ఒక క్రైస్తవుడు ముందున్న ఆశీర్వాదాల వైపే చూడాలి కాని, వెనుక విడిచి పెట్టిన వాటివైపు కాదు. పౌలు ఇలా కూడా చెబుతున్నాడు: “దేనిగూర్చియైనను మీకు వేరు తాత్పర్యము కలిగియున్నయెడల, అదియు దేవుడు మీకు బయలుపరచును.” (ఫిలిప్పీయులు 3:15) కాబట్టి, ఇలాంటి దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి మీకు సహాయం చేయమని దేవునికి ప్రార్థించండి. బైబిలు నందలి దేవుని తలంపులతో మీ మనస్సును నింపుకోండి. (ఫిలిప్పీయులు 4:6-9) మీ ఎడల యెహోవాకున్న ప్రేమ గురించి, దాని మూలంగా మీకు కలుగుతున్న ఆశీర్వాదాల గురించి ధ్యానించండి. (1 యోహాను 4:9, 10, 17-19) అప్పుడు, మీరు వెనుక విడిచిపెట్టిన వాటి గురించి శ్రద్ధ కల్గిలేకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా మీకు సహాయం చేస్తాడు. బదులుగా, పౌలు వలె, మీరు ముందున్న మహిమకరమైన భవిష్యత్తువైపు చూస్తారు.—ఫిలిప్పీయులు 3:17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి