త్రిత్వమును మీరు నమ్మవలయునా?
వెస్టిండీస్‌లోని జమైకాలో ది సండే గ్లీనర్, నకు ఇయాన్ బాయ్‌నే మత రచయిత, ఈ మధ్య యెహోవాసాక్షులు ప్రచురించిన బ్రొషూర్‌ను ఆయన చర్చించెను. అందులో కొంతభాగము ఇట్లున్నది:
“ఈ పత్రమునకు, సాక్షులు ‘ఎ’ గ్రేడ్ పొందనర్హులు. బాలురు పఠించగలిగినంత సుళువుగ వ్రాయబడినను, పేరుగాంచిన విద్వాంసులు, మరియు మూలములనుండి ఎత్తివ్రాయబడిన వాటితో చక్కగా అమర్చబడినది. త్రిత్వమును మీరు నమ్మవలయునా? అను ప్రచురణ సాక్షులయొక్క నైపుణ్యతను తెల్పుచున్నది. త్రిత్వవాదులు—లేక ద్విత్వవాదుల వాదనకు యిప్పుడు భద్రత లేదు. త్రిత్వము బైబిలునుండి తీసికొనబడినది కాదని చారిత్రక మరియు వేదాంత మూలములనుండి ఎత్తివ్రాయబడినవి యీ చిన్నపుస్తకములో కుప్పలు కుప్పలుగా నున్నవి. అధికారపూర్వకమైన ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియన్ “నూతన నిబంధనలో కూడ త్రిత్వమును గూర్చి స్పష్టమైన సిద్ధాంతము లేదని వేదాంతులు అంగీకరించుచున్నట్లు” చెప్పుదానిని అది ఎత్తివ్రాసినది.
బాయ్‌నె యింకా ఇట్లు గమనించెను: “యేసు దేవుడైయున్నాడు” అను దృక్పథమునకు వ్యతిరేకముగా పేర్చిన బలవంతముచేయు మరియు ఆజ్ఞాపించునట్టి వాదములకు సామాన్య లేక సామాన్యులకుపైగానున్న చర్చి సభ్యులెట్లు జవాబివ్వగలరో చూచుట యీ మత రచయితకు కష్టతరమైనది.”
ఈ బ్రొషూరు కాపీని మీరు పొందగోరినయెడల దీనితోనున్న కూపనును నింపి పోస్టు చేయండి.
32-పేజీల త్రిత్వమును మీరు నమ్మవలయునా? అను చిన్న పుస్తకమును పొందుటకు నేను యిష్టపడుచున్నాను. ఇందుకై రూ. 3.00 పంపుచున్నాను.
[32వ పేజీలోని చిత్రసౌజన్యం]
Musée du Louvre, Paris
Museo Egizio, Turin
Musée des Beaux-Arts de Troyes
Museo Bardini, Florence
Musée du Louvre, Paris