కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 6/1 పేజీలు 8-9
  • యేసు నిజముగా ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు నిజముగా ఎవరు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు నిజముగా ఎవరు?
    జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
  • మానవ కుమారుడు ఎవరు?
    యేసే మార్గం, సత్యం, జీవం
  • పరీక్షలు ఎదురైనా ఆయన విశ్వసనీయంగా ఉన్నాడు
    వాళ్లలా విశ్వాసం చూపించండి
  • ‘పరలోక రాజ్యపు తాళం చెవులు’ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 6/1 పేజీలు 8-9

యేసుయొక్క జీవితము పరిచర్య

యేసు నిజముగా ఎవరు?

యేసు ఆయన శిష్యులు బేత్సయిదా చేరునప్పటికి, ప్రజలు ఆయనయొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొనివచ్చి, వాని ముట్టి బాగుచేయవలెనని ఆయనను వేడుకొనిరి. యేసు ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని ఊరివెలుపలికి తోడుకొనిపోయి, అతని కన్నులమీద ఉమ్మివేసి, “నీకేమైనను కనబడుచున్నదా?” అని అడిగెను.

“మనుష్యులు నాకు కనబడుచున్నారు; వారు చెట్లవలెనుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని” జవాబిచ్చెను. అంతట ఆయన తన చేతులను ఆ మనుష్యుని కన్నులమీద ఉంచి, వాని చూపును పునరుద్ధరించగా అతడు స్పష్టముగా చూడసాగెను. పట్టణములోనికి వెళ్లవద్దని ఆజ్ఞాపించి యేసు అతనిని యింటికి పంపివేసెను.

యేసు ఇప్పుడు తన శిష్యులతో పాలస్తీనాకు చాలాదూరములో ఉత్తరముగానున్న ఫిలిప్పుదైన కైసరియ అను గ్రామమునకు వెళ్లెను. అది దాదాపు సముద్రమట్టమునకు 1,150 అడుగుల ఎత్తునవున్న సుందర ప్రదేశమగు ఫిలిప్పుదైన కైసరయకు ఆనుకొని దాదాపు 30 మైళ్ల పొడవుతో ఎత్తుగాయున్న ప్రదేశమైయున్నది. అక్కడికి వెళ్లివచ్చుటకు దాదాపు రెండు రోజులు పట్టును.

మార్గమధ్యములో, యేసు ఒంటరిగా ప్రార్థించుటకు ప్రక్కకు వెళ్లెను. తన మరణమునకు ఇంకా కేవలము తొమ్మిది లేక పది నెలలు మాత్రమే మిగిలియున్నవి, అందువలన ఆయన తన శిష్యులనుగూర్చి శ్రద్ధ కలిగియున్నాడు. అనేకులు అప్పటికే ఆయనను వెంబడించుటను మానుకొని వెళ్లిపోయారు. ప్రజలు తనను రాజుగా చేయుటకు ప్రయత్నించినప్పుడు తాను నిరాకరించినందున మరియు తన రాజరికమును నిరూపించుటకు తన శత్రువులు పరలోకమునుండి తమకొక సూచకక్రియను చేసిచూపుమని సవాలు చేసినప్పుడు తాను అలాచేయనందున ఇతరులు స్పష్టముగా నిరుత్సాహపడిరి మరియు కలతచెందిరి. తన గుర్తింపునుగూర్చి తన అపొస్తలులు ఏమని నమ్ముచున్నారు? తను ప్రార్థించుచున్న ప్రదేశమునకు వారు వచ్చినప్పుడు యేసు, “నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని?” వారినడిగెను.

“కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా అనియు, మరికొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని” జవాబిచ్చిరి. అవును వారు యేసును మృతులలోనుండి లేచిన వీరిలో ఒకడని నమ్మిరి!

“మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని” యేసు వారినడిగెను.

అందుకు పేతురు వెంటనే, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని” చెప్పెను.

పేతురు చెప్పిన దానిని అంగీకరించిన మీదట యేసు ఇట్లనెను: “నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక (హేడిస్‌) ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.” ఇక్కడ యేసు మొదటిసారిగా తానొక సంఘమును నిర్మించెదనని, కాగా దానిసభ్యులు నమ్మకముగా తమ భూజీవితమును చాలించిన తర్వాత మరణము ఏ విధముగాను వారిని తనయందు బంధించియుంచలేదని చెప్పెను. ఆ పిమ్మట ఆయన పేతురుతో, “పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదనని” చెప్పెను.

ఆ విధముగా పేతురు ప్రత్యేకమైన ఆధిక్యతలను పొందునని యేసు బయల్పరచుచున్నాడు. పేతురుకు అపొస్తలులలో మొదటి స్థానమివ్వబడునని, లేక సంఘమునకు ఆయన పునాదియగునని కాదు. ఏలయనగా సంఘము నిర్మింపబడు పునాది రాయి యేసే. అయితే పేతురుకు మూడు తాళపుచెవులు ఇవ్వబడును, అనగా పరలోకరాజ్యములో ప్రవేశించుటకు ఆయన వివిధప్రజల గుంపులకు అవకాశము తెరచునని దాని భావము.

సా.శ. 33 పెంతెకొస్తునాడు రక్షింపబడుటకు మారుమనస్సు నెందిన యూదులు ఏమిచేయవలెనో చూపించుటద్వారా పేతురు మొదటి తాళపుచెవిని ఉపయోగించెను. ఆ తర్వాత కొలది కాలమునకే దేవునిరాజ్యములో ప్రవేశించు అవకాశమును విశ్వసించిన సమరయులకు తెరచుటద్వారా రెండవ తాళపుచెవిని, ఆ పిమ్మట సా.శ. 36లో కొర్నేలి అతని స్నేహితులను, అనగా సున్నతి పొందని అన్యులకు ఇదే అవకాశమును తెరచుటద్వారా ఆయన మూడవ తాళపుచెవిని ఉపయోగించెను.

యేసు తన శిష్యులతో తన చర్చను ఇంకను కొనసాగించెను. త్వరలో యెరూషలేమునందు తాను అనుభవించు బాధలను, మరణమునుగూర్చి చెప్పుటద్వారా యేసు వారిని నిరుత్సాహపరచెను. పరలోక జీవితమునకు యేసు పునరుత్థానుడగునను విషయమును అర్థము చేసుకొనుటకు తప్పిపోయి, పేతురు యేసును ప్రక్కకు తీసుకొనిపోయి, “ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడును కలుగదని” ఆయనతో చెప్పెను. అయితే యేసు పేతురువైపు తిరిగి, “సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని” జవాబిచ్చెను.

సాక్ష్యాధారముగా అపొస్తలులతోపాటు ఇతరులును యేసుతో ప్రయాణమగుచుండిరి, కావున తన అనుచరులుగా యుండుట అంత సులభము కాదని వివరించుటకు వారిపై అవధానము నిలుపుచు, “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని తన హింసాకొయ్యనెత్తుకొని (NW) నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనునని” ఆయన చెప్పెను.

అవును, యేసు అనుచరులు ఆయన అనుగ్రహము పొందవలెనంటె ధైర్యస్థులును, స్వయం-త్యాగ పూరితులునై యుండవలెను. ఆయనిట్లు వివరించెను: “వ్యభిచారమును పాపమునుచేయు ఈ తరము వారిలో నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో, వానినిగూర్చి మనుష్యకుమారుడు తనతండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతోకూడ వచ్చునప్పుడు సిగ్గుపడును.” మార్కు 8:22-38; మత్తయి 16:13-28; లూకా 9:18-27.

◆ యేసు తన శిష్యులనుగూర్చి ఎందుకు శ్రద్ధ కలిగియుండెను?

◆ యేసు గుర్తింపు విషయములో ప్రజలెటువంటి అభిప్రాయములును కలిగియుండిరి?

◆ పేతురుకు ఏ తాళపుచెవులు ఇవ్వబడెను, మరియు అవి ఎట్లు ఉపయోగింపబడెను?

◆ పేతురు ఎటువంటి దిద్దుబాటు పొందెను, ఎందుకు? (w87 12/15)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి