బెజాయి కోడెక్స్ ఒక సాటిలేని వ్రాతప్రతి
థియోడర్ డి బెజె క్రైస్తవ గ్రీకు లేఖనములయొక్క పేరుగాంచిన ఫ్రెంచి విద్వాంసుడు. ఈయన ప్రొటెస్టెంట్ సంస్కర్త అయిన జాన్ కెల్విన్‌కు అత్యంత సన్నిహితుడైయుండి, ఆయన తదుపరి తన స్థానమును చేపట్టినవాడు. 1562వ సంత్సరములో, సాధారణముగా బెజా అని పిలువబడు ఈయన ఒక అసాధారణమైన పురాతన చేతివ్రాతప్రతిని వెలుగులోకి తెచ్చాడు. దానిని ఆయన ఫ్రాన్సునందలి లైన్సు నగరములోని “సెయింట్” ఆశ్రయమునుండి ఆ నగరము 16వ శతాబ్దపు ఫ్రెంచి విప్లవకారులవలన (హుగునాట్స్) దోచుకొనబడిన తరువాత పొందానని చెప్పెను. దాని పుట్టుక స్థలము అస్పష్టముగా ఉన్నది. అయితే చాలావరకు ఉత్తర ఆఫ్రికా లేక ఐగుప్తు దానికి మూలమైయుంటుంది.
ఈ కోడెక్స్ పది బై ఎనిమిది అంగుళముల పరిమాణముగలదై సైనాయ్టిక్, ది వాటికన్, మరియు అలెక్సాండ్రియన్ వ్రాతప్రతుల కాలమునకు కొంచెము తరువాతదిగా అనగా సా.శ. అయిదవ శతాబ్దము నాటిదిగా లెక్కించబడుచున్నది. 406 పత్రములను కలిగిన ఈ వ్రాతప్రతి, కొన్ని అంతరములతో నాలుగు సువార్తలను మరియు అపొస్తలుల కార్యములను కలిగియున్నది. కాని ఈ బెజాయి కోడెక్స్ మొట్టమొదట యితర పత్రికలను కూడా కలిగియుండవచ్చును. ఎందుకనగా యోహాను వ్రాసిన మూడవపత్రిక యొక్క కొంతభాగము దీనియందున్నది. దీనిలో మత్తయి మరియు యోహాను సువార్తలు, లూకా మరియు మార్కు సువార్తలకు ముందుగా ఉన్నవి.
ద్విభాషతో వ్రాయబడిన పుస్తకములకు ఈ వ్రాతప్రతి మొదటి ఉదాహరణ. దీనియందు ఎడమ పేజిలో గ్రీకు, కుడిపేజిలో లాటిన్ ఉన్నది. బహుశా మూడు లేక నాలుగు శతాబ్దముల యందలి P29, P38, మరియు P48 లని పిలువబడు పాపిరస్లవలె ఇది తొలికాలమందలి పుస్తకమును కలిగిన ఒక పాపిరస్ వ్రాతప్రతియొక్క నకలై యుండవచ్చును.
మందముగా మరియు సొంపుగా పెద్దఅక్షరములలో (కేపిటల్స్‌లో) వ్రాయబడిన బెజాయి కోడెక్స్ పేజిలో తదేకముగా వ్రాయబడలేదు. చదువునప్పుడు ప్రతివరుస చివరలో కొంత వ్యవధి వచ్చులాగున భిన్నమైన పొడవుగల వరుసలతో కూర్చబడియున్నది. లాటిన్ మాత్రము విశేషమైన రీతిలో గ్రీకు అక్షరముల శైలితో వ్రాయబడి అనేక సందర్భాలలో గ్రీకు పాఠాంతరమునకు తగినట్లు అనుకూలపర్చబడినది. గ్రీకు పుస్తకము పూర్తి ప్రత్యేకతను కలిగియుండి మొదట కాపీ చేసినవ్యక్తితో సహా అనేక చేతుల ద్వారా ఎన్నోదిద్దుబాటులకు గురియైనది.
బెజాయి కోడెక్స్ అధికారయుక్తముగా “D” అను అక్షరముతో సూచించబడుచున్నది. పెద్దవైన ఇతర వ్రాతప్రతులన్నిటికి ఇది ప్రత్యేకముగాయుండి అన్నిటికి స్వతంత్రముగా ఉన్నది. న్యూవరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్‌ది హోలీ స్క్రిప్చ్‌ర్స్ నందలి ఫుట్నోట్స్ సూచించురీతిగా ఈ కోడెక్స్ సైనాయ్టిక్ (א), ది వాటికన్ (B), మరియు అలెక్సాండ్రియన్ (A) మొదలగు కోడెక్స్లతో కొన్నిసార్లు ఏకీభవించుచున్నది, మరికొన్నిసార్లు ఏకీభవించుటలేదు. కొన్నిటిని తీసివేయుట లేక కలుపుటలోగల దాని ప్రత్యేక లక్షణముకన్న ఇతర ముఖ్యమైన వ్రాతప్రతులను స్థిరపరచుటయందు దీని విలువ దాగియున్నది.—న్యూవరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్‌ది హోలి స్క్రిప్చ్‌ర్స్—విత్ రెఫరెన్సులో మత్తయి 23:14; 24:36; 27:49; మార్కు 7:16; 9:44, 46; 11:26; లూకా 15:21; యోహాను 5:4 యందు ఫుట్నోట్స్ను చూడుము.
కొన్ని అసాధారణమైన పాఠాంతరములు మరియు బేధములున్నను మన కాలమువరకు బైబిలు భద్రపరచబడియున్నదనుటకు బెజాయి కోడెక్స్ మరొక మంచి నిదర్శనమైయున్నది. (w90 2⁄15)
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Above: By permission of the Syndics of Cambridge University Library
Left: Courtesy of the Trustees of the British Museum