యెహోవా తన నామమును ఎందుకు బయల్పరచెను?
1964లో పోలెండులో “పాత నిబంధన” మీద ప్రచురింపబడిన ఒక వ్యాఖ్యానము ఈ ప్రశ్నకు బహుగా ఆలోచనను రేకెత్తించు విధముగా జవాబిచ్చినది. రోమను కాథోలిక్కు చర్చి అనుమతించిన ముద్రిత అధికారము క్రింద లుబ్లిన్ విశ్వవిద్యాలయములో పండితుడైన డా. స్టానిస్లా లాక్ ఈ విధముగా వ్రాసెను: “విడిపింపబడిన ప్రజలు మానవజాతియెదుట దేవుని నామము విషయమై బాధ్యతను కలిగియున్నారు. అన్యులు యావె [యెహోవా] నామమును సన్నుతించి, దానిని దూషింపకుండునట్లు” ప్రయత్నించు బాధ్యతను ఇశ్రాయేలీయులు కలిగియుండిరి. “యావెకు ఒక అర్థమున్నది. . . . ఆ నామమును ఒప్పుకొను వారి విషయములో ప్రతిస్పందించుట మీద ఆధారపడి లోకమునకు తీర్పుతీర్చబడును.” “యావె అను నామము జనముల మధ్య గొప్పదైయుండి . . . అది ప్రపంచమంతయు విస్తరించును. మోషే విషయములో . . . ఆ నామము అటువంటి భవితవ్యమై యుండెనని” ఆ పండితుడు ప్రకటించెను.
అవును, మలాకి 1:11 ప్రవచించినట్లుగా: “అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” “యెహోవా నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరు రక్షణపొందు” లాగున ప్రపంచవ్యాప్తముగా మరి ఈనాడు ఆ నామమును ఎవరు ప్రకటించుచున్నారు? యెహోవా సాక్షులు! అవును, “ఆ నామమును ఒప్పుకొను” “ఆ నామము కొరకైన ప్రజల” యెడల ప్రజల ప్రతిస్పందన వారికి జీవన్మరణముల విషయమైయున్నది. యెహోవా యెడల ఆయన సాక్షుల యెడల మీ ప్రతిస్పందన ఏమైయున్నది?—అపొ.కార్యములు 2:21; 15:14; మలాకీ 3:16-18 పోల్చుము. (w90 2/15)