కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 12/1 పేజీలు 24-29
  • యెహోవా మా పరిపాలకుడు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మా పరిపాలకుడు!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు సాక్షులను ఆజ్ఞాపించుట
  • యెహోవా ఎంపిక చేయును
  • పరిశుద్ధాత్మతో నింపబడుట!
  • చైతన్యపూరితమైన సాక్ష్యమును పేతురు ఇచ్చుట
  • యెహోవా అభివృద్ధిని దయచేయుట
  • స్వస్థత మరియు దాని ఫలితములు
  • వారు ఆపుజేయరు!
  • ప్రార్థనలకు జవాబివ్వబడెను!
  • అబద్ధికులు బయటపెట్టబడిరి
  • మనుష్యులకు బదులుగా దేవునికి లోబడుడి
  • “చదువుకోని సామాన్యులు”
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • పునరుత్థానమైన యేసును పెంతెకొస్తుకు ముందు వందలమంది చూశారు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • వాళ్లను ఏదీ ఆపలేదు
    నా బైబిలు పుస్తకం
  • తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 12/1 పేజీలు 24-29

యెహోవా మా పరిపాలకుడు!

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”—అపొ.కార్యములు 5:29.

1, 2. దైవ చిత్తమునకు భిన్నమైన దానిని మానవులు అడిగినప్పుడు అపొస్తలుల ఏ స్థానమును యెహోవా సాక్షులును గైకొందురు?

యెహోవా దేవుడు 12 మంది మనుష్యులు ఒక ఉన్నత న్యాయసభయెదుటకు కొనిపోబడుటకు అనుమతించెను. అది సా.శ. 33వ సంవత్సరము మరియు అది యూదా న్యాయసభయైయుండెను. యేసుక్రీస్తు అపొస్తలులు న్యాయవిచారణ చేయబడుచుండిరి. ఇదిగో! ‘ఈ నామమునుబట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించితిమి గదా, అయితే మీరు యెరూషలేమును మీ బోధతో నింపియున్నారు,’ అని ప్రధాన యాజకుడు అనెను. దానికి పేతురు మరియు యితర అపొస్తలులు యిట్లనిరి: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” (అపొ.కార్యములు 5:27-29) నిజానికి వారు, “యెహోవా మా పరిపాలకుడని” చెప్పిరి.

2 అవును, యేసు నిజమైన శిష్యులకు యెహోవా పరిపాలకుడైయున్నాడు. దాదాపు సా.శ. 61లో “లూకా అను ప్రియుడగు వైద్యుడు” రోములో వ్రాసిన బైబిలు పుస్తకమగు అపొస్తలుల కార్యముల గ్రంథమునందు యిది స్పష్టము చేయబడినది. (కొలస్సయులు 4:14) అపొస్తలుల వలెనే ఈనాటి యెహోవా ప్రజలు ఆయన చిత్తమునకు భిన్నమైన దానిని మానవులు కోరినప్పుడు వారు ఆ పరలోక పరిపాలకునికే లోబడుదురు. అయితే యింకా ఏ విషయములను కూడ మనము అపొస్తలుల కార్యములనుండి నేర్చుకొనగలము? (మీ వ్యక్తిగత పఠనమందు, ప్రత్యేకించి పెద్ద అక్షరములతో ఎత్తివ్రాయబడిన పుస్తక భాగములను మీరు చదువవలసిందిగా మేము సలహాయిచ్చుచున్నాము.)

యేసు సాక్షులను ఆజ్ఞాపించుట

3. యేసు శిష్యులు “పరిశుద్ధాత్మయందు బాప్తిస్మము పొందినప్పుడు,” వారి ప్రధానమైన శ్రద్ధ ఏమైయుండెను?

3 అపొస్తలులు ఆత్మీయముగా బలపరచబడినందున వారు దేవుని కొరకు స్థిరమైన స్థానమును తీసుకొనగల వారైయుండిరి. క్రీస్తు హింసాకొయ్యపై మరణించాడు, అయితే ఆయన పునరుత్థానము చేయబడెనని వారెరిగియుండిరి. (1:1-5) యేసు “తన్నుతాను సజీవునిగా కనుపరచుకొని,” భౌతిక శరీరములను ధరించుచు, 40 దినములవరకు వారికి రాజ్య సత్యములను బోధించుచువచ్చెను. అంతేకాకుండ, “పరిశుద్ధాత్మలో బాప్తిస్మము” కొరకు యెరూషలేమునందు వేచియుండుమని ఆయన తన శిష్యులకు చెప్పెను. ఈనాటి యెహోవా సాక్షులకు వలెనే, అప్పుడు ప్రకటించుట వారి ప్రధాన శ్రద్ధయైయుండును.—లూకా 24:27, 49; యోహాను 20:19–21:24.

4. యేసు అనుచరులమీదకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమి జరుగును?

4 యింకను పరిశుద్ధాత్మయందు బాప్తిస్మము పొందనందున, రోమా ఆధిపత్యమును ఆయన భూపరిపాలన అంతమొందించునని అపొస్తలులు తప్పుగా తలంచి, ఆయనను యిట్లడిగిరి: “ప్రభువా, యీకాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” (1:6-8) నిజానికి, యేసు వారితో లేదని చెప్పెను, ఏలయనగా ‘కాలములను సమయములను తెలిసికొనుట వారి పనికాదు.’ ‘పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చినప్పుడు,’ భూమియందంతటను దేవుని పరలోక రాజ్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అది వారిని శక్తిమంతులను చేయును. వారు యెరూషలేము, యూదయ, సమరయ దేశములయందంతటను, “భూదిగంతముల వరకును” ప్రకటింతురు. ఆత్మ సహాయముద్వారా ఈ అంత్యదినములలో యెహోవా సాక్షులు అలాంటి పనిని భూవ్యాప్తితముగా చేయుచున్నారు.

5. యేసు విడిచివెళ్లిన రీతిగానే ఆయన మరలా ఎట్లు వచ్చును?

5 యేసు పరలోకమునకు ఎక్కిపోవుటకుముందు ప్రపంచవ్యాప్త ప్రచారపు పనినిగూర్చి ఆజ్ఞాపించెను. ఆ ఎక్కిపోవుట శిష్యులను వదలి పైకివెళ్లుటతో ప్రారంభమాయెను, ఆ పిమ్మట యేసు తన పరలోక పరిపాలకుని సన్నిధికి, ఆ ఆత్మీయ సామ్రాజ్యమందలి కార్యములోనికి ప్రవేశించెను. (1:9-11) శిష్యుల కన్నులకు యేసు కనబడగుండా మేఘమొకటి అడ్డు వచ్చిన తర్వాత, ఆయన భౌతిక శరీరమును మార్చుకొని వెళ్లిపోయెను. కాగా యిద్దరు దేవదూతలు వారికి ప్రత్యక్ష్యమై ఆయన ‘అదేరీతిన మరలా వచ్చునని’ చెప్పిరి. అది అట్లే జరిగినది. ఆయన వెళ్లుటను కేవలము యేసు శిష్యులు చూచినట్లుగానే, యెహోవా సాక్షులు మాత్రమే ఆయన అదృశ్యముగా తిరిగివచ్చుటను గుర్తించిరి.

యెహోవా ఎంపిక చేయును

6. ఇస్కరియోతు యూదా స్థానము ఎట్లు పూర్తిచేయబడెను?

6 ఆ వెంటనే అపొస్తలులు యెరూషలేముకు తిరిగివచ్చిరి. (1:12-26) ఒక మేడగదిలో (బహుశ మార్కు తల్లియైన, మరియ యింటిలో), 11 మంది అపొస్తలులు, యేసు సహోదరులు, యితర శిష్యులు, ఆయన తల్లియైన మరియ ఎడతెగక ప్రార్థించిరి. (మార్కు 6:3; యాకోబు 1:1) అయితే యూదా “పర్యవేక్షణా ఉద్యోగమును” ఎవరు తీసుకొందురు? (కీర్తన 109:8 NW) అపొస్తలుల 12 సంఖ్యను సమము చేయుటకు, యేసును అప్పగించిన యూదాకు మారుగా మరొకరిని దేవుడు ఎంపిక చేసికొనినప్పుడు అక్కడ 120 మంది శిష్యులు హాజరైయుండిరి. యేసు పరిచర్య కాలములో శిష్యునిగావుండి, ఆయన పునరుత్థానమునకు సాక్షియైయున్న మనిషి ఎంపిక చేయబడవలసి యుండెను. అంతేకాకుండ ఆ మనుష్యుడు యెహోవాను తన పరిపాలకునిగా గుర్తించినవాడై యుండవలెను. ప్రార్థన తర్వాత, బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయలనుగూర్చి చీట్లు వేసిరి. కాగా దేవుడు మత్తీయ పేరిట చీటి వచ్చునట్లు చేసెను.—సామెతలు 16:33.

7. (ఎ) యూదా ఎట్లు “ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలమును కొనెను”? (బి) యూదా ఎట్లు మరణించెను?

7 నిశ్చయముగా ఇస్కరియోతు యూదా యెహోవాను తన పరిపాలకునిగా అంగీకరించియుండలేదు. అంతెందుకు, అతడు దేవుని కుమారుని 30 వెండి నాణెములకు అప్పగించెను. యూదా ఆ రూకలను యాజకులకు తిరిగి యిచ్చివేసెను, అయినను పేతురు ఆ ద్రోహి “ద్రోహమువలన సంపాదించిన రూకలనిచ్చి యొక పొలమును కొనెనని” చెప్పెను. అది ఎట్లు? “రక్తభూమి” అని పిలువబడిన పొలమునొక దానిని కొనుటకు కారణమగునట్లు అతడు ఆ రూకలనిచ్చినవాడాయెను. అది హిన్నోము లోయకు దక్షిణానగల ఒక సమతల స్థలముతో గుర్తింపబడినది. తన పరలోక పరిపాలకునితో అతడు తన సంబంధమును పూర్తిగా నాశనము చేసుకొనినవాడై, యూదా “ఉరివేసుకొని” మరణించెను. (మత్తయి 27:3-10) బహుశ అతడు వ్రేలాడిన కొమ్మ విరుగుట లేక త్రాడు తెగుట జరిగియుండవచ్చును, అందువలన అతడు రాతిమొనల మీద ‘తలక్రిందుగాపడుట వలన నడిమికి బ్రద్దలై అతని ప్రేగులన్నియు బయటకు వచ్చెను.’ మనలో ఎవరము అబద్ద సహోదరులుగా ఉండకుందుము గాక!

పరిశుద్ధాత్మతో నింపబడుట!

8. యేసు శిష్యులు ఎప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిరి, మరియు ఏ ప్రభావముతో?

8 మరి వాగ్ధానము చేయబడినట్లుగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము విషయమేమి? యేసు పైకివెళ్లిన తర్వాత పది దినముల తర్వాత, సా.శ. 33 పెంతెకొస్తునాడు అది జరిగెను. (2:1-4) ఆ బాప్తిస్మ సంఘటన ఎంత పులకరింపజేయునదై యుండెను! ఆ దృశ్యమును ఊహించుము. ఆ మేడగదిలో 120 మంది శిష్యులు కూడుకొనియుండగా, ‘వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని అకస్మాత్తుగా, ఆ యిల్లంతయు నిండెను.’ అది గాలికాదు అయితే దాని శబ్దము అట్లుండెను. “అగ్ని జ్వాలలవంటి” నాలుక ప్రతి శిష్యునిమీద, అపొస్తలునిమీద వ్రాలెను. “అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై . . . అన్యభాషలతో మాటలాడసాగిరి.” ఎప్పుడైతే ఆ బాప్తిస్మము జరిగినదో అప్పుడు వారు పరిశుద్ధాత్మద్వారా పుట్టినవారును, అభిషేకించబడినవారును అయిరి, అలాగే వారు ఆత్మీయ వారసత్వమునకై దైవసంకేతముగా ముద్రింపబడిన వారైరి.—యోహాను 3:3, 5; 2 కొరింథీయులు 1:21, 22; 1 యోహాను 2:20.

9. ఆత్మనిండిన శిష్యులు దేనినిగూర్చి మాట్లాడిరి?

9 ఈ సంఘటన ‘ఆకాశము క్రిందగల ప్రతిజనములోనుండి’ యెరూషలేముకు వచ్చిన యూదులు, యూదామత ప్రవిష్టులమీద ప్రభావము చూపెను. (2:5-13) వారు ఆశ్చర్యపడి యిట్లడిగిరి: ‘మాలోని ప్రతివాని స్వభాషయందు వీరు మాట్లాడుట వినుచున్నామే అదెట్లు?’ బహుశ ఆ భాషలు మాదీయ (యూదయ తూర్పు ప్రాంతము), ఫ్రుగియ (ఆసియా మైనరులోనిది), మరియు రోమా (యూరపు లోనిది) వంటి ప్రాంతములలోనివై యుండవచ్చును. శిష్యులు “దేవుని గొప్పకార్యములనుగూర్చి” వివిధ భాషలలో మాట్లాడుచుండగా, వినిన అనేకులు విభ్రాంతినొందిరి, అయితే అపహాసకులు వారు మద్యము త్రాగియుండవచ్చుననిరి.

చైతన్యపూరితమైన సాక్ష్యమును పేతురు ఇచ్చుట

10. సా.శ. 33 నాటి సంఘటన ఏ ప్రవచనమును నెరవేర్చెను, మరియు దీనికి ఆధునిక-దిన సమాంతరమున్నదా?

10 పొద్దుపొడిచి తొమ్మిదైనా కాకమునుపే మత్తులైయుండుట విడ్డూరమని చూపించుచు పేతురు సాక్ష్యమిచ్చుటకు మొదలుపెట్టెను. (2:14-21) మత్తులైయుండుటకు బదులుగా, ఈ సంఘటన తన ప్రజలమీద పరిశుద్ధాత్మను కుమ్మరించెదనని దేవుడుచేసిన వాగ్ధాన నెరవేర్పైయుండెను. “అంత్యదినములలో” మరియు “వారు ప్రవచింతురు” అను మాటలను చేర్చుటద్వారా మన కాలమును సూచించుటకు దేవుడు పేతురును ప్రేరేపించెను. (యోవేలు 2:28-32) తన మహా దినమునకు ముందు యెహోవా, పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను కలుగజేయును, కాగా విశ్వాసముతో ఆయన నామమునుబట్టి ప్రార్థనచేయువారు మాత్రమే రక్షింపబడుదురు. అదేరీతిన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట, ఈనాడు ఎంతో శక్తివంతముగా మరియు ప్రభావపూరితముగా “ప్రవచించుటకు” అభిషక్తులను బలపరచినది.

11. యేసు విషయములో యూదులచేత మరియు దేవునిచేత ఏమి చేయబడియున్నది?

11 పేతురు తర్వాత మెస్సీయాను గుర్తించి చెప్పెను. (2:22-28) అద్భుతములు, మహత్కార్యములు మరియు సూచనలు చేయుటకు యేసును బలపరచుటద్వారా దేవుడు ఆయనను మెస్సీయాగా ధృవపరచెను. (హెబ్రీయులు 2:3, 4) అయితే యూదులు ఆయనను “అక్రమ కారులచేత,” దేవుని ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టని రోమన్లచేత మ్రానున వేయించి చంపిరి. అది దైవ చిత్తము గనుక యేసు, “దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడెను.” అయితే దేవుడు యేసును పునరుత్థానము చేసెను, అయితే మానవశరీరము కుళ్లుపట్టకుండు రీతిలో ఆయన దానిని లేకుండా చేసెను.—కీర్తన 16:8-11.

12. దావీదు ముందుగనే ఏమి చూసెను, మరియు దేనిమీద రక్షణ ఆధారపడియున్నది?

12 పేతురు తన సాక్ష్యమును అలానే కొనసాగించి మెస్సీయానుగూర్చిన ప్రవచనమును మరింతగా నొక్కితెలియజేసెను. (2:29-36) తన కుమారులలో మహాగొప్పవాడైన మెస్సీయాయగు యేసు పునరుత్థానమునుగూర్చి దావీదు ముందుగనే చెప్పెనని ఆయన అనెను. పరలోకమందు మహావున్నతస్థానమగు దేవుని కుడిపార్శ్వమునుండి, తనతండ్రియొద్దనుండి పొందిన పరిశుద్ధాత్మను యేసు కుమ్మరించెను. (కీర్తన 110:1) శిష్యుల తలలమీద అగ్నిజ్వాలలవంటి నాలుకలుండుటను, వారు మాట్లాడుచున్న అన్య దేశీయ భాషలను తాము వినుటను గమనించిన పేతురు ప్రేక్షకులు ‘దాని పనిని చూసిరి మరియు వినిరి.’ యేసును ప్రభువుగా మరియు మెస్సీయాగా అంగీకరించుటమీద రక్షణ ఆధారపడియున్నదని కూడ ఆయన చూపించెను.—రోమీయులు 10:9; ఫిలిప్పీయులు 2:9-11.

యెహోవా అభివృద్ధిని దయచేయుట

13. (ఎ) సరియైన రీతిగా బాప్తిస్మము తీసుకొనుటకు, యూదులు యూదామత ప్రవిష్టులు దేనిని అంగీకరించవలెను? (బి) ఎందరు బాప్తిస్మము తీసుకొనిరి, మరియు యెరూషలేములో దాని ప్రభావము ఏమైయుండెను?

13 పేతురు మాటలు ఎంత ప్రభావితముగా ఉండెను! (2:37-42) ఆయనను వినుచున్నవారు మెస్సీయా మరణమునకు తమ అంగీకారమును తెల్పినందుకు హృదయమందు ఎంతగానో నొచ్చుకొనిరి. అందునుబట్టి ఆయన వారినిట్లు బలవంతపెట్టెను: “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.” యూదులు యూదామత ప్రవిష్టులు యెహోవాను, పరిశుద్ధాత్మ అవసరతను ముందే గుర్తించియుండిరి. యిప్పుడు వారు తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు (కార్యమును లేక పనివిధానమును గుర్తించుచు) నామములోనికి బాప్తిస్మము తీసుకొనునట్లు, పశ్చాత్తాపపడి యేసును మెస్సీయాగా అంగీకరించవలసి యుండిరి. (మత్తయి 28:19, 20) యూదులకు యూదామత ప్రవిష్టులకు సాక్ష్యమిచ్చుటద్వారా, విశ్వసించు యూదులకు పరలోక రాజ్యమందు ప్రవేశించు అవకాశము మరియు జ్ఞానమను ద్వారమును తెరచుటకు యేసు తనకిచ్చిన మొదటి ఆత్మీయ తాళపుచెవిని పేతురు ఉపయోగించెను. (మత్తయి 16:19) ఆ ఒక్కదినములోనే 3,000 మంది బాప్తిస్మము తీసుకొనిరి! అంతమంది యెహోవా సాక్షులు యెరూషలేముయొక్క ఆ చిన్న ప్రాంతమందు ప్రకటించుటను ఊహించుము!

14. ఎందుకు మరియు ఏవిధముగా విశ్వాసులందరు “తమకు కలిగినదంతయు సమిష్టిగా” కలిగియుండిరి?

14 దూరప్రాంతములనుండి వచ్చిన అనేకులయొద్ద మరికొద్ది కాలము అక్కడుండుటకు కావల్సిన నిత్యావసర వస్తువులు లేకుండెను, అయితే వారు మరికొద్ది కాలము అక్కడేవుండి వారి నూతన విశ్వాసమునుగూర్చి మరిఎక్కువ నేర్చుకొనుటకు, యితరులకు ప్రకటించుటకు కోరుకొనిరి. యేసు తొలి అనుచరులు ప్రేమతో ఒకరికొకరు సహాయము చేసికొనిరి, ఈనాడు యెహోవా సాక్షులును అట్లే చేయుచున్నారు. (2:43-47) తాత్కాలికముగా విశ్వాసులందరు తమకు “కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి.” కొందరు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి. ‘యెహోవా రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండగా,’ సంఘము చక్కని ఈ ప్రారంభముతో ముందుకు సాగెను.

స్వస్థత మరియు దాని ఫలితములు

15. పేతురు యోహానులు ఆలయమున ప్రవేశించుచుండగా ఏమి జరిగెను, ప్రజలెట్లు స్పందించిరి?

15 “సూచక క్రియలద్వారా” యెహోవా యేసు అనుచరులను బలపరచెను. (3:1-10) ఆ విధముగా, పేతురు యోహానులు పగలు మూడు గంటలకు సాయంకాల బలి సంబంధముగాచేయు ప్రార్థనా కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా, శృంగారమను ద్వారమునొద్ద పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు వారిని “భిక్షమడిగెను.” దానికి పేతురు ‘వెండి బంగారాలైతే నాయొద్దలేవు, కాని నాయొద్ద ఉన్నది నీకిత్తునని చెప్పి: నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పెను.’ అంతట అతడు “నడచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు” ఆలయమున ప్రవేశించగా, ప్రజలు ‘విస్మయముతోనిండి పరవశులైరి.’ వారిలో కొందరు బహుశ, “కుంటివాడు దుప్పివలె గంతులువేయును” అను మాటలను గుర్తుతెచ్చుకొని యుండవచ్చును.—యెషయా 35:6.

16. ఒక కుంటివానిని అపొస్తలులు ఎట్లు స్వస్థపరచగల్గిరి?

16 ఆశ్చర్యమునొందిన ప్రజలు ఆలయ తూర్పువైపునగల సొలొమోనుదను మంటపముయొద్ద గుమికూడిరి. అక్కడ పేతురు వారికి సాక్ష్యమిచ్చెను. (3:11-18) మహిమపరచబడిన తన సేవకుడైన యేసుద్వారా, ఆ కుంటివానిని స్వస్థపరచుటకు దేవుడు అపొస్తలులను బలపరచెనని ఆయన చూపించెను. (యెషయా 52:13–53:12) యూదులు “ఆ పరిశుద్ధుని మరియు నీతిమంతుని” నిరాకరించిరి; అయినను, దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను. తాము మెస్సీయాను మరణమునకప్పగించితిమను సంగతిని ప్రజలు వారి పాలకులు ఎరుగకపోయినను, “క్రీస్తు శ్రమపడునని” చెప్పబడిన ప్రవచనార్థక మాటలను దేవుడు ఆ విధముగా నెరవేర్చెను.—దానియేలు 9:26.

17. (ఎ) యూదులు ఏ చర్య తీసుకొనవలసియుండిరి? (బి) ‘క్రీస్తు పంపబడిన’ దగ్గరనుండి మన దినములలో ఏమి జరిగినది?

17 మెస్సీయా యెడల వారట్లు చేసినందుకు పరిష్కారముగా, యూదులు ఏమిచేయవలెనో పేతురు చూపించెను. (3:19-26) వారు “పశ్చాత్తాపమునొంది” లేక వారి పాపముల విషయమై పరితాపమునొంది “మారుమనస్సునొంది తిరుగవలెను,” లేక వారి పూర్వ విధానమునకు వ్యతిరేకమైన చర్యను తీసుకుంటు తమను మార్చుకొనవలెను. మెస్సీయాగా యేసునందు వారు విశ్వాసముంచినట్లయిన, పాపములు క్షమించబడినవారిగా వారికి యెహోవానుండి సేదదీర్పు వచ్చును. (రోమీయులు 5:6-11) “నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని” అబ్రాహాముతో చెప్పి, వారి పితరులతో దేవుడు చేసిన నిబంధనకు వారు కుమారులైయున్నారని యూదులకు గుర్తుచేయబడెను. కాబట్టి పశ్చాత్తాపమునొందు యూదులను విడిపించుటకు దేవుడు మొదట తన సేవకుడైన మెస్సీయాను పంపించెను. ఆసక్తిదాయకమైన విషయమేమంటే, 1914లో పరలోక రాజ్యాధికారమునకు ‘క్రీస్తు పంపబడిన’ దగ్గరనుండి, యెహోవా సాక్షులమధ్య సేదదీర్చు సత్యముల మరియు దైవపరిపాలనా సంస్థ పునరుద్ధరణ జరుగుచున్నది.—ఆదికాండము 12:3; 18:18; 22:18.

వారు ఆపుజేయరు!

18. “ఇల్లు కట్టువారైన” యూదులు ఏ “రాయిని” తృణీకరించిరి, మరియు ఎవరియందు మాత్రమే రక్షణ కలదు?

18 పేతురు యోహానులు యేసు పునరుత్థానమును ప్రకటించుట విషయమై కోపగించిన ముఖ్య యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకయ్యులు వారిని పట్టుకొని కావలిలో ఉంచిరి. (4:1-12) సద్దూకయ్యులు పునరుత్థానమును నమ్మలేదు, అయితే అనేకులు విశ్వసించిరి, వారిలోని పురుషులే రమారమి 5,000 మంది ఉండిరి. యెరూషలేము ఉన్నత న్యాయస్థానమందు ప్రశ్నించబడినప్పుడు పేతురు, ఆ కుంటివాడు, వారు మ్రానున వ్రేలాడదీసి చంపినను దేవుడు పునరుత్థానునిగా చేసిన “నజరేయుడైన యేసుక్రీస్తు నామమున” బాగుచేయబడెనని, “యిల్లు కట్టువారైన” యూదులు తృణీకరించిన “రాయి మూలకు తలరాయి ఆయెను” అని చెప్పెను. (కీర్తన 118:22) అంతేకాదు, “మరి ఎవనివలనను రక్షణ కలుగదని” పేతురు చెప్పెను.

19. ప్రకటించుటను ఆపుమని ఆజ్ఞాపింపబడినప్పుడు, అపొస్తలులు ఎట్లు జవాబిచ్చిరి?

19 ఆ విధముగా చెప్పుటను ఆపుజేయుటకు ప్రయత్నము జరిగెను. (4:13-22) వారి మధ్యను బాగుచేయబడిన మనుష్యుడు నిలిచియుండుటతో ఈ “ప్రసిద్ధమైన సూచకక్రియను” జరుగలేదని చెప్పుట అసాధ్యమాయెను, అయినను వారు పేతురు యోహానులు ‘యేసు నామమున ఎక్కడను మాటలాడకూడదని లేక బోధింపకూడదని’ ఆజ్ఞాపించిరి. వారి జవాబు ఏమైయుండెను? ‘మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము.’ వారు తమ పరిపాలకునిగా యెహోవాకు లోబడిరి!

ప్రార్థనలకు జవాబివ్వబడెను!

20. దేనికొరకు అపొస్తలులు ప్రార్థించిరి, దాని ఫలితము ఏమైయుండెను?

20 కూటములయందు యెహోవా సాక్షులు ప్రార్థించు రీతిగానే, విడుదల చేయబడిన అపొస్తలులు తమకు జరిగినదానిని వివరించినప్పుడు శిష్యులు ప్రార్థించిరి. (4:23-31) పాలకులైన హేరోదు మరియు పొంతి పిలాతు, అలాగే అన్యులైన రోమన్లు, ఇశ్రాయేలీయులు ఏకముగా మెస్సీయాకు విరోధముగా కూడినట్లు గమనించబడినది. (కీర్తన 2:1, 2; లూకా 23:1-12) వారి ప్రార్థనకు జవాబుగా వారు దేవుని వాక్యమును బహు ధైర్యముగా మాట్లాడునట్లు యెహోవా శిష్యులను పరిశుద్ధాత్మతో నింపెను. వారు తమ పరిపాలకుని హింసను ఆపుజేయుమని కాదుగాని, అదివున్నను ధైర్యముగా ప్రకటించుటకు తమను బలపరచమని అడిగిరి.

21. బర్నబా ఎవరు, ఆయన ఎటువంటి లక్షణములను కలిగియుండెను?

21 విశ్వాసులందరు ఏ ఒక్కరు కొదువలేకుండా అందరును అలాగే కలిగినదానినంతటిని సమిష్టిగా కలిగియుండిరి. (4:32-37) అలా విరాళమిచ్చిన వారిలో కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు ఉండెను. బహుశ ఆయన సహాయకారిగా మరియు దయగల హృదయము గలవాడై యుండినందున, అపొస్తలులు ఆయనకు “ఆదరణ పుత్రుడను” అను అర్థమిచ్చు బర్నబా అని పేరుపెట్టిరి. నిశ్చయముగా, మనమందరము అలాంటి వ్యక్తులుగా ఉండుటకు యిచ్ఛయించవలెను.—అపొ.కార్యములు 11:22-24.

అబద్ధికులు బయటపెట్టబడిరి

22, 23. అననీయ సప్పీరాల పాపము ఏమైయున్నది, వారి అనుభవమునుండి మనమెట్లు ప్రయోజనము పొందగలము?

22 అయితే అననీయ అతని భార్యయైన సప్పీరా యెహోవాను తమ పరిపాలకునిగా అంగీకరించుటను విడనాడిరి. (5:1-11) వారు తమ పొలమమ్మి కొంత సొమ్ము దాచుకొని, అంతయు అపొస్తలులకు యిచ్చుచున్నట్టు నటించిరి. దేవుని ఆత్మ అనుగ్రహించిన జ్ఞానముచొప్పున పేతురు వారి వేషధారణనను గ్రహించెను, కాగా అది వారి మరణమునకు దారితీసెను. వక్రస్వభావమును కలిగియుండుటకు సాతాను శోధించువారికి ఎంతటి హెచ్చరిక!—సామెతలు 3:32; 6:16-19.

23 ఈ సంఘటన తర్వాత చెడుతలంపులుగల వారెవరును శిష్యులతో చేరుటకు సాహసించలేదు. అయితే యితరులనేకులు విశ్వాసులైరి. (5:12-16) అంతేకాకుండ, రోగములచేత, అపవిత్రాత్మలచేత పీడింపబడుచుండినవారు ఎవరు దేవునియందు విశ్వాసముంచిరో ‘వారందరు స్వస్థతపొందిరి.’

మనుష్యులకు బదులుగా దేవునికి లోబడుడి

24, 25. యూదా నాయకులు అపొస్తలులను ఎందుకు హింసించిరి, అయితే యెహోవా సేవకులందరికి ఈ విశ్వాసులు ఎటువంటి ప్రమాణమునుంచిరి?

24 ప్రధాన యాజకుడు సద్దూకయ్యులు యిప్పుడు అపొస్తలులనందరిని చెరసాలలో వేయించుటద్వారా జరుగుచున్న అద్భుతమైన అభివృద్ధిని ఆపుజేయవలెనని ప్రయత్నించిరి. (5:17-25) అయితే ఆ రాత్రి దేవుని దేవదూత వారందరిని విడుదల గావించెను. ఉదయానికల్లా వారు మరలా ఆలయమందు ప్రకటించుచుండిరి! హింస యెహోవా సేవకులను ఆపుచేయలేదు.

25 అయినను, అపొస్తలులు మహాసభయెదుటకు తీసుకొనిరాబడినప్పుడు వారిమీదకు వత్తిడి తీసుకు రాబడెను. (5:26-42) ప్రకటించుటను ఆపుజేయుమని ఆజ్ఞాపింపబడినప్పుడు వారిట్లు జవాబిచ్చిరి: “మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను.” యిది యేసు శిష్యులకు ఒక ప్రమాణమునుంచెను, దీనినే ఈనాడు యెహోవా సాక్షులు అనుసరించుచున్నారు. ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు హెచ్చరిక చేసిన తర్వాత, నాయకులు అపొస్తలులను కొట్టి, ప్రకటించవద్దని ఆజ్ఞాపించి, వారిని విడుదలచేసిరి.

26. అపొస్తలుల పరిచర్యతో ఈనాటి యెహోవా సాక్షుల పరిచర్య ఎట్లు పోల్చబడినది?

26 యేసు నామము పక్షముగా అవమానింపబడుటకు పాత్రులైనందున అపొస్తలులు సంతోషించిరి. “మరియు ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, . . . సువార్తను ప్రకటించుచుండిరి.” అవును, వారింటింటను ప్రకటించిన పరిచారకులై యుండిరి. ఆయనకు లోబడి, “యెహోవాయే మా పరిపాలకుడు!” అని చెప్పినందున పరిశుద్ధాత్మను పొందిన ఆధునిక-దిన దేవుని సాక్షులును వారివలెనే యున్నారు. (w90 6/1)

మీరెట్లు ప్రత్యుత్తరమిత్తురు?

◻ పూర్వమందును, ప్రస్తుతమందును యేసు అనుచరులు ఏ ఆజ్ఞను నెరవేర్చవలసి యున్నారు?

◻ సా.శ. 33 పెంతెకొస్తునాడు ఏమి జరిగినది?

◻ యేసు తనకిచ్చిన మొదటి ఆత్మీయ తాళపుచెవిని పేతురు ఎప్పుడు మరియు ఎట్లు ఉపయోగించెను?

◻ అననీయ సప్పీరాల అనుభవమునుండి మనమేమి నేర్చుకొనగలము?

◻ ప్రకటించుటను ఆపుమని ఆజ్ఞాపింపబడినప్పుడు, యెహోవా సాక్షులందరికి అపొస్తలులు ఏ ప్రమాణమునుంచిరి?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి