మీకు జ్ఞాపకమున్నవా?
ఈ మధ్య వచ్చిన కావలికోట పత్రికలు అభ్యాస యోగ్యమైన విలువలను కలిగియున్నవని మీరు కనుగొన్నారా? అయితే ఈ క్రింది వాటితో ఎందుకని మీ జ్ఞాపక శక్తిని పరీక్షించుకొనకూడదు?
◻ మత్తయి 25:34 నందు, గొర్రెంలాంటివారితో “లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి” అని చెప్పుటలో యేసు భావమేమి?
ఈ గొర్రెలాంటివారు ఆయనతో కూడా పరలోకములో ఏలుదురని యేసు భావముకాదు. బదులుగా “లోకము పుట్టినది మొదలుకొని” అనగా విమోచించబడదగిన మానవజాతియొద్దనుండి సిద్ధపరచబడిన రాజ్యభూసామ్రాజ్యమును గొర్రెలాంటివారు స్వతంత్రించుకొందురు. ఈ విధంగా వారు “నిత్యుడగు తండ్రి” యగు, రాజైన క్రీస్తుయేసుయొక్క భూసంబంధమగు పిల్లలగుదురు. (యెషయా 9:6, 7)—5/1, పేజి 17.
◻ సా.శ. 33నకు ముందు చనిపోయిన నమ్మకస్థులైన వారిని పునరుత్థానమందు ఆహ్వానించుటకు అభిషేకించబడిన శేషము భూమిమీద జీవించియుండుట అవసరమా?
లేదు. ఇట్లు అవసరములేదు. మహాశ్రమలయందు రక్షించబడు గొప్పసమూహములోని అనేకులు సంస్థసంబంధమైన బాధ్యతలను చేపట్టుటకు ఇప్పుడు తర్ఫీదుపొందుచున్నారు. కావున ఆ పరిస్థితికి తగిన శ్రద్ధను తీసుకొని పునరుత్థానులగువారిని “క్రొత్త ఆకాశము” క్రింది “క్రొత్తభూమి” లోకి పరిచయము చేయుటకు వారు సామర్ధ్యము కలిగియుందురు. (2 పేతురు 3:13)—5/1, పేజిలు 17, 18.
◻ ప్రపంచవ్యాప్తమైన ద్వేషము మరియు వ్యతిరేకతవలన యెహోవా సాక్షులు ఎందుకు నిరుత్సాహపడి, కృంగినహృదయము గలవారుకారు?
అట్టి వ్యతిరేకత మరియు ద్వేషము నిజమైన ఆరాధికులను గుర్తించు ఒక గుర్తెయుండునని యేసు ముందుగానే చెప్పెను. (యోహాను 15:20, 21; 2 తిమోతి 3:12) కావున సువార్తను ప్రకటించువారు తమకు దైవిక అంగీకారమున్నదని పునఃనిశ్చయతను కలిగియున్నారు. అంతేకాక తమకు సర్వోన్నతుడైన దేవుడగు యెహోవా మద్దతు ఉన్నదని యెహోవాసాక్షులు ఎరిగియున్నారు.—6/1, పేజి 23.
◻ వివాహ జతలు సమమైన జోడుగా జతచేయబడినప్పుడు ఉన్న ప్రయోజనములు ఏమి?
తమదేవుని ఆరాధించుటలో భార్యాభర్తలు ఒకరినొకరు ప్రోత్సహించుకొనే స్థానములో నుండగలరు. ఇంకా, తమ బేధములను పరిష్కరించుకొనుటలో వారు లేఖనములవైపు చూడగలరు.—6/1, పేజి 14.
◻ యెహోవా అందించు వివేకమునుండి ప్రయోజనము పొందాలంటే మనయెడల ఏ మూడు విషయములు అవసరము?
మనము యెహోవా సంస్థను గుణగ్రహించవలసియున్నాము; దేవుని వాక్యమును దానిని అర్థముచేసికొనుటకు అందించబడిన సహాయకములను క్రమముగా పఠించవలెను; మనము నేర్చుకొనినవాటిని మరియు మన అనుదిన జీవితములో వాటిని అన్వయించుకొను విధానమును గూర్చి ధ్యానించవలెను.—7/1, పేజి 26.
◻ పురాతనకాలపు ఇశ్రాయేలీయులు పూర్తి వివేకములేనివారిగా ఎందుకు ప్రవర్తించారు?
యెహోవా వారికి అనుగ్రహించిన సమస్త విషయములపైన మెప్పుగలిగి ధ్యానించటంలో విఫలులయ్యారు. (కీర్తన 106: 7, 13)—8/1, పేజి 7.
◻ “దైవభక్తి” ఏమైయున్నది? (1 తిమోతి 3:16)
దైవభక్తి అనగా పూజ్యభావము, ఆరాధన, మరియు ఆయన విశ్వసార్వభౌమాధిపత్యము యెడల యథార్థతోకూడిన సేవయైయున్నది.—8/1, పేజి 15.
◻ 2 థెస్సలొనీకయులకు 2:3 నందు పౌలు ప్రస్తావించుచున్న “ధర్మవిరోధియైన పురుషుడు” ఎవరు?
◻పౌలు ఒక వ్యక్తినిగురించి మాట్లాడుటలేదు. ఎందుకనగా ఆ “పురుషుడు” పౌలు దినములలో ఉండినవాడైయుండి, ఈ విధాన అంతమందు యెహోవా అతనిని నాశనముచేయువరకు ఉనికిలోయుండును. కావున “ధర్మవిరుద్ధపురుషుడు” అనునది సూచనార్థక వ్యక్తీకరణయైయున్నది. అతను శతాబ్దములుగా తమతమమట్టుకు తామే ఒక ధర్మశాస్త్రముగా చేసికొనిన గర్వము, మరియు అత్యాశగల క్రీస్తుమతసామ్రాజ్యపు మతగురువుల సమూహమని సాక్ష్యము చూపుచున్నది.—9/1, పేజి 13.
◻ బైబిలు చేతివ్రాతప్రతులలోని వేలకొలది విభిన్నతలు దేవునివాక్యమని చెప్పుకొను బైబిలు మాటలను బలహీనపరచుచున్నవా?
లేదు. బైబిలు విద్వాంసులు మనకు చెప్పునదేమనగా దాదాపు ఈ తారతమ్యములన్నియు పుస్తకమునకు ఎంతమాత్రము ప్రాముఖ్యమైనవికావు. కేవలం అవి లేఖనముల వాస్తవికతను రుజువుపరచుటకు బలమునిచ్చునవైయున్నవి. (కీర్తన 119:105; 1 పేతురు 1:25)—10/1, పేజీలు 30, 31.
◻ యేసుయొక్క తలాంతుల ఉపమానమందు తలాంతులను పనిలో ఉపయోగించుట అనగా అర్థమేమి? (మత్తయి 25:19-23)
తలాంతులను పనిలో ఉపయోగించుట అనగా దేవుని రాయబారులుగా నమ్మకముగా పనిచేయుట అని భావము. శిష్యులనుచేయుట మరియు ఆత్మీయసత్యములను దేవునియింటికి పంచిపెట్టుట. (మత్తయి 24:45; 28:19, 20; 2 కొరింథీయులు 5:20)—10/1, పేజి 13.
◻ ఉపదేశమునకు మూలమైన ఇతర మూలములన్నిటికంటె బైబిలు ఏ మూడు రీతులలో సాటిలేనిది?
మొదటిగా దాని ఉపదేశము ఎల్లప్పుడు ప్రయోజనకరమైనది. (కీర్తన 93:5) రెండవదిగా బైబిలుకాలపరీక్షకు నిలబడగలిగినది. (యెషయా 40:8; 1 పేతురు 1:25) మూడవదిగా విస్తారమైన బైబిలు ఉపదేశము అసమానమైనది. మనము ఏవిధమైన సమస్య లేక తీర్మానమును ఎదుర్కొనినను మనకు సహాయపడగల వివేకము బైబిలునందు కలదు.—11/1, పేజి 20.